నా కెరీర్‌లో ఈ చిత్రం సూపర్‌ స్పెషల్‌.. గుర్తుండిపోతుంది: జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌ | Jacqueline Fernandez Shares Her Stunning First Look From Kichcha Sudeepa Vikrant Rona | Sakshi
Sakshi News home page

నా కెరీర్‌లో ఈ చిత్రం సూపర్‌ స్పెషల్‌.. గుర్తుండిపోతుంది: జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌

Published Mon, Aug 2 2021 4:02 PM | Last Updated on Mon, Aug 2 2021 8:21 PM

Jacqueline Fernandez Shares Her Stunning First Look From Kichcha Sudeepa Vikrant Rona - Sakshi

‘‘విక్రాంత్‌ రోణ’ సినిమాలో భాగమైన ప్రతి క్షణం చాలా ఎగ్జయిట్‌మెంట్‌ వేసింది. నా కెరీర్‌లో ఈ చిత్రం సూపర్‌ స్పెషల్‌.. గుర్తుండిపోయే చిత్రమవుతుంది’’ అని హీరోయిన్‌ జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌ అన్నారు. ‘ఈగ’ ఫేమ్‌ కిచ్చా సుదీప్‌ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘విక్రాంత్‌ రోణ’. అనూప్‌ భండారీ దర్శకత్వంలో జాక్‌ మంజునాథ్‌– షాలిని మంజునాథ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కీలకపాత్రలో నటిస్తున్న జాక్వలైన్‌ పాత్ర ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు.

రాక్వెల్‌ డీ కోస్టా అలియాస్‌ గదంగ్‌ రాక్కమ్మగా ఆమె నటిస్తున్నారు. ముంబై బిల్‌బోర్డ్స్‌ సహా ఇతర నగరాల్లో ఈ ఫస్ట్‌లుక్‌ను ప్రదర్శించనున్నారు. ‘‘రాబోయే తరాలు గుర్తు పెట్టుకునేలా ఓ సినీ అద్భుతాన్ని సృష్టించే దారిలో ప్రయాణిస్తున్నాం’’ అన్నారు జాక్‌ మంజునాథ్‌. ‘‘మా సినిమా ప్రతి అనౌన్స్‌మెంట్‌లో ఓ సర్‌ప్రైజ్‌ను పరిచయం చేస్తుండటం అద్భుతంగా అనిపిస్తోంది’’ అన్నారు అనూప్‌ భండారి. ఈ చిత్రానికి సహ నిర్మాత: అలంకార్‌ పాండియన్, సంగీతం: బి.అజనీశ్‌ లోక్‌నాథ్, కెమెరా: విలియమ్‌ డేవిడ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement