మా వెతలు పట్టవా!
మా వెతలు పట్టవా!
Published Wed, Jul 20 2016 12:12 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM
తాగునీరులేక ఇబ్బందులు పడుతున్నాం
రోడ్లు అధ్వానంగా ఉన్నాయి
వర్షం పడితే నడవలేని పరిస్థితి
ప్రభుత్వ తీరుపై ప్రజల మండిపాటు
‘గడప గడపకూ వైఎస్సార్’లో వైఎస్సార్ సీపీ నేతలకు గోడు
టీడీపీ సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘గడప గడపకూ వైఎస్సార్’ కార్యక్రమం జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో మంగళవారం ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు వివిధ సమస్యలను వైఎస్సార్‌సీపీ నేతల దృష్టికి తీసుకువచ్చారు. ‘సమస్యలు పరిష్కరించాలని స్థానిక టీడీపీ నేతల వద్దకు వెళ్తే.. నిధులు రావడంలేదు. మమ్మల్నేం చేయమంటారు?’ అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారని వాపోయారు.
ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం చొల్లంగిలో పార్టీ నియోజకవర్గ అదనపు కో–ఆర్డినేటర్ పితాని బాలకృష్ణ ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముమ్మిడివరం నగర పంచాయతీ ఫ్లోర్‌లీడర్ కాశి బాలమునికుమారి, చీకట్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలంలోని ఉప్పంపాలెంలో కో–ఆర్డినేటర్ పర్వత పూర్ణచంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తాగునీరు అందించాలని యామన మాణిక్యం అనే మహిళ కోరింది. అలాగే తన భర్త చనిపోయి మూడేళ్లవుతున్నా ఇప్పటివరకు పింఛను రాలేదని, ఉపాధి పనుల కూలీ రూ.10 వేల వరకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తమ వీధిలో రోడ్డు నిర్మించాలని గుడాల లక్ష్మి కోరింది.
మండపేటలో నియోజకవర్గ కో–ఆర్డినేటర్ వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి పట్టణంలోని 15వ వార్డులో ఈ కార్యక్రమం నిర్వహించారు. పింఛన్లు, గృహ నిర్మాణ రుణాలు, పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడం తదితర సమస్యలను స్థానికులు నేతల దృష్టికి తీసుకువచ్చారు. రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పెంకే వెంకట్రావు, ప్రచార విభాగం జిల్లా కన్వీనర్ సిరిపురపు శ్రీనివాసరావు తదితరులు వేగుళ్ల వెంట ఉన్నారు.
పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధిలోని 14, 15 వార్డుల్లో కో–ఆర్డినేటర్ పెండెం దొరబాబు ఈ కార్యక్రమం నిర్వహించారు. రెండేళ్ల చంద్రబాబు ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో జరిగిన అవినీతి, దందాలు, దోపిడీని ప్రజలకు వివరించారు. గొల్లప్రోలు, పిఠాపురం పట్టణ కన్వీన ర్లు పర్ల రాజా, బొజ్జా రామయ్య, పిఠాపురం మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ గండేపల్లి బాబీ, పార్టీ జిల్లా ఆర్గనైజింగ్‌సెక్రటరీ , ఎంపీపీ కురుమళ్ల రాంబాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు మొగలి అయ్యారావు తదితరులు పాల్గొన్నారు.
జగ్గంపేట మండలం సీతారామపురం గ్రామంలో పార్టీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాస్ ఈ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో పారిశుధ్యం సరిగా లేదని, విద్యుత్ తీగలు కిందకు వేలాడుతున్నాయని స్థానికులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి వరసాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అమలాపురం నియోజకవర్గం అల్లవరం గ్రామంలో రెండో రోజు ఈ కార్యక్రమం నియోజవర్గ కో–ఆర్డినేటర్ పినిపే విశ్వరూప్, సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి ఆధ్వర్యంలో జరిగింది. ప్రజా బ్యాలెట్ పత్రాలను అందజేసి, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. రాష్ట్ర కార్యదర్శి బొమ్మి ఇజ్రాయిల్, నియోజవర్గ కార్యనిర్వహక కార్యదర్శి మోకా రాఘవులు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు మట్టపర్తి మురళీకృష్ణ, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు జున్నూరి వెంకటేశ్వరరావు, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు జక్కంపూడి కిరణ్, కార్యవర్గ సభ్యులు మొండి రమేష్‌బాబు, గెడ్డం జీవన్‌కుమార్, జున్నూరి బాబి పాల్గొన్నారు.
రాజానగరం మండలం సీతారామపురం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా నిర్వíß ంచారు. గతంలో వస్తున్న పింఛన్లు తీసేశారని, వికలాంగులు, వృద్ధులు వాపోయారు. వ్యవసాయ, డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదని చంద్రబాబుపై మండిపడ్డారు. మండల కన్వీనర్ బంగారపు వీర్రాజు, సొసైటీ మాజీ అధ్యక్షుడు అడబాల చినబాబు, మండల రైతు విభాగం కన్వీనర్ పిక్కిరెడ్డి హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
సామర్లకోట మున్సిపాలిటీలోని 15వ వార్డులో నియోజకవర్గ కో–ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఇళ్లు మంజూరు కాకపోవడంతో మూడేళ్లుగా పునాదులతో ఉన్నాయని, వార్డులో అనేక మందికి వికలాంగ, వితంతువులకు పింఛన్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు మంజూరు చేయడం లేదన్నారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు ఆవాల లక్ష్మీనారాయణ, జిగిని వీరభద్రరావు, కంటే వీరాఘవరావు, జెడ్పీటీసీ మాజీ సభ్యులు బంగారు కృష్ణ, బొబ్బరాడ సత్తిబాబు, కౌన్సిల్ ప్రతిపక్ష నాయకుడు మృత్యుంజయరావు తదితరులు పాల్గొన్నారు.
తట్ట మట్టి కూడా ఇవ్వలేదు
కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం కలవచర్లలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. పెంకుటిల్లు కూలడానికి సిద్ధంగా ఉన్నా ఇంటి రుణం మాత్రం మంజూరు చేయడం లేదని చండ్రమళ్ల నాగమణి ఆరోపించింది. తమ పూరింటిని మెరక చేసుకుందామంటే నీరు–చెట్టు పథకం కింద ఒక తట్ట మట్టి కూడా సరఫరా చేయలేదని బుంగ రాజు దంపతులు తెలియజేశారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవ అక్కరకు రావడం లేదంటూ తమ సమస్యలను ఏకరువు పెట్టారు.
Advertisement
Advertisement