problems heavy
-
మార్పు కావాలి
సాక్షిప్రతినిధి, ఒంగోలు: ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఇచ్చిన హామీలు విస్మరించి ప్రజా సంక్షేమం, అభివృద్ధిని గాలికొదిలిన ప్రభుత్వంలా కాకుండా మంచి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. మేనిఫెస్టోలోని హామీలన్నీ నెరవేర్చి ప్రజా శ్రేయస్సును కాంక్షించే నిబద్ధత గల నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు. మడిమ తిప్పని, మాట తప్పని నాయకుడి వైపే మొగ్గుచూపుతున్నారు. యూ టర్న్‌లు తీసుకునే వారిని, హామీలిచ్చి విస్మరించే వారిని ఇంటికి పంపుతామని స్పష్టం చేస్తున్నారు. తమ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే నేతనే ఎన్నుకునేందుకు సన్నద్ధమయ్యారు. ఆ దిశగా ఓటు మీట నొక్కేందుకు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. 611 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయని ప్రభుత్వం... గత ఎన్నికల్లో 611 హామీలిచ్చి వాటిలో ఒక్క హామీని కూడా ప్రభుత్వం సక్రమంగా అమలు చేయకపోవడంతో ఇంత దారుణమైన పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి రావడం కోసం ఎన్ని అబద్ధాలు ఆడటానికైనా సిద్ధం అనేలా గత ఎన్నికల్లో అధికార పార్టీ వ్యవహరించింది. పాలకులను చూసి అధికారులు కూడా భయపడిపోయి అన్ని హామీలూ నెరవేరాయని చెబుతున్నారు. రాజ్యాంగం అపహాస్యం... గతంలో ఎన్నడూ లేని విధంగా రాజ్యాంగం అపహాస్యమైన సంఘటనలు ఈ ఐదేళ్లలో ఎక్కువగా ఉన్నాయి. ఎలాంటి రాజీనామా లేకుండా పార్టీలు మారి ఎమ్మెల్యేలుగా పదవుల్లో కొనసాగారు. ప్రతిపక్షంలోని ఎమ్మెల్యేలకు కనీసం పోలీసు సెక్యూరిటీ కూడా ఇవ్వని దుస్థితి. బడుగు, బలహీనవర్గాలకు చెందిన వారిపై దాడులు అధికమయ్యాయి. దళితుల భూముల ఆక్రమణలు ఏకంగా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే జరిగాయి. ఏ సమస్య అయినా అడిగితే చాలు పోలీస్ స్టేషన్లో అక్రమంగా కేసులు బనాయించారు. ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధులకు రావాల్సిన నిధులు ఇవ్వకుండా ఆ ప్రాంత ప్రజలకు అభివృద్ధిని దూరం చేశారు. వారిని వేధింపులకు గురిచేశారు. పార్టీ ఫిరాయింపుల చట్టంకు తూట్లు పొడిచారు. ఇలా రాజ్యాంగం అమలు జరగకుండా ప్రభుత్వ పాలన సాగింది. పాలకుల్లో లోపించిన విశ్వసనీయత... ఒకప్పుడు నాయకులంటే విశ్వసనీయత ఉండేది. వారిచ్చిన హామీలపై నమ్మకముండేది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నేతలు కొంతమేరకైన హామీలను నెరవేర్చే ప్రయత్నం చేసేవారు. కానీ, కొందరు నేతలు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా జనాన్ని వంచించడమే పనిగా పెట్టుకుంటున్నారు. ఎప్పటికప్పుడు కొత్త హామీలతో పబ్బం గడుపుకుని అధికార పీటం ఎక్కేందుకు అన్ని రకాల వంచనలకు పాల్పడుతున్నారు. జనం కష్టాలు, కన్నీళ్లు పట్టించుకోకుండా స్వలాభాపేక్షే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. అలాంటి నేతల పాలనపై విసుగెత్తిన జనం మార్పు కోరుకుంటున్నారు. కొత్తతరం నాయకత్వం కోసం, సరికొత్త విధానాలతో కూడిన పాలన కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఓటు మీట నొక్కి వంచకులకు బుద్ధి చెప్పి తమ బతుకులకు భరోసానిచ్చే యువతరం నాయకత్వానికి నాంది పలికేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. గత పాలకుల వంచన ఫలితంగానే ప్రకాశం జిల్లా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయింది. ఐదేళ్లుగా కరువు జిల్లాగానే మిగిలిపోయింది. వలసల జిల్లాగా మారింది. గుక్కెడు నీరు దొరక్క చివరకు ఫ్లోరైడ్, కిడ్నీ వ్యాధిగ్రస్తుల కేంద్రమైంది. పరిశ్రమల ఏర్పాటుకు నోచుకోక నిరుద్యోగులకు నిలయంగా ఉంది. ప్రాజెక్టులు పూర్తిగాక సాగు, తాగునీరు వెతలతో సతమతమవుతోంది. కొందరికే న్యాయం.. అర్హులకు అన్యాయం... కొందరికి మాత్రమే న్యాయం చేసే విధంగా ఉంటూ అర్హులైన ప్రజలకు మాత్రం అన్యాయం చేసేలా ఐదేళ్ల పాలన జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. జన్మభూమి కమిటీల పెత్తనం మితిమీరింది. రేషన్ కార్డులు, పింఛన్లను సైతం ఆ కమిటీల కనుసన్నల్లోనే అమలు చేశారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందే పరిస్థితి లేకుండా పోయింది. అధికారులు కేవలం సంతకానికి తప్ప మరిదేనికీ పనికిరాని పరిస్థితులు తీసుకువచ్చారు. మాట వినని అధికారులను ఇష్టానుసారంగా బదిలీలు చేసి అధికార పార్టీ నేతలు అరాచక పాలన సాగించారు. నిజాయితీ, మార్పు కోరుకుంటున్న ప్రజలు... ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేసి పేద ప్రజల పట్ల నిబద్ధతతో వ్యవహరించే నాయకుడిని ప్రస్తుతం ప్రజలు కోరుకుంటున్నారు. నిజాయితీతో ఉంటూ రాజ్యాంగ వ్యవస్థల పట్ల బాధ్యతగా వ్యవహరించే నాయకుడు అయితే మంచి పాలన వస్తుందని ప్రజలు భావిస్తున్నారు. ఇక పార్టీలు మారి నీచపు రాజకీయాలు చేసే సంస్కృతిని అడ్డుకునే నాయకుడు వస్తే మంచి జరుగుతుందని, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ అన్ని వర్గాలను కలుపుకుని ఆలోచిస్తూ మంచి చేసే నాయకుడు కావాలని కోరుకుంటున్నారు. రోజుకో హామీ.. పూటకో నిర్ణయం మార్చుకుంటూ ఉండేవారి వలన రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోందని జనం గ్రహించారు. అలాంటి వారిని దూరంపెట్టి ఒకే నిర్ణయం, ఒకే మాటగా ఉన్న నాయకులైతే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలు పేర్కొంటున్నారు. మొత్తంగా ఈ ఎన్నికలు వేదికగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. నిబద్ధత కలిగిన నేతను అధికార పీఠంపై కూర్చోపెట్టేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలో అన్నీ సమస్యలే... జిల్లా పరిధిలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గుక్కెడు మంచినీరు అందించాలన్న ధ్యాస కూడా ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఫ్లోరైడ్ నీటి పుణ్యమా అని కిడ్నీ బాధితులు పడుతున్న ఇబ్బందులు చెప్పనలవికాదు. మందులకు కూడా డబ్బులు లేక కుటుంబ పోషణ భారంగా మారి వాళ్లు బతుకుతున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు అనే పదమే మర్చిపోయారు. ఎన్నికలు వస్తున్నాయని డీఎస్సీని ప్రకటించి తక్కువ ఉద్యోగాలు చూపించి పరీక్ష పెట్టి వదిలేశారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి దారుణం. వెట్టిచాకిరి చేస్తున్నా ఎప్పుడు జీతాలు వస్తాయో అర్థంగాని పరిస్థితి. అధికారులపై ఖద్దరు పెత్తనం... అధికారులు ప్రజలకు న్యాయం చేసే వీలులేకుండా వారిపై ఖద్దరు చొక్కాలు రాజ్యమేలాయి. సామాన్య ప్రజలు కనీసం తమ సమస్యలు చెప్పుకునే వీలు కూడా లేకుండా లా అండ్ ఆర్డర్ కూడా అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో నడిచింది. ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు తమ వినతులను పట్టించుకోవాలని అడిగినందుకు కేసులకు బలయ్యారు. తమకు ఎదురు చెప్పకూడదనే విధంగా ఈ పాలన సాగిందన్నది ప్రజల భావన. సాక్షాత్తూ పెద్ద పదవుల్లో ఉన్న వారే దళితులను కించపరచడం, బీసీల గురించి అసభ్యంగా మాట్లాడటం చేశారు. అధికారులపై చేయి చేసుకోవడం, తనమాట వినని వారిపై అసత్య ప్రచారాలు చేయడం లాంటివి ఈ ఐదేళ్ల పాలనలోనే జరిగాయి. దళితుల భూములు ఆక్రమించుకోవడం, ఇసుకను దోచేయడం, అభివృద్ధి పనుల్లో అంచనాలు పెంచుకుని కోట్లు కొల్లగొట్టడం వంటివి కోకొల్లలు. ఏ గ్రామంలో చూసినా నిర్మాణాలు అవినీతిమయంగా తయారయ్యాయి. చివరకు మరుగుదొడ్ల నిర్మాణాల్లో కూడా కమీషన్లు తీసుకుని కట్టిన పరిస్థితి ఈ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది. ఎన్నికలప్పుడే హామీలు గుర్తుకొస్తాయా..? ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మళ్లీ ఎన్నికలు రావడానికి రెండు నెలల ముందు మాత్రమే పాలకులకు గుర్తుకొస్తున్నాయి. అంటే ఎన్నికల కోసమే హామీలిస్తున్నారు మినహా వాటిని అమలు చేయాలని, ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశం ఏ కోశానా లేదు. ఇటువంటి నాయకులు మనకు అవసరమా..? అని ప్రజలు ఆలోచించుకోవాలి. ఇచ్చిన మాట మీద నిలబడే నాయకులను ఎన్నుకోవాలి. - ఎం.నాగార్జునరెడ్డి, తాళ్లూరు ప్రజా వ్యతిరేక పాలనతో విసిగిపోయాం ఏళ్ల తరబడి ప్రజా వ్యతిరేక పాలనతో విసిగిపోయాం. కొత్త నాయకత్వంతో మేలు జరగుతుందని అనుకుంటున్నాం. ఇచ్చిన మాట మీద నిలబడే నాయకుడే రాజకీయాలకు అవసరం. హామీలిచ్చి నెరవేర్చని నాయకులు ఎంత మంది వచ్చినా ఒరిగేదేమీ లేదు. అలాంటి వారిని మళ్లీ నమ్మదలచుకోలేదు. అందుకే కొత్త నాయకుడికే మా ఓటు వేస్తాం. అందరూ అదే బాటలో నడవాలి. మంచి పాలన కోసం మార్పును ఆహ్వానించాలి. - చీరాల రాధాకృష్ణమూర్తి, రావినూతల -
మెట్టు దిగిన ఎమ్మెల్సీ
హామీలన్నీ గోవిందా బేలోడు..సమస్యలు బోలెడు మెట్టు .. ఒక్కహామీ తీర్చింటే ఒట్టు..! కనిపించని డ్రైనేజీలు అధ్వాన్నంగా రోడ్లు ఇబ్బందుల్లో గ్రామీణులు గ్రామం: బేలోడు నియోజకవర్గం: రాయదుర్గం జనాభా: 2,100 ఓటర్లు: 1,20 దత్తత తీసుకున్నది: తాజా మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి గుమ్మఘట్ట: బేలోడు....గుమ్మఘట్ట మండంలోని ఓ గ్రామం. మౌలిక వసతులకు నోచుకోని ఓ పల్లె. కనీస సౌకర్యాలకు కూడా లేకపోవడంతో ఇక్కడి వారంతా సమస్యలతోనే సహజీవనం చేసేవారు. అయితే మూడేళ్ల క్రితం అప్పటి ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి ఈ పల్లెను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో జనమంతా తమ గ్రామంలో మౌలిక సౌకర్యాలు మెరుగుపడుతాయని, ఊరు రూపరేఖలే మారిపోతాయని సంబరపడ్డారు. అయితే మూఽడేళ్లయినా గ్రామంలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదు. ఈలోపు పదవీకాలం పూర్తవడంతో మెట్టు మాజీ కాగా...ఆయన ఇచ్చిన హామీలన్నీ గాలిలో కలిసిపోయాయి. దత్తత సమయంలో ఎమ్మెల్సీ ఇచ్చిన హామీలు - ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి ఏర్పాటుతో పాటు రెండు మొక్కలు పెంచి తీరుతాం. - గార్మెంట్ పరిశ్రమ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి చూపుతాం - అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేయిస్తా - గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుస్తాం. ఇల్లు..పొలం కొన్నా..గ్రామ సమస్యలు తీర్చలేదు బోలోడు గ్రామం సమీపంలోనే బీటీ ప్రాజెక్టు ఉంది. ఎప్పటికైనా ఈ ప్రాంతంలోని భూములకు మంచి ధర లభిస్తుందన్న ఉద్దేశంతో ఈ గ్రామంలో ఇల్లు కట్టి...పొలాలు కొనుగోలు చేసిన మెట్టు గోవిందరెడ్డి..గ్రామంలోని సమస్యలు మాత్రం పూర్తిగా విస్మరించారు. ప్రతి ఇంటికీ మొక్కలు పెంచి తీరుతామన్న ఆయన హామీ కార్యరూపం దాల్చలేదు. ఇక మరుగుదొడ్ల నిర్మాణ బాధ్యతను ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థకు అప్పజెప్పి చేతులు దులుపుకున్నారు. గార్మెంట్ పరిశ్రమ ఏర్పాటు ఊసే లేకుండా పోయింది. ఇప్పటికీ గ్రామంలోని చాలా మంది పింఛన్లు అందడం లేదు. ఇక సీసీ రోడ్లు లేకపోవడంతో వర్షాకాలం జనం బురదగుంటగా మారిన రోడ్లపైనే నడవాల్సి వస్తోంది. డ్రైనేజీల నిర్మాణం చేపట్టకపోవడంతో మురుగునీరంతా రోడ్లపైనే ప్రవహిస్తోంది. అభివృద్ధికి సహకరిస్తాం బేలోడును అభివృద్ధి చేయాలని మెట్టు గోవిందరెడ్డి ధృడ సంకల్పంతో ఉన్నారు. ఆయన కోరిక నేరవేర్చేందుకు పూర్తిస్థాయిలో సహకరిస్తామం - బేలోడును మెట్టుగోవింద రెడ్డి దత్తత తీసుకున్న సమయంలో అప్పటి ప్రభుత్వ చీఫ్‌విప్, ప్రస్తుత గ్రామీణ గృహ నిర్మాణశాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు ఇచ్చిన హామీ ఇది. ఇందిరమ్మ కాలనీలో సౌకర్యాలు అధ్వాన్నం గ్రామం చివరలో ఉన్న ఇందిరమ్మ కాలనీలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. మెట్టు గోవిందరెడ్డి పొలానికి వెళ్లాలంటే నిత్యం ఈ కాలనీ దాటుకునే వెళ్లాలి. అయితే కాలనీలో నెలకొన్న సమస్యలను ఆయన ఏనాడు పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుక్కెడు తాగునీరు దొరక్క ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ కాలనీకి ఎక్కిళ్లు.. గ్రామంలోని ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్య తీవ్రతరమైంది. గ్రామంలో రెండు తాగునీటి పథకాలు ఉన్నా... ఆశించిన స్థాయిలో నీరు రాకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీకి శాశ్వత తాగునీటి సమస్య తీరుస్తామన్న పాలకుల మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. చెవిలో పూలు పెట్టారు ప్రజల చెవిలో పువ్వులు పెట్టడం ఈ ప్రభుత్వానికి అలువాటే. ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గ్రామాన్ని దత్తత తీసుకున్నా...ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పనీ చేయలేదు. దత్తత తీసుకున్న కొత్తలో మంత్రులు, జిల్లా అధికారులతో కొద్ది రోజులు హడావిడి చేయడం చూసి.. మా గ్రామ రూపు రేఖలు మారిపోతాయని భ్రమించాం. హామీల్లో ఒక్కంటంటే ఒక్కటీ ఆయన నెరవేర్చలేకపోయారు. - జయరామిరెడ్డి, స్థానికుడు ఎలాంటి అభివృద్ధి లేదు ఇందిరమ్మ కాలనీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. పేరుకే దత్తత గ్రామం కానీ...మచ్చకైనా అభివృద్ధి కనిపించడం లేదు. గోవిందరెడ్డి చెప్పిన మాటలు నమ్మిన ప్రజలు ఇపుడు మమ్మల్ని నిలదీస్తున్నారు. సమాధానం చెప్పలేక పోతున్నాం. మంత్రిగారైనా బేలోడు సమస్యలు తీర్చాలి. – బోయ రామాంజినేయులు, వార్డు సభ్యుడు, బేలోడు తాగునీటికీ తిప్పలే గుక్కెడు నీటి కోసం కూడా కోసం జనం తీవ్ర ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొంది. ఎస్సీకాలనీలో ఎలాంటి మౌలిక వసతులు లేవు. పదవీకాలం పూర్తయిన తర్వాత గోవిందరెడ్డి కనిపించడం కూడా కష్టమైపోయింది. – రామాంజినేయులు, గ్రామస్తుడు -
మా వెతలు పట్టవా!
తాగునీరులేక ఇబ్బందులు పడుతున్నాం రోడ్లు అధ్వానంగా ఉన్నాయి వర్షం పడితే నడవలేని పరిస్థితి ప్రభుత్వ తీరుపై ప్రజల మండిపాటు ‘గడప గడపకూ వైఎస్సార్’లో వైఎస్సార్ సీపీ నేతలకు గోడు టీడీపీ సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘గడప గడపకూ వైఎస్సార్’ కార్యక్రమం జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో మంగళవారం ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు వివిధ సమస్యలను వైఎస్సార్సీపీ నేతల దృష్టికి తీసుకువచ్చారు. ‘సమస్యలు పరిష్కరించాలని స్థానిక టీడీపీ నేతల వద్దకు వెళ్తే.. నిధులు రావడంలేదు. మమ్మల్నేం చేయమంటారు?’ అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారని వాపోయారు. ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం చొల్లంగిలో పార్టీ నియోజకవర్గ అదనపు కో–ఆర్డినేటర్ పితాని బాలకృష్ణ ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముమ్మిడివరం నగర పంచాయతీ ఫ్లోర్‌లీడర్ కాశి బాలమునికుమారి, చీకట్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలంలోని ఉప్పంపాలెంలో కో–ఆర్డినేటర్ పర్వత పూర్ణచంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తాగునీరు అందించాలని యామన మాణిక్యం అనే మహిళ కోరింది. అలాగే తన భర్త చనిపోయి మూడేళ్లవుతున్నా ఇప్పటివరకు పింఛను రాలేదని, ఉపాధి పనుల కూలీ రూ.10 వేల వరకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తమ వీధిలో రోడ్డు నిర్మించాలని గుడాల లక్ష్మి కోరింది. మండపేటలో నియోజకవర్గ కో–ఆర్డినేటర్ వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి పట్టణంలోని 15వ వార్డులో ఈ కార్యక్రమం నిర్వహించారు. పింఛన్లు, గృహ నిర్మాణ రుణాలు, పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడం తదితర సమస్యలను స్థానికులు నేతల దృష్టికి తీసుకువచ్చారు. రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పెంకే వెంకట్రావు, ప్రచార విభాగం జిల్లా కన్వీనర్ సిరిపురపు శ్రీనివాసరావు తదితరులు వేగుళ్ల వెంట ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధిలోని 14, 15 వార్డుల్లో కో–ఆర్డినేటర్ పెండెం దొరబాబు ఈ కార్యక్రమం నిర్వహించారు. రెండేళ్ల చంద్రబాబు ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో జరిగిన అవినీతి, దందాలు, దోపిడీని ప్రజలకు వివరించారు. గొల్లప్రోలు, పిఠాపురం పట్టణ కన్వీన ర్లు పర్ల రాజా, బొజ్జా రామయ్య, పిఠాపురం మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ గండేపల్లి బాబీ, పార్టీ జిల్లా ఆర్గనైజింగ్‌సెక్రటరీ , ఎంపీపీ కురుమళ్ల రాంబాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు మొగలి అయ్యారావు తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట మండలం సీతారామపురం గ్రామంలో పార్టీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాస్ ఈ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో పారిశుధ్యం సరిగా లేదని, విద్యుత్ తీగలు కిందకు వేలాడుతున్నాయని స్థానికులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి వరసాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అమలాపురం నియోజకవర్గం అల్లవరం గ్రామంలో రెండో రోజు ఈ కార్యక్రమం నియోజవర్గ కో–ఆర్డినేటర్ పినిపే విశ్వరూప్, సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి ఆధ్వర్యంలో జరిగింది. ప్రజా బ్యాలెట్ పత్రాలను అందజేసి, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. రాష్ట్ర కార్యదర్శి బొమ్మి ఇజ్రాయిల్, నియోజవర్గ కార్యనిర్వహక కార్యదర్శి మోకా రాఘవులు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు మట్టపర్తి మురళీకృష్ణ, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు జున్నూరి వెంకటేశ్వరరావు, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు జక్కంపూడి కిరణ్, కార్యవర్గ సభ్యులు మొండి రమేష్‌బాబు, గెడ్డం జీవన్‌కుమార్, జున్నూరి బాబి పాల్గొన్నారు. రాజానగరం మండలం సీతారామపురం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా నిర్వíß ంచారు. గతంలో వస్తున్న పింఛన్లు తీసేశారని, వికలాంగులు, వృద్ధులు వాపోయారు. వ్యవసాయ, డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదని చంద్రబాబుపై మండిపడ్డారు. మండల కన్వీనర్ బంగారపు వీర్రాజు, సొసైటీ మాజీ అధ్యక్షుడు అడబాల చినబాబు, మండల రైతు విభాగం కన్వీనర్ పిక్కిరెడ్డి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. సామర్లకోట మున్సిపాలిటీలోని 15వ వార్డులో నియోజకవర్గ కో–ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఇళ్లు మంజూరు కాకపోవడంతో మూడేళ్లుగా పునాదులతో ఉన్నాయని, వార్డులో అనేక మందికి వికలాంగ, వితంతువులకు పింఛన్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు మంజూరు చేయడం లేదన్నారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు ఆవాల లక్ష్మీనారాయణ, జిగిని వీరభద్రరావు, కంటే వీరాఘవరావు, జెడ్పీటీసీ మాజీ సభ్యులు బంగారు కృష్ణ, బొబ్బరాడ సత్తిబాబు, కౌన్సిల్ ప్రతిపక్ష నాయకుడు మృత్యుంజయరావు తదితరులు పాల్గొన్నారు. తట్ట మట్టి కూడా ఇవ్వలేదు కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం కలవచర్లలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. పెంకుటిల్లు కూలడానికి సిద్ధంగా ఉన్నా ఇంటి రుణం మాత్రం మంజూరు చేయడం లేదని చండ్రమళ్ల నాగమణి ఆరోపించింది. తమ పూరింటిని మెరక చేసుకుందామంటే నీరు–చెట్టు పథకం కింద ఒక తట్ట మట్టి కూడా సరఫరా చేయలేదని బుంగ రాజు దంపతులు తెలియజేశారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవ అక్కరకు రావడం లేదంటూ తమ సమస్యలను ఏకరువు పెట్టారు.