- దీక్షలను సందర్శించిన ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీగౌడ్
ప్రజాభిప్రాయం మేరకే జిల్లాలు ఏర్పాటు చేయాలి
Published Mon, Aug 1 2016 11:56 PM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM
జనగామ : శాస్త్రీయంగా నిపుణుల కమిటీ పర్యవేక్షణలో ప్రజాభిప్రాయం మేరకే నూతన జిల్లాలను ఏర్పాటు చేయాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీగౌడ్ సూచించారు. జిల్లా సాధన కోసం జేఏసీ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న దీక్షలను సోమవారం పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య సతీమణి అరుణతో కలిసి యాష్కీ సందర్శించి సంఘీభావం తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తించే సోనియాగాంధీ ప్రత్యేక తెలంగాణ ఇచ్చిందన్నారు. కానీ ప్రజాసంక్షేమాన్ని విస్మరించిన సీఎం కేసీఆర్ జిల్లాల చిచ్చు తెరపైకి తీసుకువచ్చి ప్రజల మధ్య వైరుధ్యాలు పెంచుతున్నాడని మండిపడ్డారు. ఉద్యమం సమయంలో ప్రాణాలు అర్పించిన అమరులు, ఆత్మహత్య చేసుకుంటున్న రైతు కుటుంబాలను పరామర్శించేందుకు తీరిక లేదనే సీఎం, హరితహారంతో పబ్బం గడుపుకుంటున్నాడని విమర్శించారు. ధనార్జనే ధ్యేయంగా టీఆర్‌ఎస్ కుటుంబ పాలన కొనసాగుతుందని ఆరోపించారు. దీక్షలో ధర్మపురి శ్రీనివాస్, బ్రాహ్మణపల్లి రమేష్, ఉల్లెంగుల అబ్బసాయిలు, పట్టూరి శ్రీనివాస్, నరేందర్, శ్రవణ్‌కుమార్ కూర్చున్నారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ ఆరుట్ల ద శమంతరెడ్డి, మంగళ్లపల్లి రాజు, నాయకులు చెంచారపు బుచ్చిరెడ్డి, రంగరాజు ప్రవీణ్ కుమా ర్, ఎండి అన్వర్, ఆకుల వేణుగోపాల్‌రావు, మేడ శ్రీనివాస్, మేకల రాంప్రసాద్, దూడల సిద్దయ్య, జక్కుల వేణుమాధవ్, వెన్నెం సత్యనిర ంజన్‌రెడ్డి, రంగు రవి, మాజీద్ ఉన్నారు.
Advertisement
Advertisement