little
-
మై లిటిల్ మార్ఫీ..! చిన్నారులు హాయిగా నిద్రపోయేలా..!
చిన్నపిల్లలకు కథలు చెబుతుంటే, నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటారు. దీనికోసం చాలామంది తల్లిదండ్రులు మొబైల్లో వారికి కావాల్సినవి పెట్టి పడుకోబెడుతుంటారు. ఇది చాలా ప్రమాదం. పైగా కొన్ని పరిశోధనలు నిద్రపోవడానికి ముందు అరగంట సమయం పిల్లల మానసిక ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుందని నిర్ధారించాయి. మొబైల్ వల్ల పిల్లల నిద్రకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ ‘మై లిటిల్ మార్ఫీ’నీ రూపొందించారు. ఇందులో చిన్నారుల ప్రశాంతమైన నిద్ర కోసం 128 కథలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే 32 రకాల ధ్యానాలు, పిల్లి, కుక్క, ఏనుగు వంటి 16 జంతువుల ధ్వనులు, సముద్ర కెరటాలు, గాలి, నీటి తుంపరలు, మంటల చిటపట శబ్దాలతో పాటు ‘మై లిటిల్ మార్ఫీ’ కోసం ప్రత్యేకంగా కంపోజ్ చేసిన 16 శ్రావ్యమైన సంగీత స్వరకల్పనలు ఉన్నాయి. ఇవే కాకుండా, ప్రపంచంలోని వివిధ ప్రదేశాలలో రికార్డ్ చేసిన ప్రకృతి శబ్దాలున్నాయి. ఇలా మొత్తం మై లిటిల్ మార్ఫీ 192 సెషన్లను 5 థీమ్‌లుగా విభజించింది. పడుకునే ముందు మన కిష్టమైన సెషన్ , ఆ సెషన్ వ్యవధిని ఎంచుకుంటే చాలు. అది వింటూ హాయిగా నిద్ర పోవచ్చు. చిన్నారులకే కాదు ఈ పరికరం అన్ని వయసుల వారికీ అనుకూలంగా ఉంటుంది. ఇందులో అద్భుతమైన నాణ్యతతో వాయిస్ రికార్డింగ్ చేసుకునే వీలుండటం విశేషం. దీనిని ఒకసారి పూర్తిగా చార్జ్ చేస్తే సుమారు మూడు గంటల పాటు పనిచేస్తుంది. అంటే మొత్తం ఎనిమిది కథలు, పదహారు పాటల వరకు వినొచ్చు. ధర 8 వేల నుంచి 9 వేల రూపాయల వరకు ఉంది. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. (చదవండి: ప్రపంచంలోనే అతి పెద్ద ఆటబొమ్మల దుకాణం..!) -
హైదరాబాద్ MNJ క్యాన్సర్ హాస్పిటల్లో....
-
లిటిల్ చెఫ్ ! అపుడు అన్నం తినడానికి మారాం, ఇపుడు యూట్యూబ్ స్టార్‌గా
చిన్నారులకు అన్నం తినిపించాలంటే తల్లులకు పెద్ద టాస్క్. కథలు చెప్పాలి.. బుజ్జగించాలి.. లాలించాలి.. అంత చేసినా చివరకు సగం వదిలేస్తుంటారు. ఇప్పుడైతే మొబైల్ ఫోన్లో ఏదో ఒక కార్టూన్లు, రైమ్స్ పెట్టి తినిపించేస్తున్నారు. అసలు పిల్లలు ఏం తింటున్నారో కూడా వారికి తెలియట్లేదు. అలా వారిపై ఫోన్ల ప్రభావం ఉంటోంది. ఇలాగే ఈ చిన్నారి కూడా అన్నం తిననంటూ మారాం చేస్తుండేదట. కానీ ఆ పాప తల్లిదండ్రులు మాత్రం కాస్త వెరైటీగా ఆలోచించారు. ఆ పాపతోనే వంటలు చేయించడం ప్రారంభించారు. వాటిని షూట్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టి పలువురి ప్రశంసలు పొందుతున్నారు. – సాక్షి, హైదరాబాద్లిటిల్ చెఫ్.. తినేటప్పుడు ఏడుపు మానిపించడానికి చేసిన ప్రయత్నం ఆ పాపకు వంటలపై మక్కువను పెంచేలా చేశాయి. దీంతో ప్రస్తుతం ఆ పాప మరింత యాక్టివ్‌గా తన హావభావాలతో వీక్షకులను ఆకట్టుకుంటోంది. ఆ పాప పేరే శ్రీనిత్య. బాచుపల్లిలో నివాసం ఉంటున్న నవీన్ చారి, శైలజ కూతురైన శ్రీనిత్య వయసు 8 ఏళ్లు. ప్రస్తుతం మూడో తరగతి చదువుకుంటోంది. కానీ వంటలతో పెట్టే వీడియోలతో యూట్యూబ్‌లో స్టార్‌గా మారింది.ఇదీ చదవండి: ఫెస్టివ్ సీజన్లో మెరిసివాలంటే ఇదిగో చిట్కా, చిటికెలో మ్యాజిక్!చిన్నప్పటి నుంచే ఆసక్తి.. నాలుగేళ్ల వయసు నుంచే పాప కిచెన్‌లోని వస్తువులతో గడిపేదట. పాప ఆసక్తి చూసిన తండ్రి కిచెన్ సెట్ కొనిచ్చాడు. ఇక ఎప్పుడూ వాటితోనే కాలం గడుపుతూ ఉల్లాసంగా ఉండేదట. అయితే అన్నం తినకపోయేదట. దీంతో పాపకు అన్నంపై ఆసక్తి పెంచాలనే ఉద్దేశంతో చిన్న చిన్న వంట పాత్రల్లో వంటకాలు చేయించడం నేరి్పంచారట. ఆ పాప చేసిన వంటకాలను చాలా ఇష్టంతో తినడం గుర్తించిన నవీన్.. ఓ రోజు పాప వంటలు తయారుచేస్తున్న సమయంలో వీడియోలు తీసి, ఇన్‌స్టాలో పెట్టాడు. బంధువులు, స్నేహితుల నుంచి ప్రశంసలు రావడంతో వీడియోలు తీయడం కొనసాగించాడు. అందుకోసం డ్రెస్‌లతో పాటు అన్ని రకాల మినియేచర్ వంట పాత్రలనూ కొనుగోలు చేశాడు. దాదాపు 5 ఏళ్ల వయసు నుంచే పాపతో వెరైటీ వంటకాలు చేయించడం, వాటిని అప్లోడ్ చేయడం చేస్తున్నాడు. శ్రీనిత్య చిన్నప్పటి నుంచే బుజ్జిగా మాట్లడటమే కాకుండా ముఖంలో హావభావాలు అద్భుతంగా పలికిస్తోంది. దీంతో వీక్షకులు కూడా పాప వంటకాలకే కాకుండా ఆమె ముఖ కవళికలకు కూడా ఫిదా అవుతున్నారు. ఆహారంపై ఆసక్తి పెంచాలి.. శ్రీనిత్యకు ఎలాగైనా ఆహారంపై ఆసక్తి పెంచాలనే ఉద్దేశంతో పాటు, వంటలు చేయడం ఎంత కష్టమో తెలియజేసేందుకు ఇలా వంటకాలు నేర్పించాం. వీడియోలు తీసేటప్పుడు ఎలా చెబితే అలా చేస్తుంటుంది. అస్సలు అలిసిపోదు. వీడియో షూటింగ్ అనగానే చాలా ఉత్సాహంగా ఉంటుంది. అటు స్కూల్లో కూడా బాగా చదువుకుంటుంది. వారాంతాల్లో ఎక్కువగా వంటలు చేయిస్తూ వీడియోలు తీస్తుంటాం. పాప వంటలు చేస్తుంటే ముద్దుముద్దుగా అనిపిస్తుంటుంది. వంటలు చేసుకుంటూ పిల్లలకు ఆసక్తి కలిగించే కథలు, మంచి మాటలు చెప్పిస్తుంటాం. – నవీన్ చారి నారోజు, నిత్య తండ్రి -
హీరోయిన్ రష్మిక చెల్లిని చూశారా? ఎంత చిన్న పిల్లనో! (ఫొటోలు)
-
బాల నలభీములు! తినడం చేతకాని ఏజ్‌లోనే వంటకాలు..!
వంట చేయడం ఓ కళ. అందరికీ తెలిసిన రెసిపే అయినా ఒకొక్కరి చేతిలో అమృతంలా మారుతుంది. దాన్నే చేతి మహిమ అంటుంటాం. అయితే ఇక్కడున్న పాకశాస్త్ర ప్రవీణులంతా తలలు పండిన పెద్దలు కాదు. బుల్లిబుజ్జాయిలు. ఎవరైనా తినిపిస్తే కానీ తినడం చేతకాని వయసులోనే గరిటె పట్టిన అభినవ నలభీములు. నిహాల్ రాజ్ ‘లిటిల్ షెఫ్ కిచ్చా’ అనే పేరుతో పాపులర్ అయిన నిహాల్ రాజ్.. దేశీవాసులకు సుపరిచితుడే. కేరళకు చెందిన పిల్లోడు. 2020లో గ్లోబల్ చైల్డ్ ప్రాడిజీ అవార్డ్ విజేతగా నిలిచాడు. నిహాల్ తయారు చేసిన ‘మిక్కీ మౌస్ మ్యాంగో ఐస్ క్రీమ్’కి ప్రత్యేకమైన హక్కులను పొందేందుకు ఫేస్బుక్ ఈ అబ్బాయికి 2,000 డాలర్లు చెల్లించింది. పదమూడేళ్ల ఈ లిటిల్ షెఫ్.. తన యూట్యూబ్ చానెల్లో రకరకాల వంటలు వండుతూ, ఎవరికీ తెలియని రుచులను పరిచయం చేస్తున్నాడు. సోషల్ మీడియాలోని భోజన ప్రియులను ఆకట్టుకుంటున్నాడు. ఒమారీ మెక్‌క్వీన్ లండన్ కి చెందిన ఒమారీ మెక్‌క్వీన్ అనే 14 ఏళ్ల కుర్రాడు వెజిటేరియన్ వంటగాడు. ఇప్పటికే ఆన్లైన్లో వేల మంది హృదయాలను కొల్లగొట్టాడు. ఎనిమిదేళ్ల వయస్సులోనే యూట్యూబ్ చానెల్ని స్టార్ట్ చేశాడు. ఇంగ్లండ్, క్రోయ్డన్లోని ‘"Dipalicious (డిలీషియస్)’ అనే రెస్టారెంట్‌కి సీఈఓ కూడా. శాకాహారి షెఫ్‌గా ఈ బుల్లోడు ఎన్నో అవార్డ్‌లను అందుకున్నాడు. వంటలకు సంబంధించి పలు చిట్కాలను చెబుతూ పుస్తకాలూ రాశాడు. ఒమారీకి ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఫాలోవర్స్ ఎక్కువే. ఇన్‌స్టాలో తన కుకింగ్ వీడియోలతో పాటు.. కుటుంబంతో గడిపే ఆత్మీయ క్షణాలను రీల్స్‌లా మలచి షేర్ చేస్తుంటాడు. కేంబ్రియా కాలిఫోర్నియాకు చెందిన కేంబ్రియా.. నాలుగేళ్ల వయసు నుంచే జూనియర్ షెఫ్‌గా తన ఫాలోవర్స్‌కి రకరకాల వంటకాలను ఇంట్రడ్యూస్ చేసింది. ప్రపంచంలోనే అతి పిన్న వయసు షెఫ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. నెలల వయసు నుంచే కేంబ్రియా మంచి ఫుడీ. ప్రస్తుతం ఈ పాపకు పదేళ్లు దాటాయి. సోషల్ మీడియాలో వంటల వీడియోలు, రీల్స్‌తో బిజీగా ఉంటుంది. పలు రెస్టారెంట్స్‌కి వెళుతూ అక్కడి వంటకాలను రుచి చూసి.. రివ్యూలు ఇస్తూంటుంది. ఏ రెస్టారెంట్‌కి వెళ్లినా అక్కడున్న షెఫ్ దగ్గర ఒక కొత్త వెరైటీ వంటకాన్ని నేర్చుకుని.. వీలైతే అక్కడే స్వయంగా వండి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. (చదవండి: డ్రాగన్ ఫ్రూట్ ఎలా వాడాలి?..పొరపాటున అలా తింటే..) -
ఆంటీ ల్యాప్‌టాప్ ఇవ్వకపోతేనేం.. చిట్టితల్లి ఏం చేసిందో చూడండి!
ఆంటీ తనకు ల్యాప్‌టాప్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఒక చిట్టి తల్లి తానే స్వయంగా ల్యాప్‌టాప్‌ను తయారు చేయాలని నిర్ణయించుకుంది. ఈ ఉదంతాన్ని నేహా అనే యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ చిన్నారి కార్డ్‌బోర్డ్‌తో తయారు చేసిన ‘హ్యాండ్‌మేడ్’ ల్యాప్‌టాప్ ఫొటోను నేహా షేర్ చేశారు. నేహా క్యాప్షన్‌లో ఇలా రాశారు ‘నా మేనకోడలు నన్ను ల్యాప్‌టాప్ కావాలని అడిగింది. నేను నిరాకరించడంతో, మూడు గంటల పాటు శ్రమపడి, ల్యాప్‌టాప్ తయారు చేసుకుంది’ నేహా షేర్ చేసిన ఫోటోలో ల్యాప్‌టాప్ ఆకారంలో కత్తిరించిన కార్డ్బోర్డ్ కటౌట్ కనిపిస్తుంది. దానిపై స్కెచ్ పెన్‌తో గీసిన కీబోర్టు చిహ్నాలు కనిపిస్తాయి. కాగా ఈ హోమ్మేడ్ ల్యాప్‌టాప్‌లో ‘గేమ్స్’, ‘జూమ్’, ‘లైక్’, ‘రైట్’, ‘సెలెక్ట్’ మొదలైన ఆప్షన్ బటన్లు కనిపిస్తాయి. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో త్వరగా వైరల్‌గా మారింది. 2,52,000కు పైగా వీక్షణలను దక్కించుకుంది. సోషల్ మీడియా యూజర్స్ ఆ చిన్నారి సృజనాత్మకతను ప్రశంసిస్తున్నారు. ఒక యూజర్ ‘ఈ ల్యాప్‌టాప్ ఉత్తమమైనది. విండోస్ ఎప్పటికీ స్థిరంగా ఉంటాయి’ అని రాశారు. మరొకరు ‘ఈ ల్యాప్ టాప్ కీబోర్డ్‌లో చాలా ఎక్కువ ఆప్షన్లు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా మరింత మెరుగ్గా పని చేస్తుంది’ అని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ‘బంగ్లా’లో డెంగ్యూ విధ్వంసం.. వెయ్యి దాటిన మృతులు! My niece asked for my laptop and i said no so she spent 3 hours making her own laptop😭 pic.twitter.com/Bb7EK7BN97 — Neha (@LadyPeraltaa) October 1, 2023 -
వయసు ఎనిమిదేళ్లు కానీ వంటలో దిట్ట
మయన్మార్: మో మైంట్ మే థు ఇప్పటి వరకు ఎవరికి తెలియని ఈ ఎనిమిదేళ్ల చిన్నారి పేరు ఇప్పుడు ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. కరోనా కారణంగా ప్రపంచంలో చాలా దేశాలు లాక్డౌన్ విధించడంతో అందరూ దాదాపు ఇంటికే పరిమితమయిపోయారు. ఈ లాక్డౌన్ సమయంలో చాలా మంది తమలో ఉన్న టాలెంట్ ఏంటా అని వెతికి మరీ పదునుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఈ చిన్నారి కూడా ఎనిమిదేళ్ల లేత ప్రాయంలోనే వంటకాలు చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. (కరోనా: రోజుల తరబడి కోమాలో శిశువు) రొయ్యల కూర, కప్ప ఫ్రై, పోర్క్, టమాటాతో చేపల కూర ఇలా నోరూరించే రకరకాల కూరలు చేస్తూ అందరిని మంత్రముగ్థుల్ని చేస్తోంది. ఈ పాప రొయ్యల కూర చేసిన వీడియోను ఆమె తల్లి ఏప్రిల్‌లో ఆన్లైన్లో పోస్ట్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ‘లిటిల్ చెఫ్’ పేరుతో ఆన్లైన్లో పాపులర్ అయిపోయింది. ఈ విషయంపై మో మైంట్ మే థు మాట్లాడుతూ... ‘నాకు వంటచేయడం అంటే చాలా ఇష్టం’ అని తెలిపింది. ఇంకా తను కెరీర్‌ను కూడా ఆ దిశగానే ఎంచుకోవాలనుకుంటున్నట్లు కూడా తెలిపింది. (పావురం సిక్స్ ప్యాక్ ట్రైనింగ్ అదిరింది) ఈ పాప చేసిన ఒక వీడియోని 2,00,000 మంది వీక్షించారు. ఈ వీడియోలో మో మైంట్ మే థు మయన్మార్ ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్ మోహింగ్యా, బాయిల్డ్ కాట్ ఫిష్ ను తయారు చేసింది. ఇప్పుడు ఈ పాప చేసిన వంటకాల్ని 10,000క్యాత్లకు (7.20 డాలర్ల)కు విక్రయిస్తున్నారు. దీని గురించి ఆమె తల్లి హనీచో మాట్లాడుతూ... ప్రతి రోజు మో మైంట్ థు చేసిన వంటకాలను తమ కుటుంబం డెలివరీ చేస్తోందని తెలిపారు. అన్ని జాగ్రత్తలతో ఈ వంటకాలు చేస్తోన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మో మైంట్ మే థు తనకంటూ ప్రత్యేకమైన ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆ పేజీలో తన వంటకాలను పోస్ట్ చేస్తోంది. అయితే దీనిపై కొంత మంది నెటిజన్లు స్పందిస్తూ ఆమె వీడియోలను చూస్తుంటే తమని తాము మర్చిపోతున్నామని తెలిపారు. మో మైంట్ మే థు ఆన్లైన్లో కుకింగ్ క్లాస్‌లు కూడా చెబుతోంది. -
ప్రజాభిప్రాయం మేరకే జిల్లాలు ఏర్పాటు చేయాలి
దీక్షలను సందర్శించిన ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీగౌడ్ జనగామ : శాస్త్రీయంగా నిపుణుల కమిటీ పర్యవేక్షణలో ప్రజాభిప్రాయం మేరకే నూతన జిల్లాలను ఏర్పాటు చేయాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీగౌడ్ సూచించారు. జిల్లా సాధన కోసం జేఏసీ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న దీక్షలను సోమవారం పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య సతీమణి అరుణతో కలిసి యాష్కీ సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తించే సోనియాగాంధీ ప్రత్యేక తెలంగాణ ఇచ్చిందన్నారు. కానీ ప్రజాసంక్షేమాన్ని విస్మరించిన సీఎం కేసీఆర్ జిల్లాల చిచ్చు తెరపైకి తీసుకువచ్చి ప్రజల మధ్య వైరుధ్యాలు పెంచుతున్నాడని మండిపడ్డారు. ఉద్యమం సమయంలో ప్రాణాలు అర్పించిన అమరులు, ఆత్మహత్య చేసుకుంటున్న రైతు కుటుంబాలను పరామర్శించేందుకు తీరిక లేదనే సీఎం, హరితహారంతో పబ్బం గడుపుకుంటున్నాడని విమర్శించారు. ధనార్జనే ధ్యేయంగా టీఆర్ఎస్ కుటుంబ పాలన కొనసాగుతుందని ఆరోపించారు. దీక్షలో ధర్మపురి శ్రీనివాస్, బ్రాహ్మణపల్లి రమేష్, ఉల్లెంగుల అబ్బసాయిలు, పట్టూరి శ్రీనివాస్, నరేందర్, శ్రవణ్‌కుమార్ కూర్చున్నారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ ఆరుట్ల ద శమంతరెడ్డి, మంగళ్లపల్లి రాజు, నాయకులు చెంచారపు బుచ్చిరెడ్డి, రంగరాజు ప్రవీణ్ కుమా ర్, ఎండి అన్వర్, ఆకుల వేణుగోపాల్‌రావు, మేడ శ్రీనివాస్, మేకల రాంప్రసాద్, దూడల సిద్దయ్య, జక్కుల వేణుమాధవ్, వెన్నెం సత్యనిర ంజన్‌రెడ్డి, రంగు రవి, మాజీద్ ఉన్నారు. -
ప్రమాదాలకు దారితీసే నిద్ర అలవాట్లు..
న్యూయార్క్ః నిద్రలేమి, అతి నిద్ర కూడా ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని న్యూయార్క్ కు చెందిన పరిశోధకులు చెప్తున్నారు. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సగటున ఆరునుంచి, ఎనిమిది గంటలు నిద్రపోవాలని, లేదంటే ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. ఆరు గంటలకంటే అతి తక్కువగా నిద్రపోవడం ద్వారా అనేక ఆనారోగ్యాలు దరిచేరడంతోపాటు మరణాలు సైతం సంభవిస్తున్నట్లు తమ పరిశోధనల్లో తేలినట్లు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకుడు మైఖేల్ ఇర్విన్ తెలిపారు. కలత నిద్ర, నిద్రలో ఆటంకాలు అనేక ప్రమాదాలకు దారి తీస్తాయని అమెరికా పరిశోధకులు అంటున్నారు. చాలీ చాలని నిద్రతోపాటు, అత్యధికంగా కానీ, అతి తక్కువగా కానీ నిద్రపోవడం కడుపులో మంట వంటి ఇతర ఆనారోగ్యాలకు దారి తీస్తాయని తాజా అధ్యయనాలద్వారా కనుగొన్నారు. తగిన నిద్ర లేకపోవడం అనేది ఓ మహమ్మారి వంటిది అని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ భావిస్తోంది. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం, వ్యాయామంతోపాటు నిద్ర ఎంతో అవసరమని అమెరికా లాస్ ఏంజిల్స్ లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుడు మైఖేల్ ఇర్విన్ తెలిపారు. నిద్రాభంగం, నిద్రలేమి శరీరంలో అధిక కొవ్వును కలుగజేయడం, కడుపులో మంటను సృష్టించడంతోపాటు, ప్రవర్తనపై కూడ ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని ఇర్విన్ చెప్తున్నారు. ఇన్ ఫ్లమేషన్.. శరీరంలోని సి-రియాక్టివ్ ప్రొటీన్ ను, ఇంటర్‌ల్యూకిన్ 6 తోపాటు రక్త ప్రవాహాన్ని కూడా పెంచుతుంది. దీనివల్ల రక్తపోటు, మధుమేహం, గుండెకు సంబంధించిన అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నట్లు బయోలాజికల్ సైకియాట్రీ జర్నల్ లో ప్రచురించిన పరిశోధనల్లో తెలిపారు. అత్యధిక, అత్యల్ప నిద్ర కూడా శరీరంలో సీఆర్పీని పెంచుతాయని, ఆరోగ్యంగా ఉండాలంటే మనిషి కనీసం 6 నుంచీ 8 గంటల వరకూ నిద్రపోవాలని అధ్యయనకారులు చెప్తున్నారు. తాము నిర్వహించిన పరిశోధనల్లో దాదాపు 50000 మంది భాగస్వాములయ్యారని, అంతేకాక పలు వైద్య చికిత్సా వ్యాసాలపై కూడా విశ్లేషణాత్మక అధ్యయనాలు నిర్వహించినట్లు ఇర్విన్ తెలిపారు. నిద్ర అలవాట్ల ఆధారంగా చికిత్సలు అందించి పలు అనారోగ్యాలను తగ్గించవచ్చని పరిశోధకులు నిర్థారించారు. -
కలర్పుల్గా లిటిల్ మిస్ ఇండియా పోటీలు
-
కడుపు కోత
కేసముద్రం, న్యూస్‌లైన్ : సరదాగా ఈత పండ్ల కోసమని వెళ్లిన ముగ్గురు చిన్నారులు కొద్ది గంటల్లోనే విగతజీవులయ్యూరు. ఈత కొట్టేందు కు చెరువులో దిగి మృత్యు ఒడికి చేరారు. కనిపెంచిన తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు. ఈ హృదయవిదారక సంఘటన మండలంలోని రంగాపురం గ్రామశివారు రాజీవ్ నగర్ తండాలో ఆదివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం... రాజీవ్‌నగర్‌తండాకు చెందిన లకావత్ బావుసింగ్‌కు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య లక్ష్మికి కుమార్తెలు శాంతి, కావేరి, సంధ్య(13) ఉండగా, చిన్నభార్య సాల్కికి కుమారులు సురేష్, తరుణ్(10) ఉన్నారు. ఉమ్మడి కుటుంబంలోనే కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నారు. కాగా ఇదే తండాకు చెందిన దేవోజీ, చిలుకమ్మ దంపతుల కుమార్తె నీలకు ఇదే మండలం మహముద్‌పట్నం తండాకు చెందిన హరితో వివాహమైంది. ఆ దంపతులకు కుమార్తె శారద, కుమారులు సురేష్, నరేష్(9) ఉన్నారు. తన తల్లిదండ్రులు తిరుపతికి వెళుతుండడంతో వారిని సాగనంపేందుకు నీల శనివారం పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం బావుసింగ్ కుమార్తె సంధ్య, కుమారుడు తరుణ్ , నీల కుమారుడు నరేష్‌తోపాటు ఇదే తండాకు చెందిన భద్రు కుమారుడు రమేష్, కుమార్తె మౌనిక, గుగులోతు నంద కుమార్తె శిరీష కలిసి ఈత పండ్ల కోసం సమీపంలోని ఎదళ్ల చెరువు కట్ట మీదకు వెళ్లారు. అందరు కలిసి ఒక కవర్లో ఈత పండ్లను ఏరుకున్నారు. తిరిగి ఇంటికొస్తుండగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో చెరువులో ఈత కొడదామంటూ నీళ్లలోకి దిగా రు. ముందుగా తరుణ్, సంధ్య, నరేష్, శిరీష లోపలికి వెళ్లగా గుంత ఉండటంతో ఒక్కసారిగా మునిగిపోయారు. కొంతదూరం వెళ్లిన రమేష్, మౌనిక మునుగుతున్న మిత్రులను చూసి కేకలు పెట్టారు. ఇంతలో అటుగా బహిర్భూమికి వెళ్లిన దారావత్ వీరన్న వారిని గమనించి పరుగుపరుగున చెరువులో దూకాడు. అప్పటికే మునిగిపోయి అపస్మారక స్థితికి చేరుకున్న శిరీషను ఒడ్డుకు చేర్చాడు. అలాగే రమేష్, మౌనికను ఒడ్డుకు తీసుకొచ్చాడు. చెరువులో మునిగిపోయిన వారిని గాలించి బయటకు తీసుకొచ్చినప్పటికీ అప్పటికే తరుణ్, సంధ్య, నరేష్ ప్రాణాలు విడిచారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపిస్తూ సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతురాలు సంధ్య కేసముద్రంవిలేజ్లోని కస్తూర్భా పాఠశాలలో ఏడో తరగతి పూర్తి చేయగా, తరుణ్ ధన్నసరి గ్రామంలోని సెయింట్‌జాన్స్ స్కూల్లో 2వ తరగతి చదివాడు. నరేష్ మహముద్‌పట్నం తండాలోని మూడో తరగతి పూర్తి చేశాడు. తాత దగ్గరకుపోతనని వత్తివి కదరా.. మీ తాతను చూత్తానికి పోతనని గార్బం చేసి వత్తివి కదరా కొడుకా.. ఇప్పుడు మమ్మల్ని ఒక్కసారి సూడ్రా కొడుకా.. మమ్మల్ని వదిలిపెట్టి పోదానికే వచ్చినవారా కొడుకా.. అంటూ నరేష్ తండ్రి హరి కొడుకును ముద్దాడుతూ విల పించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. నా కొడుకుకు ఎండగొడతాందంటూ తల్లి తన చీరకొంగును కొడుకు శవం పై కప్పుతూ రోదించడం స్థానికులను కలచివేసింది. నాకెమయిందో తెల్వలే : శిరీష చెరువులో అందరితో కలిసి దిగిన.. ఒక్కసారే పెద్ద బొంద వచ్చింది. అందరం మునిగినం. ఏడుసుకుంటూ అరిసిన ం. నీళ్లన్ని మింగినంక నాకు ఏమైందో తెల్వలే. వీరన్న నన్ను బయటకు తీసి నా పొట్టమీద గట్టిగా వత్తిండు. మెలకువ వచ్చింది. నా దోస్తులు చచ్చిపోయిండ్రని తెల్వంగనే నాకు భయమైంది. మృతులంతా బంధువులే.. సంధ్య, తరుణ్ తండ్రి అయిన బావుసింగ్‌కు నరేష్ అమ్మమ్మ చిలుకమ్మ స్వయూన సోదరి. మృతుల కుటుంబాల మధ్య దగ్గరి బంధుత్వం ఉండటంతో వారి బంధువుల ఇళ్లల్లో విషాదం అలుముకుంది. సంఘటన స్థలానికి రూరల్ సీఐ వాసాల సతీష్, ఏఎస్సై రాంజీనాయక్ చేరుకుని కేసు నమో దు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మానుకోట ఆస్పత్రికి తరలించారు. నరేష్ మృతదేహన్ని తరలించే క్రమంలో అతడి తండ్రి తన కొడుకుకు పోస్టుమార్టం వద్దని వాదించాడు. తన తండాకు తీసుకెళ్తానని చెప్పి ఆటోలో తీసుకెళ్లాడు. అయితే అక్కడి నుంచి పోలీసులు పోస్టుమార్టంకు తరలించారు. ముందుగా వచ్చుంటే అందర్ని కాపాడేటోన్ని పిల్లలు మునిగినంక కొద్దిసేపటి వరకు కేకలు వినపడలేదు. తీరా చెరువు దగ్గరకు వచ్చినంక వారిని చూసి ఒక్కసారిగా చెరువులోకి దూకిన. అప్పటికే ఒడ్డుకున్న ఇద్దరితోపాటు, స్పృహ కోల్పోయిన శిరీషను కాపాడిన. ఇంకా ముందు వచ్చి ఉంటే ఆ ముగ్గుర్ని కాపాడేటోన్ని. అమ్మమ్మ, తాతను తిరుపతికి సాగనంపడానికి వచ్చి... మహముద్‌పట్నం గ్రామశివారు తండా కు చెందిన గుగులోతు నీల తన తల్లిదండ్రులు దేవోజీ, చిలుకమ్మ తిరుపతికి వెళ్తుండటంతో శనివారం తన కొడు కు నరేష్‌తో కలిసి రాజీవ్‌నగర్ తండాకు వచ్చింది. రోజంతా తాతతో సరదాగా గడిపిన నరేష్ ఆదివారం తాత, అమ్మమ్మకు టాటా చెప్పి పంపాడు. ఆ తర్వా త ఉన్నంటుండి బయటకు వెళ్లిన నరేష్ చెరువులో మునిగి ప్రాణాలొదిలాడు. అయితే కేసముద్రంకు చేరుకున్న దేవోజీ, చిలుకమ్మ రైలు రావడంలో ఆలస్యం కావడంతో రైల్వేస్టేషన్లోనే ఉండిపోయారు. ఇంతలో మనవడి మరణవార్త తెలియడంతో వారు బోరున విలపిస్తూ తిరిగొచ్చారు.