
సాక్షి, హైదరాబాద్: తిరుమలగిరి పరిధిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జేఎన్ఎన్యూఆర్ఎం పథకంలో ఇళ్లను స్థానిక నేతలు అమ్ముకున్నారని స్థానికులు ఎల్‌ఐసీ బిల్డింగ్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కొందరు హైటెన్షన్ స్తంభాన్ని ఎక్కి నిరసన తెలిపారు. వెంటనే అర్హులైన తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు.
వీరిలో లక్ష్మణ్, రాములమ్మ, రాజు, మహేష్, శంకరమ్మ స్తంభం ఎక్కినట్లు గుర్తించారు. వీరంతా స్థానిక ఎమ్మెల్యేపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తమకు కేటాయించిన స్థలాలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులకు హమీ ఇవ్వడంతో స్తంభం నుంచి కిందకు దిగివచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment