House Scheme
-
‘గృహలక్ష్మి’పై లబ్దిదారుల్లో డైలమా!
సాక్షి, హైదరాబాద్: గృహలక్ష్మి ఇళ్లు మంజూరైనప్పటికీ నిర్మించుకునేందుకు జనం ముందుకు రావటం లేదు. బేస్మెంట్ స్థాయి వరకు నిర్మాణం జరుపుకోగానే, తొలి విడత రూ.లక్ష లబ్దిదారులకు అందజేయాల్సి ఉంది. ప్రస్తుతం 2.15 లక్షల మందికి మంజూరు పత్రాలు జారీ చేసి లబ్దిదారుల జాబితాలో చేర్చారు. వీరు ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించుకోవాల్సి ఉంది. కానీ, ఎక్కడా వాటి జాడే లేకుండా పోయింది. లబ్దిదారుగా మంజూరు పత్రం రాగానే తొలి విడత రూ.లక్ష విడుదల చేస్తే బాగుంటుందని బీఆర్ఎస్ పార్టీ నేతలు తొలుత ఒత్తిడి చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఒకరిద్దరు మంత్రులు కూడా ఆ మేరకు ప్రకటన కూడా చేశారు. కానీ, బేస్మెంట్ స్థాయి వరకు పనులు జరిపితేనే తొలి విడత ఇవ్వటం మంచిదని ఉన్నతాధికారులు స్పష్టం చేయటంతో ఆమేరకే నిర్ణయించినట్టు తెలిసింది. ఆ ప్రకారం బేస్మెంట్ స్థాయి వరకు పనులు చేపడితే, 2.15 లక్షల మందికి నిధులు విడుదల కావాల్సి ఉంది. కానీ, పనులు ప్రారంభించుకున్న దాఖలాలు మాత్రం కనిపించకపోవటం ఇప్పుడు ఆసక్తిగా మారింది. మొదటినుంచీ ఆలస్యమే... డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం వేగంగా ముందుకు సాగకపోవటం, ప్రజల్లో విమర్శలు వెల్లువెత్తటంతో నష్టనివారణ చర్యగా ప్రభుత్వం గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. సొంత జాగా ఉన్న వారికి రూ.3 లక్షలు చొప్పున విడతల వారీగా అందించి, ఇళ్ల నిర్మాణ బాధ్యతను వారికే అప్పగించింది. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుని, బడ్జెట్లో నిధులు ప్రతిపాదించింది. కానీ, దరఖాస్తుల ప్రక్రియలో తీవ్ర జాప్యం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల దరఖాస్తులు రాగా, దాదాపు 11 లక్షల దరఖాస్తులను అర్హమైనవిగా అధికారులు తేల్చారు. వీటిల్లోంచి 4 లక్షల మంది లబ్దిదారులతో జాబితా రూపొందించే పనిలో మరింత ఆలస్యం జరిగింది. 2.15 లక్షల మందికి మంజూరు పత్రాలు జారీచేసే సమయానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలై కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో అక్కడితో ఆ ప్రక్రియ ఆపేశారు. కానీ, అర్హులు కూడా పనులు ప్రారంభించుకునేందుకు ఆసక్తి చూపకపోవటం ఇప్పుడు ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ పార్టీ హామీతో... ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ‘ఆరు గ్యారంటీ’ల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం ఉంది. అధికారంలోకి వస్తే ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ పథకం కింద రూ.5 లక్షలు అందిస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చింది. గృహలక్ష్మి పథకం కంటే ఆ నిధులు ఎక్కువ. ఇప్పుడు ఇళ్ల నిర్మాణం ప్రారంభించుకున్నాక, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు మంజూరు కావన్న భావన ఎక్కువ మందిలో ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే, గృహలక్ష్మి లబ్దిదారులు ఇళ్ల నిర్మాణం ప్రారంభించటం లేదని చెబుతున్నారు. ఎన్నికలు పూర్తిగా దగ్గరపడ్డ నేపథ్యంలో, ఇప్పుడు పనులు ప్రారంభించుకున్నా నిధులు విడుదల కావన్న భావన కూడా వారిలో ఉందన్నది మరికొందరి వాదన. ముందు లక్ష తమ ఖాతాలో జమ అయితేనే పనులు ప్రారంభించుకోవాలని లబ్దిదారులు భావిస్తున్నారన్నది మరో మాట. ఇలా కారణాలు ఏవైనా, లబ్దిదారులుగా నమోదైన వారు పనులు ప్రారంభించుకోకపోవటం చర్చనీయాంశంగా మారింది. -
పేదల ఇళ్ల నిర్మాణాలకు.. రోజువారీ లక్ష్యాలు
సాక్షి, అమరావతి : పేదల ఇళ్ల నిర్మాణాలను శరవేగంగా పూర్తిచేసేందుకు రాష్ట్ర గృహనిర్మాణ శాఖ రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకెళ్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రోజుకు సగటున రూ.43 కోట్ల విలువ చేసే పనులను పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ లెక్కన 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.15,810 కోట్లు ఖర్చుచేయనుంది. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్రంలో పేదలకు 30 లక్షలకు పైగా ఇళ్లను నిర్మించే యజ్ఞాన్ని ప్రభుత్వం తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టిడ్కోతో కలిపి ఇప్పటికే రెండు విడతల్లో 21.25 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులివ్వగా 20.28 ఇళ్లకు శంకుస్థాపనలు జరిగి వివిధ దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో నిర్మిస్తున్న ఇళ్లలో ఇప్పటికే 3.40 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. లక్ష్య సాధనలో భాగంగా... ప్రస్తుతం రోజుకు సగటున రూ.25 కోట్ల నుంచి రూ.28 కోట్ల పనులు చేస్తున్నారు. నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు రూ.43 కోట్ల మేర పనులు పూర్తిచేసేలా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా బిల్లుల చెల్లింపుల్లో కాలయాపన లేకుండా చూస్తున్నారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.730 కోట్ల మేర గృహ నిర్మాణ సంస్థ బిల్లు చెల్లింపులు చేపట్టింది. మరోవైపు.. శనివారాన్ని హౌసింగ్ డేగా నిర్వహిస్తున్నారు. ఆ రోజు జిల్లా కలెక్టర్లు, మండల, సచివాలయాల స్థాయి అధికారులు లేఅవుట్లను సందర్శించి పనుల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు. ఇలా ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకూ ఏడు హౌసింగ్ డేలు నిర్వహించారు. అధికారులు 306 లేఅవుట్లను సందర్శించారు. ఈ కార్యక్రమం కోసమే ప్రత్యేకంగా ఒక యాప్‌ను రూపొందించారు. ఇందులో హౌసింగ్ డే రోజున లేఅవుట్లకు వెళ్లిన అధికారులు తనిఖీల తాలూకు ఫొటోలను అప్లోడ్ చేయడంతో పాటు, తమ దృష్టికి వచ్చిన సమస్యలు, ఇబ్బందులను టోకెన్ రైజ్ చేస్తున్నారు. అంతేకాక.. 11 మంది సీనియర్ అధికారులను ఆయా జిల్లాలకు ప్రత్యేకాధికారులుగా గృహ నిర్మాణ శాఖ నియమించింది. వీరు ప్రతినెలా తమకు కేటాయించిన జిల్లాలకు వెళ్లి ఇళ్ల పథకం అమలు, తీరుతెన్నులను పరిశీలిస్తున్నారు. గత ఏడాది రోజూ రూ.28 కోట్ల ఖర్చు గత ఆర్థిక సంవత్సరంలో రోజుకు సగటున రూ.28 కోట్ల చొప్పున పేదల గృహ నిర్మాణాలకు ప్రభుత్వం ఖర్చుచేసింది. పేదలకు ఖరీదైన ప్రాంతాల్లో ఉచితంగా స్థలాలిచ్చిన ప్రభుత్వం, ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు ఇస్తోంది. దీంతోపాటు పావలా వడ్డీకి బ్యాంకు రుణం రూపంలో రూ.35 వేలు అందిస్తున్నారు. ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే ఇసుకను ఉచితంగా ఇవ్వడంతో పాటు.. సిమెంట్, ఐరన్, ఇతర నిర్మాణ సామగ్రిని సబ్సిడీపై అందిస్తున్నారు. ఇలా 2022–23 ఆర్థిక సంవత్సరంలో గృహ నిర్మాణ పథకం కోసం ప్రభుత్వం రూ.10,203 కోట్లు ఖర్చుచేసింది. జిల్లాలకు రోజువారీ లక్ష్యాలు ఇళ్ల నిర్మాణాల వేగాన్ని మరింత పెంచేలా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాల వారీగా రోజువారీ లక్ష్యాలను నిర్దేశిస్తున్నాం. ఎక్కడైనా పనులు మందగమనంలో ఉంటే అక్కడ పర్యటించి సమీక్షించి పనులు జోరందుకునేలా చేస్తున్నాం. ప్రస్తుతం పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. త్వరలోనే ఐదు లక్షల ఇళ్లను పూర్తిచేయనున్నాం. – లక్ష్మీశా, గృహ నిర్మాణ సంస్థ ఎండీ -
పేదల ఇళ్ల నిర్మాణాల్లో జోరు
సాక్షి, అమరావతి: తొలి దశలో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాల లబ్ధిదారులందరికీ ప్రభుత్వ ఆదేశాల మేరకు పావలా వడ్డీకి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. ఇళ్ల నిర్మాణాలు వీలైనంత త్వరగా పూర్తి అయ్యేందుకు వీలుగా ఒక్కో లబ్ధిదారునికి రూ.35 వేల చొప్పున బ్యాంకులు పావలా వడ్డీకి రుణాలు ఇచ్చేందుకు వీలుగా గృహ నిర్మాణ శాఖ పరిపాలన అనుమతి మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ అన్ని బ్యాంకులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 3,59,856 మంది ఇళ్ల లబ్ధిదారులకు బ్యాంకులు రూ.1,332 కోట్ల మేర పావలా వడ్డీకి రుణాలు మంజూరు చేశాయి. రాష్ట్రంలో తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.80 లక్షలు వ్యయం చేస్తోంది. అయితే లబ్ధిదారుల వెసులు బాటు కోసం పావలా వడ్డీకే రూ.35 వేలు చొప్పున రుణాలు మంజూరు చేయిస్తోంది. ఇప్పటికే అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 45 శాతం, పశ్చిమగోదావరి జిల్లాలో 38, తిరుపతి జిల్లాలో 35, కాకినాడ జిల్లాలో 33, పల్నాడు జిల్లాలో 28 శాతం మేర లబ్ధిదారులకు బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయి. వెనుకబడిన జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ పావలా వడ్డీకి రుణాలు మంజూరు చేయడంలో వెనుకబడిన జిల్లాల్లో ప్రత్యేకంగా బ్యాంకర్లతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. రుణాల మంజూరులో వెనుకబడిన పార్వతిపురం మన్యం, నంద్యాల, కృష్ణా, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో బ్యాంకులతో సమన్వయం చేసుకుని, త్వరితగతిన రుణాలు మంజూరు చేయించాలని ఆదేశించినట్లు తెలిపారు. తరచూ జిల్లా స్థాయిలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాలని సూచించామన్నారు. దీంతో ఈ వేసవిలో ఇళ్ల నిర్మాణాలు మరింత వేగం పుంజుకోనున్నాయని చెప్పారు. ఈ రుణాలకు సంబంధించి లబ్ధిదారులకు పావలా వడ్డీయే పడుతుందని, మిగతా వడ్డీని ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. -
హైటెన్షన్ పోల్ ఎక్కిన స్థానికులు..
-
తిరుమలగిరిలో హైటెన్షన్... కరెంటు స్తంభం ఎక్కిన స్థానికులు
సాక్షి, హైదరాబాద్: తిరుమలగిరి పరిధిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జేఎన్ఎన్యూఆర్ఎం పథకంలో ఇళ్లను స్థానిక నేతలు అమ్ముకున్నారని స్థానికులు ఎల్ఐసీ బిల్డింగ్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కొందరు హైటెన్షన్ స్తంభాన్ని ఎక్కి నిరసన తెలిపారు. వెంటనే అర్హులైన తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. వీరిలో లక్ష్మణ్, రాములమ్మ, రాజు, మహేష్, శంకరమ్మ స్తంభం ఎక్కినట్లు గుర్తించారు. వీరంతా స్థానిక ఎమ్మెల్యేపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తమకు కేటాయించిన స్థలాలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులకు హమీ ఇవ్వడంతో స్తంభం నుంచి కిందకు దిగివచ్చారు. చదవండి: వివాహితకు మరో వ్యక్తితో పరిచయం.. ఏడాదిగా సహజీవనం -
ఇది బలవంతపు పథకం కాదు: బొత్స సత్యనారాయణ
2000 సంవత్సరం నుంచి ఉన్న ఈ పథకంలో గతంలో వడ్డీ మాత్రమే మాఫీ అయ్యేది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019 వరకు వడ్డీ మాఫీ కూడా అమలు జరగలేదు. వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చేసిన పాదయాత్రలో ప్రజలు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. ఉన్న ఒక్క ఒన్‌టైం సెటిల్మెంట్ స్కీంను కూడా నిలిపివేశారంటూ వారి కష్టాలను ఏకరవు పెట్టారు. వడ్డీల వల్ల చెల్లించాల్సిన మొత్తం గణనీయంగా పెరిగిపోయిందని తెలిపారు. పేద ప్రజలకు పట్టాలివ్వడం, నివసించే హక్కు ఇవ్వడం తప్ప.. విక్రయ హక్కు, వారసులకు బహుమతిగా ఇచ్చే అవకాశం లేదని తెలిసిన జగన్ చలించిపోయారు. ఓటీఎస్‌కంటే మరింత మెరుగైన పథకాన్ని ప్రవేశపెట్టాలని ఆనాడే నిర్ణయించుకున్నారు. దానికి అనుగుణంగా జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రవేశపెట్టారు. – మంత్రి బొత్స సాక్షి, అమరావతి: పేదల పక్కా ఇళ్లను వారి సొంతం చేయడానికి, వారు ఆపదలో ఉన్నప్పుడు ఆస్తి ఉపయోగపడటానికే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని (వన్ టైమ్ సెటిల్మెంట్, ఓటిఎస్) ప్రభుత్వం తీసుకొచ్చిందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఇది పూర్తిగా స్వచ్ఛందమేనని చెప్పారు. నిర్ణీత రుసుము చెల్లించి, ముందుకొచ్చిన వారికే ఆస్తిపై సంపూర్ణ హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ చేస్తారని, ఎవరిపైనా ఎటువంటి ఒత్తిళ్లు ఉండవని తెలిపారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలు ఆపదలో ఉన్నప్పుడు ఆ ఇంటి పట్టా శాశ్వత హక్కుదారుడిగా బ్యాంకుల్లో రుణం పొందడానికి, అవసరమైతే అమ్ముకోవడానికి, చట్టపరమైన ఆస్తిగా తమ పిల్లలకు రాసి ఇచ్చేందుకు వీలు కల్పిస్తూ, ఆ ఇంటిపై సంపూర్ణ హక్కులు కల్పించాలనే సదుద్దేశంతోనే ఈ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తెచ్చారని చెప్పారు. లబ్ధిదారుల రుణం, వడ్డీతో కలిపి ఎంత మొత్తం ఉన్నా.. వారికి పూర్తి ఉపశమనం కలిగించాలన్న ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.15 వేలు, కార్పొరేషన్ పరిధిలో రూ.20 వేలుతో పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ మొత్తం కంటే వాళ్లు కట్టవలసిన రుణం తక్కువ ఉంటే అదే మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుందని వివరించారు. ఓటీఎస్ అన్నది ఎవరినీ బలవంతం చేయడానికో, లేక షరతులు విధించడానికో కాదని స్పష్టం చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నియోజకవర్గం పరిధిలోని సంతబొమ్మాళి పంచాయతీ కార్యదర్శి సత్యప్రసాద్ ఇచ్చిన సర్క్యులర్‌కు, ప్రభుత్వానికి సంబంధమే లేదని చెప్పారు. ఆయన ఎందుకు అలాంటి ఆదేశాలు ఇచ్చాడో కూడా తెలియదన్నారు. తమ దృష్టికి వచ్చిన వెంటనే విచారణకు ఆదేశించామని, అతన్ని సస్పెండ్ చేశామని పేర్కొన్నారు. ఓటీఎస్‌పై అధికారులు ఎవరైనా బలవంతం చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. 50 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఉన్నారని, వారందరికీ పూర్తి అవగాహన వచ్చేలా ఈ పథకం గురించి వివరించాలని కార్యదర్శులకు చెప్పామన్నారు. ఓటీఎస్‌ను సద్వినియోగం చేసుకొని లబ్ధిదారులు లాభపడాలని కోరారు. మేలు చేసే పథకంపై పనిగట్టుకొని దుష్ప్రచారం ప్రజలకు మేలు చేసే ఇటువంటి మంచి పథకంపైన ప్రతిపక్షం చిల్లర విమర్శలు చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, టీడీపీ, వారికి వత్తాసు పలికే మీడియాలో పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పేదవాడిపై రాజకీయాలు చేసే పార్టీలకు, వ్యక్తులకు పుట్టగతులు ఉండవని దుయ్యబట్టారు. పేదవాడిపై టీడీపీకి ఎందుకింత కక్ష అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఇళ్లను ఫ్రీగా ఇస్తామని, ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేస్తామని చంద్రబాబు చెబుతున్నారని, అధికారంలో ఉన్నప్పుడు ఓటీఎస్‌ను తిరస్కరించిన బాబు.. ఇప్పుడు ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేస్తానంటే ఎవరు నమ్ముతారని అన్నారు. 14 ఏళ్లు అధికారంలో ఉండి చంద్రబాబు పేదలకు ఏమీ చేయలేదని చెప్పారు. అధికారంలోకి వచ్చాక రుణమాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు.. సోదరీమణులను ఏ విధంగా మోసం, దగా చేశారో అందరికీ తెలుసన్నారు. కాబట్టే టీడీపీ తుడిచిపెట్టుకుపోయిందన్నారు. ఇప్పుడు మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు, టీడీపీ దుష్ప్రచారాలు నమ్మొద్దని ప్రజలను కోరారు. ఈ ప్రభుత్వంలో అన్నివర్గాలవారికీ సముచిత స్థానం ఉందని తెలిపారు, ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందన్నారు. మహిళా సాధికారతకు కృషి చేస్తోందని, లక్షా 50 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. వడ్డీ మాఫీకి కూడా బాబు సర్కారుకు మనసే రాలేదు ‘వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీం 2000 జనవరి 24న ప్రారంభమైంది. వడ్డీని మాత్రమే అప్పటి ప్రభుత్వాలు మాఫీ చేసేవి. తీసుకున్న రుణం మొత్తాన్ని చెల్లించిన తర్వాతే తనఖా పెట్టుకున్న పత్రాన్ని లబ్ధిదారునికి ఇచ్చేవారు. మొత్తం 56,69,000 మంది లబ్ధిదారులున్నారు. 2014 మార్చి ఆఖరు వరకు.. అంటే 14 సంవత్సరాల 2 నెలల కాలంలో 2,31,284 మంది ఈ స్కీంను వినియోగించుకున్నారు. 2014 ఏప్రిల్ నుంచి 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చే వరకు పథకం అమలు కాలేదు. ఈ ఐదేళ్లూ చంద్రబాబు ప్రభుత్వం ఉంది. 2016 సెస్టెంబర్ 30న జరిగిన ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ బోర్డు మీటింగ్‌లో వన్‌టైం సెటిల్మెంట్ స్కీంను పొడిగించాలని ప్రతిపాదన పంపారు. 2016 అక్టోబర్ 27,, 2016 నవంబర్ 3న, 2018 ఏప్రిల్ 10న, 2019 ఫిబ్రవరి 13న మరో నాలుగు దఫాలు స్కీం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 5 సార్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా ప్రతిసారీ ఏదో ఒక నెపంతో వాటిని వెనక్కి పంపింది. ఒక్క లబ్ధిదారుడికి కూడా రుణ మాఫీ సంగతి దేవుడెరుగు.. వడ్డీ మాఫీకి కూడా మనసు రాలేదు. 14 ఏళ్లుగా అమల్లో ఉన్న పథకాన్ని కూడా నిర్వీర్యం చేశారు’ అని బొత్స చెప్పారు. -
జగనన్న ‘స్మార్ట్ టౌన్’కు వేగంగా అడుగులు
మండపేట: పట్టణాల్లోని మధ్యతరగతి వర్గాల సొంతింటి కల సాకారానికి అడుగులు పడుతున్నాయి. తక్కువ ధరకే స్థలం అందించేందుకు ‘జగనన్న స్మార్ట్ టౌన్’కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకానికి తూర్పు గోదావరి జిల్లాలో 41,504 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ లెక్కన వారికి స్థలాల పంపిణీకి 3,215 ఎకరాల భూమి అవసరమని అంచనా. కాకినాడలో 1,284 ఎకరాలు పరిశీలిస్తున్నారు. మిగిలిన పట్టణాల్లో 1,931 ఎకరాల సేకరణకు రూ.2,128 కోట్ల వరకూ వ్యయమవుతుందని అంచనా. పట్టణాల్లో సెంటు భూమి కొనాలన్నా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ పలుకుతోంది. ఈ పరిస్థితుల్లో సొంతింటిపై ఆశలు వదులుకున్న మధ్య తరగతి వర్గాల వారికి ‘జగనన్న స్మార్ట్ టౌన్’ పథకం కొత్త ఉత్సాహం కలిగించింది. మధ్యతరగతి వర్గాలపై భారం పడకుండా సొంతిల్లు సమకూరేలా ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. పట్టణం సమీపంలో భూములు సేకరించి మార్కెట్ ధర కంటే తక్కువకు స్థలాలు అందజేయాలని నిర్ణయించింది. ఈ స్థలాల్లో మౌలిక వసతులు కల్పించనుంది. రూ.3 లక్షల నుంచి రూ.18 లక్షల వరకూ ఆదాయం కలిగిన వారందరూ ఈ పథకానికి అర్హులు. ప్రభుత్వ ఉద్యోగులకూ అవకాశం కలి్పంచింది. లబి్ధదారుల వార్షికాదాయం మేరకు మూడు, నాలుగు, ఐదు సెంట్ల చొప్పున కేటగిరీలుగా స్థలాలు పొందేందుకు రెండు నెలల క్రితం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. జిల్లాలోని రెండు నగరపాలక సంస్థలు, ఏడు మున్సిపాలీ్టలు, మూడు నగర పంచాయతీల పరిధిలో 41,504 మంది దరఖాస్తు చేసుకున్నారు. సిద్ధమైన ప్రతిపాదనలు ఆయా కేటగిరీల్లో వచ్చిన దరఖాస్తుల ప్రకారం ఈ పథకానికి జిల్లాలో 3,215 ఎకరాల భూమి అవసరమవుతుందని అధికారులు గుర్తించారు. కాకినాడ కార్పొరేషన్ పరిధిలో 1,284 ఎకరాలు అవసరమవుతుండగా స్థల పరిశీలన బాధ్యతలను రెవెన్యూ అధికారులకు అప్పగించారు. మిగిలిన పట్టణాల్లో ఇప్పటికే పలు స్థలాలను పరిశీలించిన అధికారులు అక్కడి ధరల వివరాలతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. మున్సిపాలిటీలో ఎకరం భూ సేకరణకు రూ.కోటి నుంచి రూ.1.5 కోట్ల వరకూ అవుతుందని అంచనా. స్థల సేకరణ జరగాలి ఎంఐజీ స్కీంకు జిల్లాలో మూడు కేటగిరీల్లో 41,504 దరఖాస్తులు వచ్చాయి. స్థల పంపిణీకి దాదాపు 3,215 ఎకరాల వరకూ అవసరమవుతుందని ఇప్పటికే టౌన్ ప్లానింగ్ అధికారులు గుర్తించారు. స్థల సేకరణ ప్రక్రియ జరగాల్సి ఉంది. - రంగనాయకులు, మున్సిపల్ ఆర్డి, రాజమహేంద్రవరం -
‘అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టిస్తాం’
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన ప్రతి ఒక్కరికీ పక్కా ఇళ్లు కట్టిస్తామని మంత్రి శ్రీరంగనాథ రాజు స్పష్టం చేశారు. అర్హులైన పేదలందరికీ ఇళ్లు, జగనన్న కాలనీలపై మంత్రి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సాఆర్ జగనన్న కాలనీలను .. మోడల్ కాలనీలుగా తయారు చేస్తున్నామని తెలిపారు. అదే విధంగా, ఏపీలో రూ.33 వేల కోట్లతో మౌళిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. అయితే, ఈపథకంలో అర్హులై ఉండి కూడా.. ఇంటిపట్టా రాకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏపీలోని ప్రతి గ్రామంలో పార్టీల కతీతంగా, ప్రతి ఒక్క లబ్ధిదారునికి ప్రభుత్వ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చదవండి: ‘‘స్పందన"పై కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ -
‘ఏపీలో మరో 17వేల జగనన్న కాలనీలు రాబోతున్నాయి’
సాక్షి, విజయనగరం: ఆంధ్రప్రదేశ్‌లో మరో 17 వేల జగనన్న కాలనీలు రాబోతున్నాయని మంత్రి శ్రీ రంగనాథ రాజు తెలిపారు. పేదలందరికీ ఇళ్లు, జగనన్న కాలనీలపై మంత్రి రంగనాథరాజు మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలి విడతలో విజయనగరం జిల్లాలో 98వేల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాల్లోని ప్రతి కుటుంబంలో ఆర్ధికవృద్ధి పెరుగుతుందని, పార్టీలకతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇల్లు మంజూరు అవుతాయని భరోసానిచ్చారు. చదవండి: ధవళేశ్వరం నుంచి గోదావరి డెల్టాకు సాగునీరు భూకబ్జాలో కొత్త కోణం: దళితుల భూమి వదల్లేదు -
పేదోడి కల సాకారం
-
నగర ప్రజలకు గృహ యోగం
సాక్షి, నగరంపాలెం(గుంటూరు) : నగర ప్రజల సొంతింటి కల త్వరలో నిజం కానుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాల్లో భాగంగా అందరికీ ఇళ్లు పథకం తొలిదశ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నగరపాలక సంస్థలో ఒక కొలిక్కి వచ్చింది. నగర ప్రాంతాల్లో స్థలాల లభ్యత తక్కువుగా ఉన్న దృష్ట్యా జీప్లస్ టూలో విశాలమైన గృహాలు నిర్మించి అందించనున్నారు. వార్డు వలంటీర్లను నియమించిన ఆగస్టు 15వ తేదీ నుంచి తొలి పనిగా డోర్ టూ డోర్ గృహాలు లేని నిరుపేదల గురించి సర్వే నిర్వహించారు. నగరంలోని 52 డివిజన్లతో పాటు, 10 విలీన గ్రామాల్లో వార్డు వలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి హౌసింగ్ దరఖాస్తులను స్వీకరించారు. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీటిని క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించి ప్రాథమికంగా అర్హుల జాబితాను తయారు చేశారు. నగరంలో 52 డివిజన్లు, 10 విలీన గ్రామాల్లో కలిపి మొత్తం 38,252 మందితో ప్రాథమిక అర్హుల జాబితాను నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ విడుదల చేశారు. ప్రాథమిక అర్హుల జాబితాను నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు, బృందావన్ గార్డెన్స్‌లోని సర్కిల్ కార్యాలయంలో ప్రదర్శించారు. అర్హుల జాబితాపై ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు, సూచనలు స్వీకరించి తుది జాబితాను సిద్ధం చేయనున్నారు. డివిజన్ల వారీగా విడుదల చేసిన అర్హుల జాబితాలో ఎక్కువ మంది విలీన గ్రామాలకు సంబంధించి 56వ డివిజన్లో 3,428, 57వ డివిజన్లో 3,097, పశ్చిమ నియోజకవర్గంలోని 28వ డివిజన్లో 2,252 మంది ఉన్నారు. అతి తక్కువ మంది 42వ డివిజన్లో 385 మంది మాత్రమే ఉన్నారు. అర్హుల జాబితాపై అభ్యంతరాలను డివిజన్ల వారీగా నిర్వహించనున్న వార్డు సభల్లో స్వీకరించనున్నారు. ప్రైవేటు స్థలాల కొనుగోలుకు చర్యలు : గృహాల నిర్మాణానికి స్థల సేకరణను రెవెన్యూ అధికారులతో కలసి నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు వేగవంతం చేశారు. నగరంతో పాటు, విలీన గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలు లభ్యత లేకపోవటంతో ప్రైవేటు స్థలాలు కొనుగోలుకు ప్రయత్నాలు ప్రారంభించారు. విలీన గ్రామాల్లోను, శివారు కాలనీలోని ఇళ్ల మధ్యలో ఉన్న పొలాలను కొనుగోలు చేయటానికి ఇప్పటికే రెవెన్యూ అధికారుల సహాయంతో యజమానులను గుర్తించి చర్చలు ప్రారంభించారు. సుమారు 40 వేల ఇళ్లకు 60 నుంచి 100 ఎకరాలు అవసరం ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. దీనికి సంబంధించి ప్రాథమికంగా గుర్తించిన స్థలాల ప్రతిపాదనలు జిల్లా అధికారులకు సమర్పించనున్నారు. 15 నుంచి వార్డు సభలు అర్హుల జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 15 నుంచి డివిజన్ల వారీగా వార్డు సభలు నిర్వహిస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ తెలిపారు. ప్రాథమిక అర్హుల జాబితాను డివిజన్ల వారీగా అందుబాటులో ఉంచామన్నారు. అందరికీ ఇళ్లు పథకం ద్వారా అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలోను, ఆన్లైన్ ద్వారా వెరిఫికేషన్ చేసి ప్రాథమిక అర్హుల జాబితాను రూపొందించామని తెలిపారు. అర్హుల జాబితాపై ఫిర్యాదులు, సలహాలు, సూచనలను వార్డు సభల్లో అందిస్తే విచారణ చేసి, తుది జాబితాను సిద్ధం చేస్తామని వివరించారు. -
ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని
ఎమ్మిగనూరు: ‘జీ+3 ఇళ్ల నిర్మాణంలో చోటుచేసుకుంటున్న అవినీతి, అక్రమాలను ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే బి.జయనాగేశ్వరరెడ్డి, కౌన్సిలర్ సుందర్ రాజుల నుంచి తన భర్త ప్రభాకర్, తనకు ప్రాణహాని ఉందని టీడీపీ 9వ వార్డు కౌన్సిలర్ చిన్నలక్ష్మి సంచలన ఆరోపణలు చేశారు. కొంతకాలంగా అగంతకులు ఫోన్‌చేసి బెదిరిస్తూ, తన భర్తను చంపేందుకు రెక్కీ నిర్వహిస్తున్నారని’ ఆందోళన వ్యక్తం చేశారు. చైర్పర్సన్ సాయసరస్వతి అధ్యక్షతన బుధవారం మున్సిపల్ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశం ప్రారంభం కాగానే దళిత కౌన్సిలర్ చిన్నలక్ష్మి మాట్లాడుతూ దళిత వార్డుల్లో అభివృద్ధి పేరుతో జరుగుతున్న అవినీతి, జీ+3 ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలను తన భర్త ప్రభాకర్ సోషల్ మీడియా, మీడియా ద్వారా వెలుగులోకి తెచ్చారన్నారు. దీనిని జీర్ణించుకోలేక ఎమ్మెల్యే సహకారంతో కౌన్సిలర్ సుందర్రాజు తమను అంతం చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. వారిద్దరి నుంచి తమకు రక్షణ కల్పించాలని వేడుకుంది. తమకు ఏదైనా హాని జరిగితే అందుకు ఎమ్మెల్యేనే కారణమంటూ సమావేశం దృష్టికి తెచ్చింది. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ బుట్టారంగయ్య మాట్లాడుతూ జీ+3 ఇళ్ల మంజూరు పేరుతో అధికారపార్టీ కౌన్సిలర్లు, టీడీపీ నేతలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, సాక్షాత్తు ఆ పార్టీకి చెందిన మహిళా కౌన్సిలర్ చిన్నలక్ష్మి కూడా ప్రస్తావించిందన్నారు. ఎమ్మిగనూరు జీ+3 ఇళ్లు ఎన్ని మంజూరయ్యాయి, ఎంతమంది దగ్గర డిపాజిట్లు వసూలు చేశారో..మళ్లీ కొత్తగా జాబితాలు పట్టుకుని అక్రమ వసూళ్లు ఎందుకు చేస్తున్నారో అధికారులు సమాధానం చెప్పాలన్నారు. అదేవిధంగా చంద్రన్న పెళ్లికానుకలు ఇప్పించాలంటే రూ.3వేలు, పొదుపు రుణాల మంజూరుకు ఒక్కో గ్రూపు నుంచి రూ.15వేలు చొప్పున కౌన్సిలర్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. చివరకు స్త్రీనిధి నిధులను సైతం వారు మింగేస్తున్నారని చెప్పడంతో టీడీపీ కౌన్సిలర్లు సభలో గందరగోళం సృష్టించారు. అనంతరం 1వ వార్డు కౌన్సిలర్ నాగేశప్ప మాట్లాడుతూ ఎమ్మిగనూరు పట్టణంలో మట్టిమిద్దెలుగా ఉన్నవాటిని ఆర్సీ బిల్డింగులుగా చూపుతూ అధిక పన్నులు వేశారన్నారు. బుట్టారంగయ్య మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తెల్లకార్డున్న పేదలందరికీ రూ.200కే కుళాయి కనెక్షన్ ఇస్తే టీడీపీ ప్రభుత్వం నిబంధనలు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. కౌన్సిలర్ సుందర్రాజు మాట్లాడుతూ 9వ వార్డు కౌన్సిలర్ చిన్నలక్ష్మి భర్త ప్రభాకర్ నుంచే ఎమ్మెల్యేకు, తనకు ప్రాణహాని ఉందని చెప్పగానే సభలోని సభ్యులంతా నవ్వుకున్నారు. అనంతరం అజెండా అంశాలను చదవకుండానే ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు ప్రకటించి సమావేశాన్ని ముగించారు. సమావేశంలో కమిషనర్ రఘునాథ్‌రెడ్డి, డీఈలు వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు షబ్బీర్, రిజ్వానబేగం, దివ్యకళ, శివశంకర్, సలాం, భాస్కర్‌రెడ్డి, విజయలక్ష్మి, వీజీ ఉష, ఈరమ్మ, లక్ష్మిదేవి, తదితరులు పాల్గొన్నారు. -
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు
సాక్షి, సిటీబ్యూరో: ఫొటోగ్రఫీ ఒక అద్భుతమై కళ. వంద పేజీల అర్థాన్ని ఒక్క ఫొటో తెలియజేస్తుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీశ్‌రావు పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ ఫొటో జర్నలిస్ట్స్ అసోషియేషన్ (టీపీజేఏ) ఆధ్వర్యంలో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి ఫొటోగ్రఫీ పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాజీవితంలో ఉన్నవారు, ప్రజల కోసం పనిచేసే జర్నలిస్టులు భద్రంగా ఉండాలని సీఎం చాలాసార్లు చెబుతూంటారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.100 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించిన కేసు సుప్రీం కోర్టులో ఉందని మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. కోర్టు కేసుతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దీనిపై సీఎంతో తాను ప్రత్యేకంగా మాట్లాడతానన్నారు. త్వరలో ఈ పని పూర్తయ్యేలా చూస్తానని మంత్రి హామీ ఇచ్చారు. మెరుపుకంటే వేగంగా పనిచేసేవాడే ఫొటో జర్నలిస్టు అని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో తాము ఫొటోగ్రాఫర్ల కష్టాలను కళ్లారా చూశామన్నారు. ఉద్యమ కాలంనాటి ఫొటోలు రేపటి చర్రితకు సాక్ష్యంగా నిలుస్తాయని హరీష్‌రావు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలోని మంచి ఫొటోలతో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుకు ప్రెస్ అకాడమీ శ్రీకారం చుట్టాలన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ.. మంత్రి హరీశ్‌రావు సూచించిన రెండు అంశాలను నెరవేర్చే బాధ్యత ప్రెస్ అకాడమీ తీసుకొంటుందన్నారు. కన్సొలేషన్ బహుమతులు గెలుచుకున్న సాక్షి ఫొటోగ్రాఫర్లు ఇసుకపట్ల దేవేంద్రనాథ్ (హైదరాబాద్), యాకయ్య (సూర్యాపేట), యాదిరెడ్డి (వనపర్తి) ఆర్.రాజు (ఖమ్మం)లను మంత్రి సత్కరించారు. భాషా సాంస్కృతిక డైరెక్టర్ మామిడి హరికృష్ణ, టీపీజేఏ రాష్ట్ర అధ్యక్షుడు జి.భాస్కర్, జర్నలిస్టుల సంఘం నాయకుడు పల్లె రవి, ఎంపీ టీపీ పాటిల్, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి పాల్గొన్నారు. -
లేడీ కేడీ ‘ఇంటి’ గుట్టు
ఓ లేడీ కేడీ పనులు బయటపడ్డాయి.. మాయ మాటలతో పేదలను బురిడీ కొట్టించిన వైనం వెలుగుచూసింది.. ఇళ్లు ఇప్పిస్తానంటూ లక్షలు వసూలు చేసింది.. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆర్డర్ కాపీలంటూ మోసగించింది.. ఏడెనిమిది నెలలు అవుతున్నా ఇళ్లు రాకపోవడంతో బాధితులు కార్పొరేషన్ అధికారుల వద్దకు రాగా అసలు విషయం బయట పడింది... ఊహించని ఈ ఘటనతో కార్పొరేషన్ యంత్రాంగం ఉలిక్కి పడింది. విషయం తెలుసుకున్న కమిషనర్ విజయ్‌రామరాజు విచారణకు ఆదేశించారు. పోలీసులు రంగప్రవేశం చేసి హౌసింగ్ స్క్యామ్ కూపీ లాగుతున్నారు. విచారణలో కొందరి కార్పొరేషన్ సిబ్బంది పేర్లు బయటకు రావడంతో ఆ దిశగా కూడా విచారిస్తున్నారు. తిరుపతి తుడా: తిరుపతి కర్నాలవీధి సమీపంలోని కస్తూరిబా వీధికి చెందిన ఓ మహిళ ఆది నుంచి పేదలను మోసం చేయడమే పనిగా పెట్టుకుంది. ప్రజావసరాలను తనకు అనుకూలంగా ఉపయోగిస్తూ మామూళ్లకు అలవాటు పడింది. ఆరు నెలల కిందటి వరకు ఆమె తిరుపతి తహశీల్దార్ కార్యాలయంలో బీఎల్వోగా పనిచేసేది. కార్యాలయానికి వచ్చే వారిని మాటల్లో పెట్టి సర్టిఫికెట్ ఇప్పిస్తానని, రేషన్ కార్డు, పెన్షన్, ఇళ్ల పట్టాలు.. ఇలా అవసరమయ్యేవాటిని తీసిస్తానని చెప్పి అందినకాడికి వసూలు చేసేదని తె లిసింది. వరుసగా ఫిర్యాదులు రావడంతో రెవెన్యూ అధికా రులు ఆమెను బీఎల్వో పోస్టు నుంచి తప్పించారు. అయినా ఆమె ఆగలేదు. మరింతగా ప్రజల్ని మోసగించే పనిలో పడ్డారు. ఇటీవల తిరుపతి కార్పొరేషన్ పరిధిలో పేదల ఇళ్లనిర్మాణ పనులు జోరుగా చేపట్టారు. ఈ హౌసింగ్ స్కీమ్‌ను స్కాంగా మలుచుకుంది. ఇళ్లు ఇప్పిస్తానని మోసం చేస్తూ కొందరి నుంచి లక్షలు వసూలు చేసింది. ఏడెనిమిది నెలలు అవుతున్నా ఇళ్లు రాకపోవడంతో బాధితులు కార్యాలయానికివచ్చారు. విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న అధికారులు అవాక్కయ్యారు. మాయ మాటలతో మస్కా..కమిషనర్ సంతకం ఫోర్జరీ మున్సిపల్ కార్పొరేషన్ పూర్వపు కమిషనర్, ప్రస్తుత వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్ సంతకాన్ని ఆ మహిళ ఫోర్జరీ చేసింది. కమిషనర్ పేరుతో స్టాంపును తయారు చేసుకుంది. తిరుపతిలో గతంలో రెవెన్యూ వార్డులు 6–17 పరిధిలో బీఎల్ఓగా పనిచేసిన అనుభవం ఆమెకు కలిసొచ్చింది. పాత పరిచయాలతో ఇళ్లు లేని పేదలను టార్గెట్ చేసుకుని ఇళ్లు ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పింది. ఆమెతో పాటు మరికొందరు గ్రూపుగా ఏర్పడి హౌసింగ్ మాఫియాకు తెరలేపారు. గత కమిషనర్ హరికిరణ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, స్టాంపును సిద్ధం చేసుకుంది. దామి నేడు రూ.లక్ష, పాడిపేట రూ.2 లక్షలు చొప్పున బేరం కుదుర్చుకుంది. ముందు ఇళ్ల కేటాయింపు పత్రాలను ఇప్పించిన తర్వాతే డబ్బులు ఇవ్వండని ఆమెతోపాటు మిగిలినవారు నమ్మించారు. ఆమెపై నమ్మకంతో డబ్బులు కట్టేందుకు ముందుకొచ్చా రు. కమిషనర్ పేరుతో సొంతంగా డాక్యుమెంటును సిద్ధం చేసుకుని ఇళ్లు కేటాయిం చినట్టు ఆర్డర్ తయారు చేసుకున్నారు. ఆర్డర్‌ను చేతిలో పెట్టి రూ.1–2 లక్షల వరకు, మరీ నమ్మిన వాళ్ల నుంచి మూడు లక్షల వరకు వసూలు చేసింది. వసూలు చేసిన డబ్బును మరో వ్యక్తి హనుమంతు అకౌంట్లో జమచేసినట్లు గుర్తించారు. నాలుగు రోజుల నుంచి విషయం బయటకు పొ క్కుండా లోలోనవిచారణ చేపడుతున్నారు. కమిషనర్ ఆగ్రహం.. హౌసింగ్ మాఫియాపై కమిషనర్ విజయ్‌రామరాజు ఆగ్రహం వ్యక్తం చేశా రు. బాధితుల ఫిర్యాదులపై ఆరా తీస్తున్నా రు. తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మొహంతికి సమాచారం ఇచ్చారు. ఈస్ట్ పోలీసులను కలిసి బాధితులు గోడును వెల్లబోసుకున్నారు. 18 మంది బాధితులు పోలీసులను ఆశ్రయించినట్టు సమాచారం. ఈస్ట్ పోలీసులతో పాటు స్పెషల్ బ్రాంచ్, క్రైం బ్రాంచ్ పోలీసులు హౌసింగ్ మాఫి యాపై కూపీ లాగుతున్నారు. బాధితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా విచారిస్తున్నారు. నకిలీ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆరోపణలెదుర్కొంటున్న మహిళను విచారించగా పలు విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. కొంతమంది పేర్లను ఆమె చెప్పడంతో పోలీసులు విచారించారు. ఇప్పటివరకూ రూ.25 లక్షలను వసూలు చేసినట్టు బయటపడింది. మరికొందరు బాధితులున్నట్లు భావిస్తున్నారు. -
ఆరు నెలల్లో 19 లక్షల ఇండ్లు ఎలా కట్టిస్తారు
-
19 లక్షల ఇండ్లు ఎలా కట్టిస్తారు : రోజా
చిత్తూరు జిల్లా: నాలుగేళ్ల పాలనలో నాలుగు లక్షల ఇళ్లు కట్టించని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు..ఆరు నెలల్లో 19 లక్షల ఇండ్లు ఎలా కట్టిస్తారని నగరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రశ్నించారు. పేదలందరికీ నివాస గృహాలు కట్టిస్తానని సీఎం చంద్రబాబు మరోసారి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. నిండ్ర మండల కేంద్రంలో రెండు బస్టాప్‌లకు ఎమ్మెల్యే రోజా ప్రారంభోత్సవం చేశారు. అనంతరం పుత్తూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. చంద్రబాబు చెబుతున్నవన్నీ అబద్ధాలేనని వ్యాఖ్యానించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేదలకు ఇండ్లు రికార్డు స్థాయిలో అందరికీ కట్టించారని అలాంటిది ఇప్పుడు టీడీపీ నాయకులు, కార్యకర్తలకే ఇండ్లు ఇస్తున్నారని మండిపడ్డారు. మంత్రి నారాయణ, చంద్రబాబులు ఇండ్లపేరుతో వేల కోట్ల రూపాయలు దోచుకోవడానికి పథకం రచిస్తున్నారని ఆరోపించారు. -
‘డబుల్ బెడ్రూమ్’లపై పెత్తనం ఎమ్మెల్యేలదే!
-
‘డబుల్ బెడ్రూమ్’లపై పెత్తనం ఎమ్మెల్యేలదే!
- వారి కనుసన్నల్లోనే లబ్ధిదారుల జాబితా - రెండు పడక గదుల ఇళ్లపై మారిన ప్రభుత్వ వైఖరి - జిల్లా మంత్రితో కలసి ఎమ్మెల్యేలకు రూపకల్పన బాధ్యతలు.. నేతల ఒత్తిడికి తలొగ్గిన సర్కారు - అర్హులతోనే జాబితా ఉంటుందంటున్న గృహ నిర్మాణ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: రెండు పడక గదుల ఇళ్ల పథకంలో ఇక ఎమ్మెల్యేలే చక్రం తిప్పబోతున్నారు. ఏయే గ్రామాల్లో ఇళ్లు కట్టాలో నిర్ణయించేది మొదలు... ఎవరికి కేటాయించాలనే వరకు తేల్చేది కూడా వారే. జిల్లా మంత్రులతో కలసి ఎమ్మెల్యేలే లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. మొత్తంగా గతంలోని ఇళ్ల పథకాల తరహాలోనే ‘డబుల్’ పథకానికి యావత్తూ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే కొనసాగనుంది. తొలుత ఎమ్మెల్యేలకు పెత్తనం లేకుండా చేయాలని ప్రభుత్వం భావించినా... తర్వాత నేతల ఒత్తిడికి తలొగ్గింది. మారిన వైఖరి..: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భారీగా అక్రమాలు జరిగాయని నమ్ముతున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు రెండు పడక గదుల ఇళ్ల విషయంలో ఆ పరిస్థితి రావొద్దని భావించారు. అందులో భాగంగానే లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను పూర్తిగా కలెక్టర్లకే అప్పగించాలని తొలుత నిర్ణయించారు. ఇళ్లను నిర్మించే గ్రామాల ఎంపిక వరకు మాత్రమే ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించాలని భావించారు. పలు అంతర్గత సమావేశాల్లోనూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు కంగు తినాల్సి వచ్చింది. ప్రస్తుతం రెండు పడక గదుల ఇళ్ల పథకంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నందున... ఇలాంటి కీలక పథకంలో తమ భాగస్వామ్యం లేకపోవడం వెలితిగా భావించారు. దానికితోడు తమపై కార్యకర్తల నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్నందున లబ్ధిదారుల ఎంపికలో తమకూ భాగస్వామ్యం కల్పించాలని వారు సీఎంపై ఒత్తిడి తెచ్చారు. కొందరు మంత్రులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో మనసు మార్చుకున్న ముఖ్యమంత్రి... ఎమ్మెల్యేలకు పెత్తనం అప్పగించాలని నిర్ణయించారు. ఈమేరకు తుది మార్గదర్శకాల్లో మార్పుచేర్పులు చేయాల్సి వచ్చింది. లబ్ధిదారుల ఎంపిక ఎలా..? తొలుత కలెక్టర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసే అధికారుల కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. ఆ జాబితా ఆధారంగా ఎమ్మెల్యేలు మరో జాబితా సిద్ధం చేస్తారు. అధికారుల కమిటీ గ్రామసభ నిర్వహించి ఎంపిక చేసినవారి అర్హతను నిర్ధారించి ఆమోదిస్తుంది. ఆ మేరకు ఇళ్ల నిర్మాణం చేపడతారు. మొత్తం ఇళ్లలో ఎమ్మెల్యే 50 శాతం, జిల్లా మంత్రి 50 శాతం చొప్పున ఎంపిక చేస్తారు. ఈ మేరకు రూపొందించిన మార్గదర్శకాలు అందరు కలెక్టర్లకు అందాయి. అధికారులు రూపొందించే జాబితా, తుదకు గ్రామసభ నిర్వహించి ఆమోదం పొందే జాబితాల రూపకల్పన యావత్తు ఇప్పుడు ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే జరుగనుంది. అవకాశం చిక్కితే అస్మదీయులకే ఇళ్లు ఇస్తున్నారంటూ విరుచుకుపడే ప్రతిపక్షాల నుంచి విమర్శలు రాకుండా ఈ జాబితాలు రూపొందుతాయా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే విమర్శలకు ఆస్కారం ఇవ్వకుండా, అర్హులతోనే జాబితాలు రూపొందిస్తామని గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు. -
‘అందరికీ ఇల్లు’ షురూ
-
‘అందరికీ ఇల్లు’ షురూ
కేంద్ర కేబినెట్ భేటీలో నిర్ణయం : పట్టణ ప్రాంత పేదల కోసం జాతీయ పట్టణ గృహ నిర్మాణ పథకం ప్రారంభం ♦ అల్పాదాయ వర్గాలు, ఆర్థికంగా బలహీన వర్గాలకు 6.50 శాతం వడ్డీ రాయితీ ♦ ఈ నిర్ణయంతో రూ.6,632 నుంచి రూ.4,050కి తగ్గనున్న గృహ నిర్మాణ ఈఎంఐ న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ‘2022 నాటికి అందరికీ ఇల్లు’ పథకాన్ని బుధవారం ప్రారంభించింది. పట్టణ పేదలకు రుణాలపై వడ్డీ రాయితీని 6.50 శాతానికి పెంచేందుకు అంగీకరించింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. రుణ రాయితీ పెంపు నిర్ణయం వల్ల పట్టణ ప్రాంతాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, అల్పాదాయ వర్గాల వారికి ఒక్కొక్కరికి రూ. 2.30 లక్షల లబ్ధి చేకూరుతుందని, నెలవారీ చెల్లించాల్సిన వాయిదా (ఈఎంఐ) రూ. 2,582 తగ్గుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం వడ్డీ రేటు 10.50 శాతంగా ఉండగా.. రూ. 6 లక్షల రుణానికి 15 ఏళ్ల గడువుతో ఈఎంఐ నెలకు రూ. 6,632 గా ఉందని గృహ నిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన విభాగ అధికారి ఒకరు చెప్పారు. రుణ అనుసంధానిత సబ్సిడీని 6.50 శాతంగా కేబినెట్ నిర్ణయించటంతో ఈ ఈఎంఐ రూ. 4,050కి తగ్గుతుందన్నారు. ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో రెండు కోట్ల కొత్త ఇళ్లు నిర్మించేందుకు ప్రారంభించిన జాతీయ పట్టణ గృహ నిర్మాణ పథకం కింద రాబోయే ఏడేళ్లలో ఒక్కో లబ్ధిదారుడికి వివిధ రూపాల్లో రూ. 1 లక్ష నుంచి రూ. 2.30 లక్షల వరకూ కేంద్ర సాయం అందుతుందని తెలిపారు.కేంద్ర కేబినెట్ ఇదివరకు ఆమోదించిన ప్రకారం.. జాతీయ పట్టణ గృహనిర్మాణ పథకం కింద 4 రకాలుగా లబ్ధిదారుడికి కేంద్ర సాయం అందుతుంది. ♦ పట్టణ గృహనిర్మాణ పథకాన్ని దేశంలోని 4,041 నగరాలు, పట్టణాలంటిలోనూ మూడు దశల్లో అమలు చేస్తారు. తొలుత.. 75 శాతం మంది పట్టణ జనాభా గల.. లక్ష మంది, అంతకన్నా ఎక్కువ జనాభా గల 500 నగరాలు, పట్టణాలపై కేంద్రీకరిస్తారు. రుణ అనుసంధానిత రాయితీ పథకాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే అన్ని నగరాలు, పట్టణాల్లో అమలు చేస్తారు. ♦ పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణ పథకం కింద 30 చదరపు మీటర్ల కార్పెట్ ప్రాంతంలో ఇంటిని నిర్మించి, నీరు, మురుగునీటి పారుదల, రోడ్లు, విద్యుత్, టెలిఫోన్ లైన్లు వంటి కనీస మౌలిక సదుపాయాలు; కమ్యూనిటీ సెంటర్లు, పార్కులు, ఆటస్థలాలు, జీవనోపాధి కేంద్రాలు వంటి సామాజిక సదుపాయాలను కల్పిస్తారు. ఈ పథకం కింద నిర్మించిన గృహాలను మహిళల పేర్ల మీద లేదా భార్యాభర్తలు ఇద్దరి పేర్ల మీదా రిజిస్టర్ చేస్తారు. ♦ ఈ పథకం అమలుకు భూ వినియోగ మార్పిడి, లే-అవుట్ ప్రణాళికలకు అనుమతులు ఇచ్చే ప్రక్రియను సరళం చేయాలని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. కేబినెట్ భేటీలో నిర్ణయాలివీ.. ♦ జగదీశ్ చంద్రబోస్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ పేరుతో రక్షణ పరిశోధన కేంద్రాన్ని స్థాపించేందుకు.. పశ్చిమబెంగాల్లోని జాదవ్‌పూర్ యూనివర్సిటీకి చెందిన పాత నేషనల్ ఇన్స్ట్రుమెంట్స్ సంస్థకు చెందిన భవనం, భూమిలో కొంత భాగాన్ని డీఆర్డీఓకు బదిలీ చేయాలని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ♦ జాతీయ డయరీ అభివృద్ధి కార్యక్రమంలో మరో మూడు రాష్ట్రాలు ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లను చేర్చేందుకు కేబినెట్ ఓకే చెప్పింది. అలాగే నేషనల్ డయరీ ప్రణాళిక-1ని మరో రెండేళ్లు- 2018-10 వరకూ పొడిగించింది. ♦ సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఐదు రెట్లు పెంచింది. జవహర్లాల్ నెహ్రూ జాతీయ సౌర కార్యక్రమం కింద 2022 నాటికి లక్ష మెగావాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయటం లక్ష్యంగా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 1వ విధానంలో.. భూమిని ఒక వనరుగా వినియోగించుకుంటూ ప్రయివేటు డెవలపర్ల భాగస్వామ్యంతో చేపట్టే పేదల వాడల (స్లమ్స్) పునరభివృద్ధి ప్రణాళిక కింద ప్రతి లబ్ధిదారుడికి సగటున రూ. 1 లక్ష మేర కేంద్ర గ్రాంటు అందిస్తారు. ఈ గ్రాంటును రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు అవసరమైతే పేదల వాడల పునరభివృద్ధి పథకాలు వేటికైనా వినియోగించుకునే స్వేచ్ఛ ఉంది. 2వ విధానంలో.. రుణ అనుసంధానిత రాయితీ పథకం కింద అందుబాటు ధరలో ఉండే గృహ నిర్మాణానికి.. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, అల్పాదాయ వర్గాల వారికి ప్రతి గృహ నిర్మాణ రుణంపైనా 6.50 శాతం వడ్డీ రాయితీని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. 3వ విధానంలో.. ప్రయివేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపట్టే అందుబాటు ధరల్లోని గృహ నిర్మాణ పథకాల్లో.. 35 శాతం ఆవాసాలను ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి కేటాయించేట్లయితే ఆయా పథకాల్లో ఒక్కో లబ్ధిదారుడికి రూ.1.50 లక్షల చొప్పు న కేంద్ర సాయం అందిస్తారు. 4వ విధానంలో.. వ్యక్తిగత లబ్ధిదారుడే నిర్మించుకునే సొంత గృహ నిర్మాణానికి కానీ, సొంత ఇంటిని అభివృద్ధి చేసుకోవటానికి కానీ అర్హులైన పట్టణ పేదలు ఒక్కొక్కరికి రూ. 1.50 లక్షల కేంద్ర సాయం అందిస్తారు.