
చిత్తూరు జిల్లా: నాలుగేళ్ల పాలనలో నాలుగు లక్షల ఇళ్లు కట్టించని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు..ఆరు నెలల్లో 19 లక్షల ఇండ్లు ఎలా కట్టిస్తారని నగరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రశ్నించారు. పేదలందరికీ నివాస గృహాలు కట్టిస్తానని సీఎం చంద్రబాబు మరోసారి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. నిండ్ర మండల కేంద్రంలో రెండు బస్టాప్‌లకు ఎమ్మెల్యే రోజా ప్రారంభోత్సవం చేశారు. అనంతరం పుత్తూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
చంద్రబాబు చెబుతున్నవన్నీ అబద్ధాలేనని వ్యాఖ్యానించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేదలకు ఇండ్లు రికార్డు స్థాయిలో అందరికీ కట్టించారని అలాంటిది ఇప్పుడు టీడీపీ నాయకులు, కార్యకర్తలకే ఇండ్లు ఇస్తున్నారని మండిపడ్డారు. మంత్రి నారాయణ, చంద్రబాబులు ఇండ్లపేరుతో వేల కోట్ల రూపాయలు దోచుకోవడానికి పథకం రచిస్తున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment