శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా! | YSRCP MLA Roja Visits Tirumala Tirupati In Chittoor | Sakshi
Sakshi News home page

ఆయన చేసిన పాపాలను దేవుడు కూడా..

Published Wed, Feb 12 2020 10:39 AM | Last Updated on Wed, Feb 12 2020 11:09 AM

YSRCP MLA Roja Visits Tirumala Tirupati In Chittoor - Sakshi

సాక్షి, తిరుమల: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలలో చైతన్యం కల్పించారలనే బస్సు యాత్ర చేస్తున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేష్‌ చేసిన మోసాలకు ఏపీ ప్రజలు వారిని మూలనపడేశారన్నారు. ఎంతసేపు 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అని  చెప్పుకుంటాడు బాబు కానీ.. ఆయన చేసిన పాపాలను ఆ దేవుడు కూడా క్షమించడు అని విమర్శించారు. మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకించిన బాబు ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని రాయసీమ, ఉత్తరాంధ్రలో పర్యటిస్తారని మండిపడ్డారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతు భరోసా ద్వారా  55 లక్షల మందికి, అమ్మఒడి ద్వారా 40 లక్షల మందికి, పెన్షన్‌ ద్వారా 54 లక్షల మందికి అబ్ది చేకూర్చారని తెలిపారు. అదే విధంగా ఇంకా అనేక పథకాల ద్వారా సీఎం జగన్‌ కోట్ల మంది ప్రజలకు లబ్ది చేకుర్చారన్నారు. చంద్రబాబు రీయల్‌ ఎస్టేట్‌ కోసం పనిచేస్తే.. సీఎం జగన్‌ ప్రజల కోసం పని చేస్తారని పేర్కోన్నారు. సీఎం జగన్‌ ‘దిశ’ యాప్‌ ద్వారా మహిళలకు రక్షణ కల్పించాలని చూస్తే.. బాబు దీనిపై కూడా రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇక లోకేష్‌ సోషల్‌ మీడియా ద్వారా వైఎస్సార్‌ సీపీ నాయకులపై విషప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్‌ చేస్తున్న మంచి పథకాలు.. ఇతర రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకుంటున్నాయని రోజా తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement