చిన్నపాటి వర్షం వచ్చినా,గాలి వీచిన విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నారని రాత్రంతా అంధకారంలో మగ్గామని బీబ్రా గ్రామస్తులు మంగళవారం కాగజ్‌నగర్–దహెగాం రహదారిపై రాస్తారోకో చేపట్టారు.
విద్యుత్ కోసం రాస్తారోకో
Aug 2 2016 11:30 PM | Updated on Sep 22 2018 7:53 PM
దహెగాం: చిన్నపాటి వర్షం వచ్చినా,గాలి వీచిన విద్యుత్ సరఫరా‡ నిలిపి వేస్తున్నారని రాత్రంతా అంధకారంలో మగ్గామని బీబ్రా గ్రామస్తులు మంగళవారం కాగజ్‌నగర్–దహెగాం రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్బంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ గత కొన్ని రోజులు విద్యుత్ సరఫరా బీబ్రా గ్రామానికి సక్రమంగా చేయడం లేదన్నారు.సోమవారం రాత్రంతా చీకట్లోనే ఉన్నామని దోమల బాధ తీవ్రంగా ఉందన్నారు. అసలే వర్షాకాలం కావడంతో రాత్రి వేళల్లో బయటకి వెళ్లలేక పోతున్నామన్నారు. విషపురుగుల భయం అధికంగా ఉంటుందన్నారు. పలుమార్లు సమస్యను విద్యుత్ అధికారుల దష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోవడం లేదని విమర్శించారు.ట్రాన్స్‌కో ఏఈ రవీందర్‌తో గ్రామస్తులు ఫోన్‌లో మాట్లాడగా బీబ్రా గ్రామంలో ఉన్న విద్యుత్ సమస్యను రెండు రోజుల్లో తీరుస్తామని గ్రామస్తులకు హామీ ఇవ్వడంతో వారు రాస్తారోకో విరమించారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement