- కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం తథ్యం
- త్వరలో కాకినాడలో వైఎస్ జగన్ పర్యటన
- ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్పష్టీకరణ
టీడీపీకి ప్రజలే బుద్ధి చెబుతారు
Published Fri, Aug 11 2017 11:20 PM | Last Updated on Fri, Aug 10 2018 8:27 PM
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీకి ప్రజలే బుద్ధి చెబుతారని, ఎన్నికల కోసం వేచి చూస్తున్నారని చంద్రగిరి ఎమ్మెల్యే, ఎన్నికల పరిశీలకులు చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. కార్పోరేషన్ ఎన్నికల నేపథ్యంలో పార్టీని సమాయత్తం చేసేందుకు జిల్లాలో ఉన్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు. ప్రాంతాలకు, కులాలకు అతీతంగా వైఎస్సార్‌సీపీని గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు కానుందన ప్రజలు కసితో రలిగిపోతున్నారని, ఎన్నికలెప్పుడొస్తాయా? ఎప్పుడు ఓడిద్దామని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. టీడీపీకి ప్రజల్లో గుర్తింపు లేదని, తీవ్ర వ్యతిరేకత మధ్య అభ్యర్థులను పెట్టుకోలేని పరిస్థితిలో ఉందన్నారు. అభ్యర్థులు దొరకకే మిత్రపక్షమైన బీజేపీకి అధిక సంఖ్యలో డివిజన్లు కేటాయిస్తుందని, ఆ పార్టీ బలహీనతకు ఇదే నిదర్శనమని చెప్పారు. కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటిస్తారని వెల్లడించారు.
Advertisement
Advertisement