- డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
- రైతు గర్జన పోస్టర్ల విడుదల
ప్రజాగోడు పట్టని ప్రభుత్వం ఇది
Published Sat, Aug 13 2016 10:18 PM | Last Updated on Tue, Sep 18 2018 8:19 PM
నిర్మల్‌అర్బన్ : ప్రజల గోడును పట్టించుకోని ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగుతోందని డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. పట్టణంలోని ఆయన నివాసంలో భవనంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రజా సమస్యలను గాలికి వదిలేసి రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు వెనుకడుగు వేస్తోందని ఆరోపించారు. రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, రైతు వ్యతిరేక విధానాలను అవలబిస్తోందని ఆరోపించారు.
రైతు గర్జన పోస్టర్ విడుదల..
ఈ నెల 16న జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న రైతు గర్జన పోస్టర్లను శనివారం డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విడుదల చేశారు. రైతులకు భరోసా కల్పించేందుకు చేపడుతున్న రైతు గర్జన ను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఇందులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాద సుదర్శన్, కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సత్యంచంద్రకాంత్, ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జీ హరినాయక్, నిర్మల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తక్కల రమణారెడ్డి, నాయకులు జమాల్, అజార్, ముత్యంరెడ్డి, దినేష్, సంతోష్ తదితరులున్నారు.
Advertisement