
భర్తను వీర ఉతుకుడు ఉతికింది...
మరో మహిళతో జల్సా చేస్తున్న భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని వీర ఉతుకుడు ఉతికింది పెరూవియన్ మహిళ.
మరో మహిళతో జల్సా చేస్తున్న భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని వీర ఉతుకుడు ఉతికింది పెరూవియన్ మహిళ. ఓ బార్‌లో ప్రియురాలి చేతిలో చేతులు వేసి ఊసులాడుతున్న భర్తను అందరూ చూస్తుండగానే చితక్కొట్టింది. ఇంట్లో స్నేహితులను కలిసేందుకు వెళుతున్నానని చెప్పి...బయట మరొకామెతో రొమాన్స్ చేయటాన్ని తట్టుకోలేని భార్య శివమెత్తిపోయింది. తనకు, తన పిల్లలకు అన్యాయం చేస్తున్న భర్తను జుట్టు పట్టుకుని లాక్కొచ్చి కొరడాతో చితకబాదింది. అయినా ఆమె కోపం చల్లారలేదు.
సుజానా వాస్క్వెజ్ అనే మహిళ... భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చింది. దీంతో అతడిపై నిఘా పెట్టింది. ఇందుకోసం ఆమె ఓ స్వచ్ఛంద సంస్థ సాయం తీసుకుంది. స్నేహితులతో కలిసేందుకు వెళుతున్నానని భార్యకు మాయమాటలు చెప్పిన అతగాడు గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి స్థానికంగా ఉన్న బార్‌లో విందులో మునిగి తేలుతున్నాడు. అయితే భర్త ప్రవర్తన తేడాగా ఉండటంతో అతడిని సుజానా ఫాలో అయింది. భర్త... ప్రియురాలితో కలిసి ఉన్న దృశ్యం కంటబడింది. అంతే ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కొంతమంది స్థానికుల సహాయంతో మొగుడిని బయటకు లాక్కొచ్చింది. కొరడా తీసుకుని రఫ్పాడించింది. ఈ మొత్తం దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి.
'నీ పిల్లలకు తినడానికి తిండి లేదు.. ఇక్కడ నీవు జల్సాలు చేస్తున్నావా.. నీ తల్లిని మోసం చేశావు.. నాకు, నా పిల్లలకు ద్రోహం చేశావు.. నీ అంతు చూస్తానంటూ' సుజానా ఆగ్రహంతో, నిస్పహాయంగా రోదిస్తున్న తీరు వీడియోలో స్పష్టంగా ఉంది. అయితే ఈ వ్యవహారంలో కేసు నమోదు చేయాలో లేదో తెలియక పోలీసులు అయోమయంలో పడిపోయారట.