బడ్జెట్‌కు ముందు విదేశీ జోక్యం లేదు
ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని మోదీ
బడ్జెట్(Union Budget 2025-26) సమావేశాలకు ముందు 2014 తర్వాత తొలిసారి అశాంతిని రెచ్చగొట్టేలా విదేశీ ప్రయత్నాలు జరగలేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్ సమావేశాలకు ముందు ఆయన చేసిన ప్రసంగంలో ఈ మేరకు ప్రకటన చేశారు. గత దశాబ్ద కాలంగా పార్లమెంటు కీలక సమావేశాలకు ముందు రాజకీయ వాతావరణాన్ని అస్థిరపరిచేలా విదేశీ సంఘటనలు ఉన్నాయని తెలిపారు. 2014 తర్వాత ఏ విదేశీ సంస్థ కూడా అశాంతి సృష్టించేందుకు ప్రయత్నించకపోవడం ఇదే తొలిసారని ఆయన ఉద్ఘాటించారు.
ఆర్థిక సర్వే
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్న 2025 ఆర్థిక సర్వే గత ఏడాది కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ పనితీరుపై సమగ్ర అంచనాను అందిస్తుంది. కీలక పరిణామాలు, సవాళ్లు, భవిష్యత్తు వృద్ధికి రోడ్ మ్యాప్‌ను ఈ సర్వే వివరిస్తుంది. జీడీపీ వృద్ధిని పెంచడానికి, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి, మౌలిక సదుపాయాల అభివృద్ధిని పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఇది హైలైట్ చేస్తుంది.
కేంద్ర బడ్జెట్ 2025
ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ 2025లో సమ్మిళిత వృద్ధి, ఆర్థిక స్థిరత్వంపై దృష్టి సారించే అవకాశం ఉంది. భారత స్వాతంత్ర్య శతాబ్దిని పురస్కరించుకుని 2047 నాటికి ‘వికసిత్ భారత్(Vikasit Bharat)’ లక్ష్యాన్ని సాధించడానికి బడ్జెట్ సమావేశాలు కొత్త నమ్మకాన్ని, శక్తిని నింపుతాయని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. నూతన ఆవిష్కరణలు, పెట్టుబడులకు ప్రభుత్వ నిబద్ధతను ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. మహిళా సాధికారత, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో బడ్జెట్ సమావేశాల్లో కీలక సంస్కరణలు, నిర్ణయాలను ప్రవేశపెడతామని ఆయన హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: మహా కుంభమేళా.. విమాన ఛార్జీలు తగ్గింపు
గతంలో విదేశీ జోక్యం ఇలా..
దశాబ్ద కాలంలో బడ్జెట్ సమావేశాలకు ముందు విభిన్న సంఘటనల ద్వారా విదేశీ జోక్యం చోటు చేసుకుంటుంది. 2019, 2021 కెనడా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేలా చైనా, భారతదేశం పాల్గొన్నాయని కెనడా కమిషన్ నివేదిక వెల్లడించింది. చైనాను ప్రధాన పాత్రధారిగా గుర్తించగా, భారత్ పార్టీలకు అతీతంగా అభ్యర్థులను ప్రభావితం చేస్తోందని ఆరోపించారు. ఈ ఆరోపణలు నిరాధారమైనవని భారత విదేశాంగ శాఖ కొట్టిపారేసింది. 2023లో సిక్కు వేర్పాటువాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. ఇది దౌత్య సంక్షోభానికి దారితీసింది. కెనడా అక్రమ వలసలు, నేరాలకు అనుమతించే వాతావరణాన్ని ప్రోత్సహిస్తోందని భారతదేశం ఆరోపించింది.
Comments
Please login to add a commentAdd a comment