‘కంచు’ మోతలే... | Asian Games: Bronze for Shooters, Rowers on Day Six; India Remain 15th | Sakshi
Sakshi News home page

‘కంచు’ మోతలే...

Published Fri, Sep 26 2014 12:36 AM | Last Updated on Sat, Sep 2 2017 1:57 PM

‘కంచు’ మోతలే...

‘కంచు’ మోతలే...

ఆసియా క్రీడల్లో తొలి రోజు తర్వాత భారత్ స్వర్ణకాంతిని కోల్పోయింది. వెండి వెలుగులూ తగ్గిపోయాయి. మన క్రీడాకారులు వరుసగా కంచు మోతలతోనే సరి పెడుతున్నారు. పోటీల ఆరో రోజు మన ఖాతాలో మరో మూడు పతకాలు చేరాయి. అయితే అవన్నీ కాంస్యాలే. రోయర్లు ఫర్వాలేదనిపించగా... ఎన్నో ఆశలు పెట్టుకున్న షూటర్ల తుపాకులు కాస్త గురితప్పాయి.
 
భారత్ ఖాతాలో మరో మూడు కాంస్యాలు
రోయింగ్‌లో రెండు, షూటింగ్‌లో ఒకటి  
ఇంచియాన్ ఆసియా క్రీడలు
ఇంచియాన్: ఆసియా క్రీడల్లో గురువారం భారత్ మరో మూడు కాంస్య పతకాలు గెలుచుకుంది. రోయింగ్ పురుషుల  సింగిల్ స్కల్‌లో స్వరణ్ సింగ్ విర్క్ కాంస్యం సాధించాడు. టీమ్ ఎయిట్స్ విభాగంలోనూ భారత జట్టుకు కాంస్యం లభించింది. కపిల్ శర్మ, రంజిత్ సింగ్, భజరంగ్ లాల్ ఠక్కర్, పీయూ రాబిన్, సావన్ కుమార్, మొహమ్మద్ ఆజాద్, మణీందర్ సింగ్, దేవేందర్ సింగ్‌లతో పాటు హైదరాబాద్‌కు చెందిన మొహమ్మద్ అహ్మద్ కూడా ఈ జట్టులో ఉన్నాడు. షూటింగ్ మహిళల డబుల్ ట్రాప్ టీమ్ విభాగంలో కూడా భారత్‌కు కాంస్యం దక్కింది. షగున్, శ్రేయసి, వర్ష ఈ జట్టులో ఉన్నారు.
 
 రాణించిన రోయర్లు: రోయింగ్‌లో బుధవారం భారత్‌కు ఒక కాంస్యం దక్కగా, గురువారం మరో రెండు గెలిచి ... ఓవరాల్‌గా మూడు కాంస్యాలతో రోయర్లు ఆసియా క్రీడల పోరును ముగించారు. సింగిల్ స్కల్‌లో  2000 మీ. రేస్‌ను స్వరణ్ సింగ్ 7 నిమిషాల 10.65 సెకన్లలో ముగించాడు. టీమ్ ఎయిట్స్ విభాగంలో భారత జట్టు 5 నిమిషాల 51.84 సెకన్ల టైమింగ్ నమోదు చేసి మూడో స్థానంలో నిలిచింది.  
 
పరువు నిలిపిన మహిళలు: షూటింగ్‌లో డబుల్ ట్రాప్‌లో మహిళల జట్టు కాంస్యం సాధించడం మినహా ఇతర ఆటగాళ్లంతా పూర్తిగా విఫలమయ్యారు. డబుల్ ట్రాప్‌లో షగున్ 96/120, శ్రేయసి 94/120, వర్ష 89/120 స్కోర్ చేశారు. ఓవరాల్‌గా 279/360 పాయింట్లు భారత్ స్కోరు చేయగలిగింది. స్వర్ణం సాధించిన చైనా (315), రజతం గెలుచుకున్న కొరియా (314)తో పోలిస్తే బాగా వెనుకబడినా... అదృష్టవశాత్తూ కాంస్యం లభించింది. పురుషుల 50 మీ. ప్రోన్ ఈవెంట్‌లో భారత్‌కు నాలుగో స్థానం దక్కింది. వ్యక్తిగతంగా హైదరాబాదీ గగన్ నారంగ్ 618.4 పాయింట్లతో 14వ స్థానంలో నిలిచాడు.
 
హైదరాబాద్  నుంచే...
సాక్షి, హైదరాబాద్: ఇంచియాన్ ఆసియా క్రీడల్లో పతకాలు గెలుచుకున్న భారత ఆటగాళ్ల జాబితాలో ఒక హైదరాబాదీ చేరాడు. నగరానికి చెందిన రోయర్ మొహమ్మద్ అహ్మద్ ఈ క్రీడల్లో కాంస్యం సొంతం చేసుకున్నాడు. టీమ్ ఎయిట్స్ విభాగంలో మూడో స్థానంలో నిలిచిన భారత జట్టులో ఇతను సభ్యుడు. కవాడిగూడకు చెందిన ఇతను తొలి సారి ఆసియా క్రీడల్లో పాల్గొని మెడల్ సాధించడం విశేషం. ఇక ఏషియాడ్‌లో మూడు కాంస్యాలు సాధించిన భారత రోయింగ్ టీమ్ మొత్తం హుస్సేన్ సాగర్‌లోనే శిక్షణ పొందుతోంది. నగరానికే చెందిన ‘ద్రోణాచార్య’ ఇస్మాయిల్ బేగ్ జాతీయ జట్టుకు సుదీర్ఘ కాలంగా చీఫ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.
 
పాక్ చేతిలో భారత్ ఓటమి
ఆసియా క్రీడల పురుషుల హాకీ
ఇంచియూన్: వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి జోరుమీద కనిపించిన భారత పురుషుల హాకీ జట్టు కీలక వ్యూచ్‌లో చేతులెత్తేసింది. గురువారం సియోన్‌హక్ హాకీ స్టేడియుంలో జరిగిన పూల్ ‘బి’ వ్యూచ్‌లో భారత్ 1-2తో డిఫెండింగ్ చాంపియున్, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో చిత్తయింది. రెండు క్వార్టర్లు ముగిసేసరికి ఇరు జట్లు గోల్సేమీ నమోదు చేయులేకపోయూయి. మూడో క్వార్టర్ మొదలైన తర్వాత పాకిస్థాన్ జోరు పెంచింది. 38వ నిమిషంలో మొహమ్మద్ ఉవుర్ భుట్టా పాకిస్థాన్‌కు తొలి గోల్ అందించాడు.

12 నిమిషాల తర్వాత చివరి క్వార్టర్‌లో భారత జట్టు తివ్ముయ్యు (53వ నిమిషంలో) చేసిన గోల్‌తో స్కోరును 1-1తో సవుం చేసింది.
అయి ఈ ఆనందం భారత్‌కు ఎంతోసేపు నిలవలేదు. పాకిస్థాన్ ఎదురుదాడికి దిగింది. 54వ నిమిషంలో షఫీక్ రసూల్ సాయుంతో మోహ్మద్ వకాస్ భారత రక్షణశ్రేణి ఛేదించుకుంటూ గోల్ చేశాడు. దీంతో భారత్ వెనకబడిపోయింది. చివరి ఆరు నిమిషాల్లో భారత్ స్కోరును సవుం చేయులేకపోయింది. దీంతో ఓటమి తప్పలేదు. పూల్ బిలో భారత్ ఆడిన మూడు వ్యూచ్‌ల్లో ఇదే తొలి ఓటమి. ఈ పరాజయుంతో భారత్ పూల్ బిలో అగ్రస్థానంలో నిలిచే అవకాశం లేకుండా పోయింది. ఇక చైనాతో 27న జరిగే చివరి పూల్ వ్యూచ్‌లో భారత్ తప్పక గెలిస్తేనే సెమీస్‌కు చేరుతుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement