
ఈ ఏడాది భారత పురుషుల హాకీ జట్టు ప్రధాన లక్ష్యం ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించి 2024 పారిస్ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించడమేనని కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ వ్యాఖ్యానించాడు. వచ్చే నెలలో మొదలయ్యే అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) ప్రొ హాకీ లీగ్ మ్యాచ్‌లను సెప్టెంబర్‌లో చైనాలో జరిగే ఆసియా క్రీడలకు సన్నాహకంగా భావిస్తామని మన్‌ప్రీత్ తెలిపాడు. భువనేశ్వర్‌లో జరిగే ప్రొ హాకీ లీగ్‌లో స్పెయిన్, జర్మనీ, అర్జెంటీనా, ఇంగ్లండ్ జట్లతో భారత్ ఆడుతుంది.
చదవండి: Rohit Sharma: 5-6 కిలోలు తగ్గాలి రోహిత్.. అప్పుడే ఉపశమనం; ఫొటో షేర్ చేసిన ధావన్