భారత్ కు స్వర్ణం, ఫైనల్లో కంగుతున్న పాక్!
భారత్ కు స్వర్ణం, ఫైనల్లో కంగుతున్న పాక్!
Published Thu, Oct 2 2014 5:23 PM | Last Updated on Sat, Sep 2 2017 2:17 PM
ఇంచెయాన్(దక్షిణ కోరియా): 17వ ఆసియా క్రీడల్లో భాగంగా పాకిస్థాన్ తో గురువారం జరిగిన ఉత్కంఠ పోరులో భారత్ ఘన విజయం సాధించింది. నువ్వా నేనా అన్నట్టు జరిగిన పోరులో నిర్ణీత సమయానికి భారత, పాక్ జట్లు 1-1 గోల్స్ చేశాయి. దాంతో ఫలితం పెనాల్టీ షూటవుట్ కి చేరింది.
పెనాల్టీ షూటవుట్ లో భారత హాకీ క్రీడాకారులు సత్తా చాటి.. పాకిస్థాన్ ను కంగు తినిపించారు. షూటవుట్ లో భారత్ 4-2 తేడాతో విజయం సాధించింది. భారత హాకీ జట్టు విజయంతో ఆసియా క్రీడల పతకాల పట్టికలో 8 స్వర్ణాలు చేరాయి. 1982 తర్వాత భారత, హాకీ జట్లు ఆసియా క్రీడల పోటీల్లో తలపడటం ఇదే తొలిసారి. ఈ విజయంతో 2016లో రియోలో జరిగే ఒలంపిక్స్ క్రీడలకు భారత్ జట్టు అర్హత సాధించింది.
Advertisement
Advertisement