
ముంబై: ఈ ఏడాది ప్రొ కబడ్డీ లీగ్ షెడ్యూల్‌ను నిర్వాహకులు ఖరారు చేశారు. ఆరో సీజన్ పోటీలు ఈ ఏడాది అక్టోబర్ 19 నుంచి జరుగుతాయని నిర్వాహక సంస్థ మషాల్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది. మొత్తం 13 వారాల పాటు ఈ పోటీలు జరుగుతాయి. గత ఐదో సీజన్‌లో ఫ్రాంచైజీల సంఖ్య 8 నుంచి 12కు పెంచడంతో మ్యాచ్‌ల సంఖ్య, నిర్వహణ సమయం కూడా పెరిగిన సంగతి తెలిసిందే.
ఈ ఏడాది ఆసియా గేమ్స్ జరుగనున్న నేపథ్యంలో ఆటగాళ్లకు సరైన విరామం ఇవ్వాలనే ఉద్దేశంతో అక్టోబర్‌లో నిర్వహించనున్నట్లు ప్రొ కబడ్డీ కమిషనర్ అనుపమా గోస్వామి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment