ఏషియూడ్‌లో పతకం సాధిస్తా
న్యూఢిల్లీ: గ్లాస్గో కావున్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన భారత బ్యాడ్మింటన్ ఆటగాడు పారుపల్లి కశ్యప్ ఇప్పుడు ఆసియూ క్రీడల్ని లక్ష్యంగా ఎంచుకున్నాడు. ఇంచియూన్ వేదికగా ఈనెల 19 నుంచి అక్టోబరు 4 వరకు జరిగే ఏషియూడ్‌లో సత్తా చాటి పతకం సాధించాలని పట్టుదలగా ఉన్నాడు. పేలవమైన ఆటతో ప్రపంచ చాంపియున్‌షిప్‌లో తొలి రౌండ్‌లో ఓడిన కశ్యప్ వుళ్లీ వుునపటి ఫామ్‌ను అందుకుంటానన్నాడు. ఆసియూ క్రీడలకు సన్నాహాలపై అతని వూటల్లోనే...
ఏషియూడ్‌కు సాధనపై: ఆసియూ క్రీడల కోసం తీవ్రంగా సాధన చేశాను. ట్రైనింగ్ సెషన్ చాలా బాగా జరిగింది. ఇదే జోరును కొనసాగించాలి. నేనిప్పుడు ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. పతకం సాధిస్తానన్న నవ్ముకం ఉంది. దేశం కోసం, నా కోసం పతకం సాధించాలి.
ఫామ్‌పై: ప్రపంచ చాంపియున్‌షిప్‌కు వుుందు ఆశించిన స్థారుులో సాధన చేయులేకపోయూను. అందుకే తొలి రౌండ్‌లో చిత్తయ్యూను. ఓటమి తర్వాతి రోజు నుంచి ఆసియూ క్రీడల కోసం సాధన మొదలుపెట్టాను. ఇప్పుడు వుళ్లీ పుంజుకున్నాను.
ఏషియూడ్ వ్యూహాలపై: అంతర్జాతీయు వ్యూచ్‌ల్లో గతంలో ఆడిన ఆటగాళ్లతోనే వుళ్లీ వుళ్లీ ఆడాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో వ్యూచ్ వ్యూచ్‌కు కొత్తదనం చూపాలి. ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేసుకుని బరిలోకి దిగాల్సి దిగాలి. వ్యూచ్‌కు వుుందు ప్రతీ ఆటగాడు ప్రత్యర్థి ఆటతీరును యుూ ట్యూబ్‌ల్లో వీక్షించి అందుకు తగ్గట్లుగా ప్రణాళికను రూపొందించుకుంటాడు. విజేతగా నిలవాలంటే ఇది చాలా వుుఖ్యమైన అంశం.
దక్షిణ కొరియూతో పోరుపై: థావుస్ కప్‌లో దక్షిణ కొరియూ చేతిలో ఓడాం. ఈ ఆసియూ క్రీడల్లో పురుషుల టీమ్ చాంపియున్‌షిప్‌లో తొలి రౌండ్‌లో ఆ జట్టుతోనే తలపడబోతున్నాం. డబుల్స్‌లో వారికి వుంచి ప్లేయుర్లు ఉన్నారు. వారిని ఓడించే బాధ్యత వుుగ్గురు సింగిల్స్ ప్లేయుర్లపై ఉంది.