P Kashyap
-
కొరియా ఓపెన్ క్వార్టర్స్‌లో కశ్యప్
జెజు (కొరియా): మోకాలి గాయం నుంచి కోలుకున్నాక భారత బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్ తొలిసారి ఓ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకున్నాడు. కొరియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో ఈ హైదరాబాద్ ప్లేయర్ రెండో విజయాన్ని నమోదు చేశాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో కశ్యప్ 21-11, 13-21, 21-8తో జూ జెకి (చైనా)పై గెలిచాడు. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ జెయోన్ హైక్ జిన్ (కొరియా)తో ఆడతాడు. మోకాలి గాయం నుంచి తేరుకున్నాక కశ్యప్ ఆరు టోర్నీల్లో పాల్గొనగా ఏ టోర్నీలోనూ క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత పొందలేకపోయాడు. ఏడో టోర్నీలో మాత్రం అతను ఈ అడ్డంకిని అధిగమించాడు. -
సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో కశ్యప్
కొరియా ఓపెన్ మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. రెండో రౌండ్లో కశ్యప్ 21-15, 9-21, 21-19తో 32వ ర్యాంకర్ వాంగ్ జు వీ (చైనీస్ తైపీ)పై విజయం సాధించాడు. -
లెక్క సరిచేసిన శ్రీకాంత్
జపాన్ ఓపెన్‌లో కశ్యప్‌పై విజయం జయరామ్, ప్రణయ్ ముందంజ టోక్యో: రియో ఒలింపిక్స్ తర్వాత జరుగుతున్న తొలి సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, అజయ్ జయరామ్ శుభారంభం చేయగా... క్వాలిఫయర్ పారుపల్లి కశ్యప్, సాయిప్రణీత్ తొలి రౌండ్లో ఇంటిముఖం పట్టారు. గత ఏడాది ఇదే టోర్నమెంట్‌లోని రెండో రౌండ్లో కశ్యప్ చేతిలో ఎదురైన ఓటమికి కిడాంబి శ్రీకాంత్ బదులు తీర్చుకున్నాడు. 62 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 13వ ర్యాంకర్ శ్రీకాంత్ 14-21, 21-14, 23-21తో ప్రపంచ 74వ ర్యాంకర్ కశ్యప్‌ను ఓడించాడు. గతంలో కశ్యప్‌తో ఆడిన రెండుసార్లూ ఓడిపోయిన శ్రీకాంత్ మూడో ప్రయత్నంలో మాత్రం సఫలమయ్యాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో అజయ్ జయరామ్ 21-19, 23-21తో సోనీ ద్వి కుంకోరో (ఇండోనేసియా)పై, ప్రణయ్ 23-21, 19-21, 21-18తో ఇస్కందర్ జుల్కర్నైన్ జైనుద్దీన్ (మలేసియా)పై గెలుపొందగా... సాయిప్రణీత్ 21-9, 21-23, 10-21తో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో అజయ్ జయరామ్‌తో శ్రీకాంత్; రెండో సీడ్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో ప్రణయ్ తలపడతారు. -
మెయిన్ ‘డ్రా’కు కశ్యప్ అర్హత
టోక్యో: జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ పోటీల్లో కశ్యప్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందాడు. డేవిడ్ ఒబెర్‌నోస్టెరెర్ (ఆస్ట్రియా)తో జరిగిన తొలి రౌండ్లో కశ్యప్ 11-3తో ఆధిక్యంలో ఉన్నదశలో అతని ప్రత్యర్థి గాయం కారణంగా వైదొలిగాడు. ఇక రెండో రౌండ్లో కశ్యప్ 21-18, 21-12తో ఆండెర్స్ అంటన్సెన్ (డెన్మార్క్)ను ఓడించాడు. మహిళల సింగిల్స్ క్వాలియింగ్ తొలి రౌండ్లో భారత క్రీడాకారిణి తన్వీ లాడ్ 21-19, 18-21, 9-21తో చిసాతో హోషి (జపాన్) చేతిలో ఓడిపోయింది. బుధవారం జరిగే పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో భారత్‌కే చెందిన కిడాంబి శ్రీకాంత్‌తో కశ్యప్ ఆడనున్నాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)తో సాయిప్రణీత్; సోనీ ద్వి కుంకోరో (ఇండోనేసియా)తో అజయ్ జయరామ్; జుల్కర్నైన్ (మలేసియా)తో ప్రణయ్ తలపడతారు. -
ప్రిక్వార్టర్స్ లో శ్రీకాంత్, కశ్యప్
జయరామ్, సాయిప్రణీత్‌లకు షాక్ లక్నో: సయ్యద్ మోదీ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో టాప్ సీడ్ కిడాంబి శ్రీకాంత్, డిఫెండింగ్ చాంపియన్ పారుపల్లి కశ్యప్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో శ్రీకాంత్ (భారత్) 21-18, 21-14తో జూ వెన్ సూంగ్ (మలేసియా)పై, కశ్యప్ (భారత్) 21-14, 26-28, 21-17తో డెరెక్ వోంగ్ (సింగపూర్)పై గెలిచారు. అయితే భారత్‌కే చెందిన ప్రపంచ 21వ ర్యాంకర్ అజయ్ జయరామ్, ప్రపంచ 34వ ర్యాంకర్ సాయిప్రణీత్‌లకు రెండో రౌండ్లో అనూహ్య ఓటమి ఎదురైంది. ప్రపంచ 217వ ర్యాంకర్ శ్రేయాన్ష్ జైస్వాల్ (భారత్) 21-18, 15-21, 21-15తో జయరామ్‌పై, ప్రపంచ 178వ ర్యాంకర్ హర్షీల్ డాని (భారత్) 14-21, 21-17, 21-16తో సాయిప్రణీత్‌పై సంచలన విజయం సాధించారు. మరోవైపు హైదరాబాద్‌కే చెందిన గురుసాయిదత్, సిరిల్ వర్మ తొలి రౌండ్లోనే నిష్ర్కమించారు. గురుసాయిదత్ 10-21, 17-21తో జైనుద్దీన్ (మలేసియా) చేతిలో; సిరిల్ వర్మ 8-21, 18-21తో బున్సాక్ పొన్సానా (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో పీవీ సింధు 21-6, 21-7తో రియా ముఖర్జీ (భారత్)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది.మహిళల డబుల్స్ తొలి రౌండ్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప (భారత్) 21-6, 21-14తో హీతెర్-లారెన్ (ఇంగ్లండ్)లపై, సిక్కి రెడ్డి-మనీషా (భారత్) 21-7, 21-11తో సారా నక్వీ-రియా పిళ్లై (భారత్)లపై విజయం సాధించారు. -
టైటిల్ గెలుచుకుంటాం...
► ‘హంటర్స్’ ఆటగాడు కశ్యప్ ధీమా ► ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ సాక్షి, హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో విజేతగా నిలుస్తామని ‘హైదరాబాద్ హంటర్స్’ జట్టు ఆటగాడు పారుపల్లి కశ్యప్ విశ్వాసం వ్యక్తం చేశాడు. లీ చోంగ్ వీలాంటి దిగ్గజం సభ్యుడిగా ఉన్న తమ జట్టు చాలా పటిష్టంగా ఉందని...సొంతగడ్డపై టైటిల్ సాధించాలని కోరుకుంటున్నట్లు అతను చెప్పాడు. గురువారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో హంటర్స్ జట్టు సభ్యులను టీమ్ యజమాని, ఎజైల్ గ్రూప్ సీఎండీ డాక్టర్ వీఆర్కే రావు పరిచయం చేశారు. రెండు దశాబ్దాలుగా సేవల రంగంలో తాము ఎంతో గుర్తింపు తెచ్చుకున్నామని, ఇప్పుడు బ్యాడ్మింటన్‌తో జత కూడటం గర్వంగా ఉందని రావు చెప్పారు. హైదరాబాద్ హంటర్స్ టీమ్‌లో గుత్తా జ్వాల, సిరిల్ వర్మ, నందగోపాల్, సాత్విక్ సాయిరాజ్, మేఘన, ఉత్తేజితా రావు ఉన్నారు. -
ఇండియా ఓపెన్ గెలుస్తా
పారుపల్లి కశ్యప్ ధీమా న్యూఢిల్లీ: సయ్యద్ మోడీ గ్రాండ్‌ప్రి గోల్డ్ ఈవెంట్‌ను గెలుచుకున్న అనంతరం పి.కశ్యప్‌కు గాయాలు వెంటాడాయి. అయితే ఇప్పుడు తాను పూర్తి ఫిట్‌గా ఉన్నానని, వచ్చే వారం జరిగే ఇండియా సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్‌లో విజేతగా నిలుస్తానని ధీమా వ్యక్తం చేశాడు. ‘సయ్యద్ మోడి టోర్నీ తర్వాత మూడు వారాల పాటు కడుపు నొప్పితో ఆటకు దూరమయ్యాను. ఆ తర్వాత మూడు రోజుల పాటు శిక్షణ అనంతరం తొడ కండరాలు పట్టేయడంతో మరో పది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఆల్ ఇంగ్లండ్ తర్వాత రెండు వారాలుగా శిక్షణ తీసుకుంటున్నాను. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాను. ఇండియా ఓపెన్ పైనే నా దృష్టి నిలిపాను. భారత్‌లో టోర్నీ ఆడడం నాకు ఉత్సాహాన్నిస్తుంది. అందరి మద్దతుతో గెలుస్తాననే నమ్మకం ఉంది’ అని 28 ఏళ్ల కశ్యప్ అన్నాడు. -
విమర్శకులకు సమాధానమిదే!
న్యూఢిల్లీ: తన పని అయిపోయిందని వస్తున్న విమర్శలకు ఫుల్స్టాప్ పెట్టాలంటే గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలాంటి విజయం చాలా అవసరమని భారత టాప్ షట్లర్ పారుపల్లి కశ్యప్ అన్నాడు. సయ్యద్ మోడి గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్‌ను గెలవడం చాలా సంతోషాన్నిస్తోందన్నాడు. ‘సీజన్‌ను ఆరంభించడానికి ఇంతకంటే మంచిది లేదు. మలేసియా, సయ్యద్ మోడి ఈవెంట్లలో బాగా ఆడాలని నవంబర్లోనే అనుకున్నా. అయితే మలేసియాలో ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగాను. లక్కీగా ఇక్కడ మాత్రం టైటిల్‌ను నెగ్గా. ఈ టోర్నీలో రాణించాననే అనుకుంటున్నా. గతేడాది శ్రీకాంత్ చాలా మెరుగ్గా ఆడాడు. ఒక్కసారిగా నాలుగో ర్యాంక్‌లోకి దూసుకురావడంతో ఇక అందరూ నా పని అయిపోయిందని విమర్శలు మొదలుపెట్టారు. ఈ టోర్నీని మొదలుపెట్టినప్పుడు చాలా మంది నేను ఫామ్‌లో లేనని భావించారు. నిరుడు బాగా ఆడలేదు. కాబట్టి ఈసారి కూడా కష్టమేనని వ్యాఖ్యానాలు చేశారు. అయితే కామన్వెల్త్ గేమ్స్ తర్వాత నా కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నా. మూడు టోర్నీల్లో రెండింటిలో క్వార్టర్ ఫైనల్స్, ఒకదాంట్లో సెమీస్‌కు చేరా. కాకపోతే శ్రీకాంత్‌కు అన్నీ కలిసొచ్చి అద్భుతంగా ఆడాడు. దీంతో అందరి దృష్టి అటువైపు మళ్లింది. ఈ దశలో నాకు ఈ విజయం చాలా ముఖ్యం’ అని కశ్యప్ పేర్కొన్నాడు. ఆందోళన కలిగిస్తోంది... టైటిల్ గెలవడం ఆనందాన్ని కలిగించినా... మ్యాచ్ మధ్యలో పొత్తి కడుపు కండరం చిరిగిపోవడం కాస్త ఆందోళన కలిగిస్తోందని కశ్యప్ వెల్లడించాడు. ‘నా పొత్తి కడుపు కండరంలో చిన్న చీలిక వచ్చింది. ప్రస్తుతం దాని పరిస్థితి ఎలా ఉందో తెలియదు. హైదరాబాద్‌లో మంచి ఫిజియోలు లేరు. ముంబై వెళ్లి పరీక్షించుకోవాలి. గాయంపై కాస్త ఆందోళనతో ఉన్నా. అయితే నేను తర్వాత ఆడబోయే టోర్నీ ఆల్ ఇంగ్లండ్ కాబట్టి చికిత్స తీసుకోవడానికి అవసరమైన సమయం ఉంది. టోర్నీ సమయానికి కోలుకుంటా’ అని ఈ హైదరాబాదీ వ్యాఖ్యానించాడు. శ్రీకాంత్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ గురించి మాట్లాడుతూ... ‘మంచి ఫామ్‌లో ఉన్నాడు. పోటీ బాగా ఇచ్చాడు. ఫలితం ఇలాగే ఉంటుందని ముందే ఊహించా. గురుసాయిదత్, ఇతర ఆటగాళ్లతో పోటీపడ్డాను. కానీ ఏడాది కాలంగా శ్రీకాంత్‌తో తలపడలేదు. మళ్లీ చైనా, హాంకాంగ్ టోర్నీల్లో ఎదురవొచ్చు. ఇది ఒలింపిక్స్ అర్హత ఏడాది కావడంతో షట్లర్లందరికీ చాలా ముఖ్యమైంది. ర్యాంకింగ్‌పై కాకుండా టోర్నీలు గెలవడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టా’ అని కశ్యప్ వివరించాడు. -
ఇద్దరూ ఇద్దరే
సైనా, కశ్యప్ సింగిల్స్ చాంప్స్ గతేడాది గొప్ప విజయాలు సాధించిన భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్.. అదే జోరును కొత్త ఏడాదిలోనూ కొనసాగించారు. స్వదేశంలో జరిగిన సయ్యద్ మోడి స్మారక గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో సైనా మహిళల సింగిల్స్‌లో... కశ్యప్ పురుషుల సింగిల్స్‌లో చాంపియన్స్‌గా నిలిచారు. సైనా రెండు మ్యాచ్ పాయింట్లను కాపాడుకోగా... కశ్యప్ రెండు గేముల్లోనూ గేమ్ పాయింట్లను కాచుకొని నెగ్గడం విశేషం. లక్నో: ఓటమి అంచుల నుంచి గట్టెక్కిన సైనా నెహ్వాల్ కొత్త ఏడాదిలో శుభారంభం చేసింది. తాను బరిలోకి దిగిన తొలి టోర్నీలోనే ఈ హైదరాబాద్ అమ్మాయి విజేతగా నిలిచింది. ఆదివారం ముగిసిన సయ్యద్ మోడి స్మారక గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో మహిళల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సైనా 19-21, 25-23, 21-16తో ప్రపంచ చాంపియన్, రెండో సీడ్ కరోలినా మారిన్ (స్పెయిన్)పై అద్భుత విజయం సాధించింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన సైనా తొలి గేమ్ కోల్పోయి... రెండో గేమ్‌లో 19-20, 20-21 స్కోర్ల వద్ద రెండుసార్లు మ్యాచ్ పాయింట్లను కాపాడుకుంది. కీలకదశలో సంయమనంతో ఆడిన సైనా రెండు గేమ్‌లను దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్‌లో సైనా స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. ఆ తర్వాత మారిన్ తేరుకునే ప్రయత్నం చేసినా సైనా నిలకడగా పాయింట్లు స్కోరు చేసి చివరకు గంటా 19 నిమిషాల్లో విజయాన్ని ఖాయం చేసుకొని ఈ టైటిల్‌ను మూడోసారి తన ఖాతాలోకి వేసుకుంది. 2009, 2014లోనూ సైనాకు ఈ టైటిల్ లభించింది. ఇద్దరు భారత అగ్రశ్రేణి ఆటగాళ్ల మధ్య జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 15వ ర్యాంకర్ పారుపల్లి కశ్యప్ 23-21, 23-21తో ప్రపంచ 5వ ర్యాంకర్, తన సహచరుడు కిడాంబి శ్రీకాంత్‌పై గెలిచాడు. 2012లోనూ ఈ టైటిల్ నెగ్గిన కశ్యప్‌కు ఫైనల్లో శ్రీకాంత్ నుంచి గట్టిపోటీ ఎదురైంది. ఇద్దరూ ప్రతి పాయింట్ కోసం నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. ఇద్దరికీ తమ బలాలు, బలహీనతలపై అవగాహన ఉండటంతో ఆధిక్యం దోబూచులాడింది. అయితే చివర్లో అనుభవజ్ఞుడైన కశ్యప్నే విజయం వరించింది. రెండు గేముల్లోనూ కశ్యప్ 20-21తో వెనుకబడ్డ దశలో పుంజుకొని వరుసగా మూడేసి పాయింట్లు సాధిం చి విజయం సాధించడం విశేషం. సింగిల్స్ విజేతలైన సైనా, కశ్యప్‌లకు 9 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 5 లక్షల 52 వేలు)తోపాటు 7000 ర్యాం కింగ్ పాయింట్లు లభించాయి. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో తెలుగు అమ్మాయి కె.మనీషా-మనూ అత్రి జంట రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో మనీషా-మనూ అత్రి (భారత్) ద్వయం 17-21, 17-21తో రికీ విదియాంతో-పుస్పిత రిచిత దిలి (ఇండోనేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది. -
శ్రీకాంత్ x కశ్యప్
మారిన్‌తో సైనా తుదిపోరు లక్నో: సయ్యద్ మోడి స్మారక ఇండియన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ టైటిల్ భారత ఆటగాళ్ల ఖాతాలోకే చేరనుంది. హైదరాబాద్‌కే చెందిన ఇద్దరు అగ్రశ్రేణి క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్ ఆదివారం జరిగే టైటిల్ పోరుకు సిద్ధమయ్యారు. గతేడాది రన్నరప్‌గా నిలిచిన శ్రీకాంత్ వరుసగా రెండో ఏడాది ఫైనల్లోకి దూసుకెళ్లడం విశేషం. 2012లో చాంపియన్‌గా నిలిచిన కశ్యప్ రెండోసారి అంతిమ సమరానికి సిద్ధమయ్యాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ ఐదో ర్యాంకర్ శ్రీకాంత్ 12-21, 21-12, 21-14తో ప్రణయ్ (భారత్)పై నెగ్గగా... మూడో సీడ్, ప్రపంచ 15వ ర్యాంకర్ కశ్యప్ 18-21, 22-20, 21-7తో రెండో సీడ్, ప్రపంచ 10వ ర్యాంకర్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)ను ఓడించాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ శ్రీకాంత్, కశ్యప్ తొలి గేమ్ కోల్పోయి తర్వాతి రెండు గేములను సొంతం చేసుకోవడం విశేషం. మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ సైనా నెహ్వాల్ (భారత్), ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) మధ్య టైటిల్ పోరు జరుగనుంది. సెమీఫైనల్స్‌లో టాప్ సీడ్ సైనా 21-10, 21-16తో నిచావోన్ జిందాపోన్ (థాయ్‌లాండ్)పై గెలుపొందగా... మూడో సీడ్ పి.వి.సింధు 13-21, 13-21తో మారిన్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయింది. మారిన్ చేతిలో సింధుకిది వరుసగా మూడో పరాజయం కావడం గమనార్హం. గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మారిన్ చేతిలోనే సింధు ఓడిపోయింది. జ్వాల జంట ఓటమి మహిళల డబుల్స్ సెమీఫైనల్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప (భారత్) జంట 16-21, 21-19, 21-13తో అమిలియా అలిసియా-ఫీ చో సూంగ్ (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సుమిత్ రెడ్డి-మనూ అత్రి (భారత్) ద్వయం 12-21, 18-21తో ఇవనోవ్-సొజొనోవ్ (రష్యా) జంట చేతిలో ఓటమి పాలైంది. మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో కె.మనీషా-మనూ అత్రి (భారత్) జంట 24-22, 21-19తో డ్రెమిన్-దిమోవా (రష్యా) జోడీని ఓడించి ఫైనల్‌కు చేరింది. -
ఏషియూడ్‌లో పతకం సాధిస్తా
న్యూఢిల్లీ: గ్లాస్గో కావున్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన భారత బ్యాడ్మింటన్ ఆటగాడు పారుపల్లి కశ్యప్ ఇప్పుడు ఆసియూ క్రీడల్ని లక్ష్యంగా ఎంచుకున్నాడు. ఇంచియూన్ వేదికగా ఈనెల 19 నుంచి అక్టోబరు 4 వరకు జరిగే ఏషియూడ్‌లో సత్తా చాటి పతకం సాధించాలని పట్టుదలగా ఉన్నాడు. పేలవమైన ఆటతో ప్రపంచ చాంపియున్‌షిప్‌లో తొలి రౌండ్లో ఓడిన కశ్యప్ వుళ్లీ వుునపటి ఫామ్‌ను అందుకుంటానన్నాడు. ఆసియూ క్రీడలకు సన్నాహాలపై అతని వూటల్లోనే... ఏషియూడ్కు సాధనపై: ఆసియూ క్రీడల కోసం తీవ్రంగా సాధన చేశాను. ట్రైనింగ్ సెషన్ చాలా బాగా జరిగింది. ఇదే జోరును కొనసాగించాలి. నేనిప్పుడు ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. పతకం సాధిస్తానన్న నవ్ముకం ఉంది. దేశం కోసం, నా కోసం పతకం సాధించాలి. ఫామ్‌పై: ప్రపంచ చాంపియున్షిప్కు వుుందు ఆశించిన స్థారుులో సాధన చేయులేకపోయూను. అందుకే తొలి రౌండ్లో చిత్తయ్యూను. ఓటమి తర్వాతి రోజు నుంచి ఆసియూ క్రీడల కోసం సాధన మొదలుపెట్టాను. ఇప్పుడు వుళ్లీ పుంజుకున్నాను. ఏషియూడ్ వ్యూహాలపై: అంతర్జాతీయు వ్యూచ్‌ల్లో గతంలో ఆడిన ఆటగాళ్లతోనే వుళ్లీ వుళ్లీ ఆడాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో వ్యూచ్ వ్యూచ్కు కొత్తదనం చూపాలి. ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేసుకుని బరిలోకి దిగాల్సి దిగాలి. వ్యూచ్కు వుుందు ప్రతీ ఆటగాడు ప్రత్యర్థి ఆటతీరును యుూ ట్యూబ్‌ల్లో వీక్షించి అందుకు తగ్గట్లుగా ప్రణాళికను రూపొందించుకుంటాడు. విజేతగా నిలవాలంటే ఇది చాలా వుుఖ్యమైన అంశం. దక్షిణ కొరియూతో పోరుపై: థావుస్ కప్‌లో దక్షిణ కొరియూ చేతిలో ఓడాం. ఈ ఆసియూ క్రీడల్లో పురుషుల టీమ్ చాంపియున్‌షిప్‌లో తొలి రౌండ్లో ఆ జట్టుతోనే తలపడబోతున్నాం. డబుల్స్‌లో వారికి వుంచి ప్లేయుర్లు ఉన్నారు. వారిని ఓడించే బాధ్యత వుుగ్గురు సింగిల్స్ ప్లేయుర్లపై ఉంది.