కొరియా ఓపెన్ క్వార్టర్స్‌లో కశ్యప్ | Kashyap in quarters of Korea Open | Sakshi
Sakshi News home page

కొరియా ఓపెన్ క్వార్టర్స్‌లో కశ్యప్

Published Thu, Dec 8 2016 11:36 PM | Last Updated on Mon, Sep 4 2017 10:14 PM

కొరియా ఓపెన్ క్వార్టర్స్‌లో కశ్యప్

కొరియా ఓపెన్ క్వార్టర్స్‌లో కశ్యప్

జెజు (కొరియా): మోకాలి గాయం నుంచి కోలుకున్నాక భారత బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్ తొలిసారి ఓ టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకున్నాడు. కొరియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో ఈ హైదరాబాద్ ప్లేయర్ రెండో విజయాన్ని నమోదు చేశాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో కశ్యప్ 21-11, 13-21, 21-8తో జూ జెకి (చైనా)పై గెలిచాడు. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ జెయోన్ హైక్ జిన్ (కొరియా)తో ఆడతాడు. మోకాలి గాయం నుంచి తేరుకున్నాక కశ్యప్ ఆరు టోర్నీల్లో పాల్గొనగా ఏ టోర్నీలోనూ క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత పొందలేకపోయాడు. ఏడో టోర్నీలో మాత్రం అతను ఈ అడ్డంకిని అధిగమించాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement