టైటిల్ గెలుచుకుంటాం... | Parupalli Kashyap Hopes For Opening Clash Against Kidambi Srikanth | Sakshi
Sakshi News home page

టైటిల్ గెలుచుకుంటాం...

Published Fri, Dec 25 2015 12:50 AM | Last Updated on Fri, Sep 7 2018 4:33 PM

టైటిల్ గెలుచుకుంటాం... - Sakshi

టైటిల్ గెలుచుకుంటాం...

  ‘హంటర్స్’ ఆటగాడు  కశ్యప్ ధీమా
►   ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్
 సాక్షి, హైదరాబాద్: 
ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో విజేతగా నిలుస్తామని ‘హైదరాబాద్ హంటర్స్’ జట్టు ఆటగాడు పారుపల్లి కశ్యప్ విశ్వాసం వ్యక్తం చేశాడు. లీ చోంగ్ వీలాంటి దిగ్గజం సభ్యుడిగా ఉన్న తమ జట్టు చాలా పటిష్టంగా ఉందని...సొంతగడ్డపై టైటిల్ సాధించాలని కోరుకుంటున్నట్లు అతను చెప్పాడు.  గురువారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో హంటర్స్ జట్టు సభ్యులను టీమ్ యజమాని, ఎజైల్ గ్రూప్ సీఎండీ డాక్టర్ వీఆర్‌కే రావు పరిచయం చేశారు. రెండు దశాబ్దాలుగా సేవల రంగంలో తాము ఎంతో గుర్తింపు తెచ్చుకున్నామని, ఇప్పుడు బ్యాడ్మింటన్‌తో జత కూడటం గర్వంగా ఉందని రావు చెప్పారు. హైదరాబాద్ హంటర్స్ టీమ్‌లో గుత్తా జ్వాల, సిరిల్ వర్మ, నందగోపాల్, సాత్విక్ సాయిరాజ్, మేఘన, ఉత్తేజితా రావు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement