మెయిన్ ‘డ్రా’కు కశ్యప్ అర్హత
టోక్యో: జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ పోటీల్లో కశ్యప్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందాడు. డేవిడ్ ఒబెర్‌నోస్టెరెర్ (ఆస్ట్రియా)తో జరిగిన తొలి రౌండ్‌లో కశ్యప్ 11-3తో ఆధిక్యంలో ఉన్నదశలో అతని ప్రత్యర్థి గాయం కారణంగా వైదొలిగాడు.
ఇక రెండో రౌండ్‌లో కశ్యప్ 21-18, 21-12తో ఆండెర్స్ అంటన్‌సెన్ (డెన్మార్క్)ను ఓడించాడు. మహిళల సింగిల్స్ క్వాలియింగ్ తొలి రౌండ్‌లో భారత క్రీడాకారిణి తన్వీ లాడ్ 21-19, 18-21, 9-21తో చిసాతో హోషి (జపాన్) చేతిలో ఓడిపోయింది. బుధవారం జరిగే పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్‌లో భారత్‌కే చెందిన కిడాంబి శ్రీకాంత్‌తో కశ్యప్ ఆడనున్నాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)తో సాయిప్రణీత్; సోనీ ద్వి కుంకోరో (ఇండోనేసియా)తో అజయ్ జయరామ్; జుల్కర్‌నైన్ (మలేసియా)తో ప్రణయ్ తలపడతారు.