ప్రిక్వార్టర్స్ లో శ్రీకాంత్, కశ్యప్ | srikanth and kashyap in prequarters | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్ లో శ్రీకాంత్, కశ్యప్

Published Thu, Jan 28 2016 2:36 AM | Last Updated on Sun, Sep 3 2017 4:25 PM

srikanth and kashyap in prequarters

జయరామ్, సాయిప్రణీత్‌లకు షాక్
లక్నో: సయ్యద్ మోదీ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో టాప్ సీడ్ కిడాంబి శ్రీకాంత్, డిఫెండింగ్ చాంపియన్ పారుపల్లి కశ్యప్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో శ్రీకాంత్ (భారత్) 21-18, 21-14తో జూ వెన్ సూంగ్ (మలేసియా)పై, కశ్యప్ (భారత్) 21-14, 26-28, 21-17తో డెరెక్ వోంగ్ (సింగపూర్)పై గెలిచారు.

అయితే భారత్‌కే చెందిన ప్రపంచ 21వ ర్యాంకర్ అజయ్ జయరామ్, ప్రపంచ 34వ ర్యాంకర్ సాయిప్రణీత్‌లకు రెండో రౌండ్‌లో అనూహ్య ఓటమి ఎదురైంది. ప్రపంచ 217వ ర్యాంకర్ శ్రేయాన్ష్ జైస్వాల్ (భారత్) 21-18, 15-21, 21-15తో జయరామ్‌పై, ప్రపంచ 178వ ర్యాంకర్ హర్షీల్ డాని (భారత్) 14-21, 21-17, 21-16తో సాయిప్రణీత్‌పై సంచలన విజయం సాధించారు. మరోవైపు హైదరాబాద్‌కే చెందిన గురుసాయిదత్, సిరిల్ వర్మ తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించారు.

గురుసాయిదత్ 10-21, 17-21తో జైనుద్దీన్ (మలేసియా) చేతిలో; సిరిల్ వర్మ 8-21, 18-21తో బున్సాక్ పొన్సానా (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో పీవీ సింధు 21-6, 21-7తో రియా ముఖర్జీ (భారత్)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది.మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప (భారత్) 21-6, 21-14తో హీతెర్-లారెన్ (ఇంగ్లండ్)లపై, సిక్కి రెడ్డి-మనీషా (భారత్) 21-7, 21-11తో సారా నక్వీ-రియా పిళ్లై (భారత్)లపై విజయం సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement