ఇండియా ఓపెన్ గెలుస్తా | I can win India Open, says fit-again P Kashyap | Sakshi
Sakshi News home page

ఇండియా ఓపెన్ గెలుస్తా

Published Sat, Mar 21 2015 1:09 AM | Last Updated on Sat, Sep 2 2017 11:09 PM

ఇండియా ఓపెన్ గెలుస్తా

ఇండియా ఓపెన్ గెలుస్తా

పారుపల్లి కశ్యప్ ధీమా
 

 న్యూఢిల్లీ: సయ్యద్ మోడీ గ్రాండ్‌ప్రి గోల్డ్ ఈవెంట్‌ను గెలుచుకున్న అనంతరం పి.కశ్యప్‌కు గాయాలు వెంటాడాయి. అయితే ఇప్పుడు తాను పూర్తి ఫిట్‌గా ఉన్నానని, వచ్చే వారం జరిగే ఇండియా సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్‌లో విజేతగా నిలుస్తానని ధీమా వ్యక్తం చేశాడు. ‘సయ్యద్ మోడి టోర్నీ తర్వాత మూడు వారాల పాటు కడుపు నొప్పితో ఆటకు దూరమయ్యాను.

ఆ తర్వాత మూడు రోజుల పాటు శిక్షణ అనంతరం తొడ కండరాలు పట్టేయడంతో మరో పది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఆల్ ఇంగ్లండ్ తర్వాత రెండు వారాలుగా శిక్షణ తీసుకుంటున్నాను. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాను. ఇండియా ఓపెన్ పైనే నా దృష్టి నిలిపాను. భారత్‌లో టోర్నీ ఆడడం నాకు ఉత్సాహాన్నిస్తుంది. అందరి మద్దతుతో గెలుస్తాననే నమ్మకం ఉంది’ అని 28 ఏళ్ల కశ్యప్ అన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement