
హాంగ్జౌ ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులు మంగళవారం మోదీని కలిశారు

తదుపరి ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు మరెన్నో పతకాలు తెస్తారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు

ఈ సందర్భంగా ప్రధాని వారందరినీ ప్రశంసించారు

ఈ ఆసియా క్రీడల్లో వందకు పైగా పతకాలు సాధించిన క్రీడాకారులు వచ్చే క్రీడల్లో ఈ రికార్డును అధిగమిస్తారనే నమ్మకముంది

పారిస్ ఒలింపిక్స్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరుస్తారని ఆశిస్తున్నాను’అని మోదీ అన్నారు

ఈ కార్యక్రమంలో పురుషుల టెన్నిస్ డబుల్స్‌లో రజత పతకం గెలిచిన సాకేత్ మైనేని, మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణ పతకం నెగ్గిన రుతుజా భోస్లే ప్రధానికి జ్ఞాపికగా రాకెట్‌ను అందించారు

స్వర్ణ పతకాలు గెలిచిన భారత పురుషుల హాకీ జట్టు హాకీ స్టిక్‌ను, క్రికెట్లు జట్లు బ్యాట్‌ను మోదీకి బహూకరించాయి














