
Asian Games 2022: చైనాలో కోవిడ్-19 భయాల నేపథ్యంలో ఆసియా క్రీడలు-2022 వాయిదా పడ్డాయి. ఈ విషయాన్ని చైనా అధికారిక మీడియా శుక్రవారం వెల్లడించింది. ఈ మేరకు.. ‘‘ఈ ఏడాది సెప్టెంబరు 10 నుంచి 25 వరకు చైనాలోని హాంగ్జౌ నగరంలో నిర్వహించాల్సిన 19వ ఆసియా క్రీడలను వాయిదా వేస్తున్నట్లు ఆసియా ఒలిపింపిక్ కౌన్సిల్ ప్రకటించింది’’ అని పేర్కొంది.
తదుపరి తేదీలను మరికొన్ని రోజుల్లో వెల్లడించనున్నట్లు తెలిపింది. కాగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో చైనాలోని హాంగ్జౌ నగరంలో ఆసియా క్రీడలు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం చైనాలో మరోసారి కరోనా వ్యాప్తి విజృంభిస్తున్న నేపథ్యంలో వీటిని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
ఇక షాంఘై నగరానికి సమీపంలోని హాంగ్జౌలో ఇప్పటికే ఆసియా, పారా క్రీడల కోసం 56 వేదికలు నిర్మించినట్లు నిర్వాహకులు గతంలో పేర్కొన్నారు. కాగా కరోనా తీవ్రత నేపథ్యంలో షాంఘైలో గత కొద్ది రోజులుగా లాక్‌డౌన్ అమలు అవుతున్న సంగతి తెలిసిందే. ఇక అక్కడ బలవంతంగా కోవిడ్ పరీక్షలు చేస్తున్నారంటూ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్న తరుణంలో పాలకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చదవండి👉🏾David Warner: ‘ప్రతీకారం తీర్చుకున్న వార్నర్’.. ఆ ఒక్క మాట చాలు.. దెబ్బ అదుర్స్ కదూ!
Comments
Please login to add a commentAdd a comment