న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తనయ గాయత్రి ఇండోనేసియాకు పయనం కానుంది. ఆసియా క్రీడల కోసం భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) 20 మంది సభ్యులతో కూడిన మహిళల, పురుషుల జట్లను ప్రకటించింది. ఇరు జట్లలోనూ ఆరుగురు యువ షట్లర్లకు చోటు కల్పించారు. బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు, సిక్కి రెడ్డిలు ఉన్న మహిళల జట్టులో 15 ఏళ్ల పుల్లెల గాయత్రి ఎంపికైంది.
మరో తెలుగమ్మాయి చుక్కా సాయి ఉత్తేజిత రావుతో పాటు అష్మిత చాలిహ, ఆకర్షి కశ్యప్, రుతుపర్ణ, ఆర్తి సారాలు చోటు దక్కించుకున్నారు. వీరంతా బెంగళూరు, హైదరాబాద్‌లలో ‘బాయ్’ నిర్వహించిన సీనియర్ ర్యాంకింగ్ టోర్నీల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా జకార్తా మెగా ఈవెంట్‌కు ఎంపికయ్యారు. గాయత్రి హైదరాబాద్‌లో జరిగిన టోర్నీలో సెమీఫైనల్ చేరింది. జకార్తా ఆతిథ్యమిచ్చే ఆసియా గేమ్స్ ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2 వరకు జరగనున్నాయి.
పురుషుల జట్టు: కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, సాయిప్రణీత్, సమీర్ వర్మ, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి, సుమీత్ రెడ్డి, మను అత్రి, ప్రణవ్ జెర్రీ చోప్రా, సౌరభ్ వర్మ.
మహిళల జట్టు: సైనా నెహ్వాల్, పీవీ సింధు, సిక్కి రెడ్డి, అశ్విని పొన్నప్ప, సాయి ఉత్తేజిత రావు, అష్మిత చాలిహ, రుతుపర్ణ పండ, ఆర్తి సారా సునీల్, ఆకర్షి కశ్యప్, గాయత్రి. కోచ్‌లు: పుల్లెల గోపీచంద్, తన్ కిమ్ హర్, అరుణ్ విష్ణు, ఎడ్విన్ ఐరివాన్.
Comments
Please login to add a commentAdd a comment