ఆసియా గేమ్స్ టెన్నిస్ పోటీల్లో తెలుగు తేజాలు సాకేత్ మైనేని, రిషిక సుంకర తొలిసారిగా పాల్గొననున్నారు. శనివారం 12 మంది ఆటగాళ్లతో కూడిన బృందాన్ని సెలక్టర్లు ప్రకటించారు.
న్యూఢిల్లీ: ఆసియా గేమ్స్ టెన్నిస్ పోటీల్లో తెలుగు తేజాలు సాకేత్ మైనేని, రిషిక సుంకర తొలిసారిగా పాల్గొననున్నారు. శనివారం 12 మంది ఆటగాళ్లతో కూడిన బృందాన్ని సెలక్టర్లు ప్రకటించారు. 2010 గేమ్స్‌కు దూరంగా ఉన్న 40 ఏళ్ల దిగ్గజ ఆటగాడు లియాండర్ పేస్‌ను ఈసారి ఎంపిక చేశారు.
అలాగే సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంప్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, సనమ్ సింగ్, యూకీ బాంబ్రీ, రోహన్ బోపన్న బరిలోకి దిగనున్నారు. మహిళా విభాగంలో స్టార్ ప్లేయర్ సానియా మీర్జా, అంకితా రైనా, ప్రార్థన, స్నేహాదేవి రెడ్డి, నటాషా ఆడనున్నారు. మహిళల జట్టుకు సానియా మీర్జా తల్లి నసీమా కెప్టెన్‌గా వ్యవహరిస్తారు.