సానియా జంట ఓటమి | sania mirza team lost the game | Sakshi
Sakshi News home page

సానియా జంట ఓటమి

Published Thu, Feb 19 2015 12:59 AM | Last Updated on Sat, Sep 2 2017 9:32 PM

sania mirza team lost the game

న్యూఢిల్లీ: దుబాయ్ ఓపెన్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ సానియా మీర్జా జంటకు రెండో రౌండ్‌లోనే ఓటమి ఎదురైంది. బుధవారం దుబాయ్‌లో జరిగిన మహిళల డబుల్స్ రెండో రౌండ్‌లో టాప్ సీడ్ సానియా మీర్జా-సు వీ సెయి (చైనీస్ తైపీ) ద్వయం 4-6, 6-4, 7-10తో అల్లా కుద్రయెత్సెవా-పావ్లీచెంకోవా (రష్యా) జోడీ చేతిలో పరాజయం పాలైంది.
 
 తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన సానియా జంటకు రెండో రౌండ్‌లో ఊహించని ప్రతిఘటన ఎదురైంది. 87 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కీలకమైన సూపర్ టైబ్రేక్‌లో సానియా జంట తడబడి ఓటమి పాలైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement