
న్యూఢిల్లీ: దుబాయ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సానియా మీర్జా (భారత్)–కరోలినా గార్సియా (ఫ్రాన్స్) ద్వయం పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సానియా–గార్సియా జంట 4–6, 2–6తో సాయ్‌సాయ్ జెంగ్ (చైనా)–బార్బరా క్రెజిసికోవా (చెక్ రిపబ్లిక్) జోడీ చేతిలో ఓడిపోయింది. మరోవైపు ఫ్రాన్స్‌లో జరుగుతున్న మార్సెలీ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రోహన్ బోపన్న (భారత్)–షపోవలోవ్ (కెనడా) జంట 5–7, 7–6 (7/3), 8–10తో నీల్సెన్ (డెన్మార్క్)–టిమ్ పుయెట్జ్ (జర్మనీ) జోడీ చేతిలో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment