
పూర్తి వివరాలతో రాలేకపోయారు
ఆసియా గేమ్స్ బిడ్డింగ్‌పై క్రీడా మంత్రి వ్యాఖ్య
న్యూఢిల్లీ: 2019లో జరిగే ఆసియా గేమ్స్ నిర్వహణకు నిర్ణీత గడువులోగా భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) బిడ్డింగ్ దాఖలు చేయలేకపోయింది.
అయితే ఈవిషయంలో ఐఓఏదే పూర్తి వైఫల్యమని కేంద్ర క్రీడా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పేర్కొన్నారు. నిర్వహణ ఏర్పాట్లపై సమగ్ర ప్రతిపాదనలతో వారు తమ దగ్గరకు రాలేకపోయారని తెలిపారు.