అబుదాబి: ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌కు బిస్కట్ రూపంలో ట్రోఫీని రూపొందించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) నవ్వుల పాలైన విషయం తెలిసిందే. తాజాగా న్యూజిలాండ్‌తో యూఏఈ వేదికగా ప్రారంభమైన టెస్ట్ సిరీస్‌కు కూడా వినూత్న రీతిలో ట్రోఫిని రూపొందించింది. టెస్టు సిరీస్ ఆరంభం సందర్భంగా మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ సారథి సర్ఫరాజ్ అహ్మద్, కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌లు ట్రోఫీని ఆవిష్కరించారు. ‘ఓయ్ హోయే’ అనే పదాలతో ట్రోఫీపై వచ్చేలా ఫన్నీగా రూపొందించారు. ప్రస్తుతం ఆ ట్రోఫీ రూపంపై, పీసీబీ తీరుపై నెటిజన్లు సెటైర్ వేస్తున్నారు.
ఇక అభిమానులు పీసీబీని ట్రోల్ చేస్తూ ఓ ఆట ఆడుకున్నారు. పీసీబీకి ట్రోఫీలను ఎవరు తయారు చేయించి ఇస్తున్నారో చారో వారికి శతకోటి దండాలు పెట్టాలని కొందరు కామెంట్ చేస్తుండగా, బోర్డుకు ట్రోఫీలను అందంగా డిజైన్ చేయించడం కూడా రాదా అంటూ మండిపడుతున్నారు. ఇక ఆసీస్‌తో మూడు టీ20ల సిరీస్ సందర్భంగా ఫన్నీగా రూపొందించిన బిస్కట్ ట్రోఫీ పాకిస్తాన్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక కివీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో పాకిస్తాన్ చెలరేగి పోతోంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను పాక్ కైవసం చేసుకోగా, వన్డే సిరీస్ డ్రా అయ్యింది. ఇక మూడు టెస్టుల సిరీస్ నేటి నుంచి ప్రారంభమైంది.
Comments
Please login to add a commentAdd a comment