First Innings
-
స్వయంకృతం!
టీమిండియా చక్కటి అవకాశాన్ని చేజేతులా చెడగొట్టుకుంది. మెల్బోర్న్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఒక దశలో 153/2తో పటిష్ట స్థితిలో నిలిచిన భారత్ 6 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయింది. రెండో రోజును 164/5 వద్ద ముగించి ఫాలోఆన్ ఎదుర్కొనే ప్రమాదంలో పడింది. ఒక్క అనవసర రనౌట్ భారత ఇన్నింగ్స్ గతినే మార్చేసింది. స్మిత్ భారీ సెంచరీకి లోయర్ ఆర్డర్ సహకారం తోడవడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేయగా... ఆసీస్ సారథి కమిన్స్ చూపిన తెగువ మన టాపార్డర్‌లో లోపించింది. ఇక ఈ మ్యాచ్‌లో ఏదైనా ఆశ మిగిలుందంటే అది పంత్, జడేజా క్రీజులో ఉండటమే. మరి ఈ జోడీ మూడో రోజు ఆసీస్ పేసర్లను ఎలా ఎదుర్కుంటుందనే దానిపైనే భారత జట్టు ఆశలు ఆధారపడి ఉన్నాయి. మెల్బోర్న్: బౌలర్ల అసహాయతకు, బ్యాటర్ల నిర్లక్ష్యం తోడవడంతో ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీ నాలుగో టెస్టులో భారత్ కష్టాల్లో పడింది. ప్రత్యర్థి బ్యాటర్లు పరుగుల పండగ చేసుకున్న పిచ్‌పై మనవాళ్లు కనీస ప్రదర్శన కనబర్చలేకపోవడంతో శుక్రవారం ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 46 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (118 బంతుల్లో 82; 11 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకంతో రాణించగా... విరాట్ కోహ్లి (36; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలండ్ రెండేసి వికెట్లు తీశారు. చేతిలో 5 వికెట్లు ఉన్న టీమిండియా... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 310 పరుగులు వెనుకబడి ఉంది. రిషభ్ పంత్ (6 బ్యాటింగ్), రవీంద్ర జడేజా (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఫాలోఆన్ తప్పించుకోవాలంటే రోహిత్ బృందం ఇంకా 111 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 311/6తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆ్రస్టేలియా 122.4 ఓవర్లలో 474 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (197 బంతుల్లో 140; 13 ఫోర్లు, 3 సిక్స్‌లు) భారీ సెంచరీతో కదంతొక్కగా... కమిన్స్ (49; 7 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో బుమ్రా 4, జడేజా 3 వికెట్లు పడగొట్టారు. ఒక్క రనౌట్‌తో... సాఫీగా సాగుతున్న భారత ఇన్నింగ్స్‌లో రనౌట్ చిచ్చు పెట్టింది. చూడచక్కటి షాట్లతో సెంచరీ దిశగా సాగుతున్న జైస్వాల్... బోలండ్ వేసిన ఇన్నింగ్స్ 41వ ఓవర్ చివరి బంతిని మిడాన్ వైపు కొట్టి సింగిల్ కోసం పరిగెత్తాడు. కానీ నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో కోహ్లి స్పందించలేదు. అప్పటికే యశస్వి సగం పిచ్ దాటి వచ్చేశాడు. మిడాన్ వద్ద కమిన్స్ బంతిని అందుకొని కీపర్ కేరీ వైపు విసరడం అతను వికెట్లు గిరాటేయడం జరిగిపోయింది. దాంతో యశస్వి నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. దీంతో యశస్వి–కోహ్లి మూడో వికెట్‌కు 102 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. యశస్వి రనౌట్‌తో ఏకాగ్రత కోల్పోయిన కోహ్లి ఈ సిరీస్‌లో మరోసారి తన బలహీనతను బయట పెట్టుకున్నాడు. బోలండ్ వేసిన ఇన్నింగ్స్ 43వ ఓవర్ తొలి బంతికి కోహ్లి అవుటయ్యాడు.ఆఫ్‌స్టంప్ అవతల వెళుతున్న బంతిని అనవసరంగా ఆడి కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. నైట్ వాచ్‌మన్ ఆకాశ్‌దీప్ (0) కూడా అవుటవ్వడంతో భారత జట్టు సగం వికెట్లు కోల్పోయింది. గత రెండు మ్యాచ్‌ల్లో మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు దిగి విఫలమైన రోహిత్ (3) ఓపెనర్‌గానూ నిరాశ పరచగా... కేఎల్ రాహుల్ (24; 3 ఫోర్లు) కమిన్స్ అద్భుతమైన బంతికి బౌల్డయ్యాడు. స్మిత్ సూపర్ సెంచరీ భారత బౌలింగ్ లోటుపాట్లను సొమ్ముచేసుకున్న స్మిత్ రెండో రోజు ఆసీస్‌కు భారీ స్కోరు సాధించి పెట్టాడు. బుమ్రా మినహా ఇతర బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోతుండటంతో సునాయాసంగా పరుగులు రాబట్టాడు. అతడికి మరో ఎండ్ నుంచి కమిన్స్ చక్కటి సహకారం అందించాడు. ఈ క్రమంలో స్మిత్ 167 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అతడికిది 34వ శతకం. ఏడో వికెట్‌కు 112 పరుగులు జోడించిన అనంతరం కమిన్స్ అవుట్ కాగా... స్టార్క్ (15), లయన్ (13) సాయంతో కీలక పరుగులు జోడించాడు.స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: కోన్స్టాస్ (ఎల్బీ) (బి) జడేజా 60; ఖ్వాజా (సి) రాహుల్ (బి) బుమ్రా 57; లబుషేన్ (సి) కోహ్లి (బి) సుందర్ 72; స్మిత్ (బి) ఆకాశ్‌దీప్ 140; హెడ్ (బి) బుమ్రా 0; మార్ష్ (సి) పంత్ (బి) బుమ్రా 4; కేరీ (సి) పంత్ (బి) ఆకాశ్‌దీప్ 31; కమిన్స్ (సి) నితీశ్ రెడ్డి (బి) జడేజా 49; స్టార్క్ (బి) జడేజా 15; లయన్ (ఎల్బీ) (బి) బుమ్రా 13; బోలండ్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు: 27; మొత్తం (122.4 ఓవర్లలో ఆలౌట్) 474. వికెట్ల పతనం: 1–89, 2–154, 3–237, 4–240, 5–246, 6–299, 7–411, 8–455, 9–455, 10–474. బౌలింగ్: బుమ్రా 28.4–9–99–4; సిరాజ్ 23–3–122–0; ఆకాశ్‌దీప్ 26–8–94–2; జడేజా 23–4–78–3; నితీశ్ రెడ్డి 7–0–21–0; సుందర్ 15–2–49–1. భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (రనౌట్) 82; రోహిత్ (సి) బోలండ్ (సి) కమిన్స్ 3; రాహుల్ (బి) కమిన్స్ 24; కోహ్లి (సి) కేరీ (బి) బోలండ్ 36; ఆకాశ్‌దీప్ (సి) లయన్ (బి) బోలండ్ 0; పంత్ (బ్యాటింగ్) 6; జడేజా (బ్యాటింగ్) 4; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (46 ఓవర్లలో 5 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–8, 2–51, 3–153, 4–154, 5–159. బౌలింగ్: స్టార్క్ 13–0–48–0; కమిన్స్ 13–2–57–2; బోలండ్ 12–3–24–2; లయన్ 5–1–18–0; మార్ష్ 3–0–15–0. కోహ్లిని గేలి చేసిన ఆసీస్ అభిమానులు తొలి రోజు ఆటలో ఆ్రస్టేలియా ఓపెనర్ కోన్స్టాస్ను ఢీకొట్టి జరిమానాకు గురైన కోహ్లికి రెండో రోజు మైదానంలో చేదు అనుభవం ఎదురైంది. విరాట్ ఆడుతున్నంత సేపు గోల చేసిన అభిమానులు... అతడు అవుటై మైదానాన్ని వీడుతున్నప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తున్న కోహ్లి తిరిగివచ్చి ఆసీస్ అభిమానుల వైపు ఆగ్రహంగా చూడగా... భద్రతా అధికారి అతడికి నచ్చజెప్పి తీసుకెళ్లాడు. కోహ్లి భుజం మీద చేయి వేసి... శుక్రవారం ఆటలో ఓ అభిమాని సెక్యూరిటీ వలయం దాటుకొని మైదానంలోకి దూసుకురావడం కలకలం రేపింది. తొలి సెషన్లో టీమిండియా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గ్రౌండ్లోకి వచ్చిన ఆ వ్యక్తి కోహ్లి భుజంపై చేయి వేయడం గమనార్హం. ఇది గుర్తించిన సిబ్బంది అతడిని బలవంతంగా మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు.11 భారత్‌పై అత్యధిక (11) సెంచరీలు చేసిన బ్యాటర్‌గా స్మిత్ రికార్డుల్లోకెక్కాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ (10) రెండో స్థానానికి పడిపోయాడు.1 ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీలో అత్యధిక (10) సెంచరీలు చేసిన బ్యాటర్‌గా స్మిత్ నిలిచాడు. విరాట్ కోహ్లి, సచిన్ టెండూల్కర్ 9 శతకాలతో రెండో స్థానంలో ఉన్నారు. -
‘గులాబీ’ గుచ్చుకుంది!
నాలుగేళ్ల క్రితం తమకు అచ్చిరాని అడిలైడ్ మైదానంలో అదే డే అండ్ నైట్ టెస్టులో మరోసారి గులాబీ బంతిని సమర్థంగా ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు విఫలమయ్యారు. ‘పింక్ బాల్’ స్పెషలిస్ట్ స్టార్క్ పదునైన బంతులతో చెలరేగడంతో రెండు సెషన్లకే భారత బ్యాటర్లు తమ ఇన్నింగ్స్‌ను ముగించారు. ఒక్క నితీశ్ కుమార్ రెడ్డి మాత్రమే తన దూకుడుతో ఆకట్టుకోగలిగాడు. గత టెస్టులో కుప్పకూలిన ఆస్ట్రేలియా టాపార్డర్ ఇప్పుడు కాస్త పట్టుదల కనబర్చడంతో తొలి రోజు ఆధిపత్యం ఆతిథ్య జట్టు ఖాతాలో చేరింది. పెర్త్ టెస్టు తరహాలోనే మన బౌలర్లు ప్రత్యర్థిని పడగొడతారా లేక రెండో రోజు బలమైన బ్యాటింగ్‌తో ఆ్రస్టేలియా పటిష్ట స్థితికి చేరుతుందా చూడాలి. అడిలైడ్: ఆ్రస్టేలియాతో రెండో టెస్టులో భారత బ్యాటింగ్ తడబడింది. గత మ్యాచ్ తరహాలోనే తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే పరిమితమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 44.1 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. నితీశ్ కుమార్ రెడ్డి (54 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా... రాహుల్ (64 బంతుల్లో 37; 6 ఫోర్లు), గిల్ (51 బంతుల్లో 31; 5 ఫోర్లు) కీలక పరుగులు సాధించారు.మిచెల్ స్టార్క్ (6/48) తన కెరీర్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనతో భారత్‌ను దెబ్బ కొట్టాడు. అనంతరం ఆ్రస్టేలియా ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ నష్టపోయి 33 ఓవర్లలో 86 పరుగులు చేసింది. మెక్‌స్వీనీ (38 బ్యాటింగ్; 6 ఫోర్లు), లబుషేన్ (20 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. భారత తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఆ్రస్టేలియా మరో 94 పరుగులు వెనుకబడి ఉంది. ఈ ఆసక్తికర పోరుకు తొలి రోజు రికార్డు స్థాయిలో 50,186 మంది ప్రేక్షకులు హాజరు కావడం విశేషం. పదేళ్ల క్రితం మైదానంలో గాయపడి మృతి చెందిన ఫిల్ హ్యూస్, ఇటీవల కన్నుమూసిన మాజీ ఆటగాడు ఇయాన్ రెడ్‌పాత్ స్మృతిలో ఆసీస్ ఆటగాళ్లు భుజాలకు నలుపు రంగు బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు. కీలక భాగస్వామ్యం... భారత ఇన్నింగ్స్ అనూహ్య రీతిలో మొదలైంది. మ్యాచ్ తొలి బంతికి యశస్వి జైస్వాల్ (0)ను అవుట్ చేసి స్టార్క్ దెబ్బ కొట్టాడు. 140.4 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన బంతికి జైస్వాల్ వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత గిల్ ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేయగా, రాహుల్ కాస్త జాగ్రత్త ప్రదర్శించాడు. బోలండ్ తొలి ఓవర్లో రాహుల్ కొంత ఉత్కంఠను ఎదుర్కొన్నాడు. తొలి బంతికి అతను కీపర్‌కు క్యాచ్ ఇవ్వగా అది ‘నోబాల్’ అయింది.అయితే ఆ తర్వాత రీప్లేలో బంతి బ్యాట్‌కు తాకలేదని కూడా తేలింది. అదే ఓవర్లో రాహుల్ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను ఖ్వాజా వదిలేశాడు. అయితే కొద్ది సేపటి తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. 12 పరుగుల వ్యవధిలో భారత్ 3 కీలక వికెట్లు కోల్పోయింది. రాహుల్, కోహ్లి (7)లను స్టార్క్ అవుట్ చేయగా... గిల్ వికెట్ బోలండ్ ఖాతాలో చేరడంతో తొలి సెషన్ ముగిసేసరికి స్కోరు 82/4కు చేరింది. బ్రేక్ తర్వాత కూడా పరిస్థితి మారలేదు. ఆరో స్థానంలో ఆడిన రోహిత్ శర్మ (3) విఫలం కాగా... రిషభ్ పంత్ (21; 2 ఫోర్లు), అశ్విన్ (22; 3 ఫోర్లు) ఎక్కువ సేపు నిలవలేకపోయారు. హర్షిత్ రాణా (0)ను అవుట్ చేసి స్టార్క్ ఐదో వికెట్‌ను తన ఖాతాలో వేసుకోగా, స్టార్క్ బౌలింగ్‌లోనే భారీ షాట్ ఆడే క్రమంలో నితీశ్ చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. రెండో సెషన్లో భారత్ 21.1 ఓవర్లలో 98 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. వికెట్ కాపాడుకుంటూ... తొలి టెస్టులో ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి ఓటమికి బాటలు పడటంతో ఈసారి ఆసీస్ ఓపెనర్లు జాగ్రత్తగా ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. అయితే 2 పరుగుల వద్ద మెక్‌స్వీనీ ఇచ్చిన క్యాచ్‌ను పంత్ వదిలేయం కూడా కలిసొచ్చి0ది. పంత్ అడ్డుగా రాకపోతే బంతి నేరుగా రోహిత్ చేతుల్లోకి వెళ్లేది! తొలి 10 ఓవర్లలో ఆసీస్ వికెట్ కోల్పోలేదు. అయితే బుమ్రా వేసిన తర్వాతి ఓవర్లో ఉస్మాన్ ఖ్వాజా (13; 2 ఫోర్లు) పెవిలియన్ చేరాడు. వరుస వైఫల్యాలతో జట్టులో స్థానం కోల్పోయే స్థితిలో క్రీజ్‌లోకి వచ్చిన లబుషేన్ ఈ సారి కూడా ఆరంభంలో బాగా తడబడ్డాడు. ఎట్టకేలకు 19వ బంతికి అతను ఖాతా తెరిచాడు. మరోవైపు క్రీజులో నిలదొక్కుకున్న తర్వాత మెక్‌స్వీనీ కొన్ని చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. 22 ఓవర్ల పాటు ఈ జోడీని విడదీయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (ఎల్బీ) (బి) స్టార్క్ 0; రాహుల్ (సి) మెక్‌స్వీనీ (బి) స్టార్క్ 37; గిల్ (ఎల్బీ) (బి) బోలండ్ 31; కోహ్లి (సి) స్మిత్ (బి) స్టార్క్ 7; పంత్ (సి) లబుõÙన్ (బి) కమిన్స్ 21; రోహిత్ (ఎల్బీ) (బి) బోలండ్ 3; నితీశ్ కుమార్ రెడ్డి (సి) హెడ్ (బి) స్టార్క్ 42; అశ్విన్ (ఎల్బీ) (బి) స్టార్క్ 22; హర్షిత్ (బి) స్టార్క్ 0; బుమ్రా (సి) ఖ్వాజా (బి) కమిన్స్ 0; సిరాజ్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (44.1 ఓవర్లలో ఆలౌట్) 180. వికెట్ల పతనం: 1–0, 2–69, 3–77, 4–81, 5–87, 6–109, 7–141, 8–141, 9–176, 10–180. బౌలింగ్: స్టార్క్ 14.1–2–48–6, కమిన్స్ 12–4– 41–2, బోలండ్ 13–0–54–2, లయన్ 1–0–6– 0, మార్‡్ష 4–0–26–0. ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: ఖ్వాజా (సి) రోహిత్ (బి) బుమ్రా 13; మెక్‌స్వీనీ (బ్యాటింగ్) 38; లబుషేన్ (బ్యాటింగ్) 20; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (33 ఓవర్లలో వికెట్ నష్టానికి) 86. వికెట్ల పతనం: 1–24. బౌలింగ్: బుమ్రా 11–4–13–1, సిరాజ్ 10–3–29–0, హర్షిత్ 8–2–18–0, నితీశ్ 3–1–12–0, అశ్విన్ 1–1–0–0.3 ఆసీస్ ఓపెనర్ ఖ్వాజాను అవుట్ చేయడంతో బుమ్రా ఈ ఏడాది టెస్టుల్లో 50 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఒకే ఏడాది 50 అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన మూడో భారతీయ పేసర్‌గా బుమ్రా గుర్తింపు పొందాడు. గతంలో కపిల్ దేవ్ రెండుసార్లు (1983లో 18 టెస్టుల్లో 75 వికెట్లు; 1979లో 17 టెస్టుల్లో 74 వికెట్లు), జహీర్ ఖాన్ (2002లో 15 టెస్టుల్లో 51 వికెట్లు) ఒకసారి ఈ ఘనత సాధించారు. నితీశ్... తగ్గేదేలే పెర్త్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత టాప్ స్కోరర్‌గా నిలిచిన ఆంధ్ర కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్‌లోనూ దానిని పునరావృతం చేశాడు. ఈసారి బ్యాటింగ్ ఆర్డర్లో ఏడో స్థానంలో బరిలోకి దిగిన అతని ఆట వల్లే భారత్ ఈమాత్రం స్కోరు చేయగలిగింది. భారత్ ఇన్నింగ్స్‌లో 3 సిక్స్‌లూ అతని ద్వారానే వచ్చాయి. స్టార్క్ బౌలింగ్‌లో ఎక్స్ట్రా కవర్ మీదుగా అద్భుత సిక్స్ కొట్టిన అతను... బోలండ్ ఓవర్లో 2 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో ధాటిని ప్రదర్శించాడు. ఇందులో స్లిప్ కార్డన్ మీదుగా ‘రివర్స్ స్కూప్’తో అతను కొట్టిన సిక్సర్ ఆట మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా గడ్డపై పేసర్ల బౌలింగ్‌లో అత్యధిక (5) సిక్స్‌లు కొట్టిన భారత బ్యాటర్‌గా తన రెండో టెస్టులోనే నితీశ్ గుర్తింపు సాధించడం విశేషం. -
ఆధిక్యం కోల్పోయిన హైదరాబాద్
జైపూర్: పసలేని బౌలింగ్.. ఫీల్డర్ల తడబాటు.. వెరసి దేశవాళీ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీలో రాజస్తాన్‌తో మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం చేజారింది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా జరుగుతున్న పోరులో మహిపాల్ లొమ్రోర్ (150 బంతుల్లో 111; 12 ఫోర్లు, 5 సిక్సర్లు), శుభమ్ గర్వాల్ (107 బంతుల్లో 108; 8 ఫోర్లు, 9 సిక్సర్లు) సెంచరీలు బాదడంతో రాజస్తాన్ జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 117/1తో శుక్రవారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన రాజస్తాన్ చివరకు 108.2 ఓవర్లలో 425 పరుగులకు ఆలౌటైంది.ఐపీఎల్లో మంచి ఇన్నింగ్స్‌లతో గుర్తింపు తెచ్చుకున్న మహిపాల్ లొమ్రోర్ చక్కటి శతకం నమోదు చేసుకోగా.. శుభమ్ గర్వాల్ విధ్వంసం సృష్టించాడు. హైదరాబాద్ బౌలర్ల భరతం పడుతూ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. జుబైర్ అలీ (57; 7 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. కెప్టెన్ దీపక్ హుడా (1), వికెట్ కీపర్ కునాల్ సింగ్ రాథోడ్ (9), దీపక్ చహర్ (5) విఫలమయ్యారు. ఆఖర్లో అరాఫత్ ఖాన్ (32; 4 ఫోర్లు, ఒక సిక్సర్) విలువైన ఇన్నింగ్స్ ఆడి రాజస్తాన్ జట్టుకు 15 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించి పెట్టాడు.హైదరాబాద్ బౌలర్లలో తనయ్ త్యాగరాజన్ 3.. చామా మిలింద్, రోహిత్ రాయుడు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిరత్ రెడ్డి (28 బ్యాటింగ్; 4 ఫోర్లు), తన్మయ్ అగర్వాల్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. నేడు ఆటకు ఆఖరి రోజు కాగా.. చేతిలో 10 వికెట్లు ఉన్న హైదరాబాద్ ఓవరాల్‌గా 21 పరుగుల ఆధిక్యంలో ఉంది. మ్యాచ్ ‘డ్రా’గా ముగిస్తే తొలి ఆధిక్యం సాధించినందుకు రాజస్తాన్‌కు 3 పాయింట్లు, హైదరాబాద్‌కు ఒక పాయింట్ లభిస్తుంది. స్కోరు వివరాలుహైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: 410; రాజస్తాన్ తొలి ఇన్నింగ్స్: అభిజిత్ తోమర్ (బి) తనయ్ త్యాగరాజన్ 60; రామ్ చౌహాన్ (సి) రాహుల్ రాదేశ్ (బి) అజయ్‌దేవ్ గౌడ్ 11; మహిపాల్ లొమ్రోర్ (సి) రాహుల్ రాదేశ్ (బి) రక్షణ్ రెడ్డి 111; దీపక్ హుడా (సి) రాహుల్ రాదేశ్ (బి) చామా మిలింద్ 1; జుబైర్ అలీ (ఎల్బీ) (బి) తనయ్ త్యాగరాజన్ 57; శుభమ్ గర్వాల్ (సి) రాహుల్ సింగ్ (బి) చామా మిలింద్ 108; కునాల్ సింగ్ రాథోడ్ (ఎల్బీ) (బి) రోహిత్ రాయుడు 9; దీపక్ చహర్ (ఎల్బీ) (బి) రోహిత్ రాయుడు 5; అజయ్ సింగ్ (బి) తనయ్ త్యాగరాజన్ 13; అరాఫత్ ఖాన్ (సి) హిమతేజ (బి) అనికేత్ రెడ్డి 32; అనికేత్ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 9, మొత్తం (108.2 ఓవర్లలో ఆలౌట్) 425.వికెట్ల పతనం: 1–27, 2–150, 3–169, 4–216, 5–285, 6–302, 7–334, 8–374, 9–405, 10–425. బౌలింగ్: చామా మిలింద్ 19–3–73–2, రక్షణ్ రెడ్డి 18–5–36–1, అజయ్‌దేవ్ గౌడ్ 15–1–65–1; తనయ్ త్యాగరాజన్ 25–2–104–3; రోహిత్ రాయుడు 18–5–65–2; అనికేత్ రెడ్డి 13.2–2–75–1.హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (బ్యాటింగ్) 8; అభిరత్ రెడ్డి (బ్యాటింగ్) 28; మొత్తం (7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 36. బౌలింగ్: దీపక్ చహర్ 2–0–11–0, అజయ్ సింగ్ 3–0–14–0, దీపక్ హుడా 1–0–6–0, మహిపాల్ లొమ్రోర్ 1–0–5–0.