ranji
-
ఆంధ్ర లక్ష్యం 321
సాక్షి, విజయనగరం: రంజీ ట్రోఫీలో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఆంధ్ర జట్టు... ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌లోనూ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన ఆంధ్ర జట్టు... నాలుగో మ్యాచ్‌లోనూ పరాజయం దిశగా సాగుతోంది. ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో 321 పరుగుల లక్ష్యఛేదనలో ఆంధ్ర జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 4.1 ఓవర్లలో వికెట్ నష్టపోయి 8 పరుగులు చేసింది.ఓపెనర్ అభిషేక్ రెడ్డి (6) అవుట్ కాగా... హేమంత్ రెడ్డి (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. చేతిలో 9 వికెట్లు ఉన్న ఆంధ్ర జట్టు విజయానికి 313 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 92/4తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర జట్టు 56.3 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. హనుమ విహారి (91 బంతుల్లో; 43; 6 ఫోర్లు) ఒక్కడే ఫర్వాలేదనిపించగా.. మిగిలిన వాళ్లు విఫలమయ్యారు.అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఉత్తరాఖండ్ 49 ఓవర్లలో 128/9 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. స్వప్నిల్ సింగ్ (39; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. కెపె్టన్ రవికుమార్ సమర్థ్ (1), అఖిల్ రావత్ (0), ప్రియాన్షు ఖండూరి (4), యువరాజ్ (13), ఆదిత్య తారె (10) విఫలమయ్యారు. ఆంధ్ర బౌలర్లలో చీపురుపల్లి స్టీఫెన్, కేవీ శశికాంత్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. -
ఆధిక్యం కోల్పోయిన హైదరాబాద్
జైపూర్: పసలేని బౌలింగ్.. ఫీల్డర్ల తడబాటు.. వెరసి దేశవాళీ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీలో రాజస్తాన్‌తో మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం చేజారింది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా జరుగుతున్న పోరులో మహిపాల్ లొమ్రోర్ (150 బంతుల్లో 111; 12 ఫోర్లు, 5 సిక్సర్లు), శుభమ్ గర్వాల్ (107 బంతుల్లో 108; 8 ఫోర్లు, 9 సిక్సర్లు) సెంచరీలు బాదడంతో రాజస్తాన్ జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 117/1తో శుక్రవారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన రాజస్తాన్ చివరకు 108.2 ఓవర్లలో 425 పరుగులకు ఆలౌటైంది.ఐపీఎల్లో మంచి ఇన్నింగ్స్‌లతో గుర్తింపు తెచ్చుకున్న మహిపాల్ లొమ్రోర్ చక్కటి శతకం నమోదు చేసుకోగా.. శుభమ్ గర్వాల్ విధ్వంసం సృష్టించాడు. హైదరాబాద్ బౌలర్ల భరతం పడుతూ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. జుబైర్ అలీ (57; 7 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. కెప్టెన్ దీపక్ హుడా (1), వికెట్ కీపర్ కునాల్ సింగ్ రాథోడ్ (9), దీపక్ చహర్ (5) విఫలమయ్యారు. ఆఖర్లో అరాఫత్ ఖాన్ (32; 4 ఫోర్లు, ఒక సిక్సర్) విలువైన ఇన్నింగ్స్ ఆడి రాజస్తాన్ జట్టుకు 15 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించి పెట్టాడు.హైదరాబాద్ బౌలర్లలో తనయ్ త్యాగరాజన్ 3.. చామా మిలింద్, రోహిత్ రాయుడు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిరత్ రెడ్డి (28 బ్యాటింగ్; 4 ఫోర్లు), తన్మయ్ అగర్వాల్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. నేడు ఆటకు ఆఖరి రోజు కాగా.. చేతిలో 10 వికెట్లు ఉన్న హైదరాబాద్ ఓవరాల్‌గా 21 పరుగుల ఆధిక్యంలో ఉంది. మ్యాచ్ ‘డ్రా’గా ముగిస్తే తొలి ఆధిక్యం సాధించినందుకు రాజస్తాన్‌కు 3 పాయింట్లు, హైదరాబాద్‌కు ఒక పాయింట్ లభిస్తుంది. స్కోరు వివరాలుహైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: 410; రాజస్తాన్ తొలి ఇన్నింగ్స్: అభిజిత్ తోమర్ (బి) తనయ్ త్యాగరాజన్ 60; రామ్ చౌహాన్ (సి) రాహుల్ రాదేశ్ (బి) అజయ్‌దేవ్ గౌడ్ 11; మహిపాల్ లొమ్రోర్ (సి) రాహుల్ రాదేశ్ (బి) రక్షణ్ రెడ్డి 111; దీపక్ హుడా (సి) రాహుల్ రాదేశ్ (బి) చామా మిలింద్ 1; జుబైర్ అలీ (ఎల్బీ) (బి) తనయ్ త్యాగరాజన్ 57; శుభమ్ గర్వాల్ (సి) రాహుల్ సింగ్ (బి) చామా మిలింద్ 108; కునాల్ సింగ్ రాథోడ్ (ఎల్బీ) (బి) రోహిత్ రాయుడు 9; దీపక్ చహర్ (ఎల్బీ) (బి) రోహిత్ రాయుడు 5; అజయ్ సింగ్ (బి) తనయ్ త్యాగరాజన్ 13; అరాఫత్ ఖాన్ (సి) హిమతేజ (బి) అనికేత్ రెడ్డి 32; అనికేత్ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 9, మొత్తం (108.2 ఓవర్లలో ఆలౌట్) 425.వికెట్ల పతనం: 1–27, 2–150, 3–169, 4–216, 5–285, 6–302, 7–334, 8–374, 9–405, 10–425. బౌలింగ్: చామా మిలింద్ 19–3–73–2, రక్షణ్ రెడ్డి 18–5–36–1, అజయ్‌దేవ్ గౌడ్ 15–1–65–1; తనయ్ త్యాగరాజన్ 25–2–104–3; రోహిత్ రాయుడు 18–5–65–2; అనికేత్ రెడ్డి 13.2–2–75–1.హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (బ్యాటింగ్) 8; అభిరత్ రెడ్డి (బ్యాటింగ్) 28; మొత్తం (7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 36. బౌలింగ్: దీపక్ చహర్ 2–0–11–0, అజయ్ సింగ్ 3–0–14–0, దీపక్ హుడా 1–0–6–0, మహిపాల్ లొమ్రోర్ 1–0–5–0. -
12th ఫెయిల్ డైరక్టర్ కొడుకు ప్రపంచ రికార్డ్..!
-
ఐదేళ్ల తర్వాత సాధించారు
లక్నో: ఎట్టకేలకు హైదరాబాద్ జట్టు రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్‌కు అర్హత సాధించింది. ఆంధ్ర జట్టుతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌ను డ్రా చేసుకున్న బద్రీనాథ్ బృందం గ్రూప్ ‘సి’లో టాపర్‌గా నిలిచింది. తద్వారా ఈ సీజన్లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించిన హైదరాబాద్ జట్టు వచ్చే ఏడాది మేటి జట్లతో తలపడే అవకాశాన్ని పొందింది. ఐదేళ్ల తర్వాత మన జట్టు ‘ఎలైట్’ ఇన్నింగ్స ఆడనుంది. గతంలో 2011లో చివరిసారిగా హైదరాబాద్ జట్టు ఎలైట్‌లో ఆడింది. మంచుకురిసే వేళలో...: రెండో రోజులాగే శనివారం చివరి రోజు కూడా లంచ్ విరామం తర్వాత... చాలా ఆలస్యంగా ఆట మొదలైంది. పొద్దుపోయాక కూడా ఎంతకీ తెరిపినివ్వని పొగమంచు ఆటకు అంతరాయం కలిగించింది. దీంతో తొలి సెషన్ అంతా మంచుదుప్పటిలో తుడిచిపెట్టుకుపోయింది. తర్వాత కేవలం 40 ఓవర్ల ఆటే సాగింది. చివరకు డ్రా ఫలితంతో ఆంధ్ర జట్టు 3, హైదరాబాద్ ఒక పాయింట్ పొందాయి. దీంతో హైదరాబాద్ 31 పారుుంట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మళ్లీ తడబాటు...: నాలుగో రోజు 219 పరుగుల లక్ష్యంతో 13/1 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స కొనసాగించిన హైదరాబాద్ మ్యాచ్ ముగిసే సమయానికి 47 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. టాప్ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మళ్లీ రెండో ఇన్నింగ్సలోనూ తడబడ్డారు. ఆట మొదలైన తొలి ఓవర్లోనే అనిరుధ్ (2) శివకుమార్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డయ్యాడు. దీంతో ఓవర్‌నైట్ స్కోరు వద్దే రెండో వికెట్‌ను కోల్పోయింది. తర్వాత ఓపెనర్ అక్షత్ రెడ్డి (5), బావనక సందీప్ (13) జతరుునప్పటికీ... వీరిద్దరూ ఎక్కువసేపు నిలువలేకపోయారు. అనంతరం వచ్చిన హిమాలయ్ అగర్వాల్ (0) కూడా చేతులెత్తేయడంతో హైదరాబాద్ 36 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోరుు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ బద్రీనాథ్ (14 నాటౌట్), కొల్లా సుమంత్ (10 నాటౌట్) మరో వికెట్ పడకుండా 20 ఓవర్లపాటు జాగ్రత్తగా ఆడారు. మ్యాచ్ నిలిచే సమయానికి నాటౌట్‌గా నిలిచారు. ఆంధ్ర బౌలర్లలో విజయ్ కుమార్ 2, భార్గవ్ భట్, శివకుమార్ చెరో వికెట్ తీశారు. స్కోరు వివరాలు ఆంధ్ర తొలి ఇన్నింగ్స: 190; హైదరాబాద్ తొలి ఇన్నింగ్స: 143; ఆంధ్ర రెండో ఇన్నింగ్స: 171/6 డిక్లేర్డ్ హైదరాబాద్ రెండో ఇన్నింగ్స: తన్మయ్ రనౌట్ 9; అక్షత్ రెడ్డి (సి) భార్గవ్ (బి) విజయ్ కుమార్ 5; అనిరుధ్ (బి) శివకుమార్ 2; సందీప్ (సి) ప్రణీత్ (బి) భార్గవ్ 13; బద్రీనాథ్ నాటౌట్ 14; హిమాలయ్ (సి) భరత్ (బి) విజయ్ కుమార్ 0; సుమంత్ నాటౌట్ 10; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (47 ఓవర్లలో 5 వికెట్లకు) 56. వికెట్ల పతనం: 1-9, 2-13, 3-28, 4-30, 5-36. బౌలింగ్: విజయ్ కుమార్ 19-12-13-2, స్టీఫెన్ 6-3-10-0, భార్గవ్ భట్ 14-3-21-1, శివకుమార్ 7-3-12-1, రవితేజ 1-1-0-0. -
42 ఫోర్లు.. 9 సిక్సర్లు!
ముంబై: దేశవాళీ ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో భాగంగా ఇక్కడ మహారాష్ట్రతో జరిగిన రంజీ మ్యాచ్‌లో మరో సంచలన ఇన్నింగ్స్ నమోదైంది. ఢిల్లీ ఆటగాడు రిషబ్ పంత్ (308: 326 బంతుల్లో 42 ఫోర్లు, 9 సిక్సర్లు) విజృంభించి ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఢిల్లీ తన తొలి ఇన్నింగ్స్ లో భాగంగా ఐదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన రిషబ్ రెచ్చిపోయాడు. మంచి బంతులను సమర్ధవంతంగా ఎదుర్కొంటునే, చెత్త బంతులను మాత్రం బౌండరీలు దాటించాడు. కాగా, అంతకుముందు ఇదే మ్యాచ్ లో మహారాష్ట్ర ఆటగాళ్లు స్వప్నిల్ గుగలే(351నాటౌట్), అంకిత్ బావ్నే(258నాటౌట్) మూడో వికెట్‌కు అభేద్యంగా 594 పరుగులు జోడించి దేశవాళీ రికార్డులను తిరగరాసిన సంగతి తెలిసిందే. తద్వారా తొలిసారి ఒకే రంజీ మ్యాచ్ లోముగ్గురు 250కు పైగా వ్యక్తిగత పరుగులను నమోదు చేసిన మరో రికార్డు లిఖించబడింది. చివరిరోజు ఆటలో భాగంగా 155 పరుగులతో ఓవర్ నైట్ బ్యాట్స్‌మన్ గా క్రీజ్ లోకి వచ్చిన రిషబ్ దూకుడుగా ఆడి ట్రిపుల్ ను సాధించాడు. ఈ క్రమంలోనే రెండొందలకు పైగా పరుగులను ఫోర్లు, సిక్సర్లతోనే సాధించి ఢిల్లీని పటిష్ట స్థితికి తీసుకెళ్లాడు. దాంతో ఢిల్లీ తొలి ఇన్నింగ్స్ లో 590 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్ ను 635/2 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ ఇన్నింగ్స్ తరువాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన మహారాష్ట్ర ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 58 పరుగులు చేసింది. దాంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. -
ఆంధ్రకు ఇన్నింగ్స్ ఓటమి
ఇండోర్: రంజీ ట్రోఫీలో భాగంగా ఇక్కడ మధ్యప్రదేశ్ తో జరిగిన గ్రూప్ -బి లీగ్ మ్యాచ్ లో ఆంధ్ర ఇన్నింగ్స్ తొమ్మిది పరుగుల తేడాతో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. 159/5 ఓవర్ నైట్ స్కోరుతో గురువారం తన రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర 78.3 ఓవర్లలో 214 పరుగులకు చాపచుట్టేసి ఘోర పరాజయాన్ని చవిచూసింది. తొలి ఇన్నింగ్స్ లో 56 పరుగులు మాత్రమే చేసి ఫాలో ఆన్ ఆడిన ఆంధ్రను మధ్య ప్రదేశ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ అంకిత్ శర్మ ఏడు వికెట్లతో వెన్నువిరిచాడు. తొలి ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు తీసిన అంకిత్ అదే ఊపును రెండో ఇన్నింగ్స్ లో కూడా కొనసాగించి ఆంధ్ర పతనాన్ని శాసించాడు. ఆంధ్ర ఆటగాళ్లలో ప్రశాంత్(49), కెప్టెన్ మహ్మద్ కైఫ్(51), ప్రదీప్(62)లు ఆకట్టుకున్నా జట్టును ఓటమిని తప్పించలేకపోయారు. బుధవారం రెండో రోజు ఆటలోనే ఆంధ్ర పదిహేను వికెట్లను కోల్పోవడంతో మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసింది. ఈ తాజా విజయంతో మధ్య ప్రదేశ్ క్వార్టర్ ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ 279 ఆలౌట్ ఆంధ్ర తొలి ఇన్నింగ్స్ 56 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 214 ఆలౌట్