
నేనేమైనా ప్రభుత్వాలు కూల్చానా?
విజయవాడ: మహిళా సదస్సును మహానాడులా నిర్వహించారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. మహిళా సాధికారతను సీఎం చంద్రబాబు కిట్టీ పార్టీలా మార్చేశారని మండిపడ్డారు. మంగళవారం ఉదయం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... మహిళా సదస్సు జరిగిన తీరును జాతీయ మీడియా ఏకిపారేసిందని చెప్పారు. భజనపరులనే సదస్సును అనుమతించారని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు పాలన హిట్లర్ ను తలపిస్తోందని వాపోయారు. మహిళా సదస్సుకు తనను ఆహ్వానించి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగి అవమానంపై న్యాయపోరాటం చేస్తానని ప్రకటించారు. చంద్రబాబు రాక్షస పాలనపై పోరాటం చేయాలని మహిళలకు పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే రోజా ఇంకేం మాట్లాడారంటే...
- పోలీసులను చంద్రబాబు బౌన్సర్లుగా వాడుకుంటున్నారు
- పోలీసులను అడ్డుపెట్టుకుని మమ్మల్ని అణగతొక్కుతున్నారు
- మహిళా సదస్సు సాక్షిగా నాకు అవమానం జరిగింది
- స్సీకర్ పంపిన ఆహ్వానం మేరకు సదస్సుకు వచ్చిన నన్ను అక్రమంగా నిర్బంధించారు
- మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా నిర్బంధించిన తీరును చూసి దేశం నివ్వెరపోయింది
- మహిళా ఎమ్మెల్యేల పట్ల వ్యవహరించే తీరు ఇదేనా?
- వెంకయ్య కూతురు, కేసీఆర్ కూతురు, చంద్రబాబు కోడలు.. వీళ్లకే ప్రాధాన్యత ఇచ్చారు
- కార్పొరేట్ మహిళా సదస్సా, కామన్ మహిళా సదస్సా
- స్పీకర్ రెండు ఇన్విటేషన్లు పంపితేనే వచ్చాను
- మహిళా సమస్యలపై మాట్లాడే హక్కు నాకు లేదా?
- నేను ఈ రాష్ట్రంలో పుట్టలేదా? నాకు ఇక్కడ ఇళ్లు లేవా?
- మీకు నచ్చకపోతే వేరే రాష్ట్రంలో వదిలేస్తారా?
- ఇక్కడ ఉండే హక్కు మాకు లేదా?
- డీజీపీ కనుసన్నల్లో ఇలాంటి దారుణం జరగడం బాధాకరం
- చట్టప్రకారం నడుచుకోవాల్సిన డీజీపీ ఇలా చేయడం బాధాకరం
- చంద్రబాబుకు బానిసలా డీజీపీ పనిచేయడం దురదృష్టకరం
- డీజీపీ చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తే ప్రజల దృష్టిలో విలన్ గా ఉండిపోయే అవకాశముంది
- కుంటిసాకులతో నన్ను నిర్బంధించిన విధానం చాలా తప్పు
- నా ట్రాక్ రికార్డు చూసి నిర్బంధించమని చెప్పానని చంద్రబాబు అంటున్నారు
- పదేళ్లు టీడీపీలో ఉన్నప్పుడు ట్రాక్ రికార్డు గుర్తుకురాలేదా?
- ఏదైనా ప్రభుత్వాలు కూల్చిన ట్రాక్ రికార్డు ఉందా?
- నా ఇంట్లో బాంబులు పేలిన ట్రాక్ రికార్డు ఉందా?
- ఇంట్లోకి వారిపై కాల్పులు జరిపిన ట్రాక్ రికార్డు ఉందా?
- ఏ ట్రాక్ రికార్డు చూసి నన్ను నిర్బంధించమని డీజీపీకి చెప్పారు
- నాకు జరిగిన అవమానాలపై న్యాయం పోరాటం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది
- తమకు జరిగిన అన్యాయాలపై సామాన్య మహిళలు తిరబడాలన్నఉద్దేశంతో న్యాయపోరాటానికి సిద్ధపడ్డాను
- బాబు హయాంలో 11 శాతం నేరాలు పెరిగాయని పోలీసు రికార్డులే చెబుతున్నాయి
- చంద్రబాబు, డీజీపీ ఉన్న విజయవాడలోనే 70 రేప్ లు జరిగాయి
- కర్నూలులో మహిళపై టీడీపీ నేతలు గ్యాంగ్ రేప్ చేస్తే డీజీపీ ఎందుకు చర్యలు తీసుకోలేదు?
- బాధిత మహిళ డీజీపీ కార్యాలయం చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు
- మహిళా సమస్యలపై పోరాటం చేయకపోతే ఎమ్మెల్యేగా ఉండడమే నేను వేస్ట్
- మహిళల కోసం అడుగడుగునా పోరాటం చేయడం వల్లే నాపై కక్ష సాధిస్తున్నారు
- మహిళల పోరాటానికి జగనన్న అండగా ఉంటాడు
- మహిళకు హోం మంత్రి ఇచ్చిన నాయకుడు వైఎస్ఆర్
- మహిళలకు ఐదు ఎంపీ సీట్లు ఇచ్చిన మహిళాపక్షపాతి జగనన్నను చూశాం
- చంద్రబాబు రావణసుర పాలనపై అందరూ పోరాటం చేయాలి
సంబంధిత కథనాలు ఇక్కడ చదవండి..
నిస్సిగ్గుగా అరాచకం
నన్ను.. చంపేస్తారేమో
ప్రతిపక్షంపై నిర్బంధాలేమిటి?