women parliament
-
సవాళ్లెన్ని ఎదురైనా..
సవాళ్లెన్ని ఎదురైనా.. మహిళా సాధికారతకు గొప్ప ప్రోత్సాహమిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ఆమోదం పొందడంతో భారత ప్రజాస్వామిక చరిత్రలో నూతన శకానికి నాంది పలికినట్లు అయ్యింది. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లోని సీట్లలో మహిళలకు 33 శాతం కోటాను ఈ బిల్లు కేటాయించింది. ఇది అమల్లోకి రాగానే లోక్‌సభలో మహిళా ఎంపీల సంఖ్య 82 నుంచి 181కి పెరుగుతుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావల్ చెప్పారు. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అనేక సంవత్సరాలుగా దేశంలో రాజకీయ చర్చకు కేంద్రంగా ఉంది. ఈ బిల్లును 1996లో ప్రవేశపెట్టినప్పటికీ, పలు రాజకీయ అవరోధాల కారణంగా ఇది ఆమోదం పొందలేదు. ఇప్పుడు పార్లమెంటులో మహిళలకు 15 శాతం లోపే ప్రాతినిధ్యం ఉంది. దేశ జనాభాలో దాదాపు సగంమంది మహిళలు ఉన్నప్పటికీ, వారి రాజకీయ భాగస్వామ్యం తగినంతగా లేదు. మహిళల గణనీయమైన భాగస్వామ్యంతో కూడిన పార్లమెంట్... భారత ప్రజల విభిన్న అవసరాలను, ఆందోళనలను మరింత మెరుగ్గా పరిష్కరించగలదు. పైగా, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మహిళల రాజకీయ సాధికారత మరింతగా అవసరం అవుతోంది. ఈ రిజర్వేషన్ నిజానికి మహిళలకు సాధికారత కల్పించకపోవచ్చని వ్యతిరేకులు వాదిస్తున్నారు. పురుష రాజకీయ నాయకులు తమ మహిళా బంధువులను తమ తరఫున ఉపయోగించుకుంటారనేది ఒక వాదన. ప్రత్యేక నేపథ్యం ఉన్న మహిళలకు మాత్రమే ఇది ప్రయోజనం చేకూరుస్తూ సామాజిక అసమానతలను పెంచుతుందని విమర్శకులు వాదిస్తుంటారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా మరొక వాదన ఏమిటంటే, కోటాను అమలు చేయాలంటే చాలామంది పురుషులు తమ సీట్లను వదులుకోవలసి ఉంటుందనేది! ఇలాంటి సవాళ్లు ఉన్నప్పటికీ, పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ ప్రయోజనాలు గణనీయంగా ఉన్నాయి. రాజకీయాల్లో ఉన్న మహిళలు విద్య, ఆరోగ్యం, సామాజిక న్యాయం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తారని ప్రపంచవ్యాప్తంగా పలు పరి శోధనలు చెబుతున్నాయి. పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడం వల్ల ఈ సంక్లిష్టమైన రంగా లకు మరిన్ని వనరులను కేటాయించవచ్చు. పైగా, మహిళా రిజర్వేషన్ ఇతర రంగాలలో లింగ సమా నత్వానికి శక్తిమంతమైన ఉదాహరణగా నిలుస్తుంది. ఇది సాంప్రదాయికమైన జెండర్ నిబంధనలను, మూస పద్ధతులను సవాలు చేయగలదు. పార్లమెంట్లో పెరిగే మహిళా ప్రాతినిధ్యం మరింత సమగ్రమైన, సమానమైన భారతదేశాన్ని వాగ్దానం చేస్తుంది. స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు గడిచిన తర్వాత కూడా, రాజకీయాల్లో సమాన లింగ ప్రాతినిధ్యాన్ని భారతదేశం సాధించలేకపోయింది. పార్లమెంట్లో అత్యధిక మహిళా ప్రాతినిధ్యం ఉన్న టాప్ 20 దేశాల్లో చాలా వరకు మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు ఉన్న విషయం ఈ సందర్భంగా గమనార్హం. పార్లమెంటులో మహిళలకు ప్రాతినిధ్యం లేకుండా సమానత్వంతో, న్యాయంతో సామాజిక అభివృద్ధిని సాధించలేము; అందుకే మహిళా రిజర్వేషన్ బిల్లు ఈనాటి అవసరం. రాజకీయ, ప్రజా జీవితంలో వివక్షను, ప్రత్యేకించి మహిళల పట్ల వివక్షను తొలగించడానికి తగిన చర్యలు తీసుకోవాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 7 ప్రభుత్వాలను నిర్దేశిస్తున్నది. మహిళలపై అన్ని రకాల వివక్షా నిర్మూలనకు సంబంధించిన కన్వెన్షన్‌పై భారతదేశం సంతకం చేసింది. ప్రభుత్వ విధానానికి, దాని అమలుకు సహకరించడంలో మహిళలకు ‘పాల్గొనే హక్కు’ ఉన్నందున, అన్ని ప్రభుత్వ సంస్థలకు ఎన్నికల్లో పోటీ చేయడానికి పురుషుల వలెనే వారు అర్హులు. ఈ నిబద్ధతను గౌరవించాల్సిన సమయం ఇది. పార్లమెంటులో ఏ సమస్యలను లేవనెత్తుతారు, విధానాలను ఎలా రూపొందిస్తారు అనే అంశంపై పార్లమెంట్లో మహిళల విస్తృత ప్రాతినిధ్యం అపారమైన ప్రభావాన్ని చూపుతుంది. పైగా ఇది మహిళలపై వివక్షాపూరిత చట్టాలను సంస్కరించడానికీ, సవరించడానికీ, ప్రభుత్వ జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికీ తగిన స్పేస్‌ని సృష్టిస్తుంది. ఈ అన్ని ప్రయోజనాల దృష్ట్యా పార్లమెంట్ మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడం హర్షణీయం. ప్రేమ్ చౌధరీ వ్యాసకర్త రచయిత్రి, ఢిల్లీ యూనివర్సిటీ మాజీ విద్యావేత్త -
4న మహిళా పార్లమెంట్
సాక్షి, అమరావతి: మహిళల అభ్యున్నతికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు మార్చి 4న మహిళా పార్లమెంట్ నిర్వహించబోతున్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, క్రీడలు, మీడియా, సినిమా, కళలు తదితర రంగాలకు చెందిన మహిళలు పాల్గొంటారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. రాష్ట్ర మహిళా కమిషన్ నేతృత్వంలో జాతీయ మహిళా కమిషన్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం జరుగుతున్నట్లు చెప్పారు. శనివారం కమిషన్ సభ్యులు, అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించి.. ఏర్పాట్లపై చర్చించారు. ఎన్జీవోలను కూడా భాగస్వాముల్ని చేయాలని సూచించారు. ఆర్థిక పురోగతి, రక్షణ, ఆరోగ్యం తదితర అంశాలపై నివేదిక రూపొందించి ప్రభుత్వాలకు సమర్పిస్తామని చెప్పారు. -
నేనేమైనా ప్రభుత్వాలు కూల్చానా?
విజయవాడ: మహిళా సదస్సును మహానాడులా నిర్వహించారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. మహిళా సాధికారతను సీఎం చంద్రబాబు కిట్టీ పార్టీలా మార్చేశారని మండిపడ్డారు. మంగళవారం ఉదయం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... మహిళా సదస్సు జరిగిన తీరును జాతీయ మీడియా ఏకిపారేసిందని చెప్పారు. భజనపరులనే సదస్సును అనుమతించారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలన హిట్లర్ ను తలపిస్తోందని వాపోయారు. మహిళా సదస్సుకు తనను ఆహ్వానించి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగి అవమానంపై న్యాయపోరాటం చేస్తానని ప్రకటించారు. చంద్రబాబు రాక్షస పాలనపై పోరాటం చేయాలని మహిళలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే రోజా ఇంకేం మాట్లాడారంటే... పోలీసులను చంద్రబాబు బౌన్సర్లుగా వాడుకుంటున్నారు పోలీసులను అడ్డుపెట్టుకుని మమ్మల్ని అణగతొక్కుతున్నారు మహిళా సదస్సు సాక్షిగా నాకు అవమానం జరిగింది స్సీకర్ పంపిన ఆహ్వానం మేరకు సదస్సుకు వచ్చిన నన్ను అక్రమంగా నిర్బంధించారు మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా నిర్బంధించిన తీరును చూసి దేశం నివ్వెరపోయింది మహిళా ఎమ్మెల్యేల పట్ల వ్యవహరించే తీరు ఇదేనా? వెంకయ్య కూతురు, కేసీఆర్ కూతురు, చంద్రబాబు కోడలు.. వీళ్లకే ప్రాధాన్యత ఇచ్చారు కార్పొరేట్ మహిళా సదస్సా, కామన్ మహిళా సదస్సా స్పీకర్ రెండు ఇన్విటేషన్లు పంపితేనే వచ్చాను మహిళా సమస్యలపై మాట్లాడే హక్కు నాకు లేదా? నేను ఈ రాష్ట్రంలో పుట్టలేదా? నాకు ఇక్కడ ఇళ్లు లేవా? మీకు నచ్చకపోతే వేరే రాష్ట్రంలో వదిలేస్తారా? ఇక్కడ ఉండే హక్కు మాకు లేదా? డీజీపీ కనుసన్నల్లో ఇలాంటి దారుణం జరగడం బాధాకరం చట్టప్రకారం నడుచుకోవాల్సిన డీజీపీ ఇలా చేయడం బాధాకరం చంద్రబాబుకు బానిసలా డీజీపీ పనిచేయడం దురదృష్టకరం డీజీపీ చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తే ప్రజల దృష్టిలో విలన్ గా ఉండిపోయే అవకాశముంది కుంటిసాకులతో నన్ను నిర్బంధించిన విధానం చాలా తప్పు నా ట్రాక్ రికార్డు చూసి నిర్బంధించమని చెప్పానని చంద్రబాబు అంటున్నారు పదేళ్లు టీడీపీలో ఉన్నప్పుడు ట్రాక్ రికార్డు గుర్తుకురాలేదా? ఏదైనా ప్రభుత్వాలు కూల్చిన ట్రాక్ రికార్డు ఉందా? నా ఇంట్లో బాంబులు పేలిన ట్రాక్ రికార్డు ఉందా? ఇంట్లోకి వారిపై కాల్పులు జరిపిన ట్రాక్ రికార్డు ఉందా? ఏ ట్రాక్ రికార్డు చూసి నన్ను నిర్బంధించమని డీజీపీకి చెప్పారు నాకు జరిగిన అవమానాలపై న్యాయం పోరాటం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది తమకు జరిగిన అన్యాయాలపై సామాన్య మహిళలు తిరబడాలన్నఉద్దేశంతో న్యాయపోరాటానికి సిద్ధపడ్డాను బాబు హయాంలో 11 శాతం నేరాలు పెరిగాయని పోలీసు రికార్డులే చెబుతున్నాయి చంద్రబాబు, డీజీపీ ఉన్న విజయవాడలోనే 70 రేప్ లు జరిగాయి కర్నూలులో మహిళపై టీడీపీ నేతలు గ్యాంగ్ రేప్ చేస్తే డీజీపీ ఎందుకు చర్యలు తీసుకోలేదు? బాధిత మహిళ డీజీపీ కార్యాలయం చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు మహిళా సమస్యలపై పోరాటం చేయకపోతే ఎమ్మెల్యేగా ఉండడమే నేను వేస్ట్ మహిళల కోసం అడుగడుగునా పోరాటం చేయడం వల్లే నాపై కక్ష సాధిస్తున్నారు మహిళల పోరాటానికి జగనన్న అండగా ఉంటాడు మహిళకు హోం మంత్రి ఇచ్చిన నాయకుడు వైఎస్ఆర్ మహిళలకు ఐదు ఎంపీ సీట్లు ఇచ్చిన మహిళాపక్షపాతి జగనన్నను చూశాం చంద్రబాబు రావణసుర పాలనపై అందరూ పోరాటం చేయాలి సంబంధిత కథనాలు ఇక్కడ చదవండి.. నిస్సిగ్గుగా అరాచకం నన్ను.. చంపేస్తారేమో ప్రతిపక్షంపై నిర్బంధాలేమిటి? ఆహ్వానించి నిర్బంధిస్తారా? -
సదస్సు అని రోజాను రానీయకపోవడమేంటి!