నంద్యాల గడ్డ వైఎస్ఆర్సీపీ అడ్డా.. | ysrcp mla roja fire on cm chandrababu naidu in gospadu | Sakshi
Sakshi News home page

నంద్యాల గడ్డ వైఎస్ఆర్సీపీ అడ్డా..

Published Sat, Aug 19 2017 9:49 PM | Last Updated on Mon, Oct 29 2018 8:10 PM

నంద్యాల గడ్డ వైఎస్ఆర్సీపీ అడ్డా.. - Sakshi

నంద్యాల గడ్డ వైఎస్ఆర్సీపీ అడ్డా..

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకోవడంతో అక్కడి రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎమ్మెల్యే రోజా శనివారం నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా గోస్పాడులో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి  భూమా అఖిల ప్రియలపై ధ్వజమెత్తారు. జగన్‌ను అన్న ప్రాసన రోజున గన్ పట్టుకున్నారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు.  చంద్రబాబు నీది నోరా? లేక తాటి మట్టా అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
 
ఎన్నికల్లో ఇచ్చిన 600 హామీలు ఏమయ్యాయని.. వాటిని మరచి మళ్లీ సిగ్గులేకుండా హామీలు ఇస్తున్నారన్నారు. శవాలపై రాజకీయాలు చేసేది చంద్రబాబే అని పేర్కొన్నారు. జగన్‌కు చంద్రబాబులా వెన్నుపోటు రాజకీయాలు తెలయదన్నారు. ఒకవేళ జగన్.. చంద్రబాబులా చేసి ఉంటే ఇప్పటికే సీఎం అయ్యి ఉండేవారన్నారు. తన పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి తిరిగి గెలిచిన చరిత్ర జగన్‌ది అని తెలిపారు. అదీ రాయలసీమ పౌరుషం అంటే.. చంద్రబాబు ఉన్నాడు సిగ్గు, శరం లేకుండా రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు.

నంద్యాలలో భూమా నాగిరెడ్డిని హింసించి అతనిపై రౌడీ షీట్‌లు తెరిపించి ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారని పేర్కొన్నారు. చివరికి మంత్రి పదవి ఆశ చూపి పార్టీలో చేర్చుకుని ఇవ్వకుండా మనోవేదనకు గురిచేసి ఆయన గుండె పోటుతో చనిపోవడానికి చంద్రబాబే కారణం అని నిప్పులు చెరిగారు. ఆయన చనిపోయిన తరువాత ఉపఎన్నికలు వస్తే.. ఆయన చావును రాజకీయం చేస్తున్నది ఎవరో చెప్పాలని ప్రశ్నించారు.

2019 ఎన్నికల్లో జగన్ సీఎం కావడం ఖాయం అని ఈ ఉపఎన్నికల్లో నంద్యాల గడ్డ వైఎస్ఆర్ సీపీ అడ్డా అనే విధంగా ఈ ఉప ఎన్నికల్లో శిల్పాను గెలిపించాలని ఎమ్మెల్యే రోజా అన్నారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని, నంద్యాల ఎన్నికల్లో టీడీపీని ఓడించి వారికి తగిన బుద్ది చెప్పాలని రోజా ప్రజలకు పిలుపునిచ్చారు .

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement