తాము ఎవరికీ బానిసలం కాదని, ప్రజలకు మాత్రమే బానిసలమని ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు అన్నారు.
విజయవాడ: తాము ఎవరికీ బానిసలం కాదని, ప్రజలకు మాత్రమే బానిసలమని ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు అన్నారు. నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తమపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబుకు బానిసలా వ్యవహరించిన డీజీపీ సాంబశివరావు.. మహిళగా, ఎమ్మెల్యేగా తన హక్కులకు భంగం కలిగించారని మంగళవారం విజయవాడలో ఎమ్మెల్యే రోజా విమర్శించారు.
కాగా, విజయవాడలో నిర్వహించిన జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులో పాల్గొనకుండా తనను అక్రమంగా నిర్బంధించి బలవంతంగా హైదరాబాద్‌కు తరలించిన ఉదంతంలో డీజీపీ సాంబశివ రావుతో పాటు మరో ఐదుగురు పోలీసు అధికారులపై కృష్ణా జిల్లా గన్నవరం జూనియర్ అదనపు సివిల్ జడ్జి కోర్టులో ఎమ్మెల్యే ఆర్కే రోజా మంగళవారం ప్రైవేటు కేసు దాఖలు చేశారు. తన హక్కులకు భంగం కలిగించిన వీరిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో కోరారు.