
నన్ను క్షమాపణ కోరే ముందు...
తిరుమల: ఒత్తిడికి తలొగ్గి పనిచేయాల్సి వస్తోందని పోలీస్ అధికారులు చెప్పడం బాధాకరమని నగరి ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. తనను క్షమాపణ అడిగే ముందు వారు ప్రవర్తించిన తీరును గుర్తు చేసుకోవాలని కోరారు. గన్ మెన్లను నల్లబ్యాడ్జీలతో నిరసర తెలపమనం సరికాదన్నారు. సీఎం చంద్రబాబు ఇంటి వద్ద వసతులు లేక ఎండలో మగ్గుతున్న పోలీసులు నిరసన తెలపాలని సూచించారు.
పోలీసులపై చింతమనేని ప్రభాకర్ దాడి చేసినప్పుడు అధికారుల సంఘం ఏం చేసిందని ప్రశ్నించారు. పుష్కరాల్లో అనేక మంది మరణిస్తే ఆ తప్పంతా పోలీసుల వైఫల్యమేనని చంద్రబాబు అన్నప్పుడు పోలీసు అధికారుల సంఘం ఏమైపోయిందని అడిగారు. తనను క్షమాపణ కోరే ముందు రాజధానిలో పోలీసుల అవస్థలపై నిరసన తెలపాలని ఎమ్మెల్యే రోజా అన్నారు.