
సాక్షి, హైదరాబాద్: మహిళల గురించి తెలుగుదేశం పార్టీ నేతలు సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పద్మజ మండిపడ్డారు. ఆమె సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రోజాపై టీడీపీ నేతల వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు. కాల్‌మనీ కాలనాగులతో రోజాపై విమర్శలు చేయించారని ఆరోపించారు. అచ్చోసిన ఆంబోతుల్లా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
అసమర్థ పాలనను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రశ్నించిన మహిళలపై ఎదురుదాడి చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే ఓ దళిత మహిళను వివస్త్రను చేస్తే చర్యలు లేవన్నారు. నారాయణ కాలేజీల్లో మిస్టరీలుగా మిగిలిపోతున్న బాలికల ఆత్మహత్య కేసుల్లో మంత్రి నారాయణపై చర్యలు తీసుకోగలరా అని ఆమె ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment