
ఎమ్మెల్యే రోజాను సన్మానిస్తున్న వైఎస్సార్ సీపీ కువైట్ కమిటీ
కడప కార్పొరేషన్: కువైట్‌లో నవరత్నాల సభ విజయవంతమైన సందర్భంగా నగరి ఎమ్మెల్యే రోజాను వైఎస్సార్ సీపీ కువైట్ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. పుష్పగుచ్ఛాలు, జ్ఞాపిక అందజేసి ధన్యవాదాలు తెలిపారు. కువైట్‌లోని సూక్ ముబారాకియా ప్రాంతంలోని అరబిక్ హోటల్‌లో నిర్వ హించిన అభినందన సభలో గల్ఫ్ కన్వీనర్ బీహెచ్ ఇలియాస్, కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి మాట్లాడారు. కువైట్‌లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాలను వారు వివరించారు. కార్యక్రమంలో కో కన్వీనర్ ఎంవీ నరసారెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు రెహమాన్ ఖాన్, ప్రధాన కోశాధికారి నాయని మహేశ్వర్‌రెడ్డి, ఆకుల ప్రభాకర్‌రెడ్డి, రమణ యాదవ్, ఎన్.చంద్ర శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.