
నయవంచన కాబట్టే ప్రజలు వెళ్లలేదు!
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణ దీక్ష పేరుతో నయవంచన చేస్తున్నారని
చిత్తూరు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణ దీక్ష పేరుతో నయవంచన చేస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. నారావారి నయవంచన తెలిసే ఈ దీక్షకు ప్రజలు వెళ్లలేదని పేర్కొన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆమె మండిపడ్డారు.
చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకున్న నైజం చంద్రబాబుదే రోజా దుయ్యబట్టారు. సోనియాను ఎదిరించినందుకే నాడు వైఎస్ జగన్ జైలుకు వెళ్లాల్సి వచ్చిందని అన్నారు. చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ జరిగింది. ఈ ప్లీనరీకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో సమయంలో చంద్రబాబు ఇచ్చిన 600 హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని, మళ్లీ ఇప్పుడు నవనిర్మాణ దీక్ష పేరుతో ఆయన నయవంచన చేస్తున్నారని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు.