అయ్యన్నతో మ్యాచ్ ఫిక్సింగ్
► చంద్రబాబు, గంటా ఆయన నోరు నొక్కేశారు
► విష్ణుకుమార్‌రాజు నోరు వెంకయ్యతో మూయించారు
► వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా వ్యాఖ్యలు
గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): విశాఖలో భూకబ్జాల అవినీతిలో రాష్ట్ర మంత్రి అయ్యన్నకు భాగం పంచారని ఎమ్మెల్యే ఆర్‌కే రోజా ఆరోపించారు. ఆరువేల ఎకరాల భూములు దోచేశారని, దీనిపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేసిన ఆయన ఇపుడు మౌనం దాల్చడం ఏమిటని ప్రశ్నించారు. విశాఖ విమానాశ్రయంలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. విశాఖలో కోట్ల విలువైన భూకుంభకోణంపై ప్రస్తావించారు. భూ కుంభకోణాలపై ఆరోపణలు చేసిన మంత్రి అయ్యన్నపాత్రుడుని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి గంటా శ్రీనివాసరావు, మంత్రి లోకేష్ అవినీతి సొమ్ముతో నోరునొక్కి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారన్నారు.
వేల ఎకరాల భూములు దోచేశారని వ్యాఖ్యలు చేసిన బీజేపీ శాసనసభా పక్షనేత విష్ణుకుమార్‌రాజును కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో ఒత్తిడి తెచ్చి చంద్రబాబు ఆపారని ఆరోపించారు. అయ్యన్నపాత్రుడు గంటాపై ఆరోపణలు చేశాక గంటా కూడా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోడానికి సీబీఐ విచారణకు తానూ సిద్ధమేనని ప్రకటించారని తెలిపారు. బయటకు అలా చెప్పి అయ్యన్నతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని మండిపడ్డారు. ఆరువేల ఎకరాలు దోచేశారని అయ్యన్న వ్యాఖ్యలు చేస్తే టీడీపీ ప్రభుత్వం అంతకాదు... రెండు మూడు వందల ఎకరాలు ఉంటుందని చెప్పడం సిగ్గుచేటన్నారు. భూ దోపిడీలపై వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి విశాఖలో సేవ్ విశాఖ పేరిట ధర్నాకు దిగడంతో దీనినుంచి బయటపడేందుకే సిట్ విచారణ చేయిస్తున్నారన్నారు. సీబీఐ విచారణ కాకుండా సిట్‌తో దర్యాప్తు చేయించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఇటీవల రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై చేసిన వ్యాఖ్యలను రోజా ఖండించారు.
ఘనస్వాగతం: అంతకుముందు ఎమ్మెల్యే రోజాకు విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలి కారు. వైఎస్సార్‌సీపీనగర అధ్యక్షురాలు పసుపు లేటి ఉషాకిరణ్‌తో పాటు అనేక మంది నాయకులు ఆమెకు స్వాగతం చెప్పారు.