
ఎమ్మెల్యే రోజాను అడ్డుకోవడంపై వైఎస్ జగన్ స్పందన
హైదరాబాద్: జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుకు ఆహ్వానించి మరీ పార్టీ ఎమ్మెల్యే రోజాను అడ్డుకోవడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఒక మహిళా ఎమ్మెల్యే పట్ల ప్రభుత్వమే ఇలా వ్యవహరిస్తే.. ఇక సమాజంలోని సామాన్య మహిళలకు రక్షణ ఎలా లభిస్తుందని ఆయన నిలదీశారు.
If the Govt can treat an MLA in such a way, what safety do women have in this society? Having invited and then-
— YS Jagan Mohan Reddy (@ysjagan) 12 February 2017
ఆహ్వానించి మరీ ఎమ్మెల్యే రోజాను అడ్డుకోవడమంటే.. జాతీయ మహిళా పార్లమెంటు సదస్సును అపహాస్యం పాలు చేయడమేనని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యే రోజాకు జరిగిన అన్యాయంపై పోరాడుతామని, ఈ అంశాన్ని అన్ని వేదికల్లోనూ లేవనెత్తుతామని వైఎస్ జగన్ ట్విట్టర్లో స్పష్టం చేశారు.
- restraining her from attending, they made a mockery of the National Women's Parliament. We will move all appropriate forums on this issue
— YS Jagan Mohan Reddy (@ysjagan) 12 February 2017
మహిళా పార్లమెంటు సదస్సుకు ఆహ్వానంపై వెళుతున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కె రోజాను శనివారం గన్నవరం విమానాశ్రయంలో పోలీసులు అడ్డగించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అత్యంత బలవంతంగా ఆమెను పోలీసులు హైదరాబాద్ తరలించారు.
సంబంధిత వార్తలు చదవండి
ఎమ్మెల్యే రోజా నిర్బంధం, విజయవాడ తరలింపు
ఎమ్మెల్యే రోజాను అరెస్ట్ చేయడం అక్రమం
నిస్సిగ్గుగా అరాచకం
నన్ను.. చంపేస్తారేమో