కుశస్థలి నదిలో ఇసుక తరలింపును పరిశీలించి, తిరిగి వస్తున్న నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా
నగరి:టీడీపీ నాయకులే ఇష్టారీతిన ఇసుకను దోచుకుంటున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళాధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. బుధవారం ఆమె మండలంలోని మిట్టపాళెం వద్ద కుశస్థలి నది నుంచి అధిక సంఖ్యలో ట్రాక్టర్లు ఇసుకను తరలిస్తుండడాన్ని గమనించి, నదిలోకి వెళ్లారు. అక్కడి ట్రాక్టర్ల డ్రైవర్ల నుంచి రశీదులు తీసుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరిలో ఇసుక రీచ్‌లు లేకపోయిన టీడీపీ నేతలు, కార్యకర్తల కోసం తహసీల్దార్ రీచ్‌లను సృష్టించి, దోచి పెట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించా రు.
ఇసుకను అధిక సంఖ్యలో తోడేసి తమిళనాడుకు, బెంగళూరుకు తరలిస్తున్నారని విమర్శించారు. నది లో ఇసుకను తోడివేతతో ఏర్పడిన గుంతల్లో పడి గ తంలో ఇద్దరు చిన్నారులు చనిపోయారన్నారు. అయినా అధికారులు వాటిని పట్టించుకోవడం లేదన్నారు. పేదవారికి ఎవరికీ ఇసుకను ఉచితంగా అందించడం లేదన్నారు. టీడీపీ నాయకులకు సంపాదించి పెట్టడానికి మాత్రమే ఇసుకను అందిస్తున్నారన్నారు. తహసీల్దార్ ఇకనైనా వీటిని ఆపాలని, లేకుంటే ప్రజలతో కలిసి ధర్నా చేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ కె.శాంతి, మాజీ చైర్మన్ కేజేకుమార్, నాయకులు బుజ్జిరెడ్డి, జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment