
జాతీయ మీడియాపై బాబు సంచలన వ్యాఖ్యలు
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి తన ఆక్రోశాన్ని వెల్లగక్కారు. విజయవాడలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ జాతీయ మీడియా సంస్థలపై దుమ్మెత్తిపోశారు. మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు వస్తున్న ఎమ్మెల్యే రోజాను అడ్డుకోవడాన్ని ఆయన సమర్థించుకున్నారు.
( చదవండి : ఎమ్మెల్యే రోజాపై నిస్సిగ్గుగా అరాచకం )
మూడు రోజుల జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సుపై జాతీయ మీడియా సంస్థలు పెద్ద హడావుడి చేశాయని మండిపడ్డారు. డబ్బులతో అందర్నీ కొనేశారని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళ సదస్సు బాగా జరిగితే కొన్ని జాతీయ పత్రికలు నెగిటివ్‌గా రాశారని అసహనం వ్యక్తం చేశారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు మహిళలపై చేసిన వ్యాఖ్యలను కూడా సీఎం తనదైన స్టైల్‌లో సమర్థించారు. ఆయన చేసిన వ్యాఖ్యల్లో తప్పేంలేదని కేవలం ఎక్స్‌ప్రెషన్ ప్రాబ్లమేనన్నారు. స్పీకర్ వ్యాఖ్యలను వక్రీకరించారని మీడియాపై బాబు ఫైర్ అయ్యారు.
( చదవండి : మహిళలపై స్పీకర్ కోడెల వ్యాఖ్యలు )
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను పోలీసులు అడ్డుకోవడంలో ఎలాంటి తప్పు లేదన్నారు. సదస్సులో గొడవ చేస్తారన్న ఉద్దేశంతో అడ్డుకున్నామని చెప్పారు. పోలీసులు ఆమెను అనుమతించివుంటే పరిణామాలు మరో విధంగా ఉండేవన్నారు. అప్పుడు పోలీసులపై చర్యలు తీసుకోవాల్సి ఉండేదని అందుకే ముందస్తుగా అడ్డుకున్నారన్నారు.