National Media
-
జాతీయ మీడియా ముందు.. ఆధారాలు బయటపెట్టిన జగన్
-
ఆంధ్రప్రదేశ్‌లో వన్స్‌మోర్... రాష్ట్రంలో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం తథ్యమని జాతీయ మీడియా సంస్థల సర్వేల్లో వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఫ్యాన్ గాలి ప్రచండం
వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టా, ఎక్స్.. వేదికగా ఒకటే చర్చ.. ‘ఈసారీ వైఎస్సార్సీపీనే వస్తుంది.. జాతీయ మీడియా, పొలిటికల్ కన్సల్టెన్సీల సర్వేలన్నీ పక్కాగా లెక్కలేసి చెబుతున్నాయి. సైంటిఫిక్ పారామీటర్స్‌తో సర్వే చేసి మరీ నొక్కి వక్కాణిస్తున్నాయి. పత్రికలకు సంపాదకులుగా పని చేసిన వాళ్లు, సీనియర్ పాత్రికేయులు కూడా అదే చెబుతున్నారు. కచ్చితంగా నేను నమ్ముతున్నా. ఎందుకంటే జగన్ చేసిన మంచి పనులు అలాగున్నాయి కాబట్టి’ అంటూ ఊరూరా జనం చెబుతున్నారు. ‘మళ్లీ వైఎస్ జగన్ సీఎం అయితేనే మా బతుకులు మారతాయని మా నమ్మకం. మేమంతా జగన్ బాటలోనే నడుస్తాం. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమికి ఘోర పరాజయం తప్పదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ సీఎం కావడం తథ్యం. జగన్ అంటే విశ్వాసం.. చంద్రబాబు అంటే మోసం..’ అని నిన్న సిద్ధం సభల్లో.. ఇప్పుడు బస్సు యాత్రలో అశేష ప్రజానీకం తేల్చి చెబుతున్నారు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని అన్ని వర్గాల ప్రజలు నిర్ధారణకు వచ్చారు. రాజకీయ విశ్లేషకులు, జాతీయ స్థాయి సర్వే సంస్థలు సైతం ఇదే విషయాన్ని నొక్కి వక్కాణిస్తున్నాయి. గతంలో ఏం చేశామన్నది చెప్పుకోవడానికి ఏమీ లేక, భవిష్యత్‌లో ఫలానా చేస్తామని నమ్మకంగా చెప్పడంలో విశ్వసనీయత లేక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఓటమి బాటలో పయనిస్తోందని స్పష్టం చేస్తున్నాయి. గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు, 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయభేరి మోగించింది. దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత భారీ విజయం సాధించిన దాఖలాలు లేవు. అధికారంలోకి వచ్చాక ప్రజా సంకల్ప పాదయాత్రలో.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో తొలి ఏడాదే 95 శాతం.. మొత్తమ్మీద 99 శాతం సీఎం జగన్ అమలు చేశారు. సంక్షేమ పథకాల ద్వారా అర్హతే ప్రామాణికంగా.. లంచాలకు తావు లేకుండా.. వివక్షకు చోటు లేకుండా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో 87 శాతం కుటంబాల ఖాతాల్లో రూ.2.70 లక్షల కోట్లు జమ చేశారు. నాన్ డీబీటీ రూపంలో రూ.1.79 లక్షల కోట్ల ప్రయోజనాన్ని చేకూర్చారు. డీబీటీ, నాన్‌డీబీటీ ద్వారా పేదలకు రూ.4.49 లక్షల కోట్ల లబ్ధి కలిగింది. దేశ చరిత్రలో ఈ స్థాయిలో పేదలకు మంచి చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ, జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ద్వారా ప్రభుత్వ సేవలను ఇంటి గుమ్మం వద్దనే ప్రజలకు అందిస్తున్నారు. వైద్య, విద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో సంస్కరణలు తెచ్చి.. అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపారు. వీటన్నింటి వల్ల సుపరిపాలనతో నవచరిత్ర లిఖించిన సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో విశ్వసనీయత రోజురోజుకూ పెరుగుతోంది. 58% మహిళల ఓట్లు జగన్‌కే ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల నాడి తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తున్నాం. 50% కంటే ఎక్కువ ఓట్లతో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించడం ఖాయం. సీఎం జగన్ నాయకత్వానికి మహిళలు 58% మంది మద్దతు పలుకుతున్నారు. దేశంలో ఏ నాయకుడికీ మహిళల్లో ఇంతటి ఆదరణ లేదు. సంక్షేమ పథకాల నుంచి కేబినెట్, నామినేటెడ్ పదవుల వరకూ మహిళలకు పెద్దపీట వేస్తూ సాధికారతకు జగన్ తీసుకున్న చర్యలే ఆయన నాయకత్వంపై మహిళల్లో అత్యధికంగా ఆదరణ ఉండటానికి కారణం. - పార్థ దాస్ సెఫాలజిస్ట్, చాణక్య కన్సల్టెన్సీ జగన్‌పై విశ్వసనీయతే విజయానికి సోపానం ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల నాడి తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తున్నాం. 50 శాతం కంటే ఎక్కువ ఓట్లతో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించడం ఖాయం. సీఎం జగన్ నాయకత్వానికి మహిళలు 58 శాతం మంది మద్దతు పలుకుతున్నారు. దేశంలో ఏ నాయకుడికీ మహిళల్లో ఇంతటి ఆదరణ లేదు. సంక్షేమ పథకాల నుంచి కేబినెట్, నామినేటెడ్ పదవుల వరకూ మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళా సాధికారతకు సీఎం జగన్ తీసుకున్న చర్యలే ఆయన నాయకత్వంపై మహిళల్లో అత్యధికంగా ఆదరణ ఉండటానికి కారణం. - పద్మజా జోషి, సీనియర్ న్యూస్ ఎడిటర్, టైమ్స్‌నౌ అప్రతిహతంగా బస్సు యాత్ర వైఎస్సార్సీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి భీమిలి (ఉత్తరాంధ్ర), దెందులూరు (ఉత్తర కోస్తా), రాప్తాడు (రాయలసీమ), మేదరమెట్ల (దక్షిణ కోస్తా)లలో నిర్వహించిన సిద్ధం సభలకు జనం కడలిలా తరలివచ్చారు. ఉమ్మడి, తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు, మేదరమెట్ల సభలు అతి పెద్ద ప్రజా సభలుగా నిలిచాయి. ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా గత నెల 27న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి సీఎం వైఎస్ జగన్ చేపట్టిన బస్సు యాత్రకు జనం అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. సీఎం జగన్‌ను చూసేందుకు యువతీ యువకులతో కలిసి చంటి బిడ్డలను చంకనేసుకుని మహిళలు పోటీపడుతూ బస్సు వెంట పరుగులు తీస్తున్నారు. మండుటెండైనా.. అర్ధ రాత్రయినా సీఎం వైఎస్ జగన్‌ను దగ్గరి నుంచి చూసేందుకు.. కరచాలనం చేసేందుకు.. మాట కలిపేందుకు.. వీలైతే ఫొటో దిగేందుకు జనం పోటీ పడుతున్నారు. మేలు చేశాం.. ఓటేయండి అనేది మామూలుగా నేతల మాట. కానీ.. బస్సు యాత్రలో తద్భిన్నంగా ‘మీ పాలన వల్ల మాకు మంచి జరిగింది.. మళ్లీ మిమ్మల్నే గెలిపించుకుంటాం’ అంటూ ప్రజలు సీఎం వైఎస్ జగన్‌కు భరోసా ఇస్తున్నారు. రాజకీయాలలో ఇలాంటి అరుదైన ఘట్టాలను తానెన్నడూ చూడలేదని సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ జత కలిశాక, చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభలకు జనం ముఖం చాటేస్తుండటం.. నాడు సిద్ధం సభలు.. నేడు బస్సు యాత్రకు వస్తున్న స్పందనను చూస్తుంటే.. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని పలువురు రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. మరో చారిత్రక విజయం ఖాయం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థలు, చాణక్య, బీపీఎస్, జన్మత్ పోల్స్, లోక్ పోల్స్, పోల్ స్ట్రాటజీ గ్రూప్, పొలిటికల్ క్రిటిక్, మ్యాట్రిజ్ వంటి పొలిటికల్ కన్సల్టెన్సీలు అటు దేశ వ్యాప్తంగా.. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నాడి తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తున్నాయి. టైమ్స్‌నౌ–ఈటీజీ, జీన్యూస్–మ్యాట్రిజ్, డెక్కన్ 24/7 వంటి జాతీయ మీడియా సంస్థలు.. చాణక్య, మ్యాట్రిజ్ నుంచి జన్మత్ పోల్స్ వరకూ పొలిటికల్ కన్సల్టెన్సీలు నిర్వహించిన డజనుకు పైగా సర్వేల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడం ఖాయమని వెల్లడించాయి. దాంతో జనసేన–బీజేపీతో చంద్రబాబు జట్టుకట్టారు. మూడు పార్టీల జెండాలు జత కలిసినా వైఎస్సార్సీపీ ప్రభంజనం ముందు కూటమి నిలబడలేదన్నది సర్వేల్లో వెల్లడైంది. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ వైఎస్సార్సీపీకి ప్రజల్లో మద్దతు పెరుగుతూ వస్తోందని సర్వేలు వెల్లడించాయి. సుమారు 50 శాతానికిపైగా ఓట్లతో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించడం ఖాయమని మార్చి రెండో వారం నుంచి ఏప్రిల్ రెండో వారం వరకు నిర్వహించిన సర్వేలు తేల్చి చెబుతున్నాయి. -
వచ్చాడు జాదూగాడు
సాక్షి, అమరావతి: నక్క జిత్తులు, నకిలీ వేషాలకు ప్రతిరూపం తానేనని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు! జనసేనతో జత కట్టి ఎన్ని మారీచ వేషాలు వేసినా గత ఎన్నికలకు మించి ఘోర పరాజయం తప్పదని తాడేపల్లిగూడెం సభ సాక్షిగా గ్రహించిన చంద్రబాబు కనీసం అవినీతి కేసుల నుంచైనా బయటపడాలనే వ్యూహంతో ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దల కాళ్లావేళ్లా పడి పొత్తు కుదుర్చుకున్నారు. జాతీయ పార్టీతో పొత్తు కుదిరిన వెంటనే వ్యవస్థలను జయప్రదంగా మేనేజ్ చేయడంలో తనకున్న అద్వితీయమైన ప్రతిభను జాతీయ మీడియాలో కొన్ని సంస్థల ముందు ప్రదర్శించారు. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి విజయం సాధించే అవకాశాలున్నాయంటూ మొన్న సీ–ఓటర్ సంస్థ ఓ నకిలీ సర్వేను వెల్లడించగా న్యూస్–18 నిన్న మరో ఫేక్ సర్వేను వదిలింది. రానున్న రోజుల్లో మరిన్ని నకిలీ సర్వేలు ఇదే రీతిలో వెల్లడి కానున్నాయి. నకిలీ సర్వేల ద్వారా టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి పుంజుకున్నట్లు కృత్రిమ బలాన్ని చూపించి పార్టీ శ్రేణులను కాపాడుకోవాలన్నది చంద్రబాబు ఎత్తుగడ. అయితే వైఎస్సార్సీపీ 50 శాతానికిపైగా ఓట్లతో 24–25 లోక్‌సభ స్థానాల్లో ఘనవిజయం సాధిస్తుందని, టీడీపీ–జనసేన కూటమి 0–1 లోక్‌సభ స్థానాలకే పరిమితం కానుందని టౌమ్స్ నౌ, చాణక్య లాంటి ప్రముఖ సంస్థల సర్వేల్లో వెల్లడైంది. డజనుకుపైగా జాతీయ మీడియా సంస్థల సర్వేల్లోనూ వైఎస్సార్సీపీ విజయ దుందుభి మోగించడం ఖాయమని తేలింది. బీజేపీతో టీడీపీ–జనసేన పొత్తు కుదిరిన రెండు మూడు రోజుల్లోనే ఆ కూటమి గెలుస్తుందంటూ సీ–ఓటర్, న్యూస్–18 ఒపీనియన్ సర్వేలు ఆదరాబాదరాగా ప్రకటించడంపై రాజకీయ పరిశీలకులు విస్తుపోతున్నారు. రెండు మూడు రోజుల్లోనే ప్రజాభిప్రాయం ఎలా తారుమారు అవుతుందని ప్రశ్నిస్తున్నారు. దీన్ని బట్టి అవి నకిలీ సర్వేలన్నది స్పష్టమవుతోందని తేల్చి చెబుతున్నారు. 2019లోనే అన్ని సర్వేలకు విరుద్ధంగా సీ–ఓటర్, న్యూస్–18 అంచనాలు ఉండటాన్ని గుర్తు చేస్తున్నారు. సర్వేల పేరుతో చంద్రబాబు ఎన్ని మాయ వేషాలు వేసినా సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మరోసారి చరిత్రాత్మక విజయం సాధించడం ఖాయమని, వైఎస్ జగన్ మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం తథ్యమని పేర్కొంటున్నారు. సుపరిపాలనతో విప్లవాత్మక మార్పులు.. 2019 ఎన్నికల్లో 50 శాతం ఓట్లతో 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలి ఏడాదిలోనే 95 శాతం హామీలను అమలు చేసి మేనిఫెస్టోకు సిసలైన నిర్వచనం చెప్పారు. గత 58 నెలల్లో 99 శాతం హామీలను నెరవేర్చి సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో రూ.2.65 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. డీబీటీ, నాన్ డీబీటీ కలిపి మొత్తం రూ.4.44 లక్షల కోట్ల మేర ప్రయోజనం చేకూర్చారు. కరోనా కష్టకాలంలోనూ ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపకుండా నిర్విఘ్నంగా కొనసాగించారు. ప్రభుత్వ ఆర్థిక చేయూతను వినియోగించుకున్న పేదలు పేదరికాన్ని అధిగమించడమే ఇందుకు నిదర్శనం. 2015–16లో రాష్ట్రంలో పేదరికం 11.77 శాతం ఉండగా 2022–23 నాటికి 4.19 శాతానికి తగ్గడమే అందుకు తార్కాణం. గ్రామ వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ, జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ద్వారా గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలు అందుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ రాష్ట్రంలో నాలుగు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే.. అందులో గత 58 నెలల్లో 2.13 లక్షల నియామకాలు చేపట్టడం గమనార్హం. రోజురోజుకు పెరుగుతున్న వైఎస్సార్సీపీ గ్రాఫ్.. సంక్షేమ పథకాలు, సుపరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్ పట్ల ప్రజాదరణ రోజురోజుకూ పెరుగుతోంది. 2019 ఎన్నికల తర్వాత జరిగిన పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్, తిరుపతి లోక్‌సభ, బద్వేలు, ఆత్మకూరు శాసనసభ స్థానాల ఉప ఎన్నికల్లో ఇది నిరూపితమైంది. వైఎస్సార్సీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తూ భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్లలో నిర్వహించిన నాలుగు సిద్ధం సభలు వైఎస్సార్సీపీ మరోసారి ప్రభంజనం సృష్టించడం ఖాయమని చాటి చెప్పాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్సీపీ 50 శాతం ఓట్లతో 24–25 లోక్‌సభ స్థానాల్లో ఘనవిజయం సాధించడం తథ్యమని, టీడీపీ 0–1 లోక్‌సభ స్థానాల్లో మాత్రమే ఉనికి చాటుకునే అవకాశం ఉందని, జనసేన, బీజేపీ, కాంగ్రెస్‌లు ఉనికి కూడా చాటుకోలేవని మూడు నెలల క్రితం టౌమ్స్‌నౌ సర్వే వెల్లడించింది. జీన్యూస్ మారిటైజ్, జీవనాధర్ ఇండియా, జన్మత్ పోల్స్, పీపుల్స్ పల్స్, చాణక్య లాంటి డజనుకుపైగా ప్రతిష్టాత్మక సంస్థలు నిర్వహించిన సర్వేల్లోనూ వైఎస్సార్సీపీ మరోసారి ఘనవిజయం సాధిస్తుందని వెల్లడైంది. కేసుల భయంతో కాళ్ల బేరం.. ఎన్నికల్లో ఒంటరిగా వైఎస్సార్సీపీని, సీఎం వైఎస్ జగన్‌ను ఎదుర్కోలేమని గ్రహించిన చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో జత కలిశారు. టీడీపీ–జనసేన పొత్తు కుదిరాక తాడేపల్లిగూడెంలో ఉమ్మడిగా నిర్వహించిన జెండా సభకు జనం మొహం చాటేశారు. జెండా సభ అట్టర్ ప్లాప్ కావడంతో మళ్లీ ఘెర పరాజయం తప్పదని ఆందోళన చెందిన చంద్రబాబు స్కిల్ స్కామ్, ఫైబర్ గ్రిడ్ స్కాం, అమరావతి భూకుంభకోణం నుంచి ఉమ్మడి రాష్ట్రంలో పాల్పడిన ఐఎంజీ భారత్ కుంభకోణం వరకూ అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు బీజేపీ పొత్తు కోసం పాకులాడారు. ఢిల్లీ వెళ్లి మూడు రోజులు పడిగాపులు కాసి బీజేపీ పెద్దల కాళ్లావేళ్లా పడి పొత్తుకు ఒప్పించుకున్నారు. బీజేపీతో జతకట్టినా డజను సర్వేలది ఒకే మాట ♦ బీజేపీతో టీడీపీ–జనసేన పొత్తు కుదిరాక ౖటౌమ్స్ నౌ–ఈటీజీ సంస్థ భారీ సర్వే చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 25 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో వివిధ వర్గాలకు చెందిన 3,23,257 మంది వెల్లడించిన అభిప్రాయాలను క్రోడీకరించింది. 49 శాతం ఓట్లతో 21–22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధిస్తుందని, 45 శాతం ఓట్లతో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి 3–4 ఎంపీ సీట్లకే పరిమితం కానుందని తేల్చింది. ♦ 48 శాతం ఓట్లతో 19 లోక్‌సభ, 133 శాసనసభ స్థానాల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధిస్తుందని, టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి 44 శాతం ఓట్లతో 6 లోక్‌సభ, 42 శాసనసభ స్థానాలకు పరిమితం అవుతుందని జీన్యూస్–మారిటైజ్ సర్వే వెల్లడించింది. ♦ 49.5 శాతం ఓట్లతో 121 శాసనసభ (ఐదు అటూఇటుగా) స్థానాల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధిస్తుందని, టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి 43 శాతం ఓట్లతో 54 (ఐదు అటూఇటుగా) శాసనసభ స్థానాలతో సరి పెట్టుకుంటుందని పొలిటికల్ క్రిటిక్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ♦ రాష్ట్రంలో 49 శాతం ఓట్లతో 17 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ సత్తా చాటుకుంటుందని, 44 శాతం ఓట్లతో 8 లోక్‌సభ స్థానాలకు టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి పరిమితం అవుతుందని చాణక్య సర్వే తేల్చింది. జనాధార్ ఇండియా, జన్మత్ పోల్స్, పీపుల్స్ పల్స్ తదితర డజనుకుపైగా ప్రతిష్టాత్మక సంస్థల సర్వేలదీ అదే మాట. -
సీఎం జగన్ ఇంటర్వ్యూ: వనరులు పుష్కలం.. అవకాశాలు అపారం
మేము అమలు చేస్తున్నవి కేవలం ఉచిత పథకాలు కాదు. ఇదంతా మానవ వనరుల మీద పెడుతున్న పెట్టుబడిగా మేం భావిస్తున్నాం. మానవ వనరుల నైపుణ్యాభివృద్ధిగానే చూస్తున్నాం. ప్రభుత్వం అలా ఆలోచించకపోతే ప్రగతి సాధించలేం. మా విద్యార్థులు సొంత కాళ్ల మీద నిలబడి, ఉన్నత స్థానాలకు ఎదగడానికి అవసరమైన వనరులను సమకూరుస్తున్నాం. అందుకోసం విద్యా ప్రమాణాలు పెంపొందిస్తున్నాం. అభివృద్ధిలో వారిని భాగస్వాములను చేస్తున్నాం. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘పరిశ్రమలు నెలకొల్పడానికి అన్ని విధాలా అనువైన వాతావరణం, వనరులు మన రాష్ట్రంలో ఉన్నాయి. 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం, నిరంతరాయమైన విద్యుత్ సరఫరా, కొత్తగా ఏర్పాటవుతున్న 4 పోర్టులు, నాణ్యమైన వనరులు.. ఇవన్నీ పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత అనుకూలమైన అంశాలు. పోర్టు ఆధారిత పరిశ్రమలకు రాష్ట్రం అత్యంత ఆకర్షణీయం. ఇక్కడ గ్రీన్ ఎనర్జీ రంగంలో అపార అవకాశాలున్నాయి. దేశంలో 11 పారిశ్రామిక కారిడార్లు రాబోతుంటే... అందులో మూడు మన రాష్ట్రంలోనే వస్తున్నాయి. మూడు పారిశ్రామిక కారిడార్లున్న ఏకైక రాష్ట్రం కూడా మనదే’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. విశాఖపట్నంలో శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు జరిగే ‘గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్’ నేపథ్యంలో బుధవారం ఆయన కొందరు జాతీయ మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ► పెట్టుబడికి ఉన్న అవకాశాలను, పరిశ్రమల ఏర్పాటుకున్న అనుకూలతలను పారిశ్రామికవేత్తలకు వివరించడం ద్వారా ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం సదస్సు లక్ష్యం. పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత సానుకూల వాతావరణం రాష్ట్రంలో ఉంది. ప్రభుత్వం తొలి నుంచీ స్నేహపూర్వక పారిశ్రామిక విధానంతో ముందుకు వెళుతోంది. ఏ రాష్ట్రంలోనైనా పరిశ్రమలు నెలకొల్పాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు, ప్రోత్సహకాలు ఇవ్వటం సహజం. ప్రభుత్వం నుంచి అందే సహకారం, రాయితీలు, ప్రోత్సహకాలు, రాష్ట్రంలో ఉన్న అనువైన వాతావరణం, వనరులను పారిశ్రామివేత్తలు చూస్తారు. రాష్ట్రంలో ఇవన్నీ ఉన్నాయి. 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీరం పరిశ్రమలకు అనుకూలం. ► రాష్ట్రంలో 48 రకాల ఖనిజాలు లభ్యమవుతాయి. ఇది ఖనిజాధారిత పరిశ్రమలకు ఎంతో అనుకూలం. సిమెంట్, లైమ్‌స్టోన్ పరిశ్రమలు నెలకొల్పడానికి మన వద్ద ఎంతో అనుకూల పరిస్థితులున్నాయి. ( ఫైల్ ఫోటో ) ► 6 పోర్టులున్నాయి. కొత్తగా 4 పోర్టులు నిర్మిస్తున్నాం. అందులో 3 పోర్టులను ప్రభుత్వమే సొంత నిధులతో నిర్మిస్తోంది. పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రం అత్యంత అనుకూలం. పోర్టు ఆధారిత పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. పోర్టు రవాణా కారణంగా రాష్ట్రంలో తయారయ్యే వస్తువుల ఎగుమతికి తక్కువ ఖర్చవుతుంది. ► కర్భన ఉద్గారాలను తగ్గించి పర్యావరణ పరిరక్షణకు మేలు చేసే గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, పంప్డ్ స్టోరేజ్... గ్రీన్ ఎనర్జీదే భవిష్యత్ అంతా. ఈ రంగంలో పెట్టుబడులకు రాష్ట్రంలో మంచి అవకాశాలున్నాయి. వీటివల్ల చౌకగా విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. రెన్యువబుల్, గ్రీన్ ఎనర్జీకి ఏపీలో పుష్కలమైన వనరులున్నాయి. విండ్, హైడ్రోజన్, సోలార్ విద్యుదుత్పత్తికి ఇక్కడ అపార అవకాశాలున్నాయి. 82 గిగావాట్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ, 34 గిగావాట్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్‌లకు అవకాశం ఉంది. భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుంది. ► పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలు తీసుకుని, వాటి ప్రకారం ప్రో యాక్టివ్‌గా వ్యవహరిస్తున్నాం. అందుకే ఈ రాష్ట్రంవైపు ఎప్పుడూ చూడని అంబానీ, బిర్లా, అదానీ, బంగూర్, బజాంకా, దాల్మియా.. వంటి వారు ఇప్పుడు రాష్టంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నారు. గతంలో ఇంతమంది దిగ్గజ పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చింది లేదు. ► 2021–22లో 11.43 శాతం వృద్ధిరేటుతో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. పలురంగాల్లో అగ్రగామిగా నిలుస్తూ... సులభతర వాణిజ్య విధానాల్లో (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) వరుసగా మూడేళ్లు నెంబర్ వన్‌గా నిలిచింది. ( ఫైల్ ఫోటో ) మూడు రంగాల్లో విప్లవాత్మకమైనమార్పులు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా గత ప్రభుత్వ తప్పులను కొన్నింటిని సరిచేస్తుంది, కొన్ని కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తుంది. మేం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలలు, వ్యవసాయం.. ఈ రంగాల్లో పూర్తి స్థాయిలో విప్లవాత్మక చర్యలు చేపట్టాం. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ‘నాడు–నేడు’ పేరిట ప్రభుత్వాసుపత్రులు, ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తున్నాం. ప్రాథమిక విద్యా రంగంలో ‘అమ్మ ఒడి’ పథకం ఓ విప్లవం. మేము అధికారంలోకి వచ్చేనాటికి ప్రాథమిక విద్య ప్రమాణాల్లో ఆంధ్ర ప్రదేశ్ దేశంలో చివరి రెండు, మూడు స్థానాల్లో ఉండేది. ఈ పరిస్థితి మార్చాలనుకున్నాం. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు మేం అమలు చేస్తున్న పథకాలు చెబుతా. అమ్మ ఒడి పథకం కింద పిల్లల్ని బడికి పంపే తల్లుల ఖాతాలో రూ.15వేలు వేస్తున్నాం. దీనికి కనీసం 75 శాతం హాజరు ఉండాలనే నిబంధన పెట్టాం. ఇంటర్మీడియట్ వరకు అమ్మ ఒడి పథకం ఇస్తున్నాం. తరవాత జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలు అందిస్తున్నాం. ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుండటంతో పిల్లల చదువు ఎందుకు ఆపాలని తల్లిదండ్రులు భావిస్తారు కదా?. ఇక ఏటా స్కూళ్లు తెరవటానికి ముందే జగనన్న విద్యా కానుక పేరిట సమగ్ర కిట్‌ను ఇస్తున్నాం. తెలుగు, ఇంగ్లీష్ బైలింగ్వల్ పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, స్కూల్ బ్యాగ్, షూ, సాక్సులు, యూనిఫామ్ ఇస్తూ యూనిఫామ్‌కు కుట్టేందుకు మజూరీ చార్జీలూ ఇస్తున్నాం. దీనికి ఏటా రూ.వేయి కోట్లకుపైగా నిధులు వెచ్చిస్తున్నాం. ఇక మధ్యాహ్న భోజన పథకాన్ని పూర్తిగా మార్చాం. టీడీపీ ప్రభుత్వంలో మధ్యాహ్న భోజన పథకానికి రూ.600 కోట్ల బడ్జెట్ ఉండేది. దాన్ని రూ.1,908కోట్లకు పెంచాం. జగనన్న గోరుముద్ద పేరుతో భోజనం నాణ్యత పెంచాం. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాం. ఆరో తరగతి నుంచి డిజిటల్ తరగతులు ఏర్పాటు చేస్తున్నాం. నాడు–నేడు మొదటి దశ కింద 15,275 పాఠశాలలను ఎంపిక చేసి వాటి రూపు రేఖలను సమూలంగా మార్చాం. రాష్ట్రంలో 30,230 తరగతుల డిజిటలైజేషన్‌ను ఈ జూన్ నాటికి పూర్తి చేస్తున్నాం. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇస్తున్నాం. ఇప్పటివరకు 60వేల మంది ఉపాధ్యాయులకు, 4.70 లక్షల మంది విద్యార్థులకు మొత్తం 5.30 లక్షల ట్యాబ్‌లు పంపిణీ చేశాం. అంతేకాదు! అంగన్వాడీ కేంద్రాలకు నిధులు పెంచాం. గతంలో అంగన్వాడీ కేంద్రాలకు ఏడాదికి రూ.800కోట్లు కేటాయించేవారు. దీన్ని రూ.1,800 కోట్లకు పెంచాం. జగనన్న సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ్ ప్లస్ పేరిట అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహర నాణ్యతను మెరుగుపరిచాం. ఎందుకంటే ఆరేళ్ల వరకే పిల్లలు శారీరకంగా, మానసికంగా వేగంగా ఎదుగుతారు. ఆ సమయంలో వారికి సరైన పోషకాహారం అందించాలి. అదే చేస్తున్నాం. ఆడపిల్లల పెళ్లికి సహకరిస్తూ... వారు చదువు కొనసాగించేలా నిబంధనలు పెట్టాం. 10వ తరగతి పాస్ అవ్వాలని, 18 ఏళ్లు నిండాలని నిబంధన పెట్టడం వల్ల వారు పది తరవాత ఇంటర్ చదువుతారు. డిగ్రీలోనూ చేరతారు. చేరారు కనక పూర్తి చేస్తారు. ఈ ఉద్దేశంతోనే వివాహానికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నాం. చదువుల్లో రాణిస్తూ విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి ‘విదేశీ దీవెన’ పథకాన్ని అందిస్తున్నాం. నిర్దేశిత 21 ఫ్యాకల్టీల్లో ప్రపంచంలోని టాప్–50 యూనివర్సిటీల్లో ఉన్నత విద్యను అభ్యసించే మన విద్యార్థులకు గరిష్ఠంగా రూ.1.25 కోట్ల వరకూ ఫీజును చెల్లిస్తున్నాం. గత ఏడాది 200మందికి స్పాన్సర్షిప్ అందించాం. ఇలాంటి వర్సిటీల్లో చదివిన వాళ్లంతా వచ్చే పదేళ్లలో అత్యున్నత స్థాయికి చేరుకుని, మన రాష్ట్రానికి ఆస్తిగా మారతారన్న విశ్వాసం నాకుంది. ► ప్రభుత్వాసుపత్రులకు కాయకల్ప చికిత్స చేస్తున్నాం. ఎవ్వరూ ఊహించని విధంగా వైద్య రంగంలో ఖాళీగా ఉన్న 48,000 పోస్టులను భర్తీ చేశాం. ప్రతి హాస్పిటల్లో డాక్టర్, నర్సులు ఉండేలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాం. జాతీయస్థాయి ప్రమాణాలు ఉండేలా హాస్పిటల్స్‌ను ఆధునీకరించాం. 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాం. ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చే చికిత్సల సంఖ్యను 1,059 నుంచి ఏకంగా 3,255కు పెంచాం. ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ హెల్త్ క్లినిక్, హెల్త్‌కార్డుల డిజిటలైజేషన్ ఇలా అనేక సంస్కరణలు తెచ్చాం. వ్యవసాయ రంగానికి వస్తే... రైతు భరోసా కేంద్రంపేరిట రైతులకు సంబంధించిన సేవలన్నీ ఒకేచోట అందిస్తున్నాం. ప్రతి గ్రామానికీ వ్యవసాయ శాస్త్రంలో డిగ్రీ పొందిన అధికారిని నియమించడమే కాకుండా ప్రతి రైతు తాలూకు పంట వివరాలను ‘ఈ క్రాప్’లో నమోదు చేస్తున్నాం. రైతులకు విత్తనం దగ్గర నుంచి పంట అమ్ముకోవడం వరకూ ఆర్బీకే ద్వారా చేయూత అందిస్తున్నాం. పాలన సంస్కరణల్లో భాగంగా.... ప్రతి 2000 జనాభాకు గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి 50 మంది జనాభాకూ ఒక వలంటీర్‌ను ఏర్పాటు చేశాం. ఎటువంటి అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. దేశంలో డీబీటీ ద్వారా నేరుగా నగదు అందుకుంటున్న లబ్ధిదారులు రాష్ట్రంలోనే అధికం. మాకు ఓటు వేశారా లేదా, ఏ పార్టీ అనేది చూడకుండా పథకాలు అందిస్తున్నాం. ఎస్డీజీ లక్ష్యాలకు అనుగుణంగా సంక్షేమ పథకాలు ఉచిత పథకాలు అంటూ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధి చేయకుండా కేవలం సంక్షేమ పథకాలే ఇస్తున్నామనుకుంటే దేశంలోనే అత్యధికంగా 11.43 శాతం వృద్ధిని ఎలా సాధిస్తాం? అన్ని రంగాల్లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులేస్తున్నాం. ప్రతి పథకాన్నీ ఎస్డీజీ లక్ష్యాలకు అనుగుణంగా డీబీటీ రూపంలో నేరుగా లబ్ధిదారులకే అందిస్తున్నాం. ఉదాహరణకు జీఈఆర్ గణాంకాలు చూస్తే కాలేజీల్లో చేరే వారి సంఖ్య రాష్ట్రంలో ఎక్కువ. 18 నుంచి 23 ఏళ్ల వయస్సులో ఉన్నవారు చదువు మానకుండా కాలేజీలో చేరేలా పర్యవేక్షిస్తున్నాం. విద్యార్థి డిగ్రీ పూర్తి చేస్తే అతని హోదా మారుతుంది. అందుకే తల్లిదండ్రులకు విద్య భారం కాకుండా ఉండేలా 100 శాతం ఫీజు రీఇంబర్స్మెంట్ ఇస్తూ విద్యాదీవెన, వసతిదీవెన, ప్రాధమిక విద్యలో అమ్మఒడి వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఈ మొత్తం నేరుగా కళాశాలలకు ఇవ్వకుండా తల్లుల ఖాతాల్లో వేస్తున్నాం. దీనివల్ల ఆ విద్యార్థి చదువు మధ్యలో ఆగదు. పట్టభద్రుడై ఆదాయాన్ని ఆర్జించడం ద్వారా పేదరికం నుంచి మధ్యతరగతి హోదాలోకి ఆ కుటుంబం మారుతుంది. దేశాభివృద్ధిలో ఇది ఎంతో కీలకమైన అంశం. బడ్జెట్ పరిమితుల్లోనే... పారదర్శకంగా... ఈ పథకాలన్నీ కూడా బడ్జెట్ పరిమితుల్లోనే అమలు చేస్తున్నాం. సాధారణంగా రాజకీయ నేతలు సామాన్యులకు అర్థం కాని రీతిలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. గతంలో కూడా ఇదే బడ్జెట్ ఉండేది. ఆ నిధులు ఎక్కడికి వెళ్తాయో ఎవరికీ అర్థమయ్యేది కాదు. లబ్ధిదారులెవరో ఆ దేవుడికే తెలియాలి అనే పరిస్థితి ఉండేది. కానీ రాష్ట్రంలో తొలిసారిగా మేము అందరికీ సరళంగా అర్థమయ్యేలా పారదర్శకంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టాం. ప్రతి పథకాన్నీ బడ్జెట్లో కచ్చితంగా నిర్దేశించాం. ప్రతి పథకాన్ని లబ్ధిదారుల ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతాలతో అనుసంధానించాం. నేరుగా నగదు బదిలీ విధానంలో పథకాన్ని అమలు చేస్తున్నాం. – ఏ రాష్ట్రానికైనా కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. అందుకే కేంద్రంలోని బీజేపీతో మేము స్నేహ పూర్వక వాతావరణమే కోరుకుంటున్నాం. మాకు రాజకీయాల కంటే మా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. ప్రజలకు ఏం కావాలో అది చేయాలనేది మా ప్రభుత్వ విధానం. అందుకే మా ప్రభుత్వం రియాలిటీలో పేదలకు ఏం కావాలో అదే చేస్తోంది. అందుకే సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో వేగంగా ముందుకెళ్తున్నాం. -
‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు.. జాతీయ మీడియా ముందుకు ఆధారాలు!
సాక్షి, హైదరాబాద్: తమ ఎమ్మెల్యేలు నలుగురు పార్టీ ఫిరాయించేలా ప్రలోభపెట్టా రనడానికి, ఇందులో ఢిల్లీ పెద్దల హస్తం ఉందనడానికి పూర్తి ఆధారాలు ఉన్నాయని టీఆర్ఎస్ వర్గాలు బలంగా చెప్తున్నాయి. ఫామ్‌హౌజ్ వ్యవహారంలో ఆడియో, వీడియో ఫుటేజీలు ఉన్నాయని.. ఈ తతంగం మొత్తాన్ని బయటపెట్టేందుకు సీఎం కేసీఆర్ రంగం సిద్ధం చేసుకుంటున్నారని అంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రలోభాల పర్వాన్ని ఆసాంతం పరిశీలిస్తున్నారని, త్వరలోనే జాతీయ మీడియా ముందుకు తీసుకెళ్లనున్నారని పేర్కొంటున్నాయి. న్యాయపరమైన చిక్కులు రాకుండా.. టీఆర్ఎస్ ‘ఎమ్మెల్యేలకు ఎర’ ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణ ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నందున న్యాయపరమైన చిక్కులు తలెత్త కుండా జాగ్రత్తలు తీసుకున్నాకే మాట్లాడాలని టీఆర్ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించినట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ వ్యవహారంలో బీజేపీ ఢిల్లీ పెద్దల ప్రమే యం ఉన్నట్టు రూఢీ చేసే సమాచారం సదరు స్వామీజీల ఫోన్లలో దొరికిందని అంటున్నాయి. ఫామ్‌హౌజ్‌లో రికార్డయిన ఆడియో, వీడియో ఫుటేజీలోనూ బీజేపీ ఢిల్లీ పెద్దల పాత్రను రుజువు చేసే ఆధారాలు ఉన్నాయని.. వాటిలోని సమాచారాన్ని రూఢీ చేసుకున్న తర్వాత జాతీయ స్థాయిలో బీజేపీ బండారాన్ని బయటపెట్టాలని కేసీఆర్ భావిస్తు న్నట్టు టీఆర్ఎస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. చదవండి: అర్ధ రూపాయికి కూడా అమ్ముడుపోని వారికి రూ.100 కోట్లా? నిందితులను రిమాండ్‌కు పంపకముందే మీడియాతో మాట్లాడితే పోలీసు విచారణను ప్రభావితం చేశారనే ఆరోపణలు వచ్చే అవకా శం ఉందని కేసీఆర్ భావిస్తున్నట్టు చెప్తున్నా యి. బీజేపీ ఎదురుదాడి వలలో చిక్కుకోకుండా ‘ఎమ్మెల్యేలకు ఎర’ వెనుక బాగోతాన్ని ఆధారాలతో సహా జాతీయ మీడియా ముందు బయట పెట్టాలని సీఎం నిర్ణయించినట్లు టీఆర్ఎస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు. స్వామీజీల ఫోన్లలో కీలక సమాచారం తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ఢిల్లీ పెద్దలు స్వయంగా రంగంలోకి దిగినట్టుగా నిందితులు నందకుమార్, ఇద్దరు స్వామీజీలు వెల్లడించారని సదరు ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌కు వివరించారని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఇది కేవలం నలుగురు ఎమ్మెల్యేలు, రూ.400 కోట్ల ప్రలోభాలకే పరిమితం కాలేదని, ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే తరహా కొనుగోళ్లకు సంబంధించిన ఆధారాలు కూడా లభించాయని అంటున్నాయి. బీజేపీ కీలక నేత ఒకరు తమతో నేరుగా టచ్‌లో ఉన్నట్టు చెప్పారని.. తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు బాధ్యత తమకు అప్పగించారని వారు చెప్పిన సంభాషణలు రికార్డు అయ్యాయని పేర్కొంటున్నాయి. కేంద్ర సంస్థల దుర్వినియోగం, తెలంగాణలోనూ వాటిని ఉసిగొల్పనున్న వైనానికి స్వామీజీల సంభాషణలు అద్దం పట్టేలా ఉన్నాయని అంటున్నాయి. ప్రగతిభవన్లోనే ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఫామ్‌హౌజ్ ఘటనలో ప్రలోభాలకు గురైన ట్టుగా పేర్కొంటున్న నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు(అచ్చంపేట), రేగ కాంతారావు (పినపాక), బీరం హర్షవ ర్ధన్‌రెడ్డి(కొల్లాపూర్), పైలట్ రోహిత్‌రెడ్డి (తాండూరు) బుధవారం రాత్రి నుంచీ ప్రగ తిభవన్లోనే ఉండటం గమనార్హం. ఘటన తర్వాత వారు మీడియాకు అందుబాటులోకి రాలేదు. అయితే వారు ఫామ్‌హౌజ్‌లో బీజేపీ దూతలతో జరిగిన మంతనాలు, పోలీసుల రాక, భేటీకి సంబంధించిన ఆధారాలు తదితరాలపై సీఎం కేసీఆర్‌కు పూర్తి వివరాలు వెల్లడించారని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. పదిరోజులుగా బేరసారాలు జరిగాయని.. భేటీ కోసం దీపావళి తర్వాత సమయాన్ని ఖరారు చేశారని వివరించారని అంటున్నాయి. చదవండి: ఫామ్‌హౌజ్ ఘటన.. టీఆర్ఎస్పై కిషన్‌రెడ్డి కౌంటర్ ఎటాక్ ఈ సమయంలో ఆడియో, వీడియో ఫుటేజీల్లో నిక్షిప్తమైన సమాచారం గురించి కేసీఆర్ ఆరా తీశారని.. ప్రలోభాల పర్వంపై పూర్తి వివరాలను బయటపెట్టేదాకా మౌనం పాటించాలని ఆదేశించారని పేర్కొంటున్నాయి. మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు, మంత్రి హరీశ్‌రావు కూడా బుధవారం రాత్రి నుంచీ ప్రగతిభవన్లోనే ఉండిపోయారు. మంత్రి హరీశ్‌రావు మాత్రం గురువారం తెల్లవా రుజామున బయటికి వెళ్లి కాసేపటికే తిరిగి ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. వారు ప్రలోభాల పర్వానికి సంబంధించిన ఆడి యో, వీడియో ఫుటేజీలను విశ్లేషించి.. ఆధా రాలను సిద్ధం చేసుకుంటున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఢిల్లీలో చంద్రబాబుకు షాక్.. అపాయింట్మెంట్ ఇవ్వని మోదీ, షా
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో గత్తర లేపుతానంటూ వెళ్లిన చంద్రబాబు నాయుడుకి భారీ షాక్ తగిలింది. చంద్రబాబు ఢిల్లీ టూర్ అట్టర్ ప్లాఫ్ అయ్యింది. టీడీపీ అధ్యక్షుడిని కేంద్ర పెద్దలు, జాతీయ మీడియా పట్టించుకోలేదని సమాచారం. రెండు రోజులుగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం పడిగాపులుగాస్తున్నప్పటికి చంద్రబాబుకు చుక్కెదురైనట్లు తెలిసింది. కశ్మీర్ పర్యటన ముగించుకుని అమిత్ షా ఢిల్లీకి వచ్చినప్పటికి.. చంద్రబాబుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదట. పార్టీ పరిస్థితి దయనీయంగా మారడంతో బీజేపీ అండ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు. కానీ గతంలో అమిత్ షా కుటుంబంతో తిరుమలకు వస్తే.. ఆయన కాన్వాయ్‌పై చంద్రబాబు రాళ్లు వేయించిన ఘటనను బీజేపీ మరచిపోలేదు. అంతేకాక నరేంద్ర మోదీని ఉగ్రవాది అని సంభోదించడాన్ని కూడా కాషాయ నేతలు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. రెండున్నరేళ్లయినా చంద్రబాబు కుట్రను బీజేపీ పెద్దలు మర్చిపోలేదు. (చదవండి: ఎందుకు దాడిచేశారో చెప్పాల్సింది) ఇప్పుడు చంద్రబాబు కల్లబొల్లి కబుర్లను బీజేపీ, జాతీయ మీడియా పట్టించుకోవడం లేదని తెలిసింది. ఏపీ డ్రగ్స్‌కు అడ్డాగా మారుతోందని రాష్ట్ర ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. ఢిల్లీలో ఉన్న చంద్రబాబును కలవాలని టీడీపీ నేతలు జాతీయ మీడియాకు పదే పదే ఫోన్లు చేస్తున్నారట. అయినప్పటికి వారు బాబును పెద్దగా పట్టించుకోవడం లేదని సమాచారం. (చదవండి: Twitter: చంద్రబాబుపై వల్లభనేని వంశీ వ్యంగ్యాస్త్రాలు ) ఇటు కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ దొరక్క, అటు జాతీయ మీడియా పట్టించుకోకపోవడంతో చంద్రబాబు వెనుదిరిగారు. ఆర్టికల్ 356 అంటూ హడావిడి చేద్దామనుకున్న చంద్రబాబు వ్యూహం తుస్సుమనడమే కాక జాతీయ స్థాయిలోనూ ఆయన ప్రతిష్ట ఎంతలా దిగజారిందో మరోసారి బహిర్గతం అయ్యింది. చదవండి: ఏపీ పరువు తీయడానికే బాబు ఢిల్లీ టూర్ -
వెక్కిరించిన వారే గెలిపించారు
ఆమెను చూసి నేషనల్ మీడియా కూడా మెచ్చుకుంటోంది. ‘నిన్ను నువ్వు సరిగ్గా చూసుకోలేవు... ఊరినెలా చూసుకుంటావు’ అన్నారు ఆమె మొదటిసారి సర్పంచ్‌గా పోటీ చేసినప్పుడు ఊరి వాళ్లు. అయినా ప్రజా సేవకు తన శారీరక పరిమితులు అడ్డం కావు అనుకుంది నాసిక్‌కు చెందిన కవితా భోండ్వే. ఆమె పని చేయడం మొదలెట్టింది. మార్పును చూపించింది. వెక్కిరించిన నోళ్లు మెచ్చుకోళ్లు మెదలెట్టాయి. అంతేనా? రెండోసారి ఆమెను సర్పంచ్‌గా గెలిపించాయి. గత తొమ్మిదేళ్లుగా సర్పంచ్‌గా ఉన్న కవితా భోండ్వే స్ఫూర్తిగాధ ఇది. తండ్రి 15 ఏళ్ల పాటు పంచాయతీ మెంబర్‌గా ఉన్నాడు. ఉన్నాడు కాని మెల్లమెల్లగా తనకు చదువు రాకపోవడం పంచాయతీ వ్యవహారాల్లో అవరోధంగా మారుతోందని గ్రహించాడు. 2011 సంవత్సరం అది. మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని దిందోరి తాలుకాలో రెండు గ్రామాలకు (దెహెగావ్, వాల్గాగ్) సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి. తన కుమార్తె చదువుకుంది. ఆమెను సర్పంచ్‌గా నిలబెడితే? అనుకున్నాడు. కాని ఆ అమ్మాయికి కుడి కాలికి పోలియో ఉంది. ‘ఏమ్మా పోటీ చేస్తావా?’ అని అడిగాడు ఆ తండ్రి పుండలిక్ భోండ్వే. ‘పోటీ చేస్తాను నాన్నా’ అంది కూతురు కవితా భోండ్వే. ఆ సమయానికి కవిత వయసు 25. అంత చిన్న వయసులో ఆ ప్రాంతంలో ఎవరూ సర్పంచ్ కాలేదు. అందునా స్త్రీ కాలేదు. పైగా శారీరక పరిమితులు ఉన్నవారు అసలే కాలేదు. రెండు ఊళ్లలోనూ ఈ విషయం పెద్ద వేళాకోళంగా మారింది. మగవారు దీనిని సహించలేకపోయారు. ‘నిన్ను నువ్వు సరిగ్గా చూసుకోలేవు. ఊళ్లను ఏం చూస్తావు?’ అని ప్రశ్నించారు. కవిత గంభీరంగా ఆ హేళనను భరించింది. తన ప్రచారం కొనసాగించింది. మెల్లమెల్లగా చాలామంది స్త్రీలు ఆమె పట్టుదలను గమనించారు. ఊరి మగవారు కూడా కొందరు మద్దతుగా నిలిచారు. సర్పంచ్‌గా ఆమె గెలిచింది. ‘వెక్కిరింతలను ఏమాత్రం మనసులోకి తీసుకోకపోవడం వల్లే నేను ముందుకు వెళ్లగలిగాను’ అని కవిత అంటోంది. కవిత పదవిలోకి వచ్చే సరికి ఊళ్లో ఆకతాయిల ఆట సాగుతోంది. కొన్ని సంఘ వ్యతిరేకమైన పనులు సాగుతున్నాయి. వాటిని మొదట నిలువరించింది ఆమె. ఆ తర్వాత రెండు ఊళ్లలోనూ బాలికల చదువు గురించి, రోడ్ల గురించి, మరుగుదొడ్ల గురించి, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా మంజూరయ్యే ఇళ్ల గురించి పని చేసింది. అవినీతి ఊసు లేకుండా సర్పంచ్ అనే దాష్టీకం లేకుండా హుందాగా పని చేస్తున్న కవితా అతి త్వరగా జనానికి దగ్గరయ్యింది. ‘చిన్న వయసులో సర్పంచ్ అయ్యానని అక్కసు పడ్డవాళ్లు కూడా మెల్లగా నన్ను గుర్తించడం మొదలెట్టారు’ అని కవితా అంది. పదవిలో ఉన్న ఐదేళ్లు కవితకు ఒకటే పని. ఉదయాన్నే సోదరుడు ఆమెను బైక్ మీద దింపితే పంచాయతీ ఆఫీస్‌కు వస్తుంది. పనులు చూసుకుంటుంది. వచ్చినవారి ఇబ్బందులు వింటుంది. జరిగే పనుల అజమాయిషీకి బయలుదేరుతుంది. ఐదేళ్లు గడిచిపోయాయి. మళ్లీ ఎలక్షన్లు వచ్చాయి. ఈసారి ఎలక్షన్లు జరగలేదు. ఎందుకంటే కవితనే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 34 ఏళ్ల కవిత 9 ఏళ్లుగా సర్పంచ్‌గా పని చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. ఆమె నడక మెల్లగా ఉండవచ్చు. కాని ఆమె సంకల్పం, చిత్తశుద్ధి, అంకితభావం, నిజాయితీ అత్యంత వేగవంతమైనవి. తన రెండు ఊళ్లలో ఆమె స్వయం ఉపాధి గ్రూపులను స్థాపించి స్త్రీల స్వావలంబన కోసం ప్రయత్నిస్తోంది. కవితకు చెట్లు నాటించడం ఇష్టం. గ్రామాల్లో పచ్చదనం కోసం కృషి చేస్తోంది. బహుశా మరికొన్నేళ్లు ఆమె సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికవుతూ రావొచ్చు. ఎందుకంటే ఆ పాలనలో నీడ ప్రజలకు అంత చల్లగా ఉంది. -
ఫేక్ టీఆర్పీ రేటింగ్ స్కాం గుట్టురట్టు
సాక్షి, న్యూఢిల్లీ : నకిలీ టీర్పీ రేటింగ్స్ పొందుతూ అక్రమాలకు పాల్పడుతున్న టీవీ రేటింగ్స్ స్కాంను ముంబై పోలీసులు బట్టబయలు చేశారు. జనాలకు డబ్బులిచ్చి, తమ ఛానల్ మాత్రమే చూడాలని మీటర్స్‌ను అమర్చి అక్రమంగా రేటింగ్స్ పెంచుకుంటున్న ఛానల్స్‌ను పోలీసులు గుర్తించారు. విధంగా అక్రమాలకు పాల్పడుతున్న ఛానల్స్‌లో ఓ ప్రముఖ జాతీయ మీడియాతో మహారాష్ట్రకు చెందిన మరో రెండు ఛానల్స్ ఉన్నట్లు వెల్లడించారు. ఈ మేరకు గురువారం ముంబైలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ముంబై పోలీస్ కమిషనర్ పరయ్ బీర్ సింగ్.. టీవీ రేటింగ్స్ స్కాం వివరాలను గురువారం వెల్లడించారు. బార్క్ సంస్థ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులకు ఫేక్ టీర్పీ రేటింగ్ వివరాలు తెలిశాయని తెలిపారు. దీనిలో బార్క్ మాజీ ఉద్యోగులతో పాటు మరికొంత మంది ప్రముఖులు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకే ఛానల్ మాత్రమే చూస్తామన్నవారికి ఉచిత టీవీతో పాటు కొంత నగదును సైతం అందిస్తారని పేర్కొన్నారు. తాజా స్కాంతో సంబంధముందని అనుమానిస్తున్న ఇద్దరు మరాఠీ టీవీ యజమానులను పోలీసులు అరెస్ట్ చేయగా.. మరికొంతమందికి నోటీసులు ఇచ్చారు. ఈ వ్యవహారం టెలివిజన్‌తో పాటు, రాజకీయంగాను చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ స్కాంలో జాతీయ మీడియాకు చెందిన ఓ ప్రముఖ ఛానల్ యజమాని కూడా ఉన్నాడని సమాచారం. -
నేషనల్ మీడియాపై దర్శకుడి వ్యంగ్యాస్త్రాలు
దక్షిణ భారత దేశ ప్రముఖుల విషయంలో జాతీయ మీడియా వ్యవహరిస్తున్న తీరుపై దర్శకుడు హరీష్ శంకర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సంగీత దిగ్గజం ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణవార్తకు జాతీయ మీడియా సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవటంపై ఆయన మండిపడ్డారు. శనివారం ట్విటర్ వేదికగా హరీష్ స్పందిస్తూ..‘‘ ఇంటర్నేషనల్ మీడియా కూడా ఎంత అద్భుతంగా ప్రెజెంట్ చేసిందో.. మన నేషనల్ మీడియాని చూస్తే జాలేస్తుంది. అంతేలే, కొందరి స్థాయి విశ్వవ్యాప్తం. ( ‘బాలు ఎప్పుడూ మాతోనే ఉన్నారు.. ఉంటారు’ ) ఇరుకు సందుల్లో కాదు’’ అని పేర్కొన్నారు. ప్రముఖ ఇంటర్ నేషనల్ న్యూస్ ఛానల్ బీబీసీ.. ఎస్పీ బాలు మరణంపై ప్రచురించిన వార్తా కథనానికి సంబంధించిన వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఇంటర్నేషనల్ మీడియా కూడా ఎంత అద్భుతంగా ప్రెజెంట్ చేసిందో.. మన నేషనల్ మీడియా ని చూస్తే జాలేస్తుంది.. అంతేలే.. కొందరి స్థాయి విశ్వవ్యాప్తం.. ఇరుకు సందుల్లో కాదు.. pic.twitter.com/hcYDqMU9WK — Harish Shankar .S (@harish2you) September 26, 2020 -
ఉంపన్ విపత్తు; కేంద్రంపై బెంగాల్ ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తూ పెను తుపాను ‘ఉంపన్’ సృష్టించిన బీభత్సం గురించి కేంద్ర ప్రభుత్వంగానీ, జాతీయ మీడియాగానీ అంతగా పట్టించుకోక పోవడం పట్ల మేధావులతోపాటు సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కలసి ఏరియల్ సర్వే చేసి తుపాను బీభత్సాన్ని ప్రత్యక్షంగా వీక్షించినా ‘జాతీయ విపత్తు’గా ప్రకటించక పోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రముఖ బెంగాలీ చిత్ర దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీ, ప్రముఖ జర్నలీస్ట్ వీర్ సాంగ్వీ ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం వైఖరిని విమర్శించారు. (ఇంత బీభత్సమా.. షాకయ్యాను) బెంగాల్ ప్రజలు గడచిన గత ఐదు దశాబ్దాలుగా జాతీయ పార్టీలను కాదని, ప్రాంతీయ పార్టీలకు అధికారాన్ని అప్పగిస్తున్నందుకు కేంద్రం, తమ రాష్ట్రంపై కక్షగట్టిందా? అని సాంగ్వీ ప్రశ్నించారు. ఉంపన్ సృష్టించిన విధ్వంసం జాతీయ మీడియాకు కనిపించక పోవడం ఆశ్చర్యంగాను, బాధగానూ ఉందంటూ బెంగాల్, ఒడిశాలకు చెందిన ప్రముఖ విద్యావేత్తలు ఓ సంయుక్త ప్రకటనలో వ్యాఖ్యానించారు. తుపాను సాయం కింద ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన వెయ్యి కోట్ల రూపాయల ఆర్థిక సహాయం ఏ మూలకు సరిపోతుందని వారు ప్రశ్నించారు. మామూలు ప్రభుత్వ ప్రాజెక్టులకే ఎక్కువ ఇస్తారని వారన్నారు. కేంద్రం మాట అటుంచితే కరోనా వార్తల ఒరవడిలో బెంగాల్‌ను కుదిపేసిన తుపాను వార్తలను జాతీయ మీడియా పట్టించుకోలేదేమో! (ఉంపన్.. కోల్‌కతా వణికెన్) -
‘ప్రత్యేక హోదా ఏపీ ప్రజల న్యాయమైన డిమాండ్’
న్యూఢిల్లీ : ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల న్యాయమైన డిమాండ్ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను అవినితీ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కంకణం కట్టుకున్నారని తెలిపారు.జాతీయ చానల్ న్యూస్ ఎక్స్ నిర్వహించిన ఇండియా నెక్ట్స్ డిబేట్లో మిథున్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. 51 శాతం ఓట్లతో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వీప్ చేశారని తెలిపారు. 3600 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసిన వైఎస్ జగన్ ప్రజల కష్టాసుఖాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారని గుర్తుచేశారు. అధికారం చేపట్టిన రోజు నుంచే వైఎస్ జగన్ ప్రజాసంక్షేమం కోసం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 50 శాతం కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి.. దేశంలో ప్రాంతీయ పార్టీలు సైతం తమ సత్తాను నిరూపించాయి. రాజ్యసభలో బీజేపీ ఇంకా మైనారిటీగానే ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బీజేపీకి అంశాల వారీగా మద్దతిస్తాం. జాతీయ స్థాయిలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాలని మేము భావించాం.. కానీ అది సాధ్యపడలేదు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని మాకు మాట ఇచ్చారు. ఆ సమయంలో బీజేపీ నేతలు కూడా సభలోనే ఉన్నారు. 60 శాతం ప్రజలకు 40 శాతం రెవెన్యూతో విభజించారు. దీంతో ఏపీ ఏటా 20వేల కోట్ల రూపాయలు వడ్డీలకే కట్టాల్సి వస్తోంది. చంద్రబాబు నాయుడు పాలనలో ఏపీలో అవినీతి పెరిగిందని జాతీయ సంస్థల సర్వేల్లో వెల్లడైంది. ఆయన రాష్ట్రాన్ని అన్ని విధాలా అప్పుల ఊబిలో నెట్టేశారు. పార్లమెంట్లో ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని కేంద్రం నిలబెట్టుకోవాలి. సీబీఐ ఆంధ్రప్రదేశ్‌లో కేసులను దర్యాప్తు చేయకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. కానీ వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే సీబీఐ దర్యాప్తుకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అనుమతి ఇచ్చార’ని మిథున్‌రెడ్డి డిబెట్లో పేర్కొన్నారు. ఏపీ, ఒడిశాకు ప్రత్యేక హోదా ఇవ్వాలి : బీజేడీ ఎంపీ మిథున్‌రెడ్డితో పాటు బీజేడీ ఎంపీ పినాకి ఘోష్ కూడా ఇండియా నెక్ట్స్ డిబెట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు, ఒడిశాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని అన్నారు. తుపాన్ల కారణంగా ఒడిశా తీవ్రంగా దెబ్బతింటోందని పేర్కొన్నారు. -
ఎక్కడ చూసినా వారి మాటే!
సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఇప్పుడు యావత్తు దేశం దృష్టిని ఆకర్షించారు. పార్టీకి చెందిన సామాన్య కార్యకర్తలు, ప్రభుత్వోద్యోగులు, ఓ పోలీసు అధికారి, ఉపాధ్యయురాలు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా పోటీచేసి గెలవడంపై సామాజిక మాధ్యమాలు, జాతీయ మీడియా చానళ్లలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సీట్ల కేటాయింపులో సామాన్యులకు ప్రాధాన్యమిచ్చిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ఎన్నికల్లో వారందరినీ గెలిపించుకున్నారు. వారిలో సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఎన్నికల ముందు వరకు బాధ్యతలు నిర్వర్తించి ఇప్పుడు హిందూపురం ఎంపీగా ఎన్నికైన గోరంట్ల మాధవ్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పనిచేస్తూ అరకు ఎంపీగా ఎన్నికైన గొడ్డేటి మాధవి, పార్టీలో సామాన్య కార్యకర్తగా పనిచేస్తూ బీపీఎల్ కార్డుదారుడైన బాపట్ల ఎంపీ నందిగం సురేష్, గ్రూప్–1 అధికారిగా పనిచేసి అనంతపురం ఎంపీగా భారీ మెజారిటీతో గెలుపొందిన పీడీ రంగయ్య దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. వీరిపై పలు జాతీయ మీడియా సంస్థలు ప్రత్యేక కథనాల్ని ప్రసారం చేశాయి, ప్రచురించాయి. పోలీస్‌స్టేషన్ టు పార్లమెంట్ వయా హిందూపురం.. హిందూపురం ఎంపీగా గెలుపొందిన గోరంట్ల మాధవ్‌ను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్గా గతంలో బాధ్యతలు నిర్వర్తించిన మాధవ్ ఎన్నికల్లో విజయం సాధించడంతో.. ‘పోలీస్‌స్టేషన్ టు పార్లమెంట్ వయా హిందూపురం’ అంటూ ఆయన విజయాన్ని కీర్తిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద హిందూపురం ఎంపీగా గెలుపొందిన గోరంట్ల మాధవ్‌ను డీఎస్పీ సెల్యూట్ చేస్తున్న ఫొటో ఒకటి దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. అప్పటి వరకు సీఐగా పనిచేసిన మాధవ్ ఎంపీగా ఎన్నికవ్వడంతో డీఎస్పీ సెల్యూట్ చేశారంటూ ముందు అందరూ భావించారు. అయితే, తానే ముందు డీఎస్పీకి సెల్యూట్ చేశానని గోరంట్ల మాధవ్ తెలిపారు. ఈ ఫొటో సామాజిక మాధ్యమాలనే కాకుండా జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించింది. దీనిపై ‘ద వీక్, న్యూస్ మినిట్స్, స్కూప్వూవ్, యూఎన్ఐ, రాజ్కాజ్ న్యూస్, ఔట్లుక్, బిజినెస్ టుడే, మనీకంట్రోల్, ఒడిశా, కర్ణాటక, హిందీ వెబ్సైట్లు ప్రత్యేక కథనాలు రాశాయి. 2019 ఎన్నికల్లో సామాన్యులు ఎంపీలుగా విజయం సాధించి పార్లమెంటులో అడుగుపెడుతుండడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రెండో అతిపిన్న వయస్కురాలిగా మాధవి మరోవైపు.. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పనిచేసి విశాఖ జిల్లా అరకు నుంచి ఎంపీగా గెలుపొందిన గొడ్డేటి మాధవి.. దేశవ్యాప్తంగా ఎన్నికైన ఎంపీలలో రెండో అతిపిన్న వయస్సురాలి (26 ఏళ్లు)గా రికార్డులకెక్కారు. ఆమె కేంద్ర మాజీమంత్రి కిశోర్ చంద్రదేవ్‌పై 2.20 లక్షల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఒడిశాలో బీజేడీ నుంచి 25 ఏళ్లకే ఎంపీగా గెలుపొందిన చంద్రాణి ముర్ము పిన్న వయస్కురాలి (25ఏళ్లు)గా మొదటి స్థానంలో ఉన్నారు. పవర్ ఆఫ్ డెమోక్రసీ.. ఇక బాపట్ల రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన నందిగం సురేష్ అందరి దృష్టినీ ప్రత్యేకంగా ఆకర్షించారు. పార్టీలో సామాన్య కార్యకర్తలా పనిచేస్తూ బీపీఎల్ కార్డుదారుడైన సురేష్.. బాపట్ల నుంచి టీడీపీ సిట్టింగ్ ఎంపీని ఓడించడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సురేష్ గెలుపును ‘పవర్ ఆఫ్ డెమోక్రసీ’గా టైమ్స్ ఆఫ్ ఇండియా అభివర్ణించింది. అలాగే, ఒక ప్రభుత్వోద్యోగిగా డీఆర్డీఏలో పీడీగా పనిచేసిన తలారి రంగయ్య అనంతపురం నుంచి, పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి చిత్తూరు ఎంపీగా రెడ్డప్పలాంటి సామాన్యులు గెలుపొందడంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా.. ఏపీలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసిన వారిలో 88 శాతం మంది ఉన్నత విద్యార్హతలు కలిగి ఉన్న పార్టీగా వైఎస్సార్సీపీ దేశంలోనే ప్రత్యేక గుర్తింపును సాధించింది. ఇలా ఉన్నత విద్యార్హతలు, సామాన్యులకు పెద్దపీట వేస్తూ సీట్లు కేటాయించడమే కాకుండా వారిని ఎన్నికల్లో గెలిపించుకున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను అన్ని వర్గాల ప్రజలు ప్రశంసిస్తున్నారు. ఎంపీలుగా గెలిచిన సామాన్యులు పార్లమెంటులో తమ ప్రత్యేకతను చాటుకోనున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
ఆంధ్రాలో జగన్ అద్భుత విజయం
సాక్షి, అమరావతి, సాక్షి హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ సీపీ ప్రభంజనం సృష్టించనుందని జాతీయ మీడియా చానళ్లు పునరుద్ఘాటించాయి. రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్ నిజాయితీ, నిబద్ధతకు పట్టంగట్టారని, మూడింట రెండు వంతులకుపైగా మెజార్టీతో ఆయన అత్యధిక స్థానాలను సాధిస్తారని పేర్కొన్నాయి. ఎగ్జిట్‌పోల్స్ విడుదలైన నేపథ్యంలో ‘ఇండియా టుడే’ సోమవారం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై చర్చావేదిక నిర్వహించింది. పలు టీవీ చానళ్లలోనూ ఈ అంశంపై చర్చ జరిగింది. ప్రముఖ సెఫాలజిస్టులు, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు తదితరులు వైఎస్సార్సీపీని రాష్ట్ర ప్రజలు ఆదరించటానికి కారణాలను విశ్లేషించారు. ఏపీలో జగన్‌ను ఎదుర్కొనే ధైర్యంలేకే టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాలంటూ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని శివసేన పార్టీ పత్రిక ‘సామ్నా’ తాజా సంపాదకీయంలో వ్యాఖ్యానించింది. చంద్రబాబు సర్కారు వైఫల్యాలు, అవినీతి, శాంతి భద్రతల వైఫల్యంపై జగన్ గట్టిగా పోరాడారని, నవరత్నాల ద్వారా అన్ని వర్గాలకు జగన్ చేరువయ్యారని హిందూస్తాన్ టైమ్స్ విశ్లేషించింది. వైఎస్సార్సీపీ విజయం సాధించనున్నట్లు ఎగ్జిట్ పోల్స్‌లో తేలడంపై రాష్ట్రమంతా చర్చ జరుగుతోంది. టీడీపీ ద్వంద్వ వైఖరిపై విస్మయం వ్యక్తమవుతోంది. ఒకపక్క లగడపాటి సర్వేను విశ్వసిస్తున్నట్లు చెబుతూ మరోవైపు ఇతర సంస్థలు నిర్వహించిన సర్వేలను నమ్మబోమనడం ఏం సంకేతాలనిస్తోందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. తమకు అనుకూలంగా ఉంటే సర్వేలను నమ్ముతామని లేదంటే వాటికి విశ్వసనీయత లేదనే ధోరణితో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నారు. క్లీన్‌స్వీప్ పార్టీల్లో అగ్రస్థానంలో వైఎస్సార్సీపీ ఈ ఎన్నికల్లో క్వీన్‌స్వీప్ చేసే పార్టీల్లో వైఎస్సార్సీపీ మొదటి స్థానంలో ఉంటుందని స్వరాజ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు యోగీంద్ర యాదవ్∙ పేర్కొన్నారు. వైఎస్ జగన్ నిజాయితీ, నిబద్ధతలకు తగిన ప్రతిఫలం లభించనుందని ‘యాక్సిస్ మై ఇండియా’ ఎండీ ప్రదీప్ గుప్తా చెప్పారు. ఎన్నికలకు నాలుగు నెలల ముందు నుంచి జగన్ ప్రణాళికాబద్ధంగా గ్రౌండ్ వర్క్ చేయడం, పాదయాత్ర ద్వారా క్షేత్ర స్థాయిలో ప్రజలకు చేరువ కావడం వైఎస్సార్సీపీ పట్ల ఆదరణ పెరగటానికి కారణాలని చెప్పారు. చంద్రబాబు కప్పదాటు వైఖరి కూడా మరో కారణమన్నారు. జగన్ అవిశ్రాంత కృషి, పార్టీ పునర్నిర్మాణంతో క్షేత్ర స్థాయిలో బలపడిందని రాజకీయ విశ్లేషకుడు సందీప్ శాస్త్రి అన్నారు. 2014 ఎన్నికల్లో జగన్ పార్టీ ఉత్తర కోస్తాలో కేవలం ఒక శాతం ఓట్ల తేడాతో సీట్లు కోల్పోయిందన్నారు.ఈసారి ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 45 శాతం, టీడీపీకి 38 శాతం ఓట్లు పడ్డాయన్నారు. ఓట్లలో 8 శాతం మార్పు వచ్చినా 70 సీట్ల వరకు తేడా వస్తుందన్నారు. రాజకీయ అభద్రతతోనే చంద్రబాబు ఢిల్లీ వైపు చూస్తున్నారని సీనియర్ జర్నలిస్టు టీఎం వీరరాఘవన్ పేర్కొన్నారు. డబ్బు ప్రామాణికం కాదు.. ఇమేజ్ పోతే మళ్లీ రాదు: సెఫాలజిస్ట్ భమిడిపాటి రామ్మూర్తి ‘ఎన్నికల సర్వేలకు డబ్బు ప్రామాణికం కాదు. వాస్తవ విరుద్ధమైన ఫలితాలు ప్రకటిస్తే సంస్థ ప్రతిష్ట దెబ్బ తింటుంది. ఒకసారి ఇమేజ్ పోతే మళ్లీ రాదు. సర్వేల్లో నిబద్దత ఉండాలి. ప్రజల్లో విశ్వసనీయ పెంచుకునేలా ఉండాలి. సర్వే నిర్వహణలో వ్యయప్రయాసలు ఉంటాయి కాబట్టి డబ్బు అవసరమే. అయితే డబ్బు ఒక్కటే ప్రామాణికం కాకూడదు. కొందరు ఒపీనియన్ పోల్‌ను కూడా ఎగ్జిట్ పోల్స్ అంటూ వైరల్ చేస్తున్నారు. ఇది సరికాదు. రాజకీయ పార్టీలు ఎ, బి, సి, డి పేరుతో ఇచ్చే ప్రశ్నలతో చేసే సర్వేల్లో కచ్చితమైన ఫలితాలు వచ్చే అవకాశంలేదు. సైంటిఫిక్‌గా సర్వే చేయాలి. సర్వే ఎవరు చేశారు? ఎప్పుడు చేశారు? ఎలా చేశారు? అనే వివరాలు ప్రజలకు నిష్పక్షపాతంగా అందించాలి. నేను ఐ న్యూస్ ఛానల్‌కు ఐ పల్స్ సర్వే చేశా. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో పనిచేసే ఒక యాప్ క్రియేట్ చేసి ఫ్రాక్సీ బ్యాలెట్ మెథడ్‌లో ఓటర్ల అభిప్రాయాలు సేకరించాం. రాష్ట్రవ్యాప్తంగా 1,100 మంది ప్రతినిధులు 50 వేల మంది ఓటర్ల(శాంపిల్స్) పోలింగ్ ఒక్క రోజులోనే సర్వే చేశాం. ఓటేసి వచ్చిన ఓటర్లను కలిసి ఏ పార్టీకి ఓటు వేశారో? ఆ మొబైల్ యాప్‌లో నొక్కమని చెప్పాం. మేం కూడా చూడకుండా నేరుగా ఓటరుతోనే యాప్‌లో ఓటు వేయించేలా చేశాం. మా సర్వే ఫలితాలను విశ్లేషిస్తే ఈ ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజార్టీతో వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తారని తేలింది. ఎన్నికల ప్రచారం నుంచి పోల్ మేనేజ్మెంట్ వరకు అన్ని దశల్లోను వైఎస్సార్సీపీ అద్బుతంగా చేసింది. ప్రజల నమ్మకాన్ని పొందిన జగన్మోహన్రెడ్డి ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుంటారని మా సర్వేలో అంచనాకు వచ్చాం’ వైఎస్సార్ సీపీకి 110 సీట్లు: ఫ్రొఫెసర్ వెంకటేష్, సీఎస్డీఎస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో 110 స్థానాలు వస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల శాంపిల్స్ సర్వేలో తీసుకున్నాం. 2014లో తెలుగుదేశం పార్టీకి 42 శాతం ఓట్లు ఉంటే 2019లో 36 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అభివృద్ధిపై చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మలేదు. అన్ని జిల్లాలను సమానంగా చూడటం లేదని గుర్తించారు. టీడీపీ మొదటి నుంచి పొత్తులతో మాత్రమే గెలుస్తూ వస్తోంది. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్, వైఎస్సార్సీపీలు పెట్టిన పథకాలను కాపీ కొట్టింది. నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో వైఎస్సార్సీపీ స్వీప్ చేస్తుంది. మా సర్వేను ఆంధ్రజ్యోతి పత్రిక వక్రీకరించి ప్రచురించింది. దీనిపై కేసు పెట్టాం. మా వద్ద నుంచి వారికి కాపీలు ఎలా వెళ్లాయి? పైగా తప్పుడు రాతలు రాశారు. అవి ఫ్యాషన్ సర్వేలు: ‘ఆరా’ మస్తాన్‌వలి ‘ఫ్యాషన్‌గా చేసే సర్వేల్లో శాస్త్రీయత ఉండదు. తెలంగాణ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ‘ఆరా’ సర్వే నిజమైంది. ఆంధ్రప్రదేశ్‌లో మా సర్వే పూర్తి శాస్త్రీయంగా సాగింది. నియోజకవర్గానికి 50 మంది అభిప్రాయాలతో కచ్చితమైన ఫలితం నిర్ణయించవచ్చు. అయినా సరే ఆరా ప్రతి నియోజకవర్గంలో 1,000 మంది అభిప్రాయాలు సేకరించింది. ఎన్నికల నోటిఫికేషన్ తరువాత వైఎస్సార్సీపీకి ప్రజాదరణ బాగా పెరిగింది. మేం పలు రాష్ట్రాల్లో సర్వేలు చేసినా కొద్ది కాలంలోనే ఇంత గణనీయమైన మార్పు ఎక్కడా చూడలేదు. 2014 ఎన్నికలతో పోల్చితే ఈసారి 0.67 శాతం మాత్రమే ఓటింగ్ శాతం పెరిగింది. పురుషుల ఓటింగ్ శాతం అంతే స్థాయిలో పెరిగింది. మా సర్వేలో వైఎస్సార్ కాంగెŠస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతంలో 47 శాతం మహిళల ఓట్లున్నాయి. అదే సమయంలో టీడీపీకి వచ్చిన మొత్తం ఓట్ల శాతంలో కేవలం 43 శాతం ఓట్లే మహిళలవి. నెల్లూరు జిల్లాలోనే మహిళల ఓట్లు అత్యధికంగా పోల్ అయ్యాయి. అక్కడ టీడీపీ ఒక్క సీటు కూడా గెలవదు. ఈసారి టీడీపీకి బీసీలు దూరమై 65–70 శాతం మంది వైఎస్సార్సీపీకి దగ్గరయ్యారు. కాపులు అత్యధికులు పవన్‌కల్యాణ్‌కు రాజ్యాధికారం దక్కదని వైఎస్సార్సీపీ వైపు మొగ్గు చూపారు. అయోమయంలో చంద్రబాబు: ప్రొఫెసర్ వేణుగోపాల్ (సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ (సీపీఎస్) చంద్రబాబు ఒక్కోసారి ఒక్కో విధంగా పొంతనలేకుండా మాట్లాడుతున్నారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయని ఒకసారి, ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరించిందని మరోసారి, 150 సీట్లలో విజయం సాధిస్తామని ఇంకోసారి అంటున్నారు. ఓట్ల లెక్కింపు వరకూ పార్టీ కార్యకర్తలను, ఏజెంట్లను నిలుపుకోవడం కోసం, వారిలో ఆత్మస్థయిర్యం కల్పించడానికే బాబు ఇలా అంటున్నారు. ఢిల్లీ, ఇతర రాష్ట్రాలు వెళ్లి నాయకులను కలుస్తూ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలని బాబుకు తెలిసినట్లు లేదు. అయితే బాబు ఇంట (రాష్ట్రంలో) గెలిచే పరిస్థితి లేదు. రాష్ట్రంలో టీడీపీకి 2– 3 ఎంపీ సీట్లు కూడా వస్తాయనే నమ్మకం లేదు. సర్వేలకు చంద్రబాబే ఆద్యుడు. ఏపీలో ప్రతినెలా వైఎస్సార్సీపీ పుంజుకుంటూ వచ్చినట్లు మేం శాస్త్రీయంగా నిర్వహించిన సర్వేల్లో తేలింది. మహిళలు, డ్వాక్రా మహిళలు టీడీపీకే ఓట్లేశారనుకోవడం తప్పు. ఈ విషయాన్ని పక్కా డేటాతోనే చెబుతున్నా. ఫిబ్రవరి మధ్యలో ఒకసారి, మార్చిలో మరోసారి మేం సర్వే చేశాం. డ్వాక్రా మహిళల్లో 45 శాతం మంది టీడీపీకి, 46 శాతం మంది వైఎస్సార్సీపీకి, మొత్తమ్మీద మహిళలను తీసుకుంటే 8 శాతం మంది అధికంగా బైఎస్సార్సీపీ వైపు మొగ్గు చూపారు. పసుపు – కుంకుమ కింద రూ. 10 వేలు ఇస్తే డ్వాక్రా మహిళలు తీసుకుని ఉండవచ్చు. వారు జగన్ ఇచ్చిన రుణమాఫీ, ఇతర హామీల ద్వారా కూడా ప్రయోజనం పొందాలని ఆశించారు. జగన్ – ఫ్యాన్’ అనే అంశం జనంలోకి రిథమిక్‌గా వెళ్లింది. పొలిటికల్ మేనేజిమెంట్, పబ్లిక్ మేనేజిమెంట్ ఇలా ఏ అంశాన్ని ప్రాతిపదికగా తీసుకున్నా వైఎస్సార్సీపీ ముందు వరుసలో నిలిచింది. ఎన్నికలకు పది రోజుల ముందు నాటికి టీడీపీ కంటే వైఎస్సార్సీపీని బలపరిచిన ఓటర్ల సంఖ్య 5 శాతానికి పెరిగింది. ఎన్నికల నాటికి వైఎస్సార్సీపీ ఓటు షేర్ టీడీపీ కంటే 9 శాతం ఎక్కువైంది. ఇవన్నీ శాస్త్రీయంగా చేసిన సర్వే గణాంకాలు. ఫోన్లలో చేసే సర్వేలు వాస్తవాలను ఏమాత్రం ప్రతిఫలించవు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎన్డీయేకి అనుకూలంగా ఉండటంతో సోమవారం సెన్సెస్ 1400 పాయింట్లుపైగ పెరిగింది. నిన్న ఎగ్జిట్‌పోల్ ఫలితాలు రాగానే ఒకరు నాతో రేపు సెన్సెస్ పరుగులు తీస్తుందన్నారు. అదే జరిగింది. ఎగ్జిట్ పోల్స్ కూడా సెన్సెస్‌ను ప్రభావితం చేసింది.టీడీపీకి 92 ప్లస్ ఆర్ మైనస్ 10 వస్తాయని లగడపాటి సర్వే పేర్కొంది. ఆ పది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలవు. ఇలా సర్వే ఫలితాలు ఉండరాదు. జగన్ అభ్యర్థులను బాగా ఎంపిక చేశారు జగన్ పార్టీ సీట్లు ఆశిస్తున్న వారి పేర్లు దగ్గర పెట్టుకుని ఎవరికి సీట్లు ఇస్తే బాగుంటుందనే అంశాన్ని చాలా చక్కగా అంచనా వేశారు. మంచి అభ్యర్థులను ఎంపిక చేశారు. స్వల్ప మెజార్టీలు ఉన్న చోట్ల గొడవలు జరుగుతాయి. అందువల్ల బాబు చివరివరకూ పార్టీ క్యాడర్‌ను నిలుపుకోవడం కోసం విజయం టీడీపీదే అంటున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఈవీఎంల పంచాయతీ ఎజెండాగా చంద్రబాబు పది రోజులు రాజకీయాలు నడిపిస్తారు. కొందరు డబ్బులకోసం, సొంత ప్రయోజనాల కోసం సర్వేలు చేయిస్తూ మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఏమాత్రం శాస్త్రీయత, నెట్ వర్క్ లేని సంస్థలు సర్వేలు చేసినట్లు ఫలితాలు ప్రకటించడం ఇందుకు నిదర్శనం. బెట్టింగుల కోసం కూడా సర్వేలను వాడుకుంటున్నారు. ఊరూపేరూలేని వారు సర్వేలు చేస్తూ మమ్మల్ని ప్రశ్నిస్తున్నాయి. 2006 నుంచి మేం శాస్త్రీయంగా సర్వేలు చేస్తున్నాం. శాస్త్రీయ సర్వేలు ఎప్పుడూ ఫెయిల్ కావు. ఎన్నికల కమిషన్ కోడ్ విధించినట్లే ఎగ్జిట్‌పోల్ సర్వే సంస్థలకూ కోడ్ ఉండాలి. మోడల్ కోడ్ లేకపోతే మైండ్ గేమ్ సర్వేలు నడుస్తాయి. -
జాతీయ మీడియానూ బాబు మోసం చేశారు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రెయిన్ గన్లతో రాష్ట్రంలో కరువును జయించామంటూ సీఎం చంద్రబాబు జాతీయ మీడియాను కూడా మోసం చేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. అనంతపురం జిల్లాలో ఐదు రోజుల పర్యటన ముగింపు సందర్భంగా ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. రాయలసీమలో కరువు లేదు, రైతులు సుభిక్షంగా, సంతోషంగా ఉన్నారంటూ చంద్రబాబు అబద్ధపు మాటలు చెప్పారని మండిపడ్డారు. నీళ్లు లేకుండా రేయిన్ గన్లతో పంటలను ఎలా కాపాడుతారని ప్రశ్నించారు. కనీసం 10–25 ఏళ్ల సుదీర్ఘ ప్రణాళిక లేకపోతే రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారుతుందని చెప్పారు. రాయలసీమ అంటే ముఠాల సంస్కృతి కాదన్నారు. ఈ ప్రాంతంలో చెరువులను కబ్జా చేశారని పేర్కొన్నారు. వాటికి పూర్వవైభవం తీసుకురావాలని ఆకాంక్షించారు. వైఎస్ జగన్ అసెంబ్లీకి వెళ్లాలి రాయలసీమ కరువుపై పాలక, ప్రతిపక్షాలు అసెంబ్లీలో చర్చించాలని పవన్ కల్యాణ్ సూచించారు. తాము పాలసీల గురించి మాట్లాడుతుంటే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తనపై వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాయలసీమపై, అనంతపురం జిల్లాపై అంత ప్రేమ ఉంటే అసెంబ్లీకి వెళ్లి చర్చించాలని చెప్పారు. ‘‘వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. అందుకని అసెంబ్లీకి వెళ్లబోమంటే ఎలా? ఎమ్మెల్యేలను కొనే నీచ సంస్కృతి రాజకీయ వ్యవస్థలో దశాబ్దాలుగా నాటుకుని ఉంది. టీడీపీ నేతలు మొత్తం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను తీసుకెళ్లినా, ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే జగన్ ఒక్కరే అసెంబ్లీకి వెళ్లాలి. అప్పుడు రాష్ట్రం మొత్తం ఆయన వెనుక నడుస్తుంది. అప్పుడు మాకు ఆయనపై మాట్లాడే హక్కు ఉండదు. కానీ, అసెంబ్లీని బహిష్కరిస్తున్నాననడం సరైంది కాదు. చంద్రబాబు చేసింది నీచమైన పనే. మొదట్నుంచీ ఖండిస్తున్నా. చంద్రబాబు చేసింది తప్పు. అయినా జగన్ మొండిగా అసెంబ్లీకి వెళ్లి ఉంటే బాగుండేది’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 175 స్థానాల్లో పోటీ చేస్తాం వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననేది జనవరి లేదా ఫిబ్రవరిలో స్పష్టం చేస్తామని పవన్ కల్యాణ్ చెప్పారు. రాష్ట్రంలో 175 స్థానాల్లో బరిలో ఉంటామని తెలిపారు. తమ బలం తెలుసుకునేందుకు, యువత రాజకీయంగా బలపడేందుకైనా గెలుపోటములతో నిమిత్తం లేకుండా పోటీ చేస్తామన్నారు. -
కథువా రేప్ కేసులో ఎవరి పాపం ఎంత?
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఎనిమిదేళ్ల ముస్లిం బాలికను కిడ్నాప్ చేసి, డ్రగ్స్ ఇచ్చి, వారం రోజుల పాటు రేప్ చేసి, చివరకు హత్య చేసిన దారుణ సంఘటనల క్రమంలో ఒళ్లు విరుచుకుంటూ మూడు నెలల తర్వాత జాతీయ మీడియా మేల్కొంది. దాంతో తప్పనిసరై రాజకీయ పార్టీల హడావిడి మొదలైంది. పరస్పరం బురద చల్లుకోవడం మొదలైంది. ఈ దారుణ రేప్ సంఘటనకు వ్యతిరేకంగా ఇండియా గేట్ వద్ద గురువారం రాత్రి జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. తన టార్గెట్ అయిన నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మహిళలకే కాకుండా పిల్లలకు కూడా రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. మైనర్ బాలికలను రేప్ చేసిన సంఘటనల్లో నేరస్థులకు ఉరిశిక్షలు విధించే చట్టాన్ని తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ప్రకటించారు. ముఫ్తీ ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగుతున్న బీజేపీలో ఇద్దరు మంత్రులు రేప్ నిందితులకు మద్దతుగా నిర్వహించిన పలు ర్యాలీలో పాల్గొన్నారు. కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ వారిపై ఎలాంటి చర్య తీసుకునేందుకు ముఖ్యమంత్రి ముఫ్తీ ధైర్యం చేయలేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ దారుణ రేప్ ఘటనపై ఇప్పటి వరకు పెదవి విప్పకుండా మౌనం వహిస్తూ వస్తోంది. ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్నట్లు కశ్మీర్ రాష్ట్ర పాలకులైన బీజేపీ, ముఫ్తీలతోపాటు కేంద్రంలోని బీజేపీకి, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి ఈ దారుణంలో పాపం ఉంది. జనవరి 11వ కథువా జిల్లా, రసన గ్రామంలో గుజ్జార్–బకర్వాల్ ముస్లిం కుటుంబానికి చెందిన 8 ఏళ్ల బాలిక ఇంటి పరిసరాల్లో అదృశ్యమైంది. వెంటనే ఆ పాప తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసినా వారి నుంచి పెద్దగా స్పందన లేదు. జనవరి 17వ తేదీన సమీపంలోని అటవి ప్రాంతంలో ఆ పాప మృతదేహం దొరికింది. దాన్ని పోస్ట్‌మార్టమ్‌కు పంపించగా, ఆ పాపకు డ్రగ్స్ ఇచ్చి దారుణంగా రేప్ చేసినట్లు తేలింది. దీనిపై దర్యాప్తు జరిపిన స్థానిక పోలీసులు దీపు భయ్యా అనే 15 ఏళ్ల బాలుడిని ప్రధాన నిందితుడిగా కేసు దాఖలు చేశారు. ఆ బాలుడు అమాయకుడని స్థానికులు చెప్పడం, మొదట పోలీసుల చిత్రహింసలకు నేరాన్ని తనపై వేసుకున్న ఆ బాలుడు ఆ తర్వాత తాను కాదని చెప్పడం స్థానికంగా సంచలనం సృష్టించింది. కేసును క్రైమ్‌బ్రాంచ్‌కి అప్పగించాల్సిందిగా స్థానిక బీజేపీ, ఆరెస్సెస్ నాయకులు గొడవ చేశారు. సీఎం ముఫ్తీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు కేసును అప్పగించారు. జనవరి 23వ తేదీన ఈ కేసును టేకప్ చేసిన ఆ పోలీసులు మూడు రోజుల్లోనే కశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న ప్రత్యేక భద్రతా దళానికి చెందిన దీపక్ కజారియా, సురీందర్ వర్మలను అరెస్ట్ చేశారు. వారు ఎక్కడి వారో, ఏ బెటాలియన్‌కు చెందిన వారో, వారి హోదా ఏమిటో ఇంతవరకు దర్యాప్తు అధికారులు వెల్లడించలేదు. వీరిద్దరు కూడా అగ్రవర్ణానికి చెందిన హిందువులవడంతో వీరికి మద్దతుగా ఫిబ్రవరి 14, 17 తేదేల్లో బీజేపీ, ఆరెస్సెస్ కార్యకర్తలు ప్రదర్శనలు జరిపారు. కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అప్పుడే కొత్తగా ‘హిందూ ఏక్తా మార్చ్’ను ఏర్పాటు చేసిన కశ్మీర్ బీజేపీ ప్రధాన కార్యదర్శి, న్యాయవాది విజయ్ వర్మ ఫిబ్రవరి 17న నిందితులకు మద్దతుగా భారీ ర్యాలీ తీశారు. ఆ ర్యాలీలో కథువా బీజేపీ అధ్యక్షుడు విజయ్ శర్మతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలోని ఇద్దరు బీజేపీ మంత్రులు హాజరయ్యారు. నాలుగువేల మంది పాల్గొన్న ఈ ర్యాలీలో ఎక్కువ మంది మహిళలు పాల్గొనడం ఆశ్చర్యం. ఇదే ర్యాలీలో ‘భారత మాతాకీ జై, పాకిస్తాన్ మురదాబాద్’ అంటూ నినాదాలు చేయడమే కాకుండా జాతీయ జెండాలను ప్రదర్శించడం మరింత ఆశ్చర్యం. ఫిబ్రవరి 17వ తేదీనే కథువా జిల్లా హీరానగర్‌లో కొంత మంది అగ్రవర్ణాలకు చెందిన హిందూ పెద్దలు సమావేశమై గుజ్జార్ బకర్వాల్ ముస్లిం కుటుంబాలను వెలివేయాలని తీర్మానించారు. ఆ కుటుంబాల్లో ఎవరిని వ్యవసాయ కూలీలుగా కూడా తీసుకోరాదని కట్టుబాటు విధించారు. ఆ సమావేశానికి రాష్ట్ర బీజేపీ మంత్రి రష్పాల్ వర్మ, హీరానగర్ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ వర్మతోపాటు కథువా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుభాష్ గుప్తా కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్న జమ్మూ హైకోర్టు బార్ అసోసియేషన్ కూడా రేప్ కేసును నీరుకార్చేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అయినా రాహుల్ గాంధీ సదరు నాయకులపై ఎలాంటి చర్య తీసుకోలేదు. కథువా రేప్ కేసు తనకు తెలియనట్లుగానే నటిస్తూ వచ్చారు. మీడియా వార్తలతో ఇప్పుడు వీధిలోకి వచ్చారు. జమ్మూలోని హిందూ మెజారిటీ, కశ్మీర్‌లోని ముస్లిం మెజారిటీ నాటకాలకు తెరపడనంత కాలం ఈ రాజకీయ పార్టీల తీరు ఇంతే! (గమనిక: సాక్షి వెబ్సైట్ కథువా రేప్ ఘటనపై ఎప్పటికప్పుడు కథనాలు ఇస్తూ వస్తోంది. ‘ఇంతటి దారుణంలో నిజమైన నేరస్థులెవరో’ చదవండి) -
టీడీపీ నాటకాలను ఎండగట్టిన జాతీయ మీడియా
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చామంటూనే వెల్‌లోకి వెళ్లి తెలుగుదేశం పార్టీ ఆందోళన చేసిందని, ఇలా ఎందుకు నాటకం ఆడుతోందని ఎండగడుతూ ఓ జాతీయ ఛానల్ మంగళవారం కథనాలు ప్రసారం చేసింది. అవిశ్వాస తీర్మానం ఇచ్చినప్పుడు దాన్ని ప్రవేశపెట్టేందుకు వీలుగా సభాపతి సభ్యుల బలాన్ని లెక్కించాల్సి ఉంటుందని, సభ సజావుగా లేనప్పుడు ఈ సంఖ్య లెక్కించడం సాధ్యం కాదని, ఈ సంగతి తెలిసీ టీడీపీ ఎంపీలు వెల్‌లోకి ఎందుకు వెళ్లారంటూ రోజంతా చర్చ నిర్వహించింది. చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ రెండేళ్ల క్రితమే ప్యాకేజీకి అంగీకరించి ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం మళ్లీ ప్రత్యేక హోదా అంటూ ఆందోళన చేస్తోందని విశ్లేషించింది. అవిశ్వాసానికి నోటీసులివ్వడం, మళ్లీ అది చేపట్టకుండా వెల్‌లోకి వెళ్లడం టీడీపీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని పేర్కొంది. -
ప్రశ్నించే వారి గొంతు నొక్కుతారా?
-
కోడెల మాటల్లో తప్పేముంది?
మహిళలపై స్పీకర్ వ్యాఖ్యలను సమర్థ్ధించిన సీఎం జాతీయ మీడియా అమ్ముడుపోయిందంటూ వ్యాఖ్యలు ⇒ కోడెల పాజిటివ్‌గా చెబితే నెగిటివ్ ప్రచారం చేశారని మండిపాటు ⇒ మహిళా పార్లమెంట్ సదస్సు విజయవంతమైతే ఏదేదో రాస్తారా? సాక్షి, అమరావతి : ‘స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు మాటల్లో తప్పేముంది.. ఎక్కడ తప్పుంది? ఆయన భావ వ్యక్తీకరణలో తేడా ఉంది.. స్పీకర్నే అప్రతిష్ఠపాలు చేస్తారా? స్పీకర్ స్థానానికి గౌరవం ఇవ్వరా? ఆయన మహిళల గురించి పాజిటివ్‌గా చెబితే మీరు నెగిటివ్‌గా రాసి ఇష్యూ చేస్తారా? హద్దులు అందరికీ ఉన్నాయి. దాటితే అందరూ బాధ్యులే. నేషనల్ మీడియా కూడా ఇష్టం వచ్చినట్లు రాసింది. దాన్ని కూడా డబ్బులు పెట్టి కొనేశారు’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. సోమవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళా పార్లమెంట్ సదస్సుకు సోషల్ మీడియా ద్వారా మంచి స్పందన వచ్చిందని, 7,71,74,960 మందిని ప్రభావితం చేశామన్నారు. సదస్సుకు ఎమ్మెల్యే రోజాను ఆహ్వానించి, తీరా ఆమెను రానివ్వకుండా పోలీసుల ద్వారా అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించగా ‘ఏం చెప్పారు.. మేమొచ్చి గొడవ చేస్తామన్నారు. పోలీసులకు ఆ సమాచారం ఉంటే యాక్ట్ చేయరా? రభస చేస్తాం అంటే వదిలి పెడతారా.. లేకుంటే పోలీసులపై మేం చర్యలు తీసుకోమా? అందుకే వారి పని వారు చేశారు. మహిళా పార్లమెంట్‌ను డిస్ట్రబ్ చేయటానికి అన్ని ప్రయత్నాలు చేశారు. తుని ఘటనతో ప్రతిష్ట పోగొట్టారు, వైజాగ్‌లో రిపబ్లిక్ డే రోజున ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. తిరుపతిలో సైన్స్ కాంగ్రెస్‌ను అడ్డుకునే యత్నం చేశారు. ఇలా ప్రతి దానినీ అడ్డుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది. అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ, మంత్రులు తెలుగుదేశం పార్టీ వారు, తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిందనే సెన్స్ కూడా లేకుండా రాశారు. సైకిల్ టీడీపీది, టీడీపీకి ప్రజలు ఓట్లు వేశారు. ఇది తప్పు ఎలా అవుతుంద’ని ప్రశ్నించారు. ‘డెలిగేట్స్ ఆవులిస్తే నిదురపోతున్నారని రాశారు. మీకు ఆవులింతలు రావా? నెగటివ్‌గా రాయాలని కొందరిలో జీర్ణించుకుపోయింది. డెక్కన్ క్రానికల్ కూడా, జాతీయ మీడియా కూడా వ్యతిరేకంగా రాసింది. అసత్య ప్రచారం చేసింద’ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంతకూ కోడెల ఏమన్నారంటే.. జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు ప్రారంభానికి ముందు బుధవారం విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో ఏపీడబ్ల్యూ జే ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మహిళల భద్రతపై విలేకరులు అడిగిన వివిధ ప్రశ్నలకు రాష్ట్ర శాసనసభ సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాద్ సమాధానమిస్తూ.. ‘ఒక వెహికల్ కొన్నారనుకోండి. ఇంట్లో, షెడ్లో పెడితే యాక్సిడెంట్లు జరగవు కదా.. అదే బజారుకు పోతే, రోడ్డు ఎక్కితేనే యాక్సిడెంట్ జరిగే అవకాశాలుంటాయి. 50 కిలోమీటర్ల తక్కువ స్పీడులో పోతే యాక్సిడెంట్లు అయ్యేందుకు తక్కువ అవకాశాలుంటాయి. 100 కిలోమీటర్ల స్పీడులో వెళితే యాక్సిడెంట్లు పెరుగుతాయి. అలాగే ఆడ పిల్లలు హౌస్ వైఫ్‌లా గతంలోలా ఉంటే వాళ్లమీద ఏమీ జరగవు. ఎక్సెప్ట్ డిస్క్రిమినేషన్ (లింగ వివక్ష లేకపోతే). వాళ్లు ఇప్పుడు చదువుతున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. వ్యాపారాలు చేస్తున్నారు. దే ఆర్ ఎక్స్పోజ్డ్ టు సొసైటి. అలా ఎక్స్పోజ్ అయినప్పుడు ఇలాంటివి జరుగుతాయి. ఈవ్‌టీజింగ్ కావచ్చు, హరాస్మెంట్ కావచ్చు. అట్రాసిటీస్ కావచ్చు. రేప్స్ కావచ్చు. కిడ్నాప్స్ కావచ్చు. పెరుగుతున్నాయి. ఇళ్లలో నుంచి బయటకు పోకపోతే జరగవు’ అన్నారు. మద్దతివ్వకపోతే వైఎస్సార్ జిల్లాను అభివృద్ధి చేయలేను: సీఎం వైఎస్సార్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతివ్వకపోతే అక్కడ అభివృద్ధి పనులు చేయలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. విజయవాడ శేషసాయి కల్యాణ మండపంలో సోమవారం వైఎస్సార్ జిల్లా టీడీపీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. మీడియాను అనుమతించకుండా నిర్వహించిన ఈ సమావేశంలో కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని ఎలా గెలుచుకోవాలనే అంశంపై చర్చించారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డిపై ఆరోపణలు చేయాలని పార్టీ నేతలకు సూచించారు. ఒక్క వైఎస్సార్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం పోయినా తనకు వచ్చే ఇబ్బంది లేదని, కానీ అభివృద్ధి కావాలంటే తనను బలపరచా లన్నారు. సమావేశంలో కడప జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీలు జేసీ దివాకర్‌రెడ్డి, సీఎం రమేష్, జిల్లా నేతలు పాల్గొన్నారు. -
జాతీయ మీడియాపై బాబు సంచలన వ్యాఖ్యలు
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి తన ఆక్రోశాన్ని వెల్లగక్కారు. విజయవాడలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ జాతీయ మీడియా సంస్థలపై దుమ్మెత్తిపోశారు. మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు వస్తున్న ఎమ్మెల్యే రోజాను అడ్డుకోవడాన్ని ఆయన సమర్థించుకున్నారు. ( చదవండి : ఎమ్మెల్యే రోజాపై నిస్సిగ్గుగా అరాచకం ) మూడు రోజుల జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సుపై జాతీయ మీడియా సంస్థలు పెద్ద హడావుడి చేశాయని మండిపడ్డారు. డబ్బులతో అందర్నీ కొనేశారని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళ సదస్సు బాగా జరిగితే కొన్ని జాతీయ పత్రికలు నెగిటివ్‌గా రాశారని అసహనం వ్యక్తం చేశారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు మహిళలపై చేసిన వ్యాఖ్యలను కూడా సీఎం తనదైన స్టైల్లో సమర్థించారు. ఆయన చేసిన వ్యాఖ్యల్లో తప్పేంలేదని కేవలం ఎక్స్ప్రెషన్ ప్రాబ్లమేనన్నారు. స్పీకర్ వ్యాఖ్యలను వక్రీకరించారని మీడియాపై బాబు ఫైర్ అయ్యారు. ( చదవండి : మహిళలపై స్పీకర్ కోడెల వ్యాఖ్యలు ) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను పోలీసులు అడ్డుకోవడంలో ఎలాంటి తప్పు లేదన్నారు. సదస్సులో గొడవ చేస్తారన్న ఉద్దేశంతో అడ్డుకున్నామని చెప్పారు. పోలీసులు ఆమెను అనుమతించివుంటే పరిణామాలు మరో విధంగా ఉండేవన్నారు. అప్పుడు పోలీసులపై చర్యలు తీసుకోవాల్సి ఉండేదని అందుకే ముందస్తుగా అడ్డుకున్నారన్నారు. -
నేనే రద్దు చేయమన్నా..!
- పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా నేను మాట్లాడలేదు - కలెక్టర్ల సదస్సులో మళ్లీ మాటమార్చిన బాబు సాక్షి, అమరావతి: నోట్లరద్దు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ మాటమార్చారు. తొలుత ఈ ఘనత తనదేనన్నంతగా చెప్పిన సీఎం ప్రజల్లో వ్యతిరేకతను చూసి అబ్బే.. నేను చెప్పలేదనడం తెలిసిందే. మళ్లీ తాజాగా అన్ని సమస్యలకు కారణమవుతున్న పెద్దనోట్లను రద్దు చేయాలని తానే చెప్పానని కలెక్టర్ల సదస్సులో ఆయన ఘనంగా ప్రకటించారు. నోట్ల రద్దును మనం కోరుకోలేదని, ఇబ్బందులున్నాయని ముందు రోజు చెప్పిన ఆయన ఆ మాటలు జాతీయ మీడియాలో ప్రసారం కావడం, ఢిల్లీ పెద్దల దృష్టికి వెళ్లడటంతో భవిష్యత్తులో తనకు ఇబ్బం ది అని భావించి మాట మార్చేశారు. పైగా లోటు పాట్లను ప్రస్తావించానే తప్ప నోట్ల రద్దు కు వ్యతిరేకంగా తాను వ్యాఖ్యలు చేయలేదం టూ సమర్థించుకున్నారు. విజయవాడలో బుధవారం ప్రారంభమైన కలెక్టర్ల రెండు రోజుల సదస్సులో సీఎం ప్రసంగించారు. నోట్ల రద్దు తర్వాత తలెత్తిన సమస్యలు ఇంకా పూర్తి గా పరిష్కారం కాలేదన్నారు. నగదు రహితంపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు చర్య లు తీసుకోవాలని సూచించారు. సెల్ఫోన్లో రూ.2000 విలువ చేసే బయోమెట్రిక్ డివైస్‌ను అమర్చుకుంటే సర్వీసు చార్జీలు లేకుండా షాపింగ్ చేసుకోవచ్చన్నారు. ఈ డివైస్‌ను తీసుకునేందుకు ముందుకొచ్చేవారికి రూ.1000 సబ్సిడీ ఇవ్వనున్నట్లు తెలిపారు. విజయవాడ బందరు రోడ్డులో దుకాణాలన్నింటినీ నగదు రహితంగా మార్చామని, కలెక్టర్లు, అధికారులు బుధవారం సాయంత్రం షాపింగ్ చేసి తమ అనుభవాలను గురువారం చెప్పాలని సూచించారు. నగదు రహిత కార్యకలాపాలపై నియమించిన సీఎంల కమిటీ ఈనెల 28న సమావేశమవుతున్నట్లు తెలిపారు. రెవెన్యూ, విద్యుత్‌శాఖల్లో తగ్గని అవినీతి రాష్ట్రంలో రెవెన్యూ, విద్యుత్‌శాఖల్లో అవినీతి తగ్గకపోవడం బాధాకరమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పోలీసుశాఖలో అవినీతిని రూపుమాపేందుకు ప్రత్యేకంగా కెమెరాలు సరఫరా చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్లెక్సీలను రద్దు చేయడానికి అవసరమైతే చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు. కుటుంబ వికాసానికి 15 అంశాలు, సమాజ వికాసం కోసం 10 సూత్రాలతో ఒక ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. పార్లమెంటరీ కమిటీ సమావేశాలు ఇక నుంచి విజయవాడలోనే నిర్వహించాలని సూచించారు. రెండో త్రైమాసికంలో 12.23 శాతం వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసిక ఆర్ధిక ఫలితాలను సీఎం విడుదల చేశారు. ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో డిస్టింక్షన్లో ఉత్తీర్ణత సాధించినప్పటికీ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోయామని అన్నారు. రెండవ త్రైమాసికంలో 12.23 శాతం వృద్ధి రేటు సాధించామని, దేశ వృద్ధి రేటు మాత్రం 7.1 శాతం ఉందన్నారు.పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నాబార్డు ద్వారా రూ.1,981.54 కోట్లు సమకూరినట్లు సీఎం చెప్పారు. ఈ మేరకు కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి తనకు రాసిన లేఖను ఆయన చదివి వినిపించారు. గృహ నిర్మాణానికి, సిమెంటు రోడ్లకు సిమెంట్ బస్తా రూ.230, ఇతర పనులకు రూ.240, పోలవరం ప్రాజెక్టుకు రూ.250ల ప్రకారం సిమెంట్ సరఫరా చేయని సిమెంట్ కంపెనీలకు విద్యుత్ సరఫరా నిలిపేస్తామని చెప్పారు. అధికార పార్టీ నేతలు ప్రతిపాదించిన పరిశ్రమలకు అనుమతుల మంజూరులో జాప్యమైతే సహించేదిలేదని సదస్సులో సీఎం కలెక్టర్లను హెచ్చరించినట్లు తెలిసింది. కలెక్టర్లు చెప్పిన అంశాలను పట్టించుకోకుండా తన ఆదేశాలు అమలు చేయాలన్నట్లు తెలిసింది. -
ఎవరీ వేటగాడు
కేంద్ర మంత్రులు మేనకాగాంధీ-ప్రకాశ్ జవదేకర్ మధ్య గురువారం మాటల యుద్ధం... నేషనల్ మీడియాలో కథనాల ప్రవాహం... కారణం ‘వేట’... బీహార్‌లోని మకామా ప్రాంతంలో ఓ వేటగాడు బ్లూబుల్స్‌ని కాల్చిచంపిన ఘటన..! మంత్రుల మధ్య మాటల యుద్ధానికి ‘కేంద్ర’మైన వేటగాడు ఎవరో కాదు. నగరంలోని రెడ్‌హిల్స్‌కు చెందిన నవాబ్ షఫత్ అలీఖాన్. ఆయన నేపథ్యం ఏమిటి..? - సాక్షి, సిటీబ్యూరో అసలేం జరిగింది... బీహార్‌లోని మకామా ప్రాంతం.. బ్లూబుల్స్ స్వైర విహారం.. రైతులకు తీవ్రనష్టం... వీటిని కట్టడి చేసేందుకు సర్కార్ శతవిధాలా ప్రయత్నించింది. తప్పనిసరి పరిస్థితుల్లో సిటీహంటర్ షఫత్ అలీఖాన్ సాయం కోరింది. సమాచారం అందుకున్న ఖాన్ ఈ నెల 5న హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. బీహార్ రాష్ట్ర అటవీ శాఖ అధికారులతో కలిసి పరిస్థితుల్ని అధ్యయనం చేశారు. బ్లూబుల్స్‌ని కాల్చి చంపడమే పరిష్కారమని తేల్చారు. ఆ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో అలీఖాన్ రంగంలోకి దిగారు. నాలుగు రోజుల్లో 300 బ్లూబుల్స్‌ని చంపారు. ఈ విషయంపై ఓ జాతీయ ఛానల్ గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రి, జంతు ప్రేమికురాలు మేనకాగాంధీని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఆమె తన సహచర మంత్రి ప్రకాశ్‌జవదేకర్, బీహార్ సీఎం నితీష్ కుమార్‌లను తీవ్రస్థాయిలో విమర్శించారు. జవదే కర్ సైతం ఘాటుగా స్పందించారు. మంత్రుల మధ్య మాటల యుద్ధానికి సిటీ హంటర్ షఫత్ అలీఖాన్ కేంద్రబిందువయ్యారు. వేటగాడి చరిత్ర... పేరు: నవాబ్ షఫత్ అలీఖాన్ నివాసం: రెడ్‌హిల్స్ కుటుంబ నేపథ్యం: అలీఖాన్ తాత బహదూర్ బ్రిటిష్‌ఇండియాకు అటవీ సలహాదారు. బ్రిటీష్ హయాంలో 50 ఏనుగులు, 10 మానీటర్లను మట్టుపెట్టారు. వేటలో ఓనమాలు 1976లో 19 ఏళ్ల వయసులో అలీఖాన్ తొలి ‘తూటా’ పేల్చారు. కర్ణాటకలోని మైసూర్ సమీపంలో ఉన్న హెచ్డీ కోటలో 19 మందిని పొట్టనపెట్టుకున్న ఏనుగును హతమార్చారు. తర్వాత కాలంలో ప్రజల ప్రాణాలు తీస్తున్న 7 ఏనుగులు, 3 పులులు, 12 చిరుతల్ని హతమార్చారు. బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాల కోరిక మేరకు ఆయా రాష్ట్రాల్లో రైతులు, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న 1500 అడవి గేదెలు, వేల సంఖ్యలో అడవి పందులు, వందలాది అడవి కుక్కల్ని చంపారు. ప్రత్యేకత మ్యాన్-యానిమల్ కన్ఫ్లిక్ట్, తుపాకీ కాల్చడం వంటి అంశాల్లో తర్ఫీదు ఇవ్వడంలో దిట్ట. వివిధ రాష్ట్రాల్లోని అటవీ శాఖ అధికారులకు శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుత హోదా బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వాలకు అటవీ విభాగం సలహాదారు. జంతుప్రేమికుడు... ఇతడిలో జంతు ప్రేమికుడు దాగి ఉన్నాడు. అంతరించిపోతున్న పులుల సంతతిపై ‘ప్రాజెక్ట్ టు సేవ్ ది టైగర్’ పేరుతో అధ్యయనం చేస్తున్నారు. ‘‘హైదరాబాద్ నుంచి వచ్చిన షూటర్ కుటుంబం మూడు తరాల నుంచి జంతువుల్ని వేటాడుతోంది’’ - కేంద్ర మంత్రి మేనకాగాంధీ ‘‘మూడు తరాల నుంచి మా కుటుంబం సమాజం కోసమే వేటాడుతోంది’’ - సిటీ హంటర్ నవాబ్ షఫత్ అలీఖాన్ -
ఒక రోజు వేడుక కోసం వందల కోట్లా..
-
జయదేవ్ మాత్రమే మాట్లాడాలట!
ఇక నుంచి జాతీయ మీడియాతో పార్టీలో ఎవరు పడితే వారు మాట్లాడటానికి వీలులేదని చంద్రబాబు నేతలకు హుకుం జారీ చేశారు. అదేంటి అలా కట్టడి విధించడమేంటా? అని ఆరా తీసిన నాయకులకు అసలు విషయం తెలిసింది. గోదావరి పుష్కరాల తొలి రోజున ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రచార కాంక్ష వల్ల 30 మంది పుష్కర యాత్రికులు మరణించారు. ఈ ఘటన ఏపీ ప్రభుత్వ పరువును జాతీయ స్థాయిలో మసకబార్చింది. జాతీయ టివీ చానళ్లు ఇదే అంశంపై చర్చను చేపట్టాయి. వివిధ రంగాల్లోని ప్రముఖులు, ఇతర రాజకీయ పార్టీల నేతలు ఈ చర్చల సందర్భంగా టీడీపీ నేతలు, మంత్రులను వ రుస పెట్టి శరపరంపరగా వచ్చిన ప్రశ్నలకు కనీసం సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. వచ్చీరాని ఆంగ్ల భాషతో మరింత ఇబ్బంది పడ్డారు. ఒకానొక సందర్భంలో వితండవాదన చేసి నవ్వుల పాలయ్యారు. ఈ చర్చల సరళిని పార్టీ వర్గాలు అధినేత చంద్రబాబుకు బ్రీఫింగ్ ఇచ్చారు. దాంతో పరువు తీశారంటూ సణుక్కున్న చంద్రబాబు ఇలాంటి చర్చాగోష్టుల్లో గుంటూరు లోక్‌సభ సభ్యుడు గల్లా జయదేవ్ మాత్రమే మాట్లాడాలని ఆదేశించారట. ఆయనొక్కరే ఎందుకు మాట్లాడాలని ఒకరిద్దరు ఎంపీలు మనస్సు ఉండబట్టలేక ప్రశ్నిస్తే ఆయనకు ఆంగ్ల భాషా పరిజ్ఞానం మీకంటే బాగా ఎక్కువగా ఉంది, జాతీయస్థాయి మీడియాకు ఇక ఆయనే బ్రీఫింగ్ ఇస్తారన్నారట.! -
బాబే బాధ్యుడు!
చంద్రబాబు ప్రచారార్భాటమే 29 మంది ప్రాణాలు తీసిందని దుమ్మెత్తిపోసిన జాతీయ మీడియా గోదావరి పుష్కరాల తొలిరోజున రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటలో 29 మంది దుర్మరణం పాలవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిదే బాధ్యత... డాక్యుమెంటరీ షూటింగ్కోసం లక్షలాదిమంది భక్తులను 2.30 గంటలపాటు పుష్కరఘాట్‌లోకి అనుమతించకపోవడంవల్లే తొక్కిసలాట జరిగింది. దానికి పూర్తి బాధ్యత చంద్రబాబుదే... అధికారులు, భక్తులే బాధ్యులనడం సిగ్గుచేటు... జరిగిన దుర్ఘటనకు సిగ్గుపడకుండా టీడీపీ నేతలు సమర్థించుకుంటున్నారు... ఇలాంటి సిగ్గులేని నాయకులున్నందుకు మనం సిగ్గుపడాలంటూ జాతీయ మీడియా విరుచుకుపడింది. గోదావరి పుష్కర దుర్ఘటనపై ప్రముఖ జాతీయ చానల్ ‘టైమ్స్ నౌ’లో ఎడిటర్ ఇన్ చీఫ్ అర్ణబ్ గోస్వామి రెండు రోజులు ప్రత్యేక చర్చ నిర్వహించారు. ఈ చర్చలో మాజీ కేబినెట్ సెక్రటరీ టీఆర్ఎస్ సుబ్రమణ్యం, మాజీ ఐఏఎస్ అధికారి అరుణ్ భాటియా, సామాజిక ఉద్యమకారులు కంచె ఐలయ్య, రావుల ఈశ్వర్, వినియోగదారుల హక్కుల నిపుణులు బెజోన్ మిశ్రా ఏపీ మంత్రులు పల్లె రఘునాథ్‌రెడ్డి, పి నారాయణ, కాంగ్రెస్ నేతలు బ్రజేశ్ కలప్ప, మధుయాష్కీగౌడ్ తదితరులు పాల్గొన్నారు. పుష్కరాల్లో పుణ్యస్నానాలు చేయడానికి వచ్చిన ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రచార యావను ‘టైమ్స్ నౌ’ చీఫ్ ఎడిటర్ అర్ణబ్ గోస్వామితోసహా ప్రముఖులంతా తీవ్రంగా ఎండగట్టారు. సామాజిక, రాజకీయ, పాలనారంగ నిపుణులను చర్చలో భాగస్వాములను చేసి నిర్వహించిన ఈ డిబేట్ చంద్రబాబు చేసిన తప్పును ప్రపంచానికి చాటిచెప్పింది. అర్ణబ్ గోస్వామి ప్రశ్నలు సంధించిన తీరు, టీడీపీ నేతలు తమ తప్పులను సమర్థించుకున్న తీరు ఎలా సాగిందో ఓసారి మీరే చదవండి.. ‘‘ముఖ్యమంత్రి, ఇతర వీవీఐపీలకోసం పుష్కరఘాట్‌ను బ్లాక్‌చేసి, అందులోకి భక్తులు ప్రవేశించకుండా రెండు గంటలపాటు నిలిపివేయడం, లక్షలాది మంది భక్తులను పోలీసులు నియంత్రించలేకపోవడమే తొక్కిసలాట జరగడానికి కారణమని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదికలోని అంశాలు స్పష్టంచేస్తున్నాయి. అసలు వీఐపీలకోసం ప్రత్యేక ఘాట్లు ఎందుకు? దాన్ని వదిలి ముఖ్యమంత్రి ప్రజలకోసం కేటాయించిన ఘాట్‌కు వెళ్లడం ఎందుకు? ఉదయం 6.26 గంటలకు పుష్కర తొలిస్నానం చేయడానికి ముఖ్యమంత్రికేమైనా ప్రత్యేక హక్కులున్నాయా? ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రచారంకోసం తీసే డాక్యుమెంటరీ షూటింగ్కోసం గంటల తరబడి ప్రజలను బయటనే నిలపడం ఎందుకు? దీనివల్ల జరిగిన తొక్కిసలాటలో 29 మంది మరణాలకు మీ ముఖ్యమంత్రి, మీ పార్టీ బాధ్యత తీసుకుంటారా?’’ అని అర్ణబ్ నిలదీశారు. పుష్కరాలు ప్రారంభించడం ముఖ్యమంత్రి హక్కు. ఆయన అక్కడ కేవలం పది నిమిషాలు మాత్రమే ఉన్నారు. అక్కడ ఎలాంటి ఫిలిం షూటింగ్ లేదు’’ అని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇచ్చిన సమాధానంతో అర్ణాబ్ నిర్ఘాంతపోయారు. ‘‘సరే కాస్సేపు మీరే కరెక్ట్ అనుకుందాం. సీఎం ఉదయం 6.26 గంటలకు తొలి పుష్కరస్నానం చేయడం నిజంకాదా? ముఖ్యమంత్రి కంటే ముందు ఎంతమంది భక్తులు స్నానం చేశారో చెప్పండి. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఏ అధికారంతో అక్కడున్నారు? వారేమైనా పబ్లిక్ సర్వెంట్సా?’’ అని ప్రశ్నించారు. ‘‘పుష్కరాలకోసం 40 వేలమంది పోలీసులను మోహరించాం. ప్రతిపక్షాలే దీన్ని రాజకీయం చేస్తున్నాయి. మృతుల కుటుంబ సభ్యులెవ్వరూ విమర్శించడంలేదు’’ అంటూ సీఎం రమేశ్ పొంతనలేని సమాధానం చెప్పారు. మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సమాధానమిస్తూ.. ‘‘రాజమండ్రిలో జరిగిన ప్రమాదానికి అధికారులదే బాధ్యత. ప్రజలను నియంత్రించాల్సిన బాధ్యతను వారు మరచిపోవడంవల్లనే ఈ దుర్ఘటన జరిగింద’ంటూ తప్పును అధికారులపైకి నెట్టివేశారు. ‘‘ముఖ్యమంత్రి తన మందీమార్బలంతో ఘాట్‌లో రెండు గంటలపాటు ఉంటే అధికారులేం చేస్తారు? పబ్లిసిటీ గిమ్మిక్ కోసం సీఎంను అక్కడకు ఎవరు వెళ్లమన్నారు?’’ అని సూటిగా అడిగారు. ‘‘చంద్రబాబు రాజకీయ నాయకుడు కాదు, రాజనీతిజ్ఞుడు. ఆయనకు ప్రచారం అవసరంలేదు. పుష్కరాల్లో పాల్గొనేలా మోటివేట్ చేసేందుకే ఆయన తొలిస్నానం చేశారు’’ అని పల్లె సమర్థించుకోచూశారు. ‘‘అవునా.. అయితే ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు నారాయణ, రావెల కిషోర్‌బాబు, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాస్, సీఎం కుమారుడు లోకేశ్‌బాబు సీఎంతో పాటు పుష్కరస్నానం చేయలేదా? వారికోసం ఆ ఘాట్‌ను బ్లాక్చేయలేదా? భద్రతా బలగాలు మొత్తం వీవీఐపీల చుట్టూ ఉండటంవల్లనే లక్షలాదిమంది భక్తులను నియంత్రించేందుకు ఎవరూ లేకపోవడం నిజంకాదా?’’ అని నిలదీశారు. ‘‘ఉదయం 6.26 గంటలకు పుష్కరస్నానం చేస్తే మంచిదన్న ప్రచారంవల్లనే ప్రజలు ఎక్కువగా వచ్చారు. అందుకే ఈ దుర్ఘటన జరిగింది. అయినా మా ప్రభుత్వం మీద ఉన్న విశ్వాసంవల్ల భక్తులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నారు’’ అని నారాయణ సమర్థించుకోచూశారు. దీంతో చర్చలో పాల్గొన్న ప్రముఖులందరూ ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. అలా మాట్లాడటానికి సిగ్గులేదా? అని మండిపడ్డారు. భక్తుల మనోభావాలను ప్రచారం కోసం వాడుకోవాలని చూసి 27 మంది మరణానికి కారణమైన ముఖ్యమంత్రి, మంత్రి నారాయణ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి నారాయణపై అందరూ ప్రశ్నలు సంధించడాన్ని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య తప్పుపట్టారు. ‘‘రాష్ట్ర సీఎం పుష్కరాల్లో తొలిస్నానం చేస్తే తప్పేమిటి? అలా చేయకూడదని రూలేమైనా ఉందా?’’ అని ఎదురుదాడికి దిగారు. ‘‘ఓకే.. మరి సీఎం కొడుక్కి ఏం హక్కుంది’’అని అర్ణబ్ నిలదీశారు. ‘‘వారంతా సీఎం కుటుంబసభ్యులు. వారికా హక్కుంది’’ అని వర్ల సమర్థించుకున్నారు. ‘‘మిస్టర్ రామయ్యా.. మీ మాటల్లో, గొంతులో వీవీఐపీని అన్న అహంకారం కనిపిస్తోంది. జరిగిన దానికి బాధ్యత తీసుకోకుండా, సిగ్గుపడకుండా అహంకారంతో మాట్లాడుతున్నారు. మీకు, మీ ముఖ్యమంత్రికి అహంకారం తగ్గే రోజు వస్తుంది. ఏదో ఒకరోజు మీరు అధికారం కోల్పోతారు. అప్పుడు మరో వీవీఐపీ మిమ్మల్నిలా గేటు బయటే ఆపినప్పుడు మీకు సామాన్యుడి బాధలేమిటో అర్థమవుతాయి’’ అంటూ అర్ణబ్ చర్చను ముగించారు. లక్షలాదిమంది హాజరయ్యే మతపరమైన ప్రాంతాలకు ప్రత్యేక సెక్యూరిటీ కావాల్సిన వీఐపీలు దూరంగా ఉండటం మంచిది. వారికోసం సామాన్య ప్రజలను బలిచేయకూడదు. ప్రజలు ఎక్కువగా వచ్చే సమయాల్లో వీవీఐపీలు రాకుండా ఉంటే మంచిది. దేవుడి దగ్గర అందరూ సమానమేనని గుర్తించండి. అందుకే అక్కడైనా అందరినీ సమానంగా చూడాలి. - రావుల ఈశ్వర్, సామాజిక ఉద్యమకారుడు గత రెండు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం పుష్కరాలంటే రాజమండ్రిలోనే అన్నట్లుగా ప్రచారం చేసింది. ఉదయం 6.26 గంటలకు ముహుర్తం నిర్ణయించారు. ఆ సమయంలో పుష్కరస్నానంచేస్తే ఎక్కువ పుణ్యం వస్తుందన్న నమ్మకంతో లక్షలాదిమంది తరలివచ్చారు. అసలు లౌకిక దేశంలో మతపరమైన కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రచారం చేయడమేమిటి? -ప్రొఫెసర్ కంచె ఐలయ్య, సామాజిక ఉద్యమకారుడు ‘‘పుష్కరాల ప్రారంభం రోజున ఉదయం ఆరు గంటలకే అమ్మ ఘాట్ వద్దకు చేరుకుంది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్కర స్నానం కోసం సుమారు రెండున్నర గంటలపాటు గేట్లు మూసివేయడంతో రద్దీ విపరీతంగా పెరిగి తొక్కిసలాట జరిగింది. పుణ్యానికని వెళితే తిరిగిరాని లోకాలకు పంపారు. చంద్రబాబు కారణంగా ఇప్పుడు అమ్మే లేకుండాపోయింది. ’’ - బుద్దరాజు లక్ష్మి కుమారుడు సతీష్ ‘మా అమ్మ దొడ్డి కన్నయ్యమ్మ పుష్కరాల్లో సేవలందించేందుకు మా గ్రామానికి చెందిన 23 మందితో కలిసి వచ్చారు. అయితే జాబితాలో ఆమె పేరు లేకపోవడంతో పుష్కరస్నానంకోసం ఘాట్‌కు చేరుకున్నారు. దాహంతో ఘాట్‌లోని శివాలయం వద్ద కూర్చున్నారు. ఇంతలో ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో అక్కడికక్కడే మృతి చెందారు.’’ - రామజోగినాయుడు, టెక్కలి ‘‘పుష్కరస్నానం కోసం ఉదయాన్నే ఘాట్‌కు చేరుకున్నాం. లోపల సీఎం ఉండటంతో గేట్లు మూసేశారు. సీఎం వెళ్లి పోయిన తర్వాత గేటు తెరువగా వెనుకనున్న వారు కెరటంలా వ చ్చి పడ్డారు. తేరుకునేలోపే నా భార్య, కుమార్తె విగతజీవులై కనిపించారు. కింద పడిపోయిన వారిని లేపే వారున్నా ఎంతోమంది బతికి బైటపడేవారు.’’ - కృష్ణ, మారికవలస, విశాఖపట్నం ఈ దుర్ఘటనపై ఏపీ ప్రభుత్వం విచారణ జరిపితే న్యాయం జరగదు. కేంద్రం జోక్యం చేసుకుని విచారణ జరిపించాలి. మతపరమైన ప్రాంతాల్లో వీఐపీ సంస్కృతిని నిషేధిస్తూ చట్టం తీసుకురావాలి. -టీఆర్ఎస్ సుబ్రమణ్యం, మాజీ కేబినెట్ సెక్రటరీ లక్షలాదిమంది వచ్చే ప్రాంతాల్లో క్యూ నిలిచిపోకూడదు. రాజమండ్రిలో చంద్రబాబు కోసం ప్రజలను ఆపడంవల్లే ప్రమాదం జరిగింది. క్యూ పక్కన పెట్టి సీఎం వెళ్లవచ్చని రూల్ ఎక్కడుంది? ఇది సిగ్గుచేటు. - అరుణ్ భాటియా, మాజీ ఐఏఎస్ అధికారి పుష్కరాల్లో ప్రజలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పించాలి. అది మరచి వ్యక్తిగత ప్రచారానికి ప్రాధాన్యమివ్వడం సిగ్గుచేటు. మతపరమైన ప్రాంతాల్లో వివక్ష తగదు. పబ్లిక్ ప్లేస్‌లోకి నేతలు వెళ్లకుండా చట్టం తీసుకురావాలి. ఈ వీఐపీ సంస్కృతికి స్వస్తి పలకాలి. -బెజోన్ మిశ్రా, వినియోగదారుల హక్కుల నిపుణుడు పుష్కరాల్లో తొలిరోజున తొలిస్నానం చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుందని చంద్రబాబు అనుకుంటున్నారేమో. ఇంతమంది మరణానికి కారణమైన ఆయనకు పుణ్యం రాదు. అన్ని రకాల పాపాలూ ఆయనను వెన్నాడతాయి. -శైలేశ్ గాంధీ, సమాచార హక్కు ఉద్యమకారుడు -
ఏపీ మంత్రులను ఏకిపారేశారు..
న్యూఢిల్లీ : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పుష్కర ఘాట్‌లో తొక్కిసలాట దుర్ఘటనపై జాతీయ టీవీ ఛానళ్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబసమేతంగా వీవీఐపీ ఘాట్‌కి బదులు...పబ్లిక్ ఘాట్‌లో స్నానాలు ఆచరించడం వల్లే 29 మంది చనిపోయారని టైమ్స్ నౌ ఛానెల్.... ఐటీశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డిని నిలదీసింది. ఈ సందర్భంగా యాంకర్ అడిగిన ఈ ప్రశ్నకు... సమాధానం చెప్పలేక మంత్రి పల్లె నానా తంటాలు పడ్డారు. మున్సిపల్, పరిపాలన శాఖ మంత్రి నారాయణకు కూడా టైమ్స్ నౌ ఛానల్ తలంటింది. రాజమండ్రి తొక్కిసలాటకు కారణం మీ ముఖ్యమంత్రి కాదా అని టైమ్స్ నౌ ఛానెల్ యాంకర్ అర్నాబ్ గోస్వామి ప్రశ్నించగా...సమాధానం చెప్పేందుకు నారాయణ మాటలెతుక్కున్నారు. బదులివ్వలేక, విషయం చెప్పలేక తిప్పలు పడ్డారు. కాగా గోదావరి నిత్యహారతికి పబ్లిసిటీ రాలేదన్న అసంతృప్తితో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుష్కరాలకు అంతర్జాతీయ ప్రచారం కావాలనుకున్నారు. ఇందుకోసం ఎంత ఖర్చయినా ఫర్వాలేదని అధికారులకు నిర్దేశించారు. అంతే ఆయన మాటకు తగ్గట్టుగా అంతర్జాతీయ ఛానల్‌తో ఒప్పందం చేసుకున్నారు. గోదావరి పుష్కరాల్లో షార్ట్ ఫిల్మ్ కోసం నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 64 లక్షల రూపాయలు చెల్లించేందుకు అంగీకరించింది. ఇందులో 30 లక్షలు ప్రొడక్షన్ కాస్ట్. మరో 19 లక్షలు డిజిటలైజేషన్, 8 లక్షలు ప్రమోషన్ మిగిలినవి ఇతర ఖర్చులు. ఈ మేరకు ఫైల్ కూడా ఏపీ సబివాలయంలో ప్రస్తుతం సర్క్యులేట్ అవుతోంది. ఇక గోదావరి పుష్కరాల ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీఐపీ ఘాట్ వదిలి సామాన్య భక్తులుండే పుష్కర ఘాట్‌కు రావడానికి ఈ షార్ట్ ఫిల్మ్ కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సీఎం కుటుంబ పుష్కర స్నానం, పిండ ప్రదాన క్రతువులు చేసినప్పుడు జనం భారీగా ఉంటే బావుంటుందన్న ఉద్దేశంతో అక్కడికి వచ్చారు. ఈ షూటింగ్ అదే సమయంలో జరిగింది. సీఎం అక్కడే రెండు గంటలు ఉండటంతో జనాన్ని పూర్తిగా నియంత్రించేశారు. సీఎం పూజల అనంతరం జనాన్ని ఒక్కసారిగా వదిలిపెట్టేసరికి తొక్కిసలాట సంభవించింది. ఫలితంగా పెను విషాదం చోటుచేసుకుంది. దీంతో 27 మంది ప్రాణాలు పోయాయి. ప్రభుత్వానికి అంతర్జాతీయ ప్రచారం మాటెలా ఉన్నా చంద్రబాబు ప్రభుత్వానికి రావాల్సినంత చెడ్డ పేరు వచ్చింది. ఒక పబ్లిసిటీ ఫిల్మ్ కోసం ఇంతమంది ప్రాణాలను బలిపెట్టడం ఏంటని విపక్షాలు మండిపడుతున్నాయి. -
జాతీయ మీడియా పారదర్శకంగా ఉండాలి: రామచంద్ర మూర్తి
తిరుపతి: దేశంలోని అన్ని ప్రాంతాల వార్తల ప్రసారంలో నేషనల్ మీడియా పారదర్శకంగా వ్యవహరించాలని సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కే.రామచంద్రమూర్తి అభిప్రాయపడ్డారు. ఇండియన్ మీడియా జర్నలిస్ట్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ శాఖ తిరుపతిలో శుక్రవారం నిర్వహించిన వర్కింగ్ కమిటీ మీట్‌కు రామచంద్రమూర్తి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాల్లోని సంఘటనలు, పరిస్థితులపై నేషనల్ మీడియా సరైన స్థాయిలో ఫోకస్ చేయలేకపోతోందని అన్నారు. గతంలో చిత్తూరు జిల్లాలో చోటుచేసుకున్న ఎర్ర చందనం కూలీల ఎన్కౌంటర్ కేసులోనూ, తెలంగాణలో మొన్నటి ఓటుకు కోట్లు కేసులోనూ సరిగా స్పందించకపోవడం బాధాకరమన్నారు. అయితే మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యాపం కుంభకోణం అంశంలో నేషనల్ మీడియా బాగా శ్రద్ధ కనబరుస్తోందన్నారు. దీన్నిబట్టి నేషనల్ మీడియా ఉత్తరాది రాష్ట్రాలకు ఇస్తున్నంత ప్రాధాన్యతను దక్షిణాది రాష్ట్రాలకు ఇవ్వడం లేదని తేటతెల్లమవుతోందని అభిప్రాయపడ్డారు. జర్నలిస్టులు ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడి, ప్రాంతాలకు, మతాలకు అతీతంగా విధి నిర్వహించినపుడే మెరుగైన సమాజం ఏర్పడుతుందన్నారు. ఆ దిశగా కృషి చేయాలని యువ జర్నలిస్టులకు సూచించారు. అనంతరం యూనియన్ జాతీయ అధ్యక్షుడు బాలభాస్కర్ మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల తరఫున జర్నలిస్టులకు కల్పిస్తున్న సౌకర్యాలు, పెన్షన్లు తెలుగు రాష్ట్రాల్లోనూ కల్పించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసమే దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలకు చెందిన యూనియన్ సభ్యులను సమావేశపరిచి చర్చించడ మే ఈ సమావేశం ముఖ్య ఉద్ధేశమన్నారు. సాక్షి ఈడీకి ఘన సన్మానం సమావేశం చివరలో సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కే.రామచంద్రమూర్తిని యూనియన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో యూనియన్ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ శర్మ, అజయ్రావత్, సుభాష్‌గౌడ్, స్థానిక జర్నలిస్టు నాయకుడు రమణమూర్తితో పాటు తమిళ, తెలుగు మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. -
స్మృతి ఇరానీ.. భవిష్యత్తులో రాష్ట్రపతి..!?
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ భవిష్యత్తులో భారతదేశానికి రాష్ట్రపతి కానున్నారా..? దీనికి అవుననే అంటోంది జాతీయ మీడియా. ఆదివారం రాజస్థాన్‌లోని భిల్వారాలో ఓ జ్యోతిష్కుడిని తన భర్తతో పాటు వెళ్లి స్మృతి ఇరానీ కలిశారని.. ఈ సందర్భంగా ఆ జ్యోతిష్కుడు స్మృతి భవిష్యత్తులో దేశానికి అధ్యక్షురాలు అవుతారని చెప్పారని కథనాలు వెలువరించాయి. ఇదే జ్యోతిష్కుడు గతంలో కూడా స్మృతి మంత్రి అవుతారని జోస్యం చెప్పారని, అది నిజం కావడంతో మరోసారి ఆయన దర్శనం కోసం స్మృతి వచ్చారని పేర్కొన్నాయి. మీడియాలో వార్తలపై స్మృతి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సోమవారం ఆమె స్పందిస్తూ.. ‘‘మంత్రిగా నా కార్యక్రమాలపై ప్రశ్నలు అడిగేందుకు మీకు హక్కు ఉంది. కానీ వ్యక్తిగత జీవితం మాత్రం నా ఇష్టం. నా వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించొద్దు’’ అని విలేకరులకు సూచించారు. -
'మెడలు విరుస్తాం.. పాతరేస్తాం' సరైనవేనా!
తెలంగాణ శాసనసభ, ఎమ్మెల్యేలపై మీడియా సంస్థలు చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలపై మండిపడుతూ కేసీఆర్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలు జాతీయ మీడియాలో బుధవారం సాయంత్రం వాడివేడి చర్చ జరిగింది. జాతీయ మీడియాలోని కొన్ని ఆంగ్ల టెలివిజన్ ఛానెల్‌లు టీఆర్ఎస్ నేతలతో జరిపిన చర్చాగోష్టిలో.. మీడియాపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలను దుమ్ము దులిపాయి. తెలంగాణ ప్రాంతంలో పత్రికా స్వేచ్చను కాలరాసినందుకు క్షమాపణలు చెబుతారనుకుంటే.. పాతరేస్తామని జవాబిస్తారా అంటూ జాతీయ మీడియా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్చాగోష్టిలో పాల్గొన్న నిజమాబాద్ ఎంపీ, కేసీఆర్ కూతురు కవిత కూడా తన తండ్రి వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని వెల్లడించారు. అంతేకాకుండా తన తండ్రి చేసిన వ్యాఖ్యలను తప్పుగా ట్రాన్స్ లేషన్ (తర్జుమా) చేసిన విధానాన్ని తప్పుపట్టారు. దాంతో కేసీఆర్ మాట్లాడిన సందర్భం, వ్యాఖ్యల్లో వాస్తవం జాతీయ మీడియాకు సరిగా చేరకపోవడం దురదృష్టకరమని కవిత అన్నారు. తెలంగాణ ప్రాంతాన్ని, సంస్కృతిని గౌరవించాలని కేసీఆర్ అన్నారని.. అయితే కొన్ని మీడియా చానెల్లు తమను మాత్రమే గౌరవించాలని విధంగా తప్పుడు కథనాలను ప్రసారం చేశాయన్నారు. త్యాగాల ఫలితంగా రాష్ట్రం ఏర్పడి తెలంగాణ ఎమ్మెల్యేలు కొలువుదీరిన రోజు కొన్ని మీడియా చానెల్లు ప్రసారం చేసిన కథనాలు సమంజసం కాదని కవిత తెలిపారు. తెలంగాణ ప్రాంతాన్ని, సంస్కృతిని అగౌరవపరిస్తే పాతరేస్తాం జాగ్రత్త. కేసీఆర్‌ను తిడితే బాధలేదు. తెలంగాణ శాసనసభను, తెలంగాణ వ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్ని, ఉనికిని, గౌరవాన్ని వ్యతిరేకించేలా ఎవడు చేసినా మెడలు విరిచి అవతల పారేస్తం. మీడియా ముసుగులో ఇడియట్ ఆటలు చేస్తామంటే సాగనివ్వం. అయినా ఈ చానళ్లను మేం బ్యాన్ చేయలేదు అని కేసీఆర్ అన్న విషయాన్ని కవిత మరోసారి మీడియాకు వివరించారు. ఏది ఏమైనా కేసీఆర్ మాటలు స్థానిక మీడియాలోనే కాకుండా.. జాతీయ మీడియాలోనూ దుమారం రేపాయి. కేసీఆర్ వ్యాఖ్యలు తెలంగాణ ప్రభుత్వ పరువును దిగజార్చేలా ఉన్నాయని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. -
కేసీఆర్ ది హెచ్చరికనా? బెదిరింపా?
కాళోజి శతజయంతి ఉత్సవాల వేదికను ఆసరాగా చేసుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సంస్థలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడి జాతీయ పత్రికలను ఆకర్షించారు. మీడియాపై కేసీఆర్ వ్యవహార తీరును జాతీయ మీడియా కథనాలను ప్రముఖంగా ప్రచురించాయి. కొన్ని మీడియా సంస్థలు హెచ్చరిక అంటూ, మరి కొన్ని బెదిరింపులు అనే పదాలను పతాక శీర్షికల్లో ఉపయోగించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఓ రెండు ఛానెల్‌లు ప్రసారం చేసిన కథనాలు వివాదంగా మారాయి. కొన్ని ఛానెల్‌లు పనిగట్టుకుని తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బ తీయాలని కథనాల ప్రసారం చేస్తున్నాయని ఏకంగా శాసనసభలో కేసీఆర్ ప్రస్తావించారు. శాసనసభను, తెలంగాణ సంస్కృతిని కించపరిచే విధంగా కథనాలు ప్రసారం చేశారనే కారణంతో తెలంగాణ ప్రాంతంలో కొన్ని ఛానెల్‌లపై అప్రకటిత నిషేధాన్ని విధించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాన్ని ఆసరాగా తీసుకుని ఎంఎస్ఓలు కొన్ని ఛానెల్‌ల ప్రసారాన్ని నిలిపివేశారు. మీడియా ప్రసారాలను నిలిపివేస్తూ, ఎంఎస్ఓలు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయినా తెలంగాణ ప్రాంతంలో ప్రసారాలు మళ్లీ పునరుద్దరించేలా చేయలేకపోయారు. తాజాగా ఢిల్లీ పర్యటనలో కేంద్ర సమాచార శాఖామంత్రి ప్రకాశ్ జవదేకర్, కేసీఆర్ ల మధ్య ఈ అంశంపై చర్చ కూడా వచ్చింది. అయితే ఈ వివాదంతో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేసినట్టు వార్తలు వెలువడ్డాయి. దాంతో ప్రసారాలను పునరుద్దరించేందుకు ఎంఎస్ఓలతో చర్చలు జరుపుతామని జవదేకర్ తెలిపిన సంగతి తెలిసిందే. అయితే రెండు రోజుల పర్యటన అనంతరం ఆయా మీడియా సంస్థలు చేసిన ధర్నా, నిరసన కార్యక్రమాలతో ఈ వివాదం మరోసారి వెలుగులోకి వచ్చింది. మీడియా సంస్థల ప్రతినిధులు నిరసన వ్యక్తం చేయడంపై కేసీఆర్ ఘాటుగా స్పందిస్తూ 'తెలంగాణ ఎమ్మెల్యేలను పాచికల్లు తాగే మొకాలంటే ఈ గడ్డ మీద క్షమించాల్నా? ఇది పత్రికా స్వేచ్చ అయితదా? ఏ మీడియా చెబుతది ఇది కరెక్టని? అనేకమంది త్యాగాల ఫలితంగా రాష్ట్రం ఏర్పడి తెలంగాణ ఎమ్మెల్యేలు కొలువుదీరిన రోజు అదేనా పద్ధతి. పాతరేస్తాం జాగ్రత్త. కేసీఆర్‌ను తిడితే బాధలేదు. తెలంగాణ శాసనసభను, తెలంగాణ వ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్ని, ఉనికిని, గౌరవాన్ని వ్యతిరేకించేలా ఎవడు చేసినా మెడలు విరిచి అవతల పారేస్తం. మీడియా ముసుగులో ఇడియట్ ఆటలు చేస్తామంటే సాగనివ్వం. అయినా ఈ చానళ్లను మేం బ్యాన్ చేయలేదు అని అన్నారు. ఓ ప్రభుత్వ అధినేతగా కాకుండా ఓ ఉద్యమ నాయకుడిలా కేసీఆర్ మాట్లాడటంపై జాతీయ పత్రికలు స్పందించాయి. ఈ నేపథ్యంలో గత 80 రోజులకు పైగా కొనసాగుతున్న వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం, ఎంఎస్ఓలు, మీడియా సంస్థల మధ్య నలుగుతున్న 'త్రికోణ' వివాదానికి సుఖాంతం కార్డు ఎప్పుడు పడుతుందో వేచి చూడాల్సిందే... -
జాతీయ టీవీ చానెళ్లతో జగన్
-
'రాయల తెలంగాణ ప్రతిపాదనకు రాజకీయ ఆమోదం'
-
రాయల తెలంగాణ దిశగా కేంద్రం!
ఢిల్లీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తెలంగాణ నేతలతో కాంగ్రెస్ హైకమాండ్ మంతనాలు జరుపుతోంది. రాయల తెలంగాణ దిశగా కేంద్రం అడుగులేస్తున్నట్టు జాతీయ మీడియాలో కధనాలు వస్తున్నాయి. రాయల తెలంగాణ ప్రతిపాదనకు రాజకీయ ఆమోదం లభించినట్టు ఎన్డీ టీవీ కధనాన్ని నడుపుతోంది. ఇక సీడబ్ల్యూసీ నిర్ణయానుసారం హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాల తెలంగాణ కాకుండా రాయల తెలంగాణ దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 5 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ వివిధ పార్టీల నేతలతో భేటీ కానున్నారు. పార్లమెంట్లో చర్చించాల్సిన కీలక అంశాలు, తెలంగాణ బిల్లు వంటి అంశాలపై వివిధ పార్టీల నేతలతో కమల్‌నాథ్ చర్చించే అవకాశముంది. మరోవైపు పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్ హస్తినలోనే మకాం వేశారు. డీఎస్ అధినేత్రి సోనియా గాంధీ, జీవోఎం సభ్యులను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక జీవోఎం నివేదిక రేపు కేబినెట్ ముందుకు రానున్న నేపథ్యంలో నివేదికకు తుది మెరుగులు దిద్దే పనిలో పడ్డారు. జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ ఉన్నతాధికారులతో మాట్లాడుతూ అంతర్గతంగా కసరత్తు చేస్తున్నారు. ఇక రాయల తెలంగాణ ప్రతిపాదనపై టీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. సీడబ్ల్యూసీ తీర్మానం మేరకు పది జిల్లాలతో కూడిన తెలంగాణ తప్ప మరే దానికి అంగీకరించేలేది లేదని తేల్చి చెప్పారు. ప్రజాభిప్రాయాన్ని గుర్తించకుండా కిరికిరి పెడితే ఊరుకోమని ఆపార్టీ శాసనసభ పక్షనేత ఈటెల రాజేందర్ హెచ్చరించారు. -
బాబుకి చుక్కలు చూపించిన జాతీయ మీడియా ప్రతినిధులు
-
కేంద్ర కేబినెట్ నిర్ణయంపై జాతీయా మీడియాతో జగన్
-
జగన్ బెయిల్ వార్తకు జాతీయ మీడియా ప్రాధాన్యం
హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి బెయిల్ అంశం రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించింది. నాంపల్లి సీబీఐ కోర్టు తీర్పుపై ఓ వైపు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉండగా......... రాష్ట్రం వెలుపల కూడా అంతే ఆసక్తి కనిపించింది. ముఖ్యంగా జాతీయ మీడియా జగన్ బెయిల్ వార్తకు విశేష ప్రాధాన్యం కల్పించింది. టైమ్స్ నౌ, ఎన్డీటీవీ సహా పలు జాతీయ ఛానెళ్లు జగన్మోహన్రెడ్డికి బెయిల్ వచ్చిన విషయాన్ని ప్రముఖంగా ప్రసారం చేశాయి. జగన్ బెయిల్‌పై తీర్పు రావడానికి ముందు నుంచే బ్రేకింగ్స్‌తో హడావుడి చేసిన జాతీయ మీడియా... బెయిల్ వచ్చిన తర్వాత ప్రాధాన్యతను మరింత పెంచాయి. కోర్టు తీర్పు సారాంశాన్ని, కోర్టు విధించిన షరతులను పేర్కొంటూనే ఎన్ని నెలలుగా జగన్ జైల్లో నిర్బంధంలో ఉన్నారనే అంశాలను వివరించాయి. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, జగన్ అభిమానుల సంబరాలను లైవ్‌లో ప్రసారం చేశాయి. జగన్‌కు బెయిల్ రావడంపై వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ నేతల ఆనందాన్ని జాతీయ ఛానెళ్లు ప్రజలతో పంచుకున్నాయి. ప్రజానేతకు సంబంధించిన అంశానికి నేషనల్ మీడియా ప్రాధాన్యం కల్పించడంపై వైఎస్సార్సీపీ శ్రేణులు, జగన్ అభిమానుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇక సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో కూడా జగన్ బెయిల్ వార్త హల్చల్ చేసింది. వేలకొద్దీ షేరింగులు... లక్షల కొద్దీ లైకులు... జగన్‌కు బెయిలొచ్చింది.. ఫేస్‌బుక్‌కి పండగొచ్చింది..నిన్న కోర్టు తీర్పు వెలువడిన కొన్ని క్షణాల్లోనే ఫేస్బుక్లో జగన్ బెయిల్ మంజూరు వార్తను ఎవరికి వారు తామే ఈ విషయాన్ని ప్రకటించాలనే ఆత్రుతతో ఆనందాన్ని రెట్టింపు చేసుకున్నారు. -
టిడిపి, కాంగ్రెస్ లవి కుమ్మకు రాజకీయాలు: షర్మిళ