మా క్లయింట్‌కు ప్రాణహాని ఉంది | Our client has a life-threatening | Sakshi
Sakshi News home page

మా క్లయింట్‌కు ప్రాణహాని ఉంది

Published Sat, Mar 4 2017 2:22 AM | Last Updated on Mon, Oct 29 2018 8:10 PM

Our client has a life-threatening

న్యాయమూర్తికి తెలిపిన రోజా తరఫు న్యాయవాదులు

గన్నవరం : తమ క్లయింట్‌కు ప్రాణహాని ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ప్రైవేట్‌ కేసును విచారణకు స్వీకరించాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా తరఫు న్యాయవాదులు న్యాయమూర్తిని కోరారు. జాతీయ మహిళా పార్లమెంటుకు హాజరయ్యేందుకు గత నెల 11న గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చిన తనను పోలీసులు అక్రమంగా నిర్బంధించి, బలవంతంగా హైదరాబాద్‌ తరలించిన ఘటనపై గన్నవరం అదనపు కోర్టులో రోజా దాఖలు చేసిన ప్రైవేట్‌ కేసు విచారణార్హతపై న్యాయ మూర్తి డి.షర్మిల ముందు శుక్రవారం వాదనలు జరిగాయి.

ఈ కేసును ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం  రోజా తన లాయర్లు, పార్టీనేతలతో కలిసి కోర్టుకు చేరుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement