
‘రోజా కన్నీళ్లతో పన్నీరు చల్లే ప్రయత్నం’
హైదరాబాద్: చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరు సంతోషంగా లేరని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి అన్నారు. రెండున్నరేళ్ల పాలనలో చంద్రబాబు చేసిందేమిటని సూటిగా ప్రశ్నించారు.
సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... జాతీయ పార్లమెంట్ మహిళా సదస్సును ఓ కిట్టీ పార్టీగా మార్చేశారని విమర్శించారు. ఎమ్మెల్యే ఆర్కే రోజా కన్నీళ్లతో మహిళా సదస్సులో పన్నీరు చల్లే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. అన్యాయం జరిగిన ఒక్క మహిళ గురించిచైనా చర్చ జరిగిందా అని ప్రశ్నించారు. సదస్సును సీఎం చంద్రబాబు తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
సంబంధిత కథనాలు చదవండి:
ఎమ్మెల్యే రోజాను అడ్డుకోవడంపై వైఎస్ జగన్ స్పందన
ప్రతిపక్షంపై నిర్బంధాలేమిటి?
నన్ను.. చంపేస్తారేమో
నిస్సిగ్గుగా అరాచకం